I think you might very well be aware when you wrote your comments that your harsh comments would definitely hurt many, who are die-hard fans of ChaSo. And, it is a fact that die-hard fans of ChaSo are very many in the Telugu literary lovers. Still, you went ahead. Of course, I know that I should not question your liberty at expressing your beliefs/ideas so long as they don’t cause any direct harm to the person intended. And, I fully agree that your assertions do not cause any harm to the ChaSo admirers directly. Now, I would like to write something, which may not be palatable to your sentiments if you are a sentimental person. Of course, it would not cause any direct harm to you. (You can be rest assured 😉 ).
If you give permission to me, I would write; otherwise, I would not. I am giving you 100% guarantee that it would exactly be in the lines in which you wrote.
తెలుగు సాహిత్య భాషగా (తెలుగు) సినిమా భాషను గురించి ఎందుకు రాశానంటే ‘పున్నమి వెన్నెల గిలిగింతలకు పూసిన మల్లెల మురిపాలూ నీ చిరునవ్వుకు సరి కావమ్మా’, ‘కావాలంటె ఇస్తాలే , నావన్నీ ఇక నీవెలే’, ‘వద్దురా కన్నయా ఈ పొద్దు ఇలు వదలి పోవద్దు రా అయ్యా’, ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ’, ‘మనసున మల్లెల మాల లూగెనే’ వంటి పాటల్నీ , ‘తెలియని వానికి చెప్పినా తెలియదు’, ‘సేవకులు ఎక్కువైతే సౌకర్యాలు తగ్గిపోతయ్’, శాసతరం సొంత తెలివి లేని వాళ్లకు’, వంటి మాటల్నీ ప్రసాదించింది తెలుగు సినిమా భాష.
కామేశ్వరరావు గారూ: ఇడ్డెన / ఇడ్లీ, అట్టు/ దోశ, చారు/రసం, పప్పుచారు/సాంబారు — వీటిల్లో తెలుగు మాటలేవి? కానివేవి? వాడుకలో ఉన్నవేవి? మన రోజు వారీ బతుకులో మనం తెలుగుని పెంచుకున్నామా? తుంచుకున్నామా? తిర్యక్ ప్రకంపనలు, అవిచ్చిన్న ప్రమేయములు, మితులు వంటి శాస్త్ర పరిభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేస్తున్నట్టా?
సాహిత్యభాషలో నేడు ఒక ప్రముఖ శాఖయై జనబాహుళ్యం లోకి తేలికగా చొచ్చుకు పోయే సినిమా భాషను తీసుకుంటే తెలుగు సినిమాలలో సంభాషణ లైనా, పాటలైనా ఆఖరికి తెలుగు సినిమాల పేర్లు అయినా తెలుగులో ఉన్నాయనగలమా? పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు అనువాదాల విషయంలో అవి శాస్త్ర సాంకేతిక విషయాలు కానివ్వండి, ఇతరములు కానీయండి ఏమి చెప్పి / చేసి ఎవర్ని ఒప్పించగలం? ఎవరికి ఉపయోగ పడగలం? అన్న నిస్పృహ వస్తుంది. అయినా తెలుగు పిల్లలు తెలుగులొ శాస్త్రాలను చిన్నతనం నుంచే తెలుగులో నేర్చుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందనిపించక మానదు. కానీ ఏ భాష కైనా ఒక మాతృభాషగా బుద్ధిని ప్రచోదన చేసే మౌలిక లక్షణాలనేవి ఏమైనా ఉంటే తెలుగు భాషకున్న ఇటువంటి లక్షణాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయనిపిస్తోంది. ఈ విషయం గురించి శ్రీ కొలిచాల వంటి పండితులు కొంత ఆలోచన చేసి నా వంటి వారికి తెలియజెప్పాలని అనుకుంటాను.
“ఆకుపాట” పేరే కవిత్వపు కొత్తదనాన్ని చెబుతోంది. ఆకుపాటకు మీ సమీక్ష పిట్ట పిల్లంగోవి ఊదినట్లు చదివినంతసేపూ రెప్పల్ని మంత్రించివేసిందంటే నమ్మండి.పుస్తకమింకా చదవలేదు గానీ ఒక్కచోట మాత్రం మీతో నే విభేదిస్తున్నా.
“వెన్నెల వెండితెరలో నుండి తొంగిచూస్తూ
మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని
ముద్రిస్తూ ముద్దు కౌముది” –(ఛాయాగీత్, పు: 43)
అన్నచోట “మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా” అన్నది ఉపమానమని నా ఊడ్దేశ్యం.’మూన్ బో’అంటూ మీరు లోతుగా ఆలోచించారు. వెన్నెల/కౌముది (కుముదము అంటే కలువలకు ఆనందం కలిగించేది, అంటూ సమర్థించను లేండీ ) మాత్రం ఒకే మీరే కరెక్ట్. కరెక్ట్.
