మహాభారతంలో ప్రయుక్తమైనదని మీరు ఉదాహరించిన “రాజానం నిహతం దృష్ట్వా అభిసారం చ మారిష” అన్న శ్లోకంలోని ‘అభిసారము’ కాశ్మీరానికి ఈశాన్యదిశలో ఉన్న ఒక గ్రామవాసం. అక్కడివారు అభిసారులు. అభిసారజాతీయుల నాయకుడు కూడా అభిసారుడే. మహాభారతయుద్ధంలో ఈ అభిసారులు కౌరవపక్షాన నిలిచి పోరాడారు. ద్రోణుని నేతృత్వంలో సాగిన పధ్నాలుగవ రోజు యుద్ధంలో అర్జునుడు వీరిలో అధికసంఖ్యాకులను సంహరించాడు.
హంస జాతక కథనుంచి మీరు ఉదాహరించిన “న తే అభిసరం పస్సే” అన్నచోట ఆ పాళీ భాషాపదానికి ‘అనుచరుడు’ లేదా ‘సహాయుడు’ అని అర్థం. కాశీ నగరంలో నీకు తోడెవరూ కనబడటం లేదు – అని.
సంస్కృతంలో ‘అభిసారము’ ధాత్వర్థఫలాశ్రయమైనప్పుడు “స్త్రీపురుషయోః అన్యతరస్య అన్యతరార్థం సఙ్కేతస్థానగమనే” అని శబ్దార్థకల్పతరువు. ఆ అభిసారము రహస్యస్థానమే కానక్కరలేదు. ముందుగా ఎన్నుకొన్న చోట సమావేశము, నియుక్తి అని అర్థం. Appointment నాథునితో (లేదా ప్రియునితో, లేదా నిమిత్తవశాన పురుషునితో) అయినప్పుడు అభిసారిక, భార్యతో (లేదా ప్రేయసితో, లేదా నిమిత్తవశాన ఒకానొక కాంతతో) అయినప్పుడు అభిసారుడు అని వ్యవహారం. సంకేతితస్థలంలో ప్రేయసీ ప్రియులు మాత్రమే కలుసుకోవాలని ఉద్దిష్టార్థం కాదు. అభిసారిక భర్తతో సమావిష్ట కాగోరిన కులాంగన కూడా కావచ్చును. ఆమె వేశ్య లేదా అష్టవిధ నాయికలలో ఒకతె అని నాట్యశాస్త్రం. “అభిసరః సహాయః. తస్య వ్యాపారేణ ప్రియతమం అతిక్రామతి” అని అభినవగుప్తుడు చెబుతూనే, భరతుడు “మదనస్యైవ ప్రాధాన్య మాహ” అని ప్రేమికుల సమావేశంగా లోకంలో రూఢికెక్కిన వ్యవహృతిని నిరూపించాడు. ఇద్దరు పురుషులు నియుక్తకార్యనిమిత్తం సమావేశం కావటమూ అభిసారమే.
సంకేతము – అభిసారము అన్న రెండింటిని భోజరాజు శృంగార ప్రకాశంలోని 27-వ ప్రకాశమైన అభియోగ విధిప్రకాశంలో విశదంగా నిరూపించిన భాగాన్ని చూడండి.
సంకేతము ప్రేమికుల సంకేతస్థలం మాత్రమే కాదు. అనుక్రోశము, అనుషంగము, అపాశయము, అభిరక్షము, ఆక్షేపణము, ఆగమము, ఆశయము, ఆశీస్సు, ఆశ్వాసము, ఉత్కంఠము, ఉపఘ్నము, ఉపచారము, ఉపజాపము, తాత్పర్యము, ప్రశ్నము, ప్రార్థనము, బహుమానము, భంగము, భ్రంశము, మనోరథము, వాత్సల్యము, విఘ్నము, విప్రలంభము, హర్షణము – అన్న కారణాల వల్ల సంకేతము సిద్ధిస్తున్నదని భోజుని మతం.
