ఇది ఈ వ్యాసముపైన అభిప్రాయము కాదు. కాని వ్యాసమును తానా పత్రికలో ప్రకటించిన దానిపైన నా అభిప్రాయము. తానాలాటి సంస్థలు, వారి వార్షిక సమావేశాలలో ప్రత్యేక సంచికలను ప్రచురిస్తారు. తరువాత దానిని ఈమాట మున్నగు పత్రికలలో ప్రచురిస్తారు. ఇది బహుశా తానాకు ఆ పత్రికలకు మధ్యనున్న ఒప్పందము అనుకొంటాను. తానా పత్రిక జ్ఞాపికలను సభ్యులకు, సమావేశమునకు ఆహ్వానింపబడిన వారికి మాత్రమే అందిస్తారు. వారు మాత్రమే ఈ పత్రికలను చదువుటకు వీలవుతుంది. ఈమాటలాటి పత్రికలలో తరువాత అవి ప్రచురించబడినప్పుడు, అందరికి వీటిని చదువుటకు వీలవుతుంది. అందువలన పత్రికలలోని ప్రచురణలకు ఇంకను ఎక్కువ వాచకత్వము లభిస్తుంది. అది రచయితలకు మంచిదే. కాని ఈ విషయమును బహుశా ప్రచురణలను అంగీకరించే ముందే రచయితలకు తెలిపితే బాగుంటుందేమో? అప్పుడు ఇట్టి పరిస్థితులు రావు.
అనుకోకుండా ఈ వ్యాసం మీద ఈ మధ్య వచ్చిన అభిప్రాయాల్ని చూశాను. “లైలా ! నా వ్యాసం మీకు నచ్చి నందుకు సంతోషం . మీ వ్యాఖ్య చదివాకనే ఈ నా వ్యాసం ఈమాట లో ఉందని నాకు తెలిసింది . ఎందుకంటే నేను ఈమాట కి నా వ్యాసాలు ఏవీ విడిగా ఎప్పుడూ పంపలేదు . ఈ వ్యాసాన్ని కూడా పంపలేదు . ఈమాట వారు బహుశా దీన్ని ఇక్కడ ఆనాటి తానా పత్రిక నించి ఎత్తి మళ్ళీ ప్రచురించుకున్నట్టున్నారు . అయితే వారీ విషయాన్ని నాకు చెప్పనూ లేదు మరి !” అని రచయిత్రి అనటంతో ఒక్కసారి జులై 1999 నాటి సంచిక సందర్భం గుర్తుకొచ్చింది. అప్పుడు నేను ఈమాట నడుపుతుండేవాడిని. తానా సమావేశాలు ఆ జులై 4 వారాంతంలో జరుగుతున్నయ్. కథల పోటీ ఏర్పాటు చేసి జంపాల చౌదరి నన్ను కూడ వాటి ఎన్నికలో పాల్గొనమన్నారు. అలా, తొలివిడత వడపోత తర్వాత మిగిలినవి ఓ కట్ట నాకూ పంపించారు. ఎన్నిక అయాక, అవి ఎలాగూ నా దగ్గర ఉన్నాయి కనక ఎన్నికైన వాటిని ఈమాటలో కూడ వేద్దాం అని చౌదరి గార్ని అడిగితే అలాగే అని, జయప్రభ రాసిన వ్యాసం కూడ ఒకటున్నది, అది కూడ వేసుకొమ్మని తనే నాకది పంపారు. నాకు గుర్తున్న ప్రకారం ఈ విషయాన్ని జయప్రభ గారికి చెప్పానని చౌదరి నాతో అన్నారు. ఆ తానా సభలకి జయప్రభ వచ్చారేమో కూడ. చౌదరి గారు ఇంకా ఈమాటని చూస్తుంటే ఆయన ఈ విషయం మీద ఇంకొంత వెలుగు చల్లొచ్చు.
జులై 1 న రావలసిన సంచిక 4 దాకా ఆగుతున్నందుకు కొంత తొందరలో వుండి నేను ఈ వ్యాసం విషయం రచయిత్రితో నేరుగా సంప్రదించలేదు. అది నా పొరపాటే.