శ్రీ ఏల్చూరి: ఒక చర్చ, ఒక వ్యాఖ్య ఒక వ్యాసాన్ని మెరుగు పరుస్తుందన్న దానికి ఈ సన్నివేశం ఒక మంచి ఉదాహరణ. ఏ కవితా, ఏ వ్యాసమూ ఎప్పటికీ ముగియవనీ, రాసిన వారనబడుతున్న వారితో సహా అవి ఏ ఒక్కరి సొమ్మూ కావనీ, అవి ఉమ్మడి ఆస్థి అనీ, ఇందులో వాదోపవాదాలలొ కనపడుతున్నట్టుగా అనిపించే అహంకారాలు కూడా ఆ రచనని మెరుగు పరచటం అన్న క్రతువులో సమిధలేననీ నా భావన. లైలా గారి వ్యాఖ్య లొ ఉన్న ఔచిత్యం దొడ్దది. సౌదర్యపూరితమైనది. ఆవ్యాఖ్యని మీరు గ్రహించిన తీరు బంగారం లాంటి మీ పాండిత్యానికి సన్నజాజుల పరిమళం కూడా ఉన్నదని చెప్పకుండా చెపుతోంది. మీ ఇరువురకూ నా అభివందనములు. తః తః
నమస్కారం
మంచి ధారగల పద్యాలతో, చదివింపజేసే రీతిలో పోతనను, భాగవతావతరణమును అందించినందుకు చాలా కృతజ్ఞతలు.
పోతన కనిపించని రూపాన్ని వర్ణించినంతగా కనిపించే అతని వ్యక్తిత్వాన్ని స్పృశించకపోవడం కొంత వెలితి.
‘భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన”, అని, అయినా, “తెలియవచ్చినంత తేట పఱతు” అని అనడం పోతన వినయానికి చిన్న ఉదాహరణ అనిపిస్తుంది. ఇప్పటికీ, కావ్యాలలో గ్రంథాలలో ముందుమాటగా, సాయం చేసినవారెందరికో కృతజ్ఞతలు చెప్పుకోవడం కనపడుతుంది. అయితే, పూర్వకవులను సంభావించి, వర్తమాన కవులకు ప్రియంబు పలికి, “భావికవుల” ను సైతం బహూకరించి కావ్యాన్ని ప్రారంభించడం పోతన విశిష్ట సహృదయతను, విశాల దృష్టిని ఎత్తి చూపిస్తుంది.
ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో సైతం ఆ రాజ్యం తెస్తాం ఈ రాజ్యం చేస్తాం అన్నది వినబడుతున్న ఈ రోజుల్లో సైతం,
అప్పుడు రాజులు ఏలుతున్న కాలంలోనే “రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే” అని బలి పలకడం, కాదు, బలిచేత పలికించడం చదివితే, నిజంగా ఎంతో ధీర ధైర్యతలున్న పోతనగారికే సాధ్యమనిపిస్తుంది. ఈ రోజు Mothers day అని జరుపుకుంటున్నా, అయిదువందల ఏండ్లకు పూర్వమే పోతన భాగవతంలో తన తల్లిని
“మానినులీడురారు.. దీన మానసగ్లానికి.. గభీరతాస్థానికి..నయవాగ్భవానికి..బమ్మెర కేతయ లక్కసానికిన్” అని చెప్పుకోవడం అతని మాతృప్రేమను చూపిస్తుంది.
అపారము, అపూర్వము అయిన అతని అనుప్రాసాలంకారాలు, భక్త్యావేశ వర్ణనల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎక్కువే మిగిలే ఉంటుందనిపిస్తుంది.
ఆయన మాటల సాయంతోనే ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించడం-
ఇంగ్లీషునుండి తెలుగు తర్జుమా విషయమై, వాసుదేవరావుగారు మొదటి వ్యాఖ్యలో చెప్పిన మూడు కోణాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అనువాదాల విషయంలో యీ మూడూ చాలా భిన్నమైనవి. అనువాద ప్రయోజనంలోనూ, విధానంలోనూ, రూపంలోనూ కూడా వీటి మధ్య చాలా తేడాలున్నాయి. తెలుగు తర్జుమాల విషయమై నేను చూసిన చర్చల్లో బహుశా తొంభైశాతం, యీ తేడాలు గమనించకపోవడం వల్ల గందరగోళానికి దారి తీసినవే. వేమూరిగారి వ్యాసంలో కూడా నాకు ప్రధానంగా కనిపించిన లోపం ఇదే. వ్యాస ముఖ్యాంశం వైజ్ఞానికి, సాంకేతిక రంగాలలో తర్జుమా అయినా, ఇందులో చర్చించిన విషయాలూ ఇచ్చిన ఉదాహరణలు, ముప్పాతికవంతు వైజ్ఞానికేతర రంగాల గురించే.