“ఐతే పాశ్చాత్యులు పట్టుదలగా అభ్యసించినట్లు మనం మన సాంస్కృతికవారసత్వం ఐన సంస్కృతభాషని అధ్యయనం చేయటం లేదు”
“మనం సంస్కృతాన్ని ఆ స్థాయికి ఎందుకు తేవటానికి ప్రయత్నం చేయము?”
శ్యామలరావుగారు: దీనికి చాలా గంభీరమైన కారణాలు ఉన్నాయండీ. కొంత వరకూ సంసృత భారతి కృషి చేస్తోంది.
ఐనా మన దేశం ముందు దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చెందాలి. అప్పుడు మిగితావన్నీ. దేహం ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని చేసి ఏమి లాభం? అలాగే పేదరికంలో అడుక్కు తింటున్న మనకి, ఏ పాటి గౌరవం లభిస్తుంది? ఏ మాత్రం అలౌకిక విషయాల పైన దృష్టి సారించగలము?
ఆ పేదరికానికి మూల కారణమేమిటో ముందు తెలుసుకుని దాని నుంచి ఎలా బైట పడాలా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పటి దాకా ఇలాటి వెండీ లాంటి వాళ్ళ బాధలూ, ప్రత్యమ్నాయ ప్రబుధ్ధుల బాధలూ తప్పవు.
యోగా గారూ,కొంచెం అయిష్టంగానే అదికూడా మీరు హాస్యం అన్నారు కాబట్టే మీరు చూపించిన లింకులో ఉన్న హాస్యఖండిక చదివాను.
ఇది హాస్యం కాదు. నూటికి నూరుపాళ్ళూ వ్యంగ్యం! ఒకప్పుడు మాక్స్‌ముల్లర్‌కు వేదాలను ఆంగ్లీకరించటం వెనుక ఆయనకు వాటిపట్ల నిజంగా ఎంతటి భక్తిశ్రధ్ధలున్నాయీ అన్నది ఏ విధంగా అనుమానించదగ్గ విషయమో అలాగే ఆధునిక ఇండాలజిష్టుల ఉద్దేశాలూ అంతే (లేదా మరింతగా) అనుమానాస్పదం అని నా అభిప్రాయం.
మాక్స్‌ముల్లర్‌గారు ఒక వేద ఋక్కుకు “ఇంద్రుడి రథం పోతూ ఉంటే ఆ రథాశ్వాల గిట్టలనుండి నేయి కారుతోంది” అని అర్థం అన్న వివరణ ఇచ్చాడట. ఈ రకమైన అజ్ఞానానికి నొచ్చుకుని అరవిందుడు ఈ ఒక ఋక్కుమీదే ఒక గ్రంథం వ్రాసి వివరణ చేశారు. వేదవాఙ్మయానికి శబ్దార్థాలను యథావిధిగా అన్వయం చేసుకుంటూ పోవటం వల్ల వాటి అసలు తత్త్వమూ హృదయమూ బోధపడవు. పాశ్చాత్యులు చేసే రంథ్రాన్వేషణకు మనవాళ్ళూ తాళం వేయటం వలన మన సంస్కృతిని మనమే పలుచన చేసుకుంటున్నాము. ఐతే పాశ్చాత్యులు పట్టుదలగా అభ్యసించినట్లు మనం మన సాంస్కృతికవారసత్వం ఐన సంస్కృతభాషని అధ్యయనం చేయటం లేదు. పైగా చిన్న చూపు చూస్తూ మనవేళ్ళతో మనకళ్ళే పొడుచుకుంటున్నాం.
ఆకాశవాణివారు సంసృతంలో వార్తాప్రసారాలు మొదలు పెట్టగానే ఒక పత్రికలో వచ్చిన కార్టూన్ శీర్షిక “చాదస్తం కాకపోతే మృతభాషలో మనకు వార్తలెందుకండీ!” అని. ఈ వాక్యంలో కూడా బోలెడు సంస్కృతమూ సంస్కృతజన్యమూ ఐన మాటలున్నాయని ఇది తయారుచేసిన మరియు ప్రచురించిన మహానుభావులకు తట్టలేదు మరి.