ఈ సంచిక ఒక సర్వాంగసుందరమైన సంచిక. దేశికాచార్యుల బిల్హణీయ నాటిక నన్ను మొట్టమొదట ఆకట్టుకొన్నది. అందులోని పద్యములు, గీతములు రసవత్తరముగా నున్నవి. మురళీధరరావుగారి పాండిత్యము, తర్కము, భాషాపటిమ వారి వ్యాసములో ప్రతిబింబించుచున్నది. కామేశ్వరరావుగారి వివరణ పద్యమునకన్న మిన్నగా నున్నది. తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ పైన దిలీప్ గారి పరిచయ వ్యాసము చదువుటకు చక్కగా నున్నది. ఇది భవిష్యత్తులో బహుజనోపాయకారిగా నుంటుందని ఆశిస్తున్నాను. ఇవి గాక ఇతర రచయితల వ్యాసములు, కవితలు, శబ్దతరంగములు మనోరంజితములు. ఇంత చక్కని సంచికను అందజేసిన సంపాదకులకు నా జోహారులు. – మోహన
నేనీ మధ్య కాళిదాసు నాటకం విక్రమోర్వశీయం చదువుకుంటున్నాను. విక్రమోర్వశీయం నాలుగవ అంకంలో ఊర్వశీవిరహతప్తుడైన విక్రముడు అడవిలో తన ప్రేయసి వివరాలను అక్కడ కనిపించే మేఘాలతో, నెమళ్ళతో, జింకలతో, సెలయేరుతో అడుగుతూ వాపోతాడు. ఆ ఘట్తం అంతటా పూర్తిగా స్వభావోక్తి వర్ణనలు, సహజమైన ఉపమలు, ఎక్కువగా దైవసృష్టిలో అంతర్భాగాలు లేదా కనీసం రోజూ కంటికి తారసపడి ఇంపు కలిగించే వస్తువులు. ఆ కావ్యం మాత్రమే కాక కాళిదాసు మిగిలిన కావ్యాల్లో, ఇతరత్రా ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా ఉపమాన ఉపమేయాల కోసం సహజమైన, మనిషి ఊహకు అనాయాసకరమైన వస్తువులను భావన చేయడం నాకు కనిపించింది.
అందుకు కాస్త విభిన్నంగా – మనిషి తన బుద్ధిని పదుని పెట్టి, లేదా కాస్త ఆలోచించి తెలుసుకోగల ఉపమలు, ఉత్ప్రేక్షల గురించి ఆలోచించినప్పుడు మొదటగా తట్టింది – చంద్రుని గురించిన వర్ణన – చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసారభేయీ కరీషైక పిండము – అన్న వర్ణన. అప్పుడే ఈ వ్యాసం కనిపించింది.
ఇక్కడ కనిపించే ఈ పద్యానికి సంబంధించిన ఉపమలలో కాస్త బుద్ధికి శ్రమ కలిగించే లక్షణం కనిపిస్తోంది.
కమ్ముకుంటున్న చీకటి=బురద (ఇక్కడ ఉపమ సహజమైన పదార్థం కాకపోగా కాస్త విముఖత్వం పుట్టించే వస్తువు)
చీకటి = కార్చిచ్చు తాలూకు పొగ,(కార్చిచ్చును చూసిన వారికి, లేదా ఊహించగలిగిన వారికి, కార్చిచ్చు అనగానే కలిగే భయం, విముఖత్వం అధిగమించి ఆసక్తితో చూడగలిగిన వారికి స్వారస్యం కలిగించే ఉపమానం)
నేల = మణిని కోల్పోయి, దానికోసం వెతుకుతున్న ఆకాశం లా (ఈ ఉత్ప్రేక్ష కాస్త బుద్ధికి అందుతోంది, అద్భుతంగానూ ఉంది, ఆకాశాన్ని రోజూ చూస్తుంటాం గనుక)
రాత్రి పూట ఆకాశం = మసిపూత పూసిన ఫలక (ఇది కూడా బుద్ధికి పనిచెప్పే ఉపమ)
అంధకారం = వృద్ధవేశ్యలకు hair dye లా, జారులకు అదృశ్యాంజనం లా (ఇవీ కాస్త సహజత్వానికి దూరమైన ఉపమలు)
ఈ ఉపమల్లో కవి కల్పనాశక్తి గొప్పగా ఉందనటానికి విరోధమేదీ లేదు కానీ, సామాజికుడికి, కార్చిచ్చులను, hair dye లాంటి వాటిని భరించలేని సగటు సామాజికునికి కలిగే రసస్ఫూర్తి ఏది అని ప్రశ్న. మరో విధంగా చెప్పాలంటే – కవిత్వంలో స్వారస్యం గ్రహించాలంటే – బహుశా సామాజికుడు బౌద్ధికంగా కాస్త ఎదగాలి. తనను తాను కవికి అనుగుణంగా mould చేసుకోవాలి. అలా చేయలేని నా వంటి అర్భకులకు బహుశా ఈ విధమైన కవిత్వం అచ్చిరాదు!
