ఇతర భాషల నుండి, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత రచయితల రచనలనుండి వచ్చే తెలుగు అనువాదాలు 99% ఇంగ్లీషు నుండి అనువదింపబడినవే అవుతాయి. ఎందుకంటే, మనకి రష్యన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి చాలా తెలుగు అనువాదాలు, అనువాదాలపై అనువాదాలు అవుతాయి. అవుతున్నాయి కూడా. ఈ మధ్య ముపాస కథలూ, చెకోవ్ కథలూ తెలుగు రచయితలు ఉబ్బడి ముబ్బడిగా అనువాదాలు చేసేస్తున్నారు. అవన్నీ ఇంగ్లీషు అనువాదాలనుండే నన్నది గూగిలిస్తే ఇట్టే తేలిపోతుంది.
ఈ నెల ఒక పెద్ద రచయిత కమ్ జర్నలిస్టు, ముపసా కథలు ఒక వెబ్ పత్రికలో అనువాదాలు చేస్తున్నారు. మొదటి ముద్దకే గులక రాళ్ళన్నట్లు, మూల రచయిత పేరే – గై డి మొపాసా – అని రాస్తే, “మహానుభావా, గి ద ముపసా ఆయన పేరు, కావాలంటే ఎలా పలకాలో గూగిలించండి తెలుస్తుంది,” అని పెద్దాయనకి మెయిల్ పెడితే ఆయన జవాబు విని ఖంగుతిన్నాను. “పాశ్చాత్యులు అంటే ముఖ్యంగా ఇంగ్లీషు వాళ్ళు మన పేర్లని కూనీ చేస్తూ పలుకుతారు, నేనూ కావాలనే “గై డి మొపాసా” అని రాసాను,” అని జవాబిచ్చారు.
మన పేర్లని ఇంగ్లీషు వాళ్ళు ఖూనీ చేస్తారని మొదట్లో నాకూ ఇలాంటి ధోరణే ఉండేది. కానీ మనం రాసే స్పెల్లింగ్ ప్రకారమే వాళ్ళు ఉచ్చరిస్తారని తరువాత బోధపడింది. పలికే దాంట్లో యాస ఉండచ్చు కాక. రవి పేరుని, మనం Ravi అని రాస్తాం. ఇంగ్లీషు వాళ్ళ ప్రకారం దాన్ని “రావి” అనే పలకాలి. మన పేర్లలో ‘డ’కి ‘ద’కి స్పెల్లింగ్ ఒకేలా రాస్తాం. గాంధీ పేరుని గాండీ అని పలకడం చూస్తూనే ఉంటాం. అలాగే ‘త’కి, ‘ట’కి ఒకేలా రాస్తాం.
ఒక రచనని ఎందుకు అనువాదం చేస్తాం? ఆ రచన మీదా, రచయిత మీదా గౌరవంతో. అంతే కానీ మన సొంత అభిప్రాయాలూ, అవగాహనలూ బట్టి కాదు. కథలో పాత్రల పేర్లూ అంతే. మనకి ఇంగ్లీషు వచ్చునన్నది భ్రమ. రచయితలే కాదు, సంపాదకులూ అంతే! రచయితలకి రాయడం ఎంత ముచ్చటో, అచ్చు గుద్దేయడం సంపాదకులకీ అంతే అచ్చొచ్చిన విద్య. ఇలా అంటే మీరు తప్పులు చేయరా? అని ప్రశ్నించచ్చు. చేసేవాణ్ణి. చేసాను కూడా. కానీ ప్రస్తుతం అవన్నీ దిద్దుకొని అలాంటి తప్పు చేయకుండా చూసుకోవడానికి కృషి చేస్తాను.
ఇంగ్లీషు కథలు తెలుగు అనువాదం చదువుకోవడం ఎందుకు? సుబ్బరంగా ఇంగ్లీషులోనే చదువుకోవచ్చుగా. పైగా మనం తెలుగు వాళ్ళం. మనకి తెలుగుకంటే ఇంగ్లీషే బాగా వచ్చన్న భ్రాంతి కూడా ఉందాయే. తెలుగు అనువాద కథలకి దూరంగా వెళ్ళడమే మంచిది. ఒక్క క్లిక్కులో గూగులమ్మని కదిపితే డొంకంతా లాగి పడేస్తుంది. చక్కగా మొదటి అనువాదం చదువుకోవచ్చు.