ఇజ్రాయిల్ వారు దాదాపు నామావశేషమైపోతున్న హిబ్రూ భాషను అంతర్జాతీయస్థాయి భాషగా మలచుకున్నారు. మనం సంస్కృతాన్ని ఆ స్థాయికి ఎందుకు తేవటానికి ప్రయత్నం చేయము? ఈ ప్రశ్నకు జవాబు అందరికీ తెలుసు – కొన్ని వర్గాలకు అది ఇష్టం ఉండదని. కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అంతే.
ఇప్పుడు మన సాంస్కృతికవారసత్వగ్రంథాల్లో ఇలా ఉందీ అలా ఉందీ అని ఇతరులు చెబుతుంటే అందరమూ ఒహో అనీ కాబోలనీ అనుకోవలసిన దుస్థితిలో ఉన్నాం.
నా ప్రశ్నలకు మంచి జవాబులు వచ్చాయి. అలవాటు కారణంగా నేను తెలుగుగులో కాస్త వేగంగా టైపు చేయ గలుగుతున్నానేమో కాని కొందరికి అదొక యోగాభ్యాసంలాగా ఉంటోందని అర్థమైంది.
ఈమాట పత్రిక పట్ల ఆసక్తి ఉండటం చేతనే, ఆంగ్లంలో వచ్చిన వ్యాఖ్యలను ముఖ్యంగా దీర్ఘవ్యాఖ్యలను చదవటం పట్ల నా మనస్సు యొక్క మొరాయింపు కారణంగా (అసమర్థత యేమీ కాదని తొలుతనే మనవిచేసాను) మంచి వ్యాఖ్యలను చదవలేకపోతున్నానన్న ఆందోళనతోనే నా ఆక్షేపణ తెలిపాను ఆంగ్లవ్యాఖ్యల పట్ల. ఇక్కడి వ్యాఖ్య డబ్బాలో వ్రాయటం, స్క్రోలింగ్ వగైరా ఇబ్బందులు ఉంటే విడిగా వ్రాసి ఇక్కడకు బదిలీ చేయవచ్చును కదా. ఏదిఏమైనా ఆంగ్లవ్యాఖ్యాతలు మాబోటివారి పట్ల కొంచెం కరుణచూపాలని మనవి. అంతే.
సంపాదకులకు ఒక మనవి. ఎలాగూ మా ఈ-మెయిల్ వివరం పొందుపరుస్తున్నాం కదా వ్యాఖ్యలతో. అందుచేత వ్యాఖ్యలకు వచ్చిన స్పందనలను మీరు మాకు సరాసరి మా మెయిల్‌కు అందించ గలిగితే, మా బోటి వ్యాఖ్యాతలకు మంచి సదుపాయంగా ఉంటుంది. స్పందన తాలూకు లింకు పంపితే సరిపోతుంది.
ఏది ఏమైనా కామెంట్ల విషయం లో సెంచరీ త్వరలో కొట్టబోతున్నందుకు సురేష్ కొలిచాలకి ముందస్తు అభినందనలు 🙂 సంపాదకులకి ఒక అడగని సూచన – ప్రతీ కామెంట్ కీ ముందు ఒక నెంబర్ వేస్తే ఎన్నో కామెంటో వెంఠనే తెలుస్తుంది కదూ?
ఎంతో కష్ట పడి రామారావు గారు రాస్తే, ఊరక చదివి ఆనందించక, పాఠకులు వారి తోలు తీశారనిపిస్తుంది. వేటూరా మజాకా?
On a different note, it is absolutely true that all the poets, activists with leftist leanings are singularly responsible for the fantastic quality of Hindi Movie songs in 50’s and 60’s. It’s not that well known that both Majrooh and Balaraj Sahni chose to go to jail in the incipient independent India rather than compromise on their ideals.