మళ్ళీ ఎన్నాళ్ళకు …బిల్హణీయం చదివాను – సరిగ్గా 30 ఏళ్ళ క్రితం హైద్రాబాద్ ఆకాశవాణిలో ప్రసారమయిన “యామినీ పూర్ణతిలక” నాటకం విన్నాను. యామినీ పూర్ణతిలకగా శారదా శ్రీనివాసన్, బిల్హణుడిగా జి. వి. సుబ్రహ్మణ్యం, మదన భూపాలునిగా సిద్దప్ప నాయుడు గార్లు అద్భుతంగా నటించారు. మళ్ళీ ఆ రోజులను గుర్తుచేశారు.
జయప్రభ గారి వ్యాసంలో కొంత భాగం ఒక వైపుకు ఒరిగి ఉండగా మరికొంతభాగం తాను సమర్థించిన దాన్నే మళ్ళీ తెగనాడుతు ఉన్నది. చలంగారి రచనలను బేషరతుగా రచయిత్రి అంగీకరించరన్నమాట. నాకు ఈ పరిణామం సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంలో నా వ్యాసం ఒకటి డిసెంబరు నెలలొ అనుకుంటాను ఆంధ్రభూమిలో వెలువడింది. వారు దాన్ని తగ్గించారు. వ్యాసం పేరు రాజేశ్వరి -రత్నావళి. పుస్తకం.నెట్ వారి వీక్షణం 64లో లింకు ఉన్నది. ప్రచురించటానికి అభ్యంతరం లేకపోతే పూర్ణరూపాన్ని ఈమాట వారికి పంపగలను.
మైదానానికి చెలియలి కట్ట గురించి మోహన అభిప్రాయం:
07/03/2014 8:45 pm

మైదానానికి చెలియలి కట్ట గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
07/03/2014 7:54 pm
అనుకోకుండా ఈ వ్యాసం మీద ఈ మధ్య వచ్చిన అభిప్రాయాల్ని చూశాను. “లైలా ! నా వ్యాసం మీకు నచ్చి నందుకు సంతోషం . మీ వ్యాఖ్య చదివాకనే ఈ నా వ్యాసం ఈమాట లో ఉందని నాకు తెలిసింది . ఎందుకంటే నేను ఈమాట కి నా వ్యాసాలు ఏవీ విడిగా ఎప్పుడూ పంపలేదు . ఈ వ్యాసాన్ని కూడా పంపలేదు . ఈమాట వారు బహుశా దీన్ని ఇక్కడ ఆనాటి తానా పత్రిక నించి ఎత్తి మళ్ళీ ప్రచురించుకున్నట్టున్నారు . అయితే వారీ విషయాన్ని నాకు చెప్పనూ లేదు మరి !” అని రచయిత్రి అనటంతో ఒక్కసారి జులై 1999 నాటి సంచిక సందర్భం గుర్తుకొచ్చింది. అప్పుడు నేను ఈమాట నడుపుతుండేవాడిని. తానా సమావేశాలు ఆ జులై 4 వారాంతంలో జరుగుతున్నయ్. కథల పోటీ ఏర్పాటు చేసి జంపాల చౌదరి నన్ను కూడ వాటి ఎన్నికలో పాల్గొనమన్నారు. అలా, తొలివిడత వడపోత తర్వాత మిగిలినవి ఓ కట్ట నాకూ పంపించారు. ఎన్నిక అయాక, అవి ఎలాగూ నా దగ్గర ఉన్నాయి కనక ఎన్నికైన వాటిని ఈమాటలో కూడ వేద్దాం అని చౌదరి గార్ని అడిగితే అలాగే అని, జయప్రభ రాసిన వ్యాసం కూడ ఒకటున్నది, అది కూడ వేసుకొమ్మని తనే నాకది పంపారు. నాకు గుర్తున్న ప్రకారం ఈ విషయాన్ని జయప్రభ గారికి చెప్పానని చౌదరి నాతో అన్నారు. ఆ తానా సభలకి జయప్రభ వచ్చారేమో కూడ. చౌదరి గారు ఇంకా ఈమాటని చూస్తుంటే ఆయన ఈ విషయం మీద ఇంకొంత వెలుగు చల్లొచ్చు.
