పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/03/2014 9:07 pm

    ప్రసాద్ గారూ, చాలా సంతోషం. చందా కూడా కట్టి ౩౦౦ తెప్పించుకోండి ప్లీజ్. మీ పిల్లల తల్లిదండ్రులకి కూడా చెప్పండి.

  2. అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/03/2014 9:01 pm

    సుజాత గారూ, అప్పట్లో ఈ నవల గురించి నేను విన్న మాట చైతన్యస్రవంతి శిల్పం అన్నది. అదేమిటో తెలుసుకోవాలని చదివాను. మీ విశ్లేషణ చూశాక మళ్ళీ చదవాలనిపిస్తుంది – జాగ్రత్తగా. మీరు రాసే అన్ని విశ్లేషణలూ, కథ, నవల పరిచయాలలాగే చాలా బావుంది. పైన వేణు గారన్నట్లు సమగ్రంగా ఉండటమే కాకుండా భలే ఆసక్తి కలిగిస్తాయి మీ విశ్లేషణలు. అభినందనలు.

  3. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/03/2014 8:55 pm

    ప్రసాద్ గారూ, (మీ ఉద్దేశం మైథిలి అనుకుంటా. పొరపాటున రాధిక అన్నారు) – మీరన్నది ఆలోచించదగ్గ పాయింటే. కాని ఇంకా ఈ రోజుల్లో కూడానా!? ఆడ మగ స్నేహం అంటే అలాగే ఎందుకు ఆలోచించడం? రోజులు మారలేదా? స్నేహాల్లో నిజాయితీ పాళ్ళు ఎక్కువవడం గమనించే రాశాను. పోనీ ఇలా మంచి మార్పు రావాలనే ఆశాదృక్పథంతో రాశాను. ధన్యవాదాలతో…

  4. విముక్తం గురించి ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2014 8:27 pm

    ఇద్దరు పురుషులు గానీ, స్త్రీలు గానీ తమ తమ అభిరుచులు కలిసి, కలిసి వుండటమో, తరచుగా కలవడమో జరిగితే ఆ స్నేహం మరింత ముదురుతుంది కానీ, అదే opposite sex మధ్య అక్కడే ఆగుతుందా అంటే… అవునని చెప్పడం కష్టమే! ప్రాకృతిక ధర్మం తన పని తాను చేసుకు వెళుతుంది.

    రాధికవి పూర్తిగా ఈర్షాసూయలుగా కొట్టిపారేయలేను. రాధిక బాధ అర్థం చేసుకోదగ్గదే!

  5. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి lyla yerneni అభిప్రాయం:

    05/03/2014 8:22 pm

    “కన్నుల కాంతులు కలువల జేరెను
    మేలిమి జేరెను మేని పసల్ ”

    Hope I made it to సహృదయులు list.

    లైలా

  6. సెలవురోజు మొదటి ఆట గురించి ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2014 7:42 pm

    విలక్షణమైన కథా వస్తువు. చివరి వరకూ కథ ఏమి చెప్పదల్చుకుందో అర్థం కాదు. బీదరికం, భాధలు కళా రూపాలు అయిపోయాయి. కన్నీళ్ళు కార్చే పాఠకులే/వీక్షకులే కాదు, కన్నీళ్ళు కార్పించే కథకులూ/కళాకారులూ తడిసిపోయిన చేరుమాళ్ళు చూసుకొని కథెంత/కళెంత బాగా వచ్చిందో అని తృప్తిపడటాన్ని కథ పదునుగా ఎండ గట్టింది.

    ఆ మధ్య ఓ యింటికెళితే వాళ్ళ living roomలో ఓ మంచి పెద్ద వర్ణ చిత్రం కనపడింది. తీరా దగ్గరి కెళ్ళి పరిశీలనగా చూస్తే, ఓ దుక్కుకొట్టే రహదారి పక్కన చెట్టుకింద ఓ గుడిసా, దాని పక్కనే, మూడు రాళ్ళు పేర్చి కట్టెలతో రొట్టెలు వేసే తల్లి, నిక్కరైనా లేకుండా దుమ్ములో ఆడుకుంటున్న చిన్న పిల్లాడు!

  7. కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2014 6:07 pm

    చాలా బాగుంది.

    ఆయన మనవడి పేరు ఇస్మాయిల్ అవడం, ఈయన కొడుకు పేరు విశ్వం అవడమే అనంత ఆనందహేతువు! లోపల బూజు పట్టిన వాళ్ళు ఈ మాత్రమూ చేయలేరు.

    ప్రస్తుతం యింతటితో తృప్తిపడాల్సిందే!