తాడిగడప గారికి, తఃతః గారికి (ఏమైనా గానీ ఈ కలం పేరు బావుంది), మరియు ఈమాట దిగ్గజాలందరికీ,
నేను తెలుగులో మొత్తం రాయడానికి ప్రయత్నిస్తాను కానీ నా తెలుగు పదజాలం అంత పటిష్టమైనది కాదు. అప్పుడప్పుడు ఆంగ్ల పదాలు దొర్లితే క్షమించగలరు. అలాగే అచ్చు తప్పులున్నా క్షమించగలరు. విషయానికి వెళ్ళే ముందు శ్యామల రావు గారి సందేహాలు తీర్చేస్తే, అప్పుడు మిగిలినది తాపీగా రాసుకోవచ్చు (చదువు కోవచ్చు కూడా). దురభిమానం విషయం ఇందాకే clarify చేసేసాం కాబట్టీ,
శ్యామల రావు గారి ఉవాచ: “మొదటిది వ్యాఖ్యాతకు తెలుగులిపిలో వ్రాయటానికి తగినంత అభ్యాసం లేకపోవటం. రెండవది భావవ్యక్తీకరణకు తెలుగుభాషకు తగినంతశక్తి ఉన్నదన్న విశ్వాసం వ్యాఖ్యాతకు లేకపోవటం. మూడవది, తెలుగుకన్న ఆంగ్లం గొప్పభాష కాబట్టి ముఖ్యమైన విషయాలు ఆంగ్లం లోనే వ్రాయటం సబబు అన్న స్థిరాభిప్రాయం.”
ఇకపై అన్నీ నా భావాలు మాత్రమే. నేను ఆంగ్లంలో వ్యాఖ్యానిస్తున్నందుకు కారణాలు. ఇవి నా కారణాలు మాత్రమే. ముందు ఆ పై మూడూ కాదని తేల్చేద్దాం.
1. తెలుగు లిపిలో వ్రాయటానికి తగినంత అభ్యాసం ఇప్పుడు అక్కర్లేదు. ఈమాట లేఖిని సాఫ్టువేరు చాలా సౌకర్యం గా ఉంది. ఈ వ్యాసం విషయంలో నాకెంత ఆగ్రహం ఉన్నా, ఈ సౌకర్యం విషయంలో మాత్రం ఈమాటను అభినందించాలి.
2. భావ వ్యక్తీకరణకు ఏ భాషా తక్కువ కాదు. ఆంగ్లం ఐనా, ఉర్దూ ఐనా, తెలుగైనా ఏదైనా, ముందు భావం అనేది ఉండాలి. అసలంటూ పదజాలంలో (vocabulary and I mean not loose vocabulary) పట్టు ఉంటే, ఏ భాష లోనైనా భావాన్ని వ్యక్త పరచగలం. ఇక్కడ పదజాలం తెలియడం అన్నది ముఖ్యం.
3. తెలుగు కన్నా ఆంగ్లం గొప్పది అని తెలుగు వాడో, బెంగాలి కన్నా ఆంగ్లం గొప్పదని బెంగాలి వాడో, మరొకడో, అనుకోలేడు ఎన్నటికీ అని నా గట్టి నమ్మకం. అస్మదీయ భావల నుండి మనిషిని విడదీయలేం. ఏ మనిషికి తన మాతృభాష, కులం, మతం, (మాతృ)భూమి తక్కువ అన్న ఆలోచన ఉండదని నా ఖచ్చితమైన అభిప్రాయం.
సరే ఈ మూడూ కారణాలు కావు. మరేమయ్యుండొచ్చు?
ఒకడు గారు సమయం అని ఇంచుమించి కరెక్టుగానే చెప్పారు. కానీ అది ఒక విముఖ్యమైన (trivial) కారణం మాత్రమే. సమయం, సంగతి ఎలా ఉన్నా, ముందు ఆంగ్లంలో వ్రాయటానికి కారణం ఇక్కడ ఆంగ్లం కూడా అర్ధమవుతుందని ఒకటి. ఇది కూడా విముఖ్యమైన కారణమే అనుకోండి.
