పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి lyla yerneni అభిప్రాయం:

    03/05/2015 10:25 pm

    యుద్ధ వ్యూహాలు, తంత్రాలు పుస్తకాలలో చదవటం, సినిమాలలో చూడటం, నాకు ఇష్టం. మీ రచన నాకు నచ్చింది. ఛెంగిజ్ ఖాన్ నవల సంపాదించాలి. దొరుకుతుందో లేదో?

    Running away from battlefield seems to be an accepted strategy in ancient times. “He who fights and runs away will live to fight another day.” Running away, was looked upon as cowardice, later on. Dying became heroic. Which is really dumb.

    Interestingly, ‘the above saying’ itself, and the meaning it conveys, seems to be changing with time. In the movie “1776” – As they are forming United States of America, freeing it from British rule – much as John Adams, Thomas Jefferson, Benjamin Franklin, wanted to also free the Negroes from slavery – they tabled that issue. John Adams concedes to other nay saying politicians, and reconciles, saying – “We live another day to fight another war.”

    The last I heard this usage is, from the hero, in the season’s finale of “The News Room.” and the heroine queries, “Yeah! But do we ever win any?”

    లైలా

  2. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    03/05/2015 7:59 pm

    అయ్యా ఒకానొకడు గారు – పాయింటులోని శ్లేష పట్టుకున్నారు కాబట్టి అది ఈశ్వరానుగ్రహమే! 🙂 కామెంటుతో మెచ్చినందుకు మీకూ కృతజ్ఞతలు….

    భవదీయుడు
    వంశీ

  3. వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    03/05/2015 7:59 pm

    అయ్యా శివశంకర్ గారు – మీకు నచ్చినందుకు , మరి కామెంటుతో మెచ్చినందుకు కృతజ్ఞతలు….కవితాకన్యక మానసంరక్షణము అని ఇంకొక వ్యాసము ఉన్నది, మీకు తీరిక ఓపిక ఉంటే నవంబరు 2013వ సంచికలో చదువుకోవచ్చు

    భవదీయుడు
    వంశీ

  4. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    03/05/2015 4:39 pm

    “ఆడెడు శంభుఁడు” అన్న నిర్దేశం వల్ల పరమశివుని నాట్యమే ఇందులో వర్ణ్యాంశం. పరమశివుడు పుష్పాంజలిహస్తుడై సంధ్యాదేవికి ప్రణమిల్లటం ఆనాటి నాట్యేతివృత్తంలోని భాగమే. ఆయన పుష్పాంజలిహస్తాన్ని పట్టినప్పుడు ఆకాశంలోని తారకలు, మెడలోని పువ్వుల దండలు, ఇలాస్థలి పుష్పవర్షం చేతిలోని అర్ఘ్యంలో ప్రతిబింబించి పువ్వులై తోచాయి. “ఇలాస్థలిఁ బువ్వుల వర్షముల్” అంటే మహీతలాన భక్తులు శివలింగముపై కురిపించిన పుష్పవర్షాలుకూడా ఆయనను చేరుకొన్నప్పుడు శిరస్సుపైనుండి అర్ఘ్యంలో పువ్వులై తోచటం సహజమే. 1. అంబరసీమఁ దారలు, 2. జటాటవి మల్లెవిరుల్, 3. భుజాంతరాళంబున హారసంతతులు, 4. ఇలాస్థలిఁ బువ్వుల వర్షముల్ – అన్నంతవరకు ఒక దళం. ఆ నాలుగూ సత్కృతాంజలిలో “ప్రసూనంబులