శ్రీ వేమూరి: “తరగతిలో పాఠాలు ఎలా చెప్పాలో నేను చెప్పటం లేదు.” అన్నారు మీరు నా అభిప్రాయానికి జవాబుగా. మీ వ్యాసం ముక్తాయింపులో రెండొ వాక్యం “పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి.” అన్న దాన్ని చూసి, పాఠ్య పుస్తకాలకీ తరగతిలో పాఠం చెప్పటానికీ – కొద్దొ గొప్పో- ఉన్న సంబంధాన్ని పురస్కరించుకుని నేను తరగతి గది ప్రస్తావన తెచ్చాను. పారిభాషిక పదాలను కూడా తర్జుమా చేస్తే శాస్త్ర విషయాన్ని సగటు తెలుగు చదువరికి చేరవేయటం మెరుగ్గా నెరవేరుతుందని మీ భావన అని నేను అనుకుని, ‘మీరు తెలుగు అనువాదం పేరిట సైన్స్ లొ ఇంగ్లిష్ లొ ప్రాచుర్యంలొ ఉన్న పడికట్టు పదాలకు చేస్తున్న సంస్కృతీకరణ నాకు మెచ్చుకోదగినట్టుగా అనిపించదు.’ అని అన్నాను. నేను మెచ్చకుంటే మించిపొయింది ఏమీ లెదని తెలిసి కూడా.
‘మానిఫోల్డ్’ గురించి నేను చెప్పినది కూడా చాలా భాగం తెనిగింపే. అక్కడ నేను ‘మానిఫొల్డ్’ని అలాగే ఉంచాను. ‘మానిఫొల్డ్’ని ఏ ‘వళీ బాహుళ్య’ అనో, ‘బహువళీ’ అనో అనటం శాస్త్రాన్ని తెలుగు చదవరికి చేరవేయటం అన్న సత్కార్యానికి ఒనగూర్చే అదనపు మేలు ఏమీ లేదనే నా అభిప్రాయం.
ఏమిటేమిటీ? అంటే దొరగారు మనల్ని ఎలా తిట్టి కొట్టి ఈసడించినా నీళ్ళొచ్చినందుకు ఆయన మహామహుడా? భలే, భలే. అందుకేనా ఆయనకి విగ్రహాలూ, పూలదండలూను? భానే ఉంది సంబడం.
ఇంకో విషయమండోయ్, ఈ వ్యాసంలో ఎక్కదా నా.రా. గారు కంగారు పడినట్టు నాకు అనిపించలేదు. అరవై పైన ఆర్టికిల్స్/పుస్తకాలు కోట్ చేసి రాసినది “అనవసరమైన తొందర” గా ఉంది అని మీకు ఎలా అనిపించింది? శ్రీనివాస్ చాలాకాలం నుంచీ ఈ బ్రౌన్ గురించి ఈ విషయాలు అంటూనే ఉన్నారు. ఏమోలెండి, ప్రపంచం మన మనసుకి ప్రతిబింబం అన్నారు కదా?
ఇప్పటికే “స్టువర్డెస్” కి “గగనసఖి” లాంటి తెలుగు పదాలు కట్టి వాడితే సంపాదకులవారి కత్తెరకి గురి అయాయి. తెలుగు మాటలు వాడడం నాకు ఒక “ఫెటిష్” (అంటే, ఏ పని మీదనైనా అతిగా దృష్టి నిలపడం) గా తయారయిందని ఆక్షేపణలు కూడ వస్తున్నాయి. కనుక ఏదో నన్ను ఇలా బతకనివ్వండి! అప్పుడప్పుడు ఇంగ్లీషు మాటలు వాడకపోతే నన్ను ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారేమోనన్న భయంతో – వేమూరి
“మేనిఫోల్డ్” కి మీరు ఇచ్చిన వివరణ నా “బిందుసమూహం” కంటె బాగుంది. నేను పూర్వం ఎప్పుడో రాసిన “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?” అనే వ్యాసాన్ని మరమ్మత్తు చేసి తిరగ రాస్తున్నాను. అందులో మీ వివరణ వాడుకుంటాను.