ఇక్కడ పాఠకులు ఆంగ్లం కూడా అర్ధం చేసుకోగలరు. కనుక, ఒక వేళ భావ ప్రకటన ఆంగ్లంలో వస్తే తప్పేముంది? వీళ్ళెవరూ వ్యాసాలు వ్రాయట్లేదు కదా? వ్యాసం మీద కామెంట్లే కదా చేస్తున్నారు? దీనికి అంత నియమాలు అనవసరం. ఈమాట పాఠకులు ఇంచుమించు అందరూ ఆంగ్లం కూడా వచ్చిన వాళ్ళే కాబట్టీ, విమర్శలు, వ్యాఖ్యలూ ఆంగ్లంలో ఉన్నా అంత హైరాన పడిపోవల్సిన అవసరం లేదు. ఆంగ్లంలో వ్రాసినా, తెలుగులో వ్రాసినా, వ్రాసిన దాంట్లో విషయం ఉందా లేదా అన్నది ముఖ్యం.
ఆంగ్లంలో రాస్తే నాకు నచ్చదు, మీరెవరూ నా మాట ఒప్పుకోకపోతే నేనింక ఈమాటకి రాను — ఈ నేపధ్యమేమిటి? మీరూ నేను ఈమాటకి వచ్చి చదివినా చదవక పోయినా ఈమాటకి కానీ, మీకు కానీ, మరెవరికి కానీ కాణీ నష్టం కూడా లేదు.
ఇది వ్రాసేసరికే నాకు గంట పట్టింది. కాస్సేపు ఆగి ఈ విషయం మళ్ళీ కొనసాగిస్తాను.
ఇట్లు
యోగా
P.S:- వెంకటరమణ గారు ఈ “లిబరల్” మహాశయుల అసంబధ్ధత చక్కగా వివరించారు. ఈ వ్యాసకర్త కూడా అమెరికాలో first amendment గురించి చెప్పారు కానీ, దానికి సరిగ్గా సరితూగే మన ఇండియా first amendment సరిగ్గా అమెరికాకి వ్యతిరేకం గా వాక్స్వేచ్ఛని నిషేధించింది. ఇక్కడ నుంచి మొదలైంది మన దేశ దౌర్భాగ్యం. ఇది ఎవరి హయాం లో జరిగింది? “guess guess??”…hint: హిందుత్వాదులెవరో అనుకుంటున్నారేమో. నేను చెప్పనుగా… ఈ ముక్కను వ్యాసకర్త చాలా సౌకర్యంగా విశ్లేషించక పోవడం విశేషమే మరి.
బల్లి ఫలితం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/11/2014 3:13 pm
శ్రీ శ్యామలరావు గారికి
_/\_ !
మహాభారతంలో ప్రయుక్తమైనదని మీరు ఉదాహరించిన “రాజానం నిహతం దృష్ట్వా అభిసారం చ మారిష” అన్న శ్లోకంలోని ‘అభిసారము’ కాశ్మీరానికి ఈశాన్యదిశలో ఉన్న ఒక గ్రామవాసం. అక్కడివారు అభిసారులు. అభిసారజాతీయుల నాయకుడు కూడా అభిసారుడే. మహాభారతయుద్ధంలో ఈ అభిసారులు కౌరవపక్షాన నిలిచి పోరాడారు. ద్రోణుని నేతృత్వంలో సాగిన పధ్నాలుగవ రోజు యుద్ధంలో అర్జునుడు వీరిలో అధికసంఖ్యాకులను సంహరించాడు.
హంస జాతక కథనుంచి మీరు ఉదాహరించిన “న తే అభిసరం పస్సే” అన్నచోట ఆ పాళీ భాషాపదానికి ‘అనుచరుడు’ లేదా ‘సహాయుడు’ అని అర్థం. కాశీ నగరంలో నీకు తోడెవరూ కనబడటం లేదు – అని.