ప్రస్తుతం వైజ్ఞానికరంగానికి పరిమితమై చూస్తే, ముందుగా అసలు తర్జుమా అవసరం లేదా ప్రయోజనం ఏమిటన్నది తప్పక ఆలోచించాలి. ప్రయోజనాన్ని బట్టే, అనువాద విధానం, దాని స్వరూపం ఆధారపడి ఉంటాయి. రెండు ప్రయోజనాలు ఊహించవచ్చు. ఒకటి వైజ్ఞానిక విషయాలు తెలుగువాళ్ళకి సులువుగా బోధపడటం. రెండు, వైజ్ఞానిక పదసంపదతో తెలుగుభాష పరిపుష్టి కావడం. ప్రాథమిక పాఠశాలల్లో వైజ్ఞానిక విషయాలను తెలుగులో బోధించడంలో ఉన్నది మొదటి ప్రయోజనం. అలాగే వైజ్ఞానికవిషయాలను సామాన్యులకు పరిచయం చేయడానికి వ్రాసే జనరంజక వ్యాసాల వల్ల కూడా మొదటి ప్రయోజనమే చేకూరుతుంది. అంచేత, వీటి విషయంలో తర్జుమా ఒక పద్ధతిలో సాగాలి. ఇక ఉన్నతవిద్యలోనూ, పరిశోధనలోనూ తెలుగుభాషను వాడడం వల్ల ఒనగూరే ప్రయోజనం రెండవది, అంటే భాషాపరిపుష్టి. దీనికి అనుసరించాల్సిన మార్గం మొదటి దానికన్నా వేరుగా సాగాలి. ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాల విషయంలో అనువాదానికి ముఖ్యలక్షణం సులభగ్రాహ్యత. నిర్దిష్టత, క్లుప్తత అంత ప్రధానం కావు. అదే ఉన్నతవిద్యలో నిర్దిష్టత, క్లుప్తత ప్రధానం. సులభగ్రాహ్యత కాదు. ఏ భాషలోనైనా చాలావరకూ వైజ్ఞానిక పదాలు తమంత తాము అర్థస్ఫురణని కలిగించేవి కావు. నిత్యవ్యవహారంలో కాస్త సమీపంగా ఉన్న భావాలకు వాడే పదాలు తెచ్చి తమకు అనువుగా వాడుకోవడమో, కొత్త పదాలను సృష్టించడమో జరుగుతుంది. అలా వాడుకభాషలోంచి తెచ్చుకొన్న పదాలకు శాస్త్రరంగంలో తమదైన ప్రత్యేక అర్థం ఏర్పడుతుంది. ఆ భాషలో ఆ శాస్త్రాన్ని అభ్యసించిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. అంచేత, ప్రాథమికవిద్య అయినా, ఉన్నతవిద్య అయినా, శాస్త్రంలోని పదాలన్నీ చప్పున అర్థమైపోవాలని అనుకోవడం తప్పు. మన భాషలో ఎంత బాగా ఇమిడిపోయాయి, ఎంత సులువుగా పాఠకులు దాన్ని గుర్తుపెట్టుకోగలరు, మొదలైన అంశాలే ముఖ్యం. ప్రాథమికవిద్యలోనూ, జనరంజక వ్యాసాలలోనూ ఆయా పదాలకు సంబంధించిన భావాలను ఎంత సులువుగా తెలుగులో బోధపరచగలం అనేదే ముఖ్యమైన విషయం.
మరి అలాంటప్పుడు ఇంగ్లీషులో ఉన్న పారిభాషిక పదాలను అలాగే వాడితే వచ్చిన నష్టమేవిటి? అన్న ప్రశ్న వస్తుంది. నా ఆలోచనకి తడుతున్న ఒక ఇబ్బంది – అప్పుడలాంటి పాఠాలూ వ్యాసాలూ ఆంగ్లపదాలతో నిండిపోయి తెలుగు భాషా స్వరూపాన్ని మౌలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు “కంటిన్యుఅస్” అనేది ఏ కోశానా ఇప్పటి తెలుగుభాషాలో ఇమడలేని పదం. ఇలాంటి పదాలు ఉన్నవున్నట్టుగా తెలుగులో విస్తృతమైతే, తెలుగుభాషా స్వరూపం మారిపోతుంది (ఎందుకంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాలూ కాబట్టి). అయితే, ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగులో తెలుగు పారిభాషిక పదాలతో సాగితే ఉన్నతవిద్య మాటేమిటి? బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పటి సంగతేమిటి? అన్న మరొక ప్రశ్న వస్తుంది. ఈ విషయంలో నాకు ఏ రకమైన అనుభవమూ లేదు కాని, తెలుగులోని ప్రాథమికవిద్యకూ ఇంగ్లీషులో ఉన్నతవిద్యకూ మధ్య వారధి కట్టడం అంత కష్టమైన పని కాదని నా ఉద్దేశం. అయితే దీనికి ఒక ప్రణాళిక తప్పనిసరి. అలా లేనప్పుడే అది వాసుదేవరావుగారు చెప్పిన యిబ్బందులకు దారితీస్తుంది. ఇక ఉన్నతవిద్య విషయానికి వస్తే, అందులో తెలుగు వాడడం వెనక ముఖ్యప్రయోజనం తెలుగు భాషని శాస్త్రభాషగా అభివృద్ధి చేయడం ఒక్కటే. అయితే, ప్రాథమికవిద్యలో తెలుగు విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తే తప్ప యిది అసాధ్యం. అసలంతవరకూ దాని గురించి ఆలోచించడమే అనవసరం!