సంపాదకులకు: “మూలం: లియో టాల్స్‌టాయ్” అన్నప్పుడు కధను సూటిగా రష్యన్ భాష నుంచి అనువదించారా లేక ఇది ఒక అనువాదానికి తెలుగు అనువాదమా అన్నది పాఠకులకు తెలియ జేయటం మేలుగా ఉంటుంది. తఃతః
మోహమకరందం
గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
05/17/2014
11:43 am
బాగుంది.
ఒకదానిపై ఒకటి మరొకదానిపైఒకటి
పోగవుతూ ఆ నిశ్శబ్దపు వీథిలో
రెక్కలల్లార్చిన తేటీగల అల్లరికి
…
…
తడితడి గుర్తులు ఊచలకొదిలి
మేడ గడియలు బిగుసుకున్నాయి
>>నేరుపు బ్రహ్మ జేరె నిజనిర్మలతేజము సూర్యు జేరె నా
>>కారము కాము జేరె నధికంబగు లక్ష్మి యనంతు జేరె గం
ఇందులోని ఏ ఏ అంశలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ భీముడు తయారయ్యాడో ఆయా అంశలు వాటి వాటి నెలవులకు చేరుకున్నట్టు చెప్పినట్టుగా అనిపించింది. లక్ష్మి, అనంతుని హృదయవాసి. భీముని నిర్యాణానంతరం తిరిగి అక్కడికే చేరింది. ఈ రకమైన పోలిక ఇంకా చాలా సందర్భాలలో చూసినట్టు అనిపిస్తోంది. ఎక్కువ తెలిసినవారు పంచుకోగలరు…
అద్భుతమైన వ్యాసాలను అందిస్తున్న వ్యాసకర్తలకు, మా ముందుంచుతున్న ఈమాట సంపాదకులకు ధన్యవాదాలు. తృణమో పణమో సాయం చెయ్యలనుకునెవారు ఈమాటకు పంపాలంటే చిరునామా గానీ, వెబ్ లింక్ గాని వివరాలు ముఖ పత్రంలో పొందుపరచగలరు.
-కామేశ్వర రావు.
[ముఖపత్రంలో ఎడమవైపు లింకులలో “రచయితలకు సూచనలు” చదవండి. కుడివైపు పైన, పేజీ మొదట్లో సంపాదకులని సంప్రదించడానికి లింక్ ఉంది. – సం.]
మీ కధ చాల బాగుంది. చాలా చోట్ల కలసి చదువుకోవడం, ఉద్యొగం చెయ్యడం ఈ మధ్య ఎక్కువైంది, దాని వల్ల స్నేహాలు కుడా ఎక్కువైయ్యాయి. అలాని ఎవ్వరూ హద్దులు దాటడం లేదు. కానీ ప్రస్తుతపు కధలో మైథిలికి ఇంత మనస్తాపం కలగడానికి ముఖ్య కారణం ఆమె భర్త ఎడల ప్రగాఢమైన ప్రేమ. ఎక్కడ తన భర్త తనకు దూరమైపోతాడో అనే భయం. ఈ అభద్రతా భావాన్ని మీరు కధలో బాగా విజువలైజ్ చేశారు. ఎండింగ్ చాలా బాగుంది. అభినందనలు.
ఇద్దరు మిత్రులు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
05/19/2014 11:39 am
తఃతః గారూ,
ఇతర భాషల నుండి, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత రచయితల రచనలనుండి వచ్చే తెలుగు అనువాదాలు 99% ఇంగ్లీషు నుండి అనువదింపబడినవే అవుతాయి. ఎందుకంటే, మనకి రష్యన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి చాలా తెలుగు అనువాదాలు, అనువాదాలపై అనువాదాలు అవుతాయి. అవుతున్నాయి కూడా. ఈ మధ్య ముపాస కథలూ, చెకోవ్ కథలూ తెలుగు రచయితలు ఉబ్బడి ముబ్బడిగా అనువాదాలు చేసేస్తున్నారు. అవన్నీ ఇంగ్లీషు అనువాదాలనుండే నన్నది గూగిలిస్తే ఇట్టే తేలిపోతుంది.
ఈ నెల ఒక పెద్ద రచయిత కమ్ జర్నలిస్టు, ముపసా కథలు ఒక వెబ్ పత్రికలో అనువాదాలు చేస్తున్నారు. మొదటి ముద్దకే గులక రాళ్ళన్నట్లు, మూల రచయిత పేరే – గై డి మొపాసా – అని రాస్తే, “మహానుభావా, గి ద ముపసా ఆయన పేరు, కావాలంటే ఎలా పలకాలో గూగిలించండి తెలుస్తుంది,” అని పెద్దాయనకి మెయిల్ పెడితే ఆయన జవాబు విని ఖంగుతిన్నాను. “పాశ్చాత్యులు అంటే ముఖ్యంగా ఇంగ్లీషు వాళ్ళు మన పేర్లని కూనీ చేస్తూ పలుకుతారు, నేనూ కావాలనే “గై డి మొపాసా” అని రాసాను,” అని జవాబిచ్చారు.
మన పేర్లని ఇంగ్లీషు వాళ్ళు ఖూనీ చేస్తారని మొదట్లో నాకూ ఇలాంటి ధోరణే ఉండేది. కానీ మనం రాసే స్పెల్లింగ్ ప్రకారమే వాళ్ళు ఉచ్చరిస్తారని తరువాత బోధపడింది. పలికే దాంట్లో యాస ఉండచ్చు కాక. రవి పేరుని, మనం Ravi అని రాస్తాం. ఇంగ్లీషు వాళ్ళ ప్రకారం దాన్ని “రావి” అనే పలకాలి. మన పేర్లలో ‘డ’కి ‘ద’కి స్పెల్లింగ్ ఒకేలా రాస్తాం. గాంధీ పేరుని గాండీ అని పలకడం చూస్తూనే ఉంటాం. అలాగే ‘త’కి, ‘ట’కి ఒకేలా రాస్తాం.
ఒక రచనని ఎందుకు అనువాదం చేస్తాం? ఆ రచన మీదా, రచయిత మీదా గౌరవంతో. అంతే కానీ మన సొంత అభిప్రాయాలూ, అవగాహనలూ బట్టి కాదు. కథలో పాత్రల పేర్లూ అంతే. మనకి ఇంగ్లీషు వచ్చునన్నది భ్రమ. రచయితలే కాదు, సంపాదకులూ అంతే! రచయితలకి రాయడం ఎంత ముచ్చటో, అచ్చు గుద్దేయడం సంపాదకులకీ అంతే అచ్చొచ్చిన విద్య. ఇలా అంటే మీరు తప్పులు చేయరా? అని ప్రశ్నించచ్చు. చేసేవాణ్ణి. చేసాను కూడా. కానీ ప్రస్తుతం అవన్నీ దిద్దుకొని అలాంటి తప్పు చేయకుండా చూసుకోవడానికి కృషి చేస్తాను.
ఇంగ్లీషు కథలు తెలుగు అనువాదం చదువుకోవడం ఎందుకు? సుబ్బరంగా ఇంగ్లీషులోనే చదువుకోవచ్చుగా. పైగా మనం తెలుగు వాళ్ళం. మనకి తెలుగుకంటే ఇంగ్లీషే బాగా వచ్చన్న భ్రాంతి కూడా ఉందాయే. తెలుగు అనువాద కథలకి దూరంగా వెళ్ళడమే మంచిది. ఒక్క క్లిక్కులో గూగులమ్మని కదిపితే డొంకంతా లాగి పడేస్తుంది. చక్కగా మొదటి అనువాదం చదువుకోవచ్చు.
ఇదీ నా అభిప్రాయం.
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/17/2014 11:26 pm
ధన్యవాదాలు మణి గారూ, బాలసుందరి గారూ – చాలా సంతోషంగా ఉంది.
మరి నువ్వేమో… గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
05/17/2014 3:00 pm
“నేనేమో గడ్దిపూవుని, బుల్లి పిట్టని, నిశ్శబ్దాన్ని మరియు పరమాణువుని!