సంస్కృతంలో ‘అభిసారము’ ధాత్వర్థఫలాశ్రయమైనప్పుడు “స్త్రీపురుషయోః అన్యతరస్య అన్యతరార్థం సఙ్కేతస్థానగమనే” అని శబ్దార్థకల్పతరువు. ఆ అభిసారము రహస్యస్థానమే కానక్కరలేదు. ముందుగా ఎన్నుకొన్న చోట సమావేశము, నియుక్తి అని అర్థం. Appointment నాథునితో (లేదా ప్రియునితో, లేదా నిమిత్తవశాన పురుషునితో) అయినప్పుడు అభిసారిక, భార్యతో (లేదా ప్రేయసితో, లేదా నిమిత్తవశాన ఒకానొక కాంతతో) అయినప్పుడు అభిసారుడు అని వ్యవహారం. సంకేతితస్థలంలో ప్రేయసీ ప్రియులు మాత్రమే కలుసుకోవాలని ఉద్దిష్టార్థం కాదు. అభిసారిక భర్తతో సమావిష్ట కాగోరిన కులాంగన కూడా కావచ్చును. ఆమె వేశ్య లేదా అష్టవిధ నాయికలలో ఒకతె అని నాట్యశాస్త్రం. “అభిసరః సహాయః. తస్య వ్యాపారేణ ప్రియతమం అతిక్రామతి” అని అభినవగుప్తుడు చెబుతూనే, భరతుడు “మదనస్యైవ ప్రాధాన్య మాహ” అని ప్రేమికుల సమావేశంగా లోకంలో రూఢికెక్కిన వ్యవహృతిని నిరూపించాడు. ఇద్దరు పురుషులు నియుక్తకార్యనిమిత్తం సమావేశం కావటమూ అభిసారమే.
సంకేతము – అభిసారము అన్న రెండింటిని భోజరాజు శృంగార ప్రకాశంలోని 27-వ ప్రకాశమైన అభియోగ విధిప్రకాశంలో విశదంగా నిరూపించిన భాగాన్ని చూడండి.
సంకేతము ప్రేమికుల సంకేతస్థలం మాత్రమే కాదు. అనుక్రోశము, అనుషంగము, అపాశయము, అభిరక్షము, ఆక్షేపణము, ఆగమము, ఆశయము, ఆశీస్సు, ఆశ్వాసము, ఉత్కంఠము, ఉపఘ్నము, ఉపచారము, ఉపజాపము, తాత్పర్యము, ప్రశ్నము, ప్రార్థనము, బహుమానము, భంగము, భ్రంశము, మనోరథము, వాత్సల్యము, విఘ్నము, విప్రలంభము, హర్షణము – అన్న కారణాల వల్ల సంకేతము సిద్ధిస్తున్నదని భోజుని మతం.
అభిసారము అభిసరణసాధ్వసము, అభిసరణోత్సాహము, అభిసారికా వృత్తాంతకథనము, అవినయగూహనము, ఇతివృత్తాఖ్యానము, చంద్రతిరస్కారము, చంద్రికాభిసరణము, చంద్రోదయనింద, చిహ్ననిహ్నవము, ధ్వాంతప్రతీక్ష, ధ్వాంతసత్కారము, ధ్వాంతానుశోచనము, పరిభోగదర్శనము, వంచితా కథానకము, విరహవిసూరణము, వ్యాజగర్భము, సఖీశిక్షార్థము, సఖీసంప్రశ్నము – ఇత్యాది నైమిత్తికాల వల్ల కలుగుతుందని భోజమతం.
ఇది నియుక్తిరూపం అన్నమాట. నియుక్తి అంటే Appointment అన్న ఆంగ్ల పదార్థబోధకమే.
అందుకే, మోనియర్ విలియమ్స్ English Sanskrit Dictionaryలో “Appointment = (Assignation) అభిసారః” అని సమంజసంగా నిరూపితమై ఉన్నది. అది సప్రమాణమే.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/11/2014 10:27 am
శ్యామలరావుగారు: దీనికి చాలా గంభీరమైన కారణాలు ఉన్నాయండీ. కొంత వరకూ సంసృత భారతి కృషి చేస్తోంది.
ఐనా మన దేశం ముందు దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చెందాలి. అప్పుడు మిగితావన్నీ. దేహం ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని చేసి ఏమి లాభం? అలాగే పేదరికంలో అడుక్కు తింటున్న మనకి, ఏ పాటి గౌరవం లభిస్తుంది? ఏ మాత్రం అలౌకిక విషయాల పైన దృష్టి సారించగలము?
ఆ పేదరికానికి మూల కారణమేమిటో ముందు తెలుసుకుని దాని నుంచి ఎలా బైట పడాలా అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పటి దాకా ఇలాటి వెండీ లాంటి వాళ్ళ బాధలూ, ప్రత్యమ్నాయ ప్రబుధ్ధుల బాధలూ తప్పవు.
బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/11/2014 8:53 am
మోహనగారూ,
“సంకేత సమయము” అన్నప్పుడు సంకేతము మరియు సమయమూ రెండున్నూ అన్న అర్థం రాదు గదండీ?
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/11/2014 8:51 am
యోగా గారూ,కొంచెం అయిష్టంగానే అదికూడా మీరు హాస్యం అన్నారు కాబట్టే మీరు చూపించిన లింకులో ఉన్న హాస్యఖండిక చదివాను.
ఇది హాస్యం కాదు. నూటికి నూరుపాళ్ళూ వ్యంగ్యం! ఒకప్పుడు మాక్స్‌ముల్లర్‌కు వేదాలను ఆంగ్లీకరించటం వెనుక ఆయనకు వాటిపట్ల నిజంగా ఎంతటి భక్తిశ్రధ్ధలున్నాయీ అన్నది ఏ విధంగా అనుమానించదగ్గ విషయమో అలాగే ఆధునిక ఇండాలజిష్టుల ఉద్దేశాలూ అంతే (లేదా మరింతగా) అనుమానాస్పదం అని నా అభిప్రాయం.
మాక్స్‌ముల్లర్‌గారు ఒక వేద ఋక్కుకు “ఇంద్రుడి రథం పోతూ ఉంటే ఆ రథాశ్వాల గిట్టలనుండి నేయి కారుతోంది” అని అర్థం అన్న వివరణ ఇచ్చాడట. ఈ రకమైన అజ్ఞానానికి నొచ్చుకుని అరవిందుడు ఈ ఒక ఋక్కుమీదే ఒక గ్రంథం వ్రాసి వివరణ చేశారు. వేదవాఙ్మయానికి శబ్దార్థాలను యథావిధిగా అన్వయం చేసుకుంటూ పోవటం వల్ల వాటి అసలు తత్త్వమూ హృదయమూ బోధపడవు. పాశ్చాత్యులు చేసే రంథ్రాన్వేషణకు మనవాళ్ళూ తాళం వేయటం వలన మన సంస్కృతిని మనమే పలుచన చేసుకుంటున్నాము. ఐతే పాశ్చాత్యులు పట్టుదలగా అభ్యసించినట్లు మనం మన సాంస్కృతికవారసత్వం ఐన సంస్కృతభాషని అధ్యయనం చేయటం లేదు. పైగా చిన్న చూపు చూస్తూ మనవేళ్ళతో మనకళ్ళే పొడుచుకుంటున్నాం.
ఆకాశవాణివారు సంసృతంలో వార్తాప్రసారాలు మొదలు పెట్టగానే ఒక పత్రికలో వచ్చిన కార్టూన్ శీర్షిక “చాదస్తం కాకపోతే మృతభాషలో మనకు వార్తలెందుకండీ!” అని. ఈ వాక్యంలో కూడా బోలెడు సంస్కృతమూ సంస్కృతజన్యమూ ఐన మాటలున్నాయని ఇది తయారుచేసిన మరియు ప్రచురించిన మహానుభావులకు తట్టలేదు మరి.
ఇజ్రాయిల్ వారు దాదాపు నామావశేషమైపోతున్న హిబ్రూ భాషను అంతర్జాతీయస్థాయి భాషగా మలచుకున్నారు. మనం సంస్కృతాన్ని ఆ స్థాయికి ఎందుకు తేవటానికి ప్రయత్నం చేయము? ఈ ప్రశ్నకు జవాబు అందరికీ తెలుసు – కొన్ని వర్గాలకు అది ఇష్టం ఉండదని. కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అంతే.