చివరిగా మరొక మాట. తెలుగుభాషపై ఇంగ్లీషు ప్రభావం గూర్చి వచ్చినప్పుడల్లా, సంస్కృతభాషా ప్రభావం గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది. ఈ తేడాలను గుర్తించడం చాలా అవసరం.
1. నిత్యవ్యవహారంలో సంస్కృత ప్రభావం ప్రధానంగా కనిపించేది తెలుగులోకి వచ్చి చేరిన అక్షరాలలో (మహాప్రాణాలు మొదలైనవి). పదాలు కూడా వచ్చి చేరాయి కాని, అవి తెలుగుభాషా స్వరూపానికి అనువుగా మారి వచ్చాయి. తద్భవాలు తెలుగుభాష ఉచ్చారణకు దగ్గరగా పదస్వరూపాన్ని మార్చుకున్నవి అయితే, తత్సమాలు తెలుగు విభక్తిప్రత్యయాలతో కలిసి తెలుగులోకి వచ్చినవి. ఇంగ్లీషునుండి తెలుగులోకి వస్తున్న పదాలలో ఇలాంటి మార్పులేవీ జరగడం లేదు (ఒకప్పుడు జరిగాయి, క్రమేపీ అది తగ్గుముఖం పట్టి ఉన్నవున్నట్టుగా వాడడం బాగా ఎక్కువయ్యింది).
2. తెలుగుభాషా స్వభావానికి కొంత పరాయిగా ఉండే సంధులు, సమాసాలవంటివి కూడా తెలుగుభాషలోకి వచ్చాయి. అయితే ఇవి చాలావరకూ కావ్యభాషకు మాత్రమే పరిమితం. ఆ కాలంలో కావ్యభాష అత్యల్పవర్గానికి మాత్రమే పరిచితమైన భాష. అంచేత వాడుకభాషపై దాని ప్రభావం పరిమితం. మూలమట్టంగా తెలుగుభాషా స్వరూపాన్ని అవి మార్చేయలేదు. కానీ ప్రస్తుతం ఇంగ్లీషు ప్రభావం అలాంటిది కాదు. ఇది నిత్యవ్యవహారంలోకి చొచ్చుకొనిపోతోంది. అంచేత దీనికి భాష మౌలిక స్వరూపాన్ని మార్చేసే శక్తి ఉంది. అలాంటి సమూలపరివర్తనను మనం ఆహ్వానిస్తామా లేదా అన్నది మనం తేల్చుకోవలసిన విషయం.
ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి G V Ramesh అభిప్రాయం:
05/13/2014 5:22 am
Respected sri Jampala Chowdury garu,
Super-like for the impression 🙂
Wishes, Thanks and Regards
– G V Ramesh
Respected sri Meher,
I think you might very well be aware when you wrote your comments that your harsh comments would definitely hurt many, who are die-hard fans of ChaSo. And, it is a fact that die-hard fans of ChaSo are very many in the Telugu literary lovers. Still, you went ahead. Of course, I know that I should not question your liberty at expressing your beliefs/ideas so long as they don’t cause any direct harm to the person intended. And, I fully agree that your assertions do not cause any harm to the ChaSo admirers directly. Now, I would like to write something, which may not be palatable to your sentiments if you are a sentimental person. Of course, it would not cause any direct harm to you. (You can be rest assured 😉 ).
If you give permission to me, I would write; otherwise, I would not. I am giving you 100% guarantee that it would exactly be in the lines in which you wrote.