  8. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2014 5:18 pm

    మరో కోణం నుండీ బ్రౌన్ విశేషాలు తెలియజేయడం బాగుంది కానీ ఎక్కడో ఈ వ్యాసం ధోరణి పట్ల కాసింత బాధ కూడా వుంది.

    తన స్వంత వుపయోగానికి అభ్యున్నతికి కాకుండా కేవల ప్రజల కోసమో కళ కోసమో చేసేవాళ్ళు అరుదు. కుంఫిణీ ప్రభుత్వమైనా, భారత దేశంలో రాజులైనా తమ స్వార్థం కోసమే చేశారు. కవులూ తమ పొట్ట నింపుకోవడం కోసమే ఎలాంటివాన్నైనా ఇంద్రుడూ, చంద్రుడంటూ పొగిడారు. ఇందులో కొత్తేముంది? చివరికీ చెట్టు కూడా తన నీడను స్వలాభం లేకుండా ఇవ్వటం లేదు కదా!

  9. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    05/03/2014 4:46 pm

    శ్రీ వేమూరి:

    మీ వ్యాసం ‘చదువు’మీద ఆసక్తి ఉన్న వారందరూ చదవాల్సిన వ్యాసం. మీ వ్యాసంలో ప్రస్తావించిన / తడిమిన కొన్ని విషయాల గురించి నేను చాలా సంవత్సరాలుగా ఆలొచిస్తున్నాను. మొట్టమొదటగా, నా వరకు నాకు తెలుగును మూడు విభిన్న కోణాల్నుంచి చూడక తప్పటం లేదు. మొదటిది: తెలుగు ప్రజలు అనబడే వాళ్లు నిత్య జీవితంలొ మాట్లాడుకునే భాషగా, రెండవది: తెలుగు విద్యార్థులు ఆధునిక శాస్త్రాలను చదువుకోటానికి వీలైన భాషగా. మూడవది:సాహిత్య భాషగా.

    మొదటి దానికి సంబంధించి నిత్యవ్యవహారాలలొ తెలుగు వారి దరిదాపులలొ లేకుండా ఇంగ్లీషునీ కనీసం అంతే తీవ్రతతో సంస్కృతాన్నీ తరిమి కొట్టాలని నేననుకుటూ ఉంటాను. తెలుగుకు ఉన్న రుచీ,చేవా తెలిస్తే/ తెలియజేయ గలిగితే దీనిని తేలికగా చేసేయవచ్చన్న ఒక పిచ్చి నమ్మకం నాకు ఉంది.

    రెండవ విషయానికి వస్తే నాది మొదటి దానికి భిన్నమైన ఆలోచన. ఇష్టమైనా కష్టమైనా శాస్త్ర సాంకేతిక విద్యా విషయాలలో మనం ఇంగ్లీష్ ను స్వీకరించక తప్పదు. తెలుగులో శాస్త్ర విషయాలను తెలియజెప్పాలనుకున్తపన ఉన్న వారు – పాఠ్య పుస్తకాలు రాసేవారైనా,ఇతరులైనా – పారిభాషిక/ పడికట్టు పదాలను ఉన్నవి ఉన్నట్టుగా ఇంగ్లిష్ భాష లోనివే వాడి తీరాలి. దీనికి తెలుగు భాష ఎంతో సహకరిస్తుంది.

    ఇప్పుడున్న పరిస్థితి ఆధారంగా ఒక ఉదాహరణ: if ‘f ‘is a continuous function… తెలుగు మీడియం పుస్తకాల్లో దీని రూపం: f ఒక అవిచ్చిన్న ప్రమేయమైతే… ఇది- ఒక ‘ఒక’ మినహాగా – తెలుగా సంస్కృతమా అన్న సంగతి కాస్త పక్కనుంచితే ఇలా నేర్చుకున్న వారు ఎంత తెలివి గలవారయినా బయట ప్రపంచంలో చెల్లరు. వాళ్లకు మాతృభాషలో చదువుకున్న advantage లభించదు. కారణం బయట ప్రపంచంలో ఫంక్షన్ ని ‘ప్రమేయము’ అని ఎవరూ అనరు. కన్టిన్యుటీని ‘అవిచ్సిన్నత ‘ అని అసలు అనరు. ఈ దుర్భర పరిస్థితి, తెలుగు అకాడమీ 1970 లలో బీ యస్సీ విద్యార్థులకు తెలుగులో – మాతృభాష లో – సైన్స్ బోధిస్తే సత్ఫలితాలను సాధించవచ్చన్న మంచి ఆలోచనతో తెలుగులో పాఠ్య పుస్తకాలు తయారుచేయటమనే పనిని కొంతమంది శాస్త్రంలో నిజంగా ఉద్దండులైన పండితులకు అప్పగించినప్పుడు – ఆ రచయితల ఆవిష్కరణ.