జులై 1 న రావలసిన సంచిక 4 దాకా ఆగుతున్నందుకు కొంత తొందరలో వుండి నేను ఈ వ్యాసం విషయం రచయిత్రితో నేరుగా సంప్రదించలేదు. అది నా పొరపాటే.
ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:
07/03/2014 11:14 am
ఈ సంచిక ఒక సర్వాంగసుందరమైన సంచిక. దేశికాచార్యుల బిల్హణీయ నాటిక నన్ను మొట్టమొదట ఆకట్టుకొన్నది. అందులోని పద్యములు, గీతములు రసవత్తరముగా నున్నవి. మురళీధరరావుగారి పాండిత్యము, తర్కము, భాషాపటిమ వారి వ్యాసములో ప్రతిబింబించుచున్నది. కామేశ్వరరావుగారి వివరణ పద్యమునకన్న మిన్నగా నున్నది. తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ పైన దిలీప్ గారి పరిచయ వ్యాసము చదువుటకు చక్కగా నున్నది. ఇది భవిష్యత్తులో బహుజనోపాయకారిగా నుంటుందని ఆశిస్తున్నాను. ఇవి గాక ఇతర రచయితల వ్యాసములు, కవితలు, శబ్దతరంగములు మనోరంజితములు. ఇంత చక్కని సంచికను అందజేసిన సంపాదకులకు నా జోహారులు. – మోహన
నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం గురించి రవి అభిప్రాయం:
07/03/2014 2:56 am
నేనీ మధ్య కాళిదాసు నాటకం విక్రమోర్వశీయం చదువుకుంటున్నాను. విక్రమోర్వశీయం నాలుగవ అంకంలో ఊర్వశీవిరహతప్తుడైన విక్రముడు అడవిలో తన ప్రేయసి వివరాలను అక్కడ కనిపించే మేఘాలతో, నెమళ్ళతో, జింకలతో, సెలయేరుతో అడుగుతూ వాపోతాడు. ఆ ఘట్తం అంతటా పూర్తిగా స్వభావోక్తి వర్ణనలు, సహజమైన ఉపమలు, ఎక్కువగా దైవసృష్టిలో అంతర్భాగాలు లేదా కనీసం రోజూ కంటికి తారసపడి ఇంపు కలిగించే వస్తువులు. ఆ కావ్యం మాత్రమే కాక కాళిదాసు మిగిలిన కావ్యాల్లో, ఇతరత్రా ప్రాచీన సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా ఉపమాన ఉపమేయాల కోసం సహజమైన, మనిషి ఊహకు అనాయాసకరమైన వస్తువులను భావన చేయడం నాకు కనిపించింది.
అందుకు కాస్త విభిన్నంగా – మనిషి తన బుద్ధిని పదుని పెట్టి, లేదా కాస్త ఆలోచించి తెలుసుకోగల ఉపమలు, ఉత్ప్రేక్షల గురించి ఆలోచించినప్పుడు మొదటగా తట్టింది – చంద్రుని గురించిన వర్ణన – చరమాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసారభేయీ కరీషైక పిండము – అన్న వర్ణన. అప్పుడే ఈ వ్యాసం కనిపించింది.
ఇక్కడ కనిపించే ఈ పద్యానికి సంబంధించిన ఉపమలలో కాస్త బుద్ధికి శ్రమ కలిగించే లక్షణం కనిపిస్తోంది.
కమ్ముకుంటున్న చీకటి=బురద (ఇక్కడ ఉపమ సహజమైన పదార్థం కాకపోగా కాస్త విముఖత్వం పుట్టించే వస్తువు)
చీకటి = కార్చిచ్చు తాలూకు పొగ,(కార్చిచ్చును చూసిన వారికి, లేదా ఊహించగలిగిన వారికి, కార్చిచ్చు అనగానే కలిగే భయం, విముఖత్వం అధిగమించి ఆసక్తితో చూడగలిగిన వారికి స్వారస్యం కలిగించే ఉపమానం)
నేల = మణిని కోల్పోయి, దానికోసం వెతుకుతున్న ఆకాశం లా (ఈ ఉత్ప్రేక్ష కాస్త బుద్ధికి అందుతోంది, అద్భుతంగానూ ఉంది, ఆకాశాన్ని రోజూ చూస్తుంటాం గనుక)
రాత్రి పూట ఆకాశం = మసిపూత పూసిన ఫలక (ఇది కూడా బుద్ధికి పనిచెప్పే ఉపమ)
అంధకారం = వృద్ధవేశ్యలకు hair dye లా, జారులకు అదృశ్యాంజనం లా (ఇవీ కాస్త సహజత్వానికి దూరమైన ఉపమలు)
ఈ ఉపమల్లో కవి కల్పనాశక్తి గొప్పగా ఉందనటానికి విరోధమేదీ లేదు కానీ, సామాజికుడికి, కార్చిచ్చులను, hair dye లాంటి వాటిని భరించలేని సగటు సామాజికునికి కలిగే రసస్ఫూర్తి ఏది అని ప్రశ్న. మరో విధంగా చెప్పాలంటే – కవిత్వంలో స్వారస్యం గ్రహించాలంటే – బహుశా సామాజికుడు బౌద్ధికంగా కాస్త ఎదగాలి. తనను తాను కవికి అనుగుణంగా mould చేసుకోవాలి. అలా చేయలేని నా వంటి అర్భకులకు బహుశా ఈ విధమైన కవిత్వం అచ్చిరాదు!
బిల్హణీయము గురించి jagadeeshwar reddy అభిప్రాయం:
07/03/2014 2:29 am
ఈ నాటక రచన ముఖచిత్రం రవివర్మ చిత్రించిన యతి రూపం లోని అర్జునుడు , సుభద్ర లదైనా యామినీ బిల్హణులకు సరిగ్గా అమరింది – సంపాదకుల సమయస్ఫూర్తి బాగు బాగు 🙂
బిల్హణీయము గురించి jagadeeshwar reddy అభిప్రాయం:
07/03/2014 2:21 am
మళ్ళీ ఎన్నాళ్ళకు …బిల్హణీయం చదివాను – సరిగ్గా 30 ఏళ్ళ క్రితం హైద్రాబాద్ ఆకాశవాణిలో ప్రసారమయిన “యామినీ పూర్ణతిలక” నాటకం విన్నాను. యామినీ పూర్ణతిలకగా శారదా శ్రీనివాసన్, బిల్హణుడిగా జి. వి. సుబ్రహ్మణ్యం, మదన భూపాలునిగా సిద్దప్ప నాయుడు గార్లు అద్భుతంగా నటించారు. మళ్ళీ ఆ రోజులను గుర్తుచేశారు.
ధన్యవాదాలు – గొరుసు
కాలం విలవ తెలీదు గురించి Velcheru Narayan Rao అభిప్రాయం:
07/02/2014 11:46 pm
సుందరంగారూ, అవును ఇది కవిత్వమే. మంచి కవిత్వం.
కనకప్రసాద్ గారూ. మీరేం అనుకోకపోతే, ఆ చివరి చరణం ఆరు పాదాలూ అక్కర్లేదు, తీసెయ్యండి. పద్యం శీర్షిక అలాగే వుంచండి.
నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం గురించి కాజ సురేశ్ అభిప్రాయం:
07/02/2014 6:04 pm
ఆహా ఎంత అద్భుతముగా వివరించారండి!! మళ్లీ మళ్లీ చదివాను.. పద్యము అర్థము కాకనే కాదు.. ధన్యవాదాలు కామేశ్వర రావుగారూ!!
మైదానానికి చెలియలి కట్ట గురించి kameswari yaddanapudi అభిప్రాయం:
07/02/2014 4:03 pm
జయప్రభ గారి వ్యాసంలో కొంత భాగం ఒక వైపుకు ఒరిగి ఉండగా మరికొంతభాగం తాను సమర్థించిన దాన్నే మళ్ళీ తెగనాడుతు ఉన్నది. చలంగారి రచనలను బేషరతుగా రచయిత్రి అంగీకరించరన్నమాట. నాకు ఈ పరిణామం సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంలో నా వ్యాసం ఒకటి డిసెంబరు నెలలొ అనుకుంటాను ఆంధ్రభూమిలో వెలువడింది. వారు దాన్ని తగ్గించారు. వ్యాసం పేరు రాజేశ్వరి -రత్నావళి. పుస్తకం.నెట్ వారి వీక్షణం 64లో లింకు ఉన్నది. ప్రచురించటానికి అభ్యంతరం లేకపోతే పూర్ణరూపాన్ని ఈమాట వారికి పంపగలను.
కోనసీమ కథలు: కాటికాడ రుణం గురించి Shobha అభిప్రాయం:
07/02/2014 1:33 pm
ఈ కథ బాగనె ఉంది గానీ నా మాదిరి చదువరులకు అంత సంత్రుప్తి కలగదు.