May GOD bless you always. 🙂
Wishes Thanks & Regards
– GV Ramesh
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవరావు అభిప్రాయం:
05/13/2014 4:06 am
తెలుగు సాహిత్య భాషగా (తెలుగు) సినిమా భాషను గురించి ఎందుకు రాశానంటే ‘పున్నమి వెన్నెల గిలిగింతలకు పూసిన మల్లెల మురిపాలూ నీ చిరునవ్వుకు సరి కావమ్మా’, ‘కావాలంటె ఇస్తాలే , నావన్నీ ఇక నీవెలే’, ‘వద్దురా కన్నయా ఈ పొద్దు ఇలు వదలి పోవద్దు రా అయ్యా’, ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ’, ‘మనసున మల్లెల మాల లూగెనే’ వంటి పాటల్నీ , ‘తెలియని వానికి చెప్పినా తెలియదు’, ‘సేవకులు ఎక్కువైతే సౌకర్యాలు తగ్గిపోతయ్’, శాసతరం సొంత తెలివి లేని వాళ్లకు’, వంటి మాటల్నీ ప్రసాదించింది తెలుగు సినిమా భాష.
వాసుదేవరావు.
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవరావు అభిప్రాయం:
05/12/2014 6:20 pm
కామేశ్వరరావు గారూ: ఇడ్డెన / ఇడ్లీ, అట్టు/ దోశ, చారు/రసం, పప్పుచారు/సాంబారు — వీటిల్లో తెలుగు మాటలేవి? కానివేవి? వాడుకలో ఉన్నవేవి? మన రోజు వారీ బతుకులో మనం తెలుగుని పెంచుకున్నామా? తుంచుకున్నామా? తిర్యక్ ప్రకంపనలు, అవిచ్చిన్న ప్రమేయములు, మితులు వంటి శాస్త్ర పరిభాషా పదాలు తెలుగును పరిపుష్టం చేస్తున్నట్టా?
సాహిత్యభాషలో నేడు ఒక ప్రముఖ శాఖయై జనబాహుళ్యం లోకి తేలికగా చొచ్చుకు పోయే సినిమా భాషను తీసుకుంటే తెలుగు సినిమాలలో సంభాషణ లైనా, పాటలైనా ఆఖరికి తెలుగు సినిమాల పేర్లు అయినా తెలుగులో ఉన్నాయనగలమా? పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు అనువాదాల విషయంలో అవి శాస్త్ర సాంకేతిక విషయాలు కానివ్వండి, ఇతరములు కానీయండి ఏమి చెప్పి / చేసి ఎవర్ని ఒప్పించగలం? ఎవరికి ఉపయోగ పడగలం? అన్న నిస్పృహ వస్తుంది. అయినా తెలుగు పిల్లలు తెలుగులొ శాస్త్రాలను చిన్నతనం నుంచే తెలుగులో నేర్చుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందనిపించక మానదు. కానీ ఏ భాష కైనా ఒక మాతృభాషగా బుద్ధిని ప్రచోదన చేసే మౌలిక లక్షణాలనేవి ఏమైనా ఉంటే తెలుగు భాషకున్న ఇటువంటి లక్షణాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయనిపిస్తోంది. ఈ విషయం గురించి శ్రీ కొలిచాల వంటి పండితులు కొంత ఆలోచన చేసి నా వంటి వారికి తెలియజెప్పాలని అనుకుంటాను.
నమస్కారాలతో
వాసుదేవరావు
ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం గురించి raj అభిప్రాయం:
05/12/2014 10:24 am
“ఆకుపాట” పేరే కవిత్వపు కొత్తదనాన్ని చెబుతోంది. ఆకుపాటకు మీ సమీక్ష పిట్ట పిల్లంగోవి ఊదినట్లు చదివినంతసేపూ రెప్పల్ని మంత్రించివేసిందంటే నమ్మండి.పుస్తకమింకా చదవలేదు గానీ ఒక్కచోట మాత్రం మీతో నే విభేదిస్తున్నా.
“వెన్నెల వెండితెరలో నుండి తొంగిచూస్తూ
మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని
ముద్రిస్తూ ముద్దు కౌముది” –(ఛాయాగీత్, పు: 43)
అన్నచోట “మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా” అన్నది ఉపమానమని నా ఊడ్దేశ్యం.’మూన్ బో’అంటూ మీరు లోతుగా ఆలోచించారు. వెన్నెల/కౌముది (కుముదము అంటే కలువలకు ఆనందం కలిగించేది, అంటూ సమర్థించను లేండీ ) మాత్రం ఒకే మీరే కరెక్ట్. కరెక్ట్.