మీరు తలుచుకుంటే చాలా బాగా రాయగలరని నాకు తెలిసింది కనుక మీరు కూడ అప్పుడప్పుడు తెలుగులో రాసి చూడండి. ఇంగ్లీషు వచ్చిన వాళ్లు కూడ అందరూ “టొపాలజీ” పుస్తకాలు, “రెలెటివిటీ” పుస్తకాలు అర్థం చేసుకోలేరు. అదే పదార్థం తెలుగులో కనిపిస్తే చదువుతారు. సైన్సుని నలుగురికీ అర్థం అయే భాషలో రాసి అదేమిటో చెప్పవలసిన బాధ్యత “సైంటిస్టు” ల మీదే ఉంది.
“వలసరాజ్యాల మీద వలసదేశాలు ఆధిపత్యం చలాయించడానికి కారణం కేవలం సైనికమైనది కాదనీ అది నిజానికి సాంస్కృతికమైనదనీ గమనించి మంచి ఆలోచనలు ప్రతిపాదించిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. తరువాత కాలంలో ఇంగ్లండులో ఉన్నారు. భారతదేశంలో కూడా ఉన్నారు”
“కాకపోతే ఆ పరిశోధనలన్నీ ఇంగ్లీషులో జరగబట్టి కాబోలు మన తెలుగు పండితుల చెవులకెక్కలేదు”
అంటే వలస దేశాల సాంస్కృతిక ఆధిపత్యం గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లండు అమెరికా మేధావులే శరణ్యమనా లేక ఇంగ్లీషు రిసర్చి పత్రాలే దిక్కు అనా ? తెలుగు సాహిత్యంలోనే ఇటువంటి ఆలోచనలు చేసిన పండితులు ఆ కాలం లోనే ఉండి ఉండచ్చును కదా? విశ్వనాథ?
మైథిలి పడ్ద మానసిక సంఘర్షణను చాలా బాగా వ్రాసారండీ. తనవాడూ అనుకున్న మనిషి పరాయివాడైపోతున్నాడేమోనన్న ఆందోళనతో ఆవిడ పడిన మానసికవ్యథ న్యాయంగానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆవిడలో వున్న సంస్కారం ఆ ఆందోళన అర్ధంలేదని వివరిస్తుంది. ఈరెండింటిమధ్యనున్న సన్నగీతని చాలా చక్కగా విశ్లేశించారు. అభినందనలండీ రాధగారూ..
“అణువు” కి బహువచనం “బణువు” 🙂 బాగుంది భలే గా వుంది. అవును మనం ఇంగ్లీషువాడు వేసిన పప్పులోని కాలుని పట్టుకుని పైకి ఎగబాకడం మొదలెట్టి వందలేళ్లైపోయాయి మరి. అంచేత పోటీని వాళ్లతో పడటం మొదలెట్టామే గానీ మనలో మనకో మనతో మనకో అసలు పోటీ ఏదీ?
“ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి. వెయ్యండి వీడికి రెండు వీరతాళ్ళు” అని ఘటోత్కచుడు మన తెలుగు మాయాబజార్లో పింగళి వారి మాటని కాస్తా కక్కేసి మనల్ని బతికించాడు గానీ మనం భరించలేని సంకర వాక్యాలతో ఇంకా గిరీశం శైలిలోనే ఇస్టారాజ్యంగా భాషని వాడుతూ రోజూ జాలిగా బతుకుతున్నాం 🙂
ఊహ అన్నది ముఖ్యం. అది ఉన్నవాళ్ళే కొత్త మాటల్ని చక్కగా తయారు చేసుకుంటారు. తెలుగులో చాలా మందికి “ఒరిజినాలిటీ” లేకనే, బధ్ధకం వల్లనో మరి అతి ఎక్కువ ఇంగ్లీషుని అవసరం ఉన్నా మానినా మాటల్లో వాడటం చేస్తోంటారు. మీరిచ్చిన వంటల “రెసిపీ” ని చెప్పినట్టు :). మేం ఆ టీవీల లోని ఆ సంకర భాష ని వినలేక చస్తూ బతుకుతూ ఉంటాం రోజూ 🙂
మా చిన్నప్పుడు మేం ప్రిడ్జ్ కి “మంచుబీరువా” అనీను ఇంకా ఇలాంటి లిస్టుని బోలెడన్ని తయారు చేస్తిమి ఒక కాలంలో గానీ అంతా నవ్వి ఊరుకున్నారే గానీ ఎవరూ నిజంగా పట్టించుకుంటే కద? అంతే, తెలుగు వాళ్ళకి తెలుగు మీద ఖాతరీ లేదు. తెలుగు కవుల మీదా లేదు. ఏం చేస్తాం! మన వాళ్ళకి ఇంగ్లీషువాడి చేత మాత్రమే మెప్పు పొందాలన్న కోరిక నరనరానా నిండిపోయేకా 🙂 కొత్త ఊహలు తెలుగులో ఆలోచించడానికి ఎలా వస్తాయి చెప్పండీ? అయినా పాపం మీ ప్రయత్నం మీరు చేసేరు. నేను మిమ్మల్ని సర్టెన్లీ సప్పోర్ట్ చేస్తున్నాను 🙂
సరదాగా అన్నాను గానీ చాలా మంచి ప్రయత్నం మీ వ్యాసం. బాగుంది. ఇది ఎవరికైనా అర్ధం అయి ఇటుపైన అయినా రాసేవారు వారు వారివారి వాక్యాలలో సరళమైన తెలుగు మాటలని.. అవి దొరకనప్పుడు కనీశం తత్సమ తధ్భవాలనైనా [ఇంగ్లీషుస్థానే] ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తారని మాత్రం ఆశిద్దాం.