    గణితశాస్త్ర విషయంలో ఏమి జరిగిందో ఆ రోజుల్లో ఆంద్ర విశ్వ కళా పరిషత్లో అప్ప్లయిడ్ మాథమాటిక్స్‌లో అప్పుడే రీసెర్చ్ విద్యార్థిగా చేరిన నాకు కొంత తెలుసు కాబట్టి ఈ సంగతి గట్టిగా చెప్పగలను. ఆ తొలి రొజుల్లో చాలా సీరియస్గా పారిభాషిక పదాలను తయారుచేస్తున్న ఇద్దరు పెద్దల గట్టి చర్చను పక్క గదిలో నుంచి విన్న వాడినై వారిలో ఒకరు అప్పుడు నా రీసెర్చ్ గురువుగా ఉండటం వల్ల ఆయన దగ్గరకు వెళ్లి “మీరు ఘోరం చేస్తున్నారు” అని ఆయనతో చనువు తోనే చెప్పాను. “బాబూ – ‘f’ ఒక కంటిన్యుఅస్ ఫంక్షన్ అయితే – అని రాయండి” అని విన్నవించాను. ఆయన కొంత ఆలోచించి, చాలా చాలా తక్కువే అయినా ఎంతో కొంత అంగీకారం తో “ఒక సారి ఆయనతో కూడా చెప్పిచూడు.” అన్నారు.అలాగేనని ఆ రెండో ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్లి చెప్పాను. ఆయన నా మీద విరుచుకు పడి “జర్మన్ వాళ్ళు లెక్కలు జర్మన్ భాషలోనే చెప్పుకుంటారు, రాసుకుంటారు. అలాగే జపాను వాళ్ళు. నీకు ఏమి తెలుసు?” అన్నారు. ఒక విషయం ఆయన విస్మరించారు. యూరపు దేశాలలో సమకాలీనంగా ఆధునిక శాస్త్ర విషయాలలో మౌలిక అధ్యయనాలు జరిగినాయనీ, ఆ శాస్త్రాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాటిని వాళ్ళ పద్ధతులలో మనం నేర్చుకుంటున్నామనీ. జపానీయులు తదుపరి ఇంగ్లిష్ నేర్చుకొటానికి ఎంత అవస్థ పడ్డారొ కూడా ఆయనకు తెలిసి ఊండదు. తర్వాత చాల యేళ్ళకు వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలొ ఒక కాన్ఫరెన్స్‌లోలో ఒక ప్రఖ్యాత రష్యన్ శాస్త్రవేత్తతొ మాట్లాడుతున్నప్పుడు ఆయన “ఇప్పటి రష్యన్ కుర్రాళ్ళు కష్టపడి ఇంగ్లిష్ నేర్చుకుంటున్నార”ని మెచ్చుకొలుగా అన్న విషయం నాకు గుర్తుండి పోయింది.

    పైన చెప్పినటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు M.Sc స్థాయిలో ఇంగ్లీష్ లో పాఠం చెప్పటం ఎంత కష్టమయిన పనో పాఠం చెప్పటంలో కొంత శ్రద్ధ ఉన్న వాళ్ళకు మాత్రమే తెలిసిన సంగతి.

    మన దేశంలో చాలా మందికి – మూడు వందల సంవత్సరాలకు పైగా గడిచిన ఆంగ్లేయుల పాలన వల్ల సంస్కృతం కన్నా ఇంగ్లీషు దగ్గర అయింది. మీ రచనలో సారళ్యం ఎంత ఆనందాన్ని కలిగించినా మీరు తెలుగు అనువాదం పేరిట సైన్స్ లొ ఇంగ్లిష్ లొ ప్రాచుర్యంలొ ఉన్న పడికట్టు పదాలకు చేస్తున్న సంస్కృతీకరణ నాకు మెచ్చుకోదగినట్టుగా అనిపించదు.

    [మూడవ విషయం సాహిత్య భాషగా అది రచయిత ఇష్టాఇష్టాలతొ మాత్రమే ముడిబడిందని అనుకుంటాను. ఈ అభిప్రాయంలొ నేను సరి గానో తప్పు గానో వాడిన సంస్కృత పదాలు నాకు ఇష్టమై మాత్రం కాదు. వాటికి తెలుగు తెలీక].

    నమస్కారాలతో – వాసుదేవ రావు ఎరికలపూడి

  10. కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి గురించి ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2014 4:42 pm

    కొత్తపల్లి అద్బుతంగా వుంది.
    మా మనబడిలో పిల్లలకూ దీన్ని పరిచయం చేస్తాను.