నువ్వేమో స్థిమితానివి మరియు విశ్వాసానివి…”
ఇది మరీ బావుంది గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
05/17/2014 2:39 pm
బాగా వ్రాసారు. అదెమిటో నాకు ‘మరి ఇదే బాగుంది’
“చలనం గురించి వినిపిస్తె అది సంచలనం అయ్యిందని
పయనం గురించి మాట్లాడితే అది కవనంగా మారిందని”
ఇద్దరు మిత్రులు గురించి తఃతః అభిప్రాయం:
05/17/2014 12:50 pm
సంపాదకులకు: “మూలం: లియో టాల్స్‌టాయ్” అన్నప్పుడు కధను సూటిగా రష్యన్ భాష నుంచి అనువదించారా లేక ఇది ఒక అనువాదానికి తెలుగు అనువాదమా అన్నది పాఠకులకు తెలియ జేయటం మేలుగా ఉంటుంది. తఃతః
మోహమకరందం గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
05/17/2014 11:43 am
బాగుంది.
కాటు పడిందని దిగులెందుకు,
తేనెచుక్కలు చిందినప్పుడు
మోహమకరందం మిగిలినప్పుడు!
నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి kamesh Chikka అభిప్రాయం:
05/16/2014 1:10 pm
>>మళ్ళీ మొదటికి…
>>నేరుపు బ్రహ్మ జేరె నిజనిర్మలతేజము సూర్యు జేరె నా
>>కారము కాము జేరె నధికంబగు లక్ష్మి యనంతు జేరె గం
ఇందులోని ఏ ఏ అంశలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ భీముడు తయారయ్యాడో ఆయా అంశలు వాటి వాటి నెలవులకు చేరుకున్నట్టు చెప్పినట్టుగా అనిపించింది. లక్ష్మి, అనంతుని హృదయవాసి. భీముని నిర్యాణానంతరం తిరిగి అక్కడికే చేరింది. ఈ రకమైన పోలిక ఇంకా చాలా సందర్భాలలో చూసినట్టు అనిపిస్తోంది. ఎక్కువ తెలిసినవారు పంచుకోగలరు…
About eemaata గురించి kamesh Chikka అభిప్రాయం:
05/16/2014 12:34 pm
అద్భుతమైన వ్యాసాలను అందిస్తున్న వ్యాసకర్తలకు, మా ముందుంచుతున్న ఈమాట సంపాదకులకు ధన్యవాదాలు. తృణమో పణమో సాయం చెయ్యలనుకునెవారు ఈమాటకు పంపాలంటే చిరునామా గానీ, వెబ్ లింక్ గాని వివరాలు ముఖ పత్రంలో పొందుపరచగలరు.
-కామేశ్వర రావు.
[ముఖపత్రంలో ఎడమవైపు లింకులలో “రచయితలకు సూచనలు” చదవండి. కుడివైపు పైన, పేజీ మొదట్లో సంపాదకులని సంప్రదించడానికి లింక్ ఉంది. – సం.]
విముక్తం గురించి V Balasundari అభిప్రాయం:
05/16/2014 10:27 am
మీ కధ చాల బాగుంది. చాలా చోట్ల కలసి చదువుకోవడం, ఉద్యొగం చెయ్యడం ఈ మధ్య ఎక్కువైంది, దాని వల్ల స్నేహాలు కుడా ఎక్కువైయ్యాయి. అలాని ఎవ్వరూ హద్దులు దాటడం లేదు. కానీ ప్రస్తుతపు కధలో మైథిలికి ఇంత మనస్తాపం కలగడానికి ముఖ్య కారణం ఆమె భర్త ఎడల ప్రగాఢమైన ప్రేమ. ఎక్కడ తన భర్త తనకు దూరమైపోతాడో అనే భయం. ఈ అభద్రతా భావాన్ని మీరు కధలో బాగా విజువలైజ్ చేశారు. ఎండింగ్ చాలా బాగుంది. అభినందనలు.
మరి నువ్వేమో… గురించి g srinivas అభిప్రాయం:
05/15/2014 9:17 pm
ఈ వెబ్ సైట్ చాలా బాగుంది. తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ కవిత్వం కూడా చాల చాలా బాగుంది.