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
05/05/2014 1:36 pm
శ్రీ వేమూరి: “తరగతిలో పాఠాలు ఎలా చెప్పాలో నేను చెప్పటం లేదు.” అన్నారు మీరు నా అభిప్రాయానికి జవాబుగా. మీ వ్యాసం ముక్తాయింపులో రెండొ వాక్యం “పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి.” అన్న దాన్ని చూసి, పాఠ్య పుస్తకాలకీ తరగతిలో పాఠం చెప్పటానికీ – కొద్దొ గొప్పో- ఉన్న సంబంధాన్ని పురస్కరించుకుని నేను తరగతి గది ప్రస్తావన తెచ్చాను. పారిభాషిక పదాలను కూడా తర్జుమా చేస్తే శాస్త్ర విషయాన్ని సగటు తెలుగు చదువరికి చేరవేయటం మెరుగ్గా నెరవేరుతుందని మీ భావన అని నేను అనుకుని, ‘మీరు తెలుగు అనువాదం పేరిట సైన్స్ లొ ఇంగ్లిష్ లొ ప్రాచుర్యంలొ ఉన్న పడికట్టు పదాలకు చేస్తున్న సంస్కృతీకరణ నాకు మెచ్చుకోదగినట్టుగా అనిపించదు.’ అని అన్నాను. నేను మెచ్చకుంటే మించిపొయింది ఏమీ లెదని తెలిసి కూడా.
‘మానిఫోల్డ్’ గురించి నేను చెప్పినది కూడా చాలా భాగం తెనిగింపే. అక్కడ నేను ‘మానిఫొల్డ్’ని అలాగే ఉంచాను. ‘మానిఫొల్డ్’ని ఏ ‘వళీ బాహుళ్య’ అనో, ‘బహువళీ’ అనో అనటం శాస్త్రాన్ని తెలుగు చదవరికి చేరవేయటం అన్న సత్కార్యానికి ఒనగూర్చే అదనపు మేలు ఏమీ లేదనే నా అభిప్రాయం.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి okaDu అభిప్రాయం:
05/05/2014 1:03 pm
జయప్రభ గారు,
ఏమిటేమిటీ? అంటే దొరగారు మనల్ని ఎలా తిట్టి కొట్టి ఈసడించినా నీళ్ళొచ్చినందుకు ఆయన మహామహుడా? భలే, భలే. అందుకేనా ఆయనకి విగ్రహాలూ, పూలదండలూను? భానే ఉంది సంబడం.
ఇంకో విషయమండోయ్, ఈ వ్యాసంలో ఎక్కదా నా.రా. గారు కంగారు పడినట్టు నాకు అనిపించలేదు. అరవై పైన ఆర్టికిల్స్/పుస్తకాలు కోట్ చేసి రాసినది “అనవసరమైన తొందర” గా ఉంది అని మీకు ఎలా అనిపించింది? శ్రీనివాస్ చాలాకాలం నుంచీ ఈ బ్రౌన్ గురించి ఈ విషయాలు అంటూనే ఉన్నారు. ఏమోలెండి, ప్రపంచం మన మనసుకి ప్రతిబింబం అన్నారు కదా?