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి తఃతః అభిప్రాయం:
05/12/2014 6:00 am
శ్రీ ఏల్చూరి: ఒక చర్చ, ఒక వ్యాఖ్య ఒక వ్యాసాన్ని మెరుగు పరుస్తుందన్న దానికి ఈ సన్నివేశం ఒక మంచి ఉదాహరణ. ఏ కవితా, ఏ వ్యాసమూ ఎప్పటికీ ముగియవనీ, రాసిన వారనబడుతున్న వారితో సహా అవి ఏ ఒక్కరి సొమ్మూ కావనీ, అవి ఉమ్మడి ఆస్థి అనీ, ఇందులో వాదోపవాదాలలొ కనపడుతున్నట్టుగా అనిపించే అహంకారాలు కూడా ఆ రచనని మెరుగు పరచటం అన్న క్రతువులో సమిధలేననీ నా భావన. లైలా గారి వ్యాఖ్య లొ ఉన్న ఔచిత్యం దొడ్దది. సౌదర్యపూరితమైనది. ఆవ్యాఖ్యని మీరు గ్రహించిన తీరు బంగారం లాంటి మీ పాండిత్యానికి సన్నజాజుల పరిమళం కూడా ఉన్నదని చెప్పకుండా చెపుతోంది. మీ ఇరువురకూ నా అభివందనములు. తః తః
గూడు గురించి Seetha అభిప్రాయం:
05/12/2014 5:24 am
ఎంతో ఆర్ద్రత ఉంది ఈ కవితలో …
భాగవతావతరణము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
05/12/2014 2:01 am
నమస్కారం
మంచి ధారగల పద్యాలతో, చదివింపజేసే రీతిలో పోతనను, భాగవతావతరణమును అందించినందుకు చాలా కృతజ్ఞతలు.
పోతన కనిపించని రూపాన్ని వర్ణించినంతగా కనిపించే అతని వ్యక్తిత్వాన్ని స్పృశించకపోవడం కొంత వెలితి.
‘భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన”, అని, అయినా, “తెలియవచ్చినంత తేట పఱతు” అని అనడం పోతన వినయానికి చిన్న ఉదాహరణ అనిపిస్తుంది. ఇప్పటికీ, కావ్యాలలో గ్రంథాలలో ముందుమాటగా, సాయం చేసినవారెందరికో కృతజ్ఞతలు చెప్పుకోవడం కనపడుతుంది. అయితే, పూర్వకవులను సంభావించి, వర్తమాన కవులకు ప్రియంబు పలికి, “భావికవుల” ను సైతం బహూకరించి కావ్యాన్ని ప్రారంభించడం పోతన విశిష్ట సహృదయతను, విశాల దృష్టిని ఎత్తి చూపిస్తుంది.
ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో సైతం ఆ రాజ్యం తెస్తాం ఈ రాజ్యం చేస్తాం అన్నది వినబడుతున్న ఈ రోజుల్లో సైతం,
అప్పుడు రాజులు ఏలుతున్న కాలంలోనే “రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే” అని బలి పలకడం, కాదు, బలిచేత పలికించడం చదివితే, నిజంగా ఎంతో ధీర ధైర్యతలున్న పోతనగారికే సాధ్యమనిపిస్తుంది. ఈ రోజు Mothers day అని జరుపుకుంటున్నా, అయిదువందల ఏండ్లకు పూర్వమే పోతన భాగవతంలో తన తల్లిని
“మానినులీడురారు.. దీన మానసగ్లానికి.. గభీరతాస్థానికి..నయవాగ్భవానికి..బమ్మెర కేతయ లక్కసానికిన్” అని చెప్పుకోవడం అతని మాతృప్రేమను చూపిస్తుంది.
అపారము, అపూర్వము అయిన అతని అనుప్రాసాలంకారాలు, భక్త్యావేశ వర్ణనల గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎక్కువే మిగిలే ఉంటుందనిపిస్తుంది.
ఆయన మాటల సాయంతోనే ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించడం-
ఇందుగలడందులేదని
సందేహము వలదు పద్య సముదాయములం
దెందెందు వెతకి చూచిన
అందందే కలదు ధార అతులిత భక్తిన్
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునె తరంగిణులకు?
లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు?
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు?
పోతనార్యుని పద్యాల పొంగి పొరలు
రమ్య శబ్దార్థ సద్భక్తి రసము గ్రోలు
చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు
విశద పరచగ మాటలు వేయునేల?
============
విధేయుడు
_శ్రీనివాస్
మోహమకరందం గురించి Seetha అభిప్రాయం:
05/11/2014 6:57 pm
చాల చాల బాగుంది.