ఇప్పుడు మన సాంస్కృతికవారసత్వగ్రంథాల్లో ఇలా ఉందీ అలా ఉందీ అని ఇతరులు చెబుతుంటే అందరమూ ఒహో అనీ కాబోలనీ అనుకోవలసిన దుస్థితిలో ఉన్నాం.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/11/2014 6:45 am
ఈ చర్చ లో హాస్యం లోపించింది కనుక… దీనికి సంబంధం కూడా ఉంది కనుక:
ఈ యొక్క ఆంగ్ల లింకు చదవగలరు: http://m.fakingnews.firstpost.com/2014/02/meet-the-author-of-sholay-an-alternative-history/page/1/
దేవకన్య గురించి బ్రహ్మేశ్వర రావు మేకా అభిప్రాయం:
03/11/2014 1:52 am
సున్నితంగా, చాల బాగా స్త్రీ ఔన్నత్యాన్ని చిత్రించారు. చాల బాగుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/10/2014 11:16 pm
నా ప్రశ్నలకు మంచి జవాబులు వచ్చాయి. అలవాటు కారణంగా నేను తెలుగుగులో కాస్త వేగంగా టైపు చేయ గలుగుతున్నానేమో కాని కొందరికి అదొక యోగాభ్యాసంలాగా ఉంటోందని అర్థమైంది.
ఈమాట పత్రిక పట్ల ఆసక్తి ఉండటం చేతనే, ఆంగ్లంలో వచ్చిన వ్యాఖ్యలను ముఖ్యంగా దీర్ఘవ్యాఖ్యలను చదవటం పట్ల నా మనస్సు యొక్క మొరాయింపు కారణంగా (అసమర్థత యేమీ కాదని తొలుతనే మనవిచేసాను) మంచి వ్యాఖ్యలను చదవలేకపోతున్నానన్న ఆందోళనతోనే నా ఆక్షేపణ తెలిపాను ఆంగ్లవ్యాఖ్యల పట్ల. ఇక్కడి వ్యాఖ్య డబ్బాలో వ్రాయటం, స్క్రోలింగ్ వగైరా ఇబ్బందులు ఉంటే విడిగా వ్రాసి ఇక్కడకు బదిలీ చేయవచ్చును కదా. ఏదిఏమైనా ఆంగ్లవ్యాఖ్యాతలు మాబోటివారి పట్ల కొంచెం కరుణచూపాలని మనవి. అంతే.
సంపాదకులకు ఒక మనవి. ఎలాగూ మా ఈ-మెయిల్ వివరం పొందుపరుస్తున్నాం కదా వ్యాఖ్యలతో. అందుచేత వ్యాఖ్యలకు వచ్చిన స్పందనలను మీరు మాకు సరాసరి మా మెయిల్‌కు అందించ గలిగితే, మా బోటి వ్యాఖ్యాతలకు మంచి సదుపాయంగా ఉంటుంది. స్పందన తాలూకు లింకు పంపితే సరిపోతుంది.
పొరబాటున స్పందనలను వెదకి ప్రతిస్పందించకపోతే ఆనక బాధపడవలసి వస్తుంది కదా ఆవలివారు ఏమనుకున్నారో అని.
రచయితలకు రచయిత్రులకు కూడా ఇదే విధంగా తమతమ వ్రాతలకు వచ్చిన స్పందనల లింకులు పంపుతూ ఉంటే వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Okadu అభిప్రాయం:
03/10/2014 5:04 pm
ఏది ఏమైనా కామెంట్ల విషయం లో సెంచరీ త్వరలో కొట్టబోతున్నందుకు సురేష్ కొలిచాలకి ముందస్తు అభినందనలు 🙂 సంపాదకులకి ఒక అడగని సూచన – ప్రతీ కామెంట్ కీ ముందు ఒక నెంబర్ వేస్తే ఎన్నో కామెంటో వెంఠనే తెలుస్తుంది కదూ?
వేటూరి పాట గురించి Yugandar అభిప్రాయం:
03/10/2014 4:43 pm
ఎంతో కష్ట పడి రామారావు గారు రాస్తే, ఊరక చదివి ఆనందించక, పాఠకులు వారి తోలు తీశారనిపిస్తుంది. వేటూరా మజాకా?
On a different note, it is absolutely true that all the poets, activists with leftist leanings are singularly responsible for the fantastic quality of Hindi Movie songs in 50’s and 60’s. It’s not that well known that both Majrooh and Balaraj Sahni chose to go to jail in the incipient independent India rather than compromise on their ideals.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/10/2014 3:55 pm