ఎండని ఏడో చేప కథ గురించి Rao Vemuri అభిప్రాయం:
05/05/2014 12:27 pm
రంగ, రంగా! ఎంత మాటన్నారు!
ఇప్పటికే “స్టువర్డెస్” కి “గగనసఖి” లాంటి తెలుగు పదాలు కట్టి వాడితే సంపాదకులవారి కత్తెరకి గురి అయాయి. తెలుగు మాటలు వాడడం నాకు ఒక “ఫెటిష్” (అంటే, ఏ పని మీదనైనా అతిగా దృష్టి నిలపడం) గా తయారయిందని ఆక్షేపణలు కూడ వస్తున్నాయి. కనుక ఏదో నన్ను ఇలా బతకనివ్వండి! అప్పుడప్పుడు ఇంగ్లీషు మాటలు వాడకపోతే నన్ను ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారేమోనన్న భయంతో – వేమూరి
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి Rao Vemuri అభిప్రాయం:
05/05/2014 11:41 am
వాసుదేవ రావు గారూ,
“మేనిఫోల్డ్” కి మీరు ఇచ్చిన వివరణ నా “బిందుసమూహం” కంటె బాగుంది. నేను పూర్వం ఎప్పుడో రాసిన “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?” అనే వ్యాసాన్ని మరమ్మత్తు చేసి తిరగ రాస్తున్నాను. అందులో మీ వివరణ వాడుకుంటాను.
మీరు తలుచుకుంటే చాలా బాగా రాయగలరని నాకు తెలిసింది కనుక మీరు కూడ అప్పుడప్పుడు తెలుగులో రాసి చూడండి. ఇంగ్లీషు వచ్చిన వాళ్లు కూడ అందరూ “టొపాలజీ” పుస్తకాలు, “రెలెటివిటీ” పుస్తకాలు అర్థం చేసుకోలేరు. అదే పదార్థం తెలుగులో కనిపిస్తే చదువుతారు. సైన్సుని నలుగురికీ అర్థం అయే భాషలో రాసి అదేమిటో చెప్పవలసిన బాధ్యత “సైంటిస్టు” ల మీదే ఉంది.
– వేమూరి
అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి Manjari Lakshmi అభిప్రాయం:
05/05/2014 7:53 am
మీరు చేసిన విశ్లేషణ బాగుందండి.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Halley అభిప్రాయం:
05/05/2014 5:20 am
అంటే వలస దేశాల సాంస్కృతిక ఆధిపత్యం గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లండు అమెరికా మేధావులే శరణ్యమనా లేక ఇంగ్లీషు రిసర్చి పత్రాలే దిక్కు అనా ? తెలుగు సాహిత్యంలోనే ఇటువంటి ఆలోచనలు చేసిన పండితులు ఆ కాలం లోనే ఉండి ఉండచ్చును కదా? విశ్వనాథ?
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/05/2014 3:41 am
సుబ్బలక్ష్మి గారూ, మీరు కూడా చక్కగా విశ్లేషణాపూరితమైన వ్యాఖ్యని చేశారు కథ గురించి. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు మీకు.
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/05/2014 3:36 am
చాలా సంతోషంగా ఉందండీ సుకన్య గారూ మీ కామెంట్ కి. ధన్యవాదాలు
విముక్తం గురించి G.S.Lakshmi అభిప్రాయం:
05/05/2014 2:46 am
మైథిలి పడ్ద మానసిక సంఘర్షణను చాలా బాగా వ్రాసారండీ. తనవాడూ అనుకున్న మనిషి పరాయివాడైపోతున్నాడేమోనన్న ఆందోళనతో ఆవిడ పడిన మానసికవ్యథ న్యాయంగానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆవిడలో వున్న సంస్కారం ఆ ఆందోళన అర్ధంలేదని వివరిస్తుంది. ఈరెండింటిమధ్యనున్న సన్నగీతని చాలా చక్కగా విశ్లేశించారు. అభినందనలండీ రాధగారూ..
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి jayaprabha అభిప్రాయం:
05/05/2014 1:30 am
అయ్యా! మీ వ్యాసం నాకు బాగుంది సుమా!