If only you exercised little restraint and do not go for laughter from cheap seats, this would have been a great piece. Now, it is merely a funny piece (still incisive though). I am referring to the early obvious satire. You could have pulled back and made it not so obvious and all the talent (it is a talent — almost like that of Sree Ramana) would have made a definitive piece about poetry in Telugu. Needless to say that I enjoyed it immensely.
మన మంగళవారం ఏ గ్రహం నుండి ఎలా వచ్చిందో నాకు తెలియదు.
కుజుడికి మరొక పేరు మంగళుడు.
నెప్టూన్ సముద్రాలకి అధిపతి. అందుకని మనవాళ్లు సగరుడు అని పేరు పెట్టేరు… దూరదృష్టి కల తెలుగు వాళ్లు దీనికి (ప్లూటోకి) ఏ పేరూ పెట్టలేదు.
కొంతమంది జ్యోతిష్కులు నెప్టూన్ ను ఇంద్రుడు అనీ, ప్లూటోను యముడు అనీ వ్యవహరిస్తారు.
పూర్వ కాలం నుండీ తెలుగులో గ్రహం అన్న మాటకి ఇతమిద్ధమైన అర్థం లేదు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహాలు, భూత ప్రేతాదులు, … ఇవి గ్రహం అన్న మాటకి చలామణీలో ఉన్న అర్థాలు
భూతప్రేతాలనీ, మనం ఎరిగిన ప్లానెట్స్ నీ కూడా గ్రహాలని అని ఎందుకు వ్యవహరించేవారంటే, ‘గ్రహం’ అంటే ‘పట్టుకునేది/ప్రభావం చూపేది’ అని అర్థం కాబట్టి. సూర్యుడూ, చంద్రుడూ, రాహువూ, కేతువూ కూడా ఆ రకంగా చూస్తే గ్రహాలే వాళ్ళ దృష్టిలో. నా చిన్నప్పుడు కొంతమందిని ‘వాడో గ్రహం గాడు రా బాబూ, పట్టుకుంటే వదలడు’ అనడం ఎరుగుదును.
మరో సంగతి. పాశ్చాత్య జ్యోతిష్కులు కొంతమంది ఆస్టరాయిడ్లని కూడా జాతకాల్లో ఉపయోగిస్తారు. అలాగే ప్లూటోతో పాటు నెప్టూన్ కి అవతల ఉన్న మరికొన్ని ప్లూటోలాంటి ‘గ్రహాల్ని’ కూడా. ఉదా: Sedna, Quaoar, Ixion, Eris, Varuna, Orcus. కాబట్టి జ్యోతిష్కులకి లక్ష్మణ రేఖల్తో పన్లేదు. ఏదైనా ‘గ్రహం’ కావచ్చు. 🙂
కామేశ్వర రావుగారూ: మీరు రుచిచూపించిన మూడు పద్యరత్నాలూ, ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అన్నమయ్య శతకం గురించి విన్నానే కాని, శ్రద్ధగా చదివి అనుభవిద్దామని ఇప్పటివరకూ అనుకోలేదు. ఇప్పుడు మీరు ప్రేరేపించారు. సంతోషం.
కవిత్వానికి,తాత్వికతకూ దీటయిన పద్యం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ క్రింది పద్యం — చాలా అందమైన పద్యం — అని నా
అభిప్రాయం.
క్షేమేంద్రుని ‘కవికంఠాభరణం’, దేవేశ్వరుని ‘కవికల్పలత’, అక్కిరాజు ఉమాకాంతం గారి ‘నేటి కాలపు కవిత్వం’ మొదలైన రచనలాగా కొంత లాక్షణికత, కొంత అధిక్షేపం, కొంత వ్యంగ్యం మేళవించి (ఇకపైని ‘ఈమాట’కు ఏమైనా రాయాలంటే కొంచెం బెదురు పుట్టేట్లు), ఒకమారు అలిఖితాల అల్లుడి కథను జ్ఞాపకం చేస్తూ, మరోమారు హంసపాదుల అయ్యవారి ఉదంతాన్ని స్మరింపజేస్తూ చాలా బాగా రాశారు.
తమ కావ్యాదుల సత్కవుల్ “కుకవినిందం జేసి” యంచొక్క భా
గముఁ గల్పించి రకారణంబ; యది నిష్కార్పణ్యమాత్సర్యభా
వమె గా కా ఘను లుండకున్న నల దేవానాంప్రియశ్రేణి కె
ట్లమరుం గీర్తివిశేషపూర్తి యిలఁ గావ్యాసారపూరోత్థమై.
– దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తండ్రి శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారి ‘రావువంశముక్తావళి’
“ధ్వని” నా చప్పు డటంచు; “శయ్య” యనఁ దల్పంబంచు; “దోషంబు” నాఁ
గను బాపం బను; “చర్థ” మన్న సమభాగంబంచుఁ; “బాకం” బటం
చనినన్ వంట యటంచు “వృత్తి” యనినన్ వ్యాపారమౌ నంచు నే
ఘనబుద్ధుల్ వివరింతు ర క్కవుల వక్కాణింపఁగా నేటికిన్.
– దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారి ‘మహేంద్రవిజయము’
మీరు ఈ వ్యాసం ద్వారా రజని గారు, వారి లలితసంగీత సేవ గురించి చక్కగా తెలియజేసారు అందుకు గాను మీకు ధన్యవాదాలు. ఇక, నేను లలితసంగీత పాఠం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేదాన్ని కాని ఇప్పుడు ఆ అవకాశం నాకు కలగడం లేదు. ఐతె నేను ఆ కార్యక్రమాలను నా పిల్లలకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి 1980,1990ల ఆ కార్యక్రమాలను నేను ఒన్లినె లో పొందగలనా? దయచేసి వాటిని పంపగలరు.
-రూపాబాలకృష్ణ.
అనావిష్కృతం
గురించి బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ అభిప్రాయం:
11/02/2014
5:24 am
మనోకాసారంలో పైకి తేలేది
జీవం ఉండీలేనట్టు కనిపించే
పల్చని పచ్చని పొర మాత్రమే.
మూతపడని కళ్ళతో
మిలమిలలాడుతూ తిరిగే
బంగారురంగు చేపలేవో
ఎప్పటికీ అగుపడకుండా
అడుగునే ఉండిపోతాయి.
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
11/03/2014 1:27 am
If only you exercised little restraint and do not go for laughter from cheap seats, this would have been a great piece. Now, it is merely a funny piece (still incisive though). I am referring to the early obvious satire. You could have pulled back and made it not so obvious and all the talent (it is a talent — almost like that of Sree Ramana) would have made a definitive piece about poetry in Telugu. Needless to say that I enjoyed it immensely.
రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు గురించి గంటి లక్ష్మీనారాయణమూర్తి అభిప్రాయం:
11/02/2014 10:23 pm
మాన్యమిత్రులు శ్రీ మురళీధరరావుగారి ధిషణాసంజనిత బహుగ్రంథశోధిత విషయ సంగ్రహ సుసంశోభితమైన వచన రచన, వికటకవి పద్యరచనకు చిత్రికపట్టి అమూల్యమైన విలువలనాపాదించిన తీరు, అధ్బుతం, అనితర సాధ్యం, ఆంధ్ర భాషాయోషకు అవసర నైవేద్యం.
నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి lyla yerneni అభిప్రాయం:
11/02/2014 9:12 pm
హేయ్! -:)
అత్యంత శ్రద్ధతో చదువుతున్న వేలూరి కి ప్రశ్న.
జూలై సంచికలో, ఈ శీర్షిక కిందే విశదీకరించబడిన ముక్కుతిమ్మన పద్యంలో “జార నలినముఖులు” స్త్రీలా? పురుషులా? మీరు చెప్పరూ.
లైలా
ప్లూటో గ్రహచారం గురించి nagamurali అభిప్రాయం:
11/02/2014 6:19 pm
వ్యాసం చాలా బాగుంది.
కుజుడికి మరొక పేరు మంగళుడు.
కొంతమంది జ్యోతిష్కులు నెప్టూన్ ను ఇంద్రుడు అనీ, ప్లూటోను యముడు అనీ వ్యవహరిస్తారు.
భూతప్రేతాలనీ, మనం ఎరిగిన ప్లానెట్స్ నీ కూడా గ్రహాలని అని ఎందుకు వ్యవహరించేవారంటే, ‘గ్రహం’ అంటే ‘పట్టుకునేది/ప్రభావం చూపేది’ అని అర్థం కాబట్టి. సూర్యుడూ, చంద్రుడూ, రాహువూ, కేతువూ కూడా ఆ రకంగా చూస్తే గ్రహాలే వాళ్ళ దృష్టిలో. నా చిన్నప్పుడు కొంతమందిని ‘వాడో గ్రహం గాడు రా బాబూ, పట్టుకుంటే వదలడు’ అనడం ఎరుగుదును.
మరో సంగతి. పాశ్చాత్య జ్యోతిష్కులు కొంతమంది ఆస్టరాయిడ్లని కూడా జాతకాల్లో ఉపయోగిస్తారు. అలాగే ప్లూటోతో పాటు నెప్టూన్ కి అవతల ఉన్న మరికొన్ని ప్లూటోలాంటి ‘గ్రహాల్ని’ కూడా. ఉదా: Sedna, Quaoar, Ixion, Eris, Varuna, Orcus. కాబట్టి జ్యోతిష్కులకి లక్ష్మణ రేఖల్తో పన్లేదు. ఏదైనా ‘గ్రహం’ కావచ్చు. 🙂
నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
11/02/2014 5:01 pm
కామేశ్వర రావుగారూ: మీరు రుచిచూపించిన మూడు పద్యరత్నాలూ, ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. అన్నమయ్య శతకం గురించి విన్నానే కాని, శ్రద్ధగా చదివి అనుభవిద్దామని ఇప్పటివరకూ అనుకోలేదు. ఇప్పుడు మీరు ప్రేరేపించారు. సంతోషం.
కవిత్వానికి,తాత్వికతకూ దీటయిన పద్యం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ క్రింది పద్యం — చాలా అందమైన పద్యం — అని నా
అభిప్రాయం.
తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లేండమావుల తతున్ ఖద్యోతకీటప్రభల్
సురవీథీలిఖితాక్షరంబులసువుల్ జ్యోత్స్నాపయఃపిండముల్
సిరులందేల మదాధులౌదురొ జనుల్!శ్రీకాళహస్తీశ్వరా!
మరొక విషయం: ధూర్జటి కూడా”అద్వైతజ్ఞానుల”ను పరిహసించాడు.
వటవద్రజ్జు భుజంగవ ద్రజత విభ్రాంతి స్ఫురచ్చుక్తి వ
ద్ఘట వచ్చంద్ర శిలాజపాకుసుమ రుక్సాంగత్యవత్తంచు వా
క్పటిమ ల్నేర్త్తురు చిత్సుఖంబనుభవింపన్ లేక దుర్మేధనున్
చిటుకన్నందలపోయజూతురధముల్ శ్రీకాళహస్తీశ్వరా!
మీరు పరిచయం చేసే పద్యాలు, మీవ్యాఖ్యానం అత్యంత శ్రద్ధతో చదివి ఆనందించే వాళ్ళల్లో నేను ఒకణ్ణి.
Please continue the good work.
వేవేరా
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
11/02/2014 1:50 pm
మాన్యులు శ్రీ మాధవ్ గారికి
నమస్కరణతో,
క్షేమేంద్రుని ‘కవికంఠాభరణం’, దేవేశ్వరుని ‘కవికల్పలత’, అక్కిరాజు ఉమాకాంతం గారి ‘నేటి కాలపు కవిత్వం’ మొదలైన రచనలాగా కొంత లాక్షణికత, కొంత అధిక్షేపం, కొంత వ్యంగ్యం మేళవించి (ఇకపైని ‘ఈమాట’కు ఏమైనా రాయాలంటే కొంచెం బెదురు పుట్టేట్లు), ఒకమారు అలిఖితాల అల్లుడి కథను జ్ఞాపకం చేస్తూ, మరోమారు హంసపాదుల అయ్యవారి ఉదంతాన్ని స్మరింపజేస్తూ చాలా బాగా రాశారు.
తమ కావ్యాదుల సత్కవుల్ “కుకవినిందం జేసి” యంచొక్క భా
గముఁ గల్పించి రకారణంబ; యది నిష్కార్పణ్యమాత్సర్యభా
వమె గా కా ఘను లుండకున్న నల దేవానాంప్రియశ్రేణి కె
ట్లమరుం గీర్తివిశేషపూర్తి యిలఁ గావ్యాసారపూరోత్థమై.
– దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తండ్రి శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారి ‘రావువంశముక్తావళి’
“ధ్వని” నా చప్పు డటంచు; “శయ్య” యనఁ దల్పంబంచు; “దోషంబు” నాఁ
గను బాపం బను; “చర్థ” మన్న సమభాగంబంచుఁ; “బాకం” బటం
చనినన్ వంట యటంచు “వృత్తి” యనినన్ వ్యాపారమౌ నంచు నే
ఘనబుద్ధుల్ వివరింతు ర క్కవుల వక్కాణింపఁగా నేటికిన్.
– దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గారి ‘మహేంద్రవిజయము’
ఛంద మెఱుఁగుట, శబ్దశాస్త్రము చదువుట
బహునిఘంటుపరిజ్ఞానపాటవంబుఁ
గాదు కుకవుల కవితకుఁ గారణంబు
లుచితలజ్జాపరిత్యాగ మొకటె గాని.
– దామెరల వెంగళనాయకుని బహుళాశ్వచరిత్ర
ఇట్లాంటి కవులు ఎట్లా ప్రసిద్ధులు కావచ్చునో చెప్పారు కనుకనే, మీరు వ్యాసం మొదట్లో వారి కవిత్వాన్ని ఒక అసంకల్పిత ‘ప్రతీకార’ చర్య అనటం చాలా బాగుంది!
🙂
రెండు కవితలు గురించి Karthik అభిప్రాయం:
11/02/2014 12:20 pm
చాలా చాలా బాగున్నయి…
అనావిష్కృతం గురించి Karthik అభిప్రాయం:
11/02/2014 12:18 pm
Really superb superb Ravi Shankar gaaru
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి rupadevi అభిప్రాయం:
11/02/2014 11:48 am
మీరు ఈ వ్యాసం ద్వారా రజని గారు, వారి లలితసంగీత సేవ గురించి చక్కగా తెలియజేసారు అందుకు గాను మీకు ధన్యవాదాలు. ఇక, నేను లలితసంగీత పాఠం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేదాన్ని కాని ఇప్పుడు ఆ అవకాశం నాకు కలగడం లేదు. ఐతె నేను ఆ కార్యక్రమాలను నా పిల్లలకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి 1980,1990ల ఆ కార్యక్రమాలను నేను ఒన్లినె లో పొందగలనా? దయచేసి వాటిని పంపగలరు.
-రూపాబాలకృష్ణ.
అనావిష్కృతం గురించి బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ అభిప్రాయం:
11/02/2014 5:24 am
నిజమే. బావుందండి