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
05/11/2014 1:33 pm
ఇంగ్లీషునుండి తెలుగు తర్జుమా విషయమై, వాసుదేవరావుగారు మొదటి వ్యాఖ్యలో చెప్పిన మూడు కోణాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అనువాదాల విషయంలో యీ మూడూ చాలా భిన్నమైనవి. అనువాద ప్రయోజనంలోనూ, విధానంలోనూ, రూపంలోనూ కూడా వీటి మధ్య చాలా తేడాలున్నాయి. తెలుగు తర్జుమాల విషయమై నేను చూసిన చర్చల్లో బహుశా తొంభైశాతం, యీ తేడాలు గమనించకపోవడం వల్ల గందరగోళానికి దారి తీసినవే. వేమూరిగారి వ్యాసంలో కూడా నాకు ప్రధానంగా కనిపించిన లోపం ఇదే. వ్యాస ముఖ్యాంశం వైజ్ఞానికి, సాంకేతిక రంగాలలో తర్జుమా అయినా, ఇందులో చర్చించిన విషయాలూ ఇచ్చిన ఉదాహరణలు, ముప్పాతికవంతు వైజ్ఞానికేతర రంగాల గురించే.
ప్రస్తుతం వైజ్ఞానికరంగానికి పరిమితమై చూస్తే, ముందుగా అసలు తర్జుమా అవసరం లేదా ప్రయోజనం ఏమిటన్నది తప్పక ఆలోచించాలి. ప్రయోజనాన్ని బట్టే, అనువాద విధానం, దాని స్వరూపం ఆధారపడి ఉంటాయి. రెండు ప్రయోజనాలు ఊహించవచ్చు. ఒకటి వైజ్ఞానిక విషయాలు తెలుగువాళ్ళకి సులువుగా బోధపడటం. రెండు, వైజ్ఞానిక పదసంపదతో తెలుగుభాష పరిపుష్టి కావడం. ప్రాథమిక పాఠశాలల్లో వైజ్ఞానిక విషయాలను తెలుగులో బోధించడంలో ఉన్నది మొదటి ప్రయోజనం. అలాగే వైజ్ఞానికవిషయాలను సామాన్యులకు పరిచయం చేయడానికి వ్రాసే జనరంజక వ్యాసాల వల్ల కూడా మొదటి ప్రయోజనమే చేకూరుతుంది. అంచేత, వీటి విషయంలో తర్జుమా ఒక పద్ధతిలో సాగాలి. ఇక ఉన్నతవిద్యలోనూ, పరిశోధనలోనూ తెలుగుభాషను వాడడం వల్ల ఒనగూరే ప్రయోజనం రెండవది, అంటే భాషాపరిపుష్టి. దీనికి అనుసరించాల్సిన మార్గం మొదటి దానికన్నా వేరుగా సాగాలి. ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాల విషయంలో అనువాదానికి ముఖ్యలక్షణం సులభగ్రాహ్యత. నిర్దిష్టత, క్లుప్తత అంత ప్రధానం కావు. అదే ఉన్నతవిద్యలో నిర్దిష్టత, క్లుప్తత ప్రధానం. సులభగ్రాహ్యత కాదు. ఏ భాషలోనైనా చాలావరకూ వైజ్ఞానిక పదాలు తమంత తాము అర్థస్ఫురణని కలిగించేవి కావు. నిత్యవ్యవహారంలో కాస్త సమీపంగా ఉన్న భావాలకు వాడే పదాలు తెచ్చి తమకు అనువుగా వాడుకోవడమో, కొత్త పదాలను సృష్టించడమో జరుగుతుంది. అలా వాడుకభాషలోంచి తెచ్చుకొన్న పదాలకు శాస్త్రరంగంలో తమదైన ప్రత్యేక అర్థం ఏర్పడుతుంది. ఆ భాషలో ఆ శాస్త్రాన్ని అభ్యసించిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. అంచేత, ప్రాథమికవిద్య అయినా, ఉన్నతవిద్య అయినా, శాస్త్రంలోని పదాలన్నీ చప్పున అర్థమైపోవాలని అనుకోవడం తప్పు. మన భాషలో ఎంత బాగా ఇమిడిపోయాయి, ఎంత సులువుగా పాఠకులు దాన్ని గుర్తుపెట్టుకోగలరు, మొదలైన అంశాలే ముఖ్యం. ప్రాథమికవిద్యలోనూ, జనరంజక వ్యాసాలలోనూ ఆయా పదాలకు సంబంధించిన భావాలను ఎంత సులువుగా తెలుగులో బోధపరచగలం అనేదే ముఖ్యమైన విషయం.
మరి అలాంటప్పుడు ఇంగ్లీషులో ఉన్న పారిభాషిక పదాలను అలాగే వాడితే వచ్చిన నష్టమేవిటి? అన్న ప్రశ్న వస్తుంది. నా ఆలోచనకి తడుతున్న ఒక ఇబ్బంది – అప్పుడలాంటి పాఠాలూ వ్యాసాలూ ఆంగ్లపదాలతో నిండిపోయి తెలుగు భాషా స్వరూపాన్ని మౌలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు “కంటిన్యుఅస్” అనేది ఏ కోశానా ఇప్పటి తెలుగుభాషాలో ఇమడలేని పదం. ఇలాంటి పదాలు ఉన్నవున్నట్టుగా తెలుగులో విస్తృతమైతే, తెలుగుభాషా స్వరూపం మారిపోతుంది (ఎందుకంటే, ఇక్కడ మనం మాట్లాడుతున్నది ప్రాథమికవిద్య, జనరంజక వ్యాసాలూ కాబట్టి). అయితే, ప్రాథమిక విద్య పూర్తిగా తెలుగులో తెలుగు పారిభాషిక పదాలతో సాగితే ఉన్నతవిద్య మాటేమిటి? బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పటి సంగతేమిటి? అన్న మరొక ప్రశ్న వస్తుంది. ఈ విషయంలో నాకు ఏ రకమైన అనుభవమూ లేదు కాని, తెలుగులోని ప్రాథమికవిద్యకూ ఇంగ్లీషులో ఉన్నతవిద్యకూ మధ్య వారధి కట్టడం అంత కష్టమైన పని కాదని నా ఉద్దేశం. అయితే దీనికి ఒక ప్రణాళిక తప్పనిసరి. అలా లేనప్పుడే అది వాసుదేవరావుగారు చెప్పిన యిబ్బందులకు దారితీస్తుంది. ఇక ఉన్నతవిద్య విషయానికి వస్తే, అందులో తెలుగు వాడడం వెనక ముఖ్యప్రయోజనం తెలుగు భాషని శాస్త్రభాషగా అభివృద్ధి చేయడం ఒక్కటే. అయితే, ప్రాథమికవిద్యలో తెలుగు విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తే తప్ప యిది అసాధ్యం. అసలంతవరకూ దాని గురించి ఆలోచించడమే అనవసరం!
చివరిగా మరొక మాట. తెలుగుభాషపై ఇంగ్లీషు ప్రభావం గూర్చి వచ్చినప్పుడల్లా, సంస్కృతభాషా ప్రభావం గురించిన ప్రస్తావన వస్తూ ఉంటుంది. నా దృష్టిలో ఈ రెంటినీ పక్కపక్కన పెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే, సంస్కృతం తెలుగుపై చూసిన ప్రభావం – విధానంలోనూ, స్వరూపంలోనూ కూడా ఇంగ్లీషు చూపిన/చూపుతున్న ప్రభావం కంటే చాలా వేరయినది. ఈ తేడాలను గుర్తించడం చాలా అవసరం.
1. నిత్యవ్యవహారంలో సంస్కృత ప్రభావం ప్రధానంగా కనిపించేది తెలుగులోకి వచ్చి చేరిన అక్షరాలలో (మహాప్రాణాలు మొదలైనవి). పదాలు కూడా వచ్చి చేరాయి కాని, అవి తెలుగుభాషా స్వరూపానికి అనువుగా మారి వచ్చాయి. తద్భవాలు తెలుగుభాష ఉచ్చారణకు దగ్గరగా పదస్వరూపాన్ని మార్చుకున్నవి అయితే, తత్సమాలు తెలుగు విభక్తిప్రత్యయాలతో కలిసి తెలుగులోకి వచ్చినవి. ఇంగ్లీషునుండి తెలుగులోకి వస్తున్న పదాలలో ఇలాంటి మార్పులేవీ జరగడం లేదు (ఒకప్పుడు జరిగాయి, క్రమేపీ అది తగ్గుముఖం పట్టి ఉన్నవున్నట్టుగా వాడడం బాగా ఎక్కువయ్యింది).
2. తెలుగుభాషా స్వభావానికి కొంత పరాయిగా ఉండే సంధులు, సమాసాలవంటివి కూడా తెలుగుభాషలోకి వచ్చాయి. అయితే ఇవి చాలావరకూ కావ్యభాషకు మాత్రమే పరిమితం. ఆ కాలంలో కావ్యభాష అత్యల్పవర్గానికి మాత్రమే పరిచితమైన భాష. అంచేత వాడుకభాషపై దాని ప్రభావం పరిమితం. మూలమట్టంగా తెలుగుభాషా స్వరూపాన్ని అవి మార్చేయలేదు. కానీ ప్రస్తుతం ఇంగ్లీషు ప్రభావం అలాంటిది కాదు. ఇది నిత్యవ్యవహారంలోకి చొచ్చుకొనిపోతోంది. అంచేత దీనికి భాష మౌలిక స్వరూపాన్ని మార్చేసే శక్తి ఉంది. అలాంటి సమూలపరివర్తనను మనం ఆహ్వానిస్తామా లేదా అన్నది మనం తేల్చుకోవలసిన విషయం.
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/10/2014 12:43 pm
ధన్యవాదాలు రాఘవగారు, సంతోషంగా ఉంది మీకు నచ్చినందుకు. వనజ గారూ బాగా చెప్పారు. థాంక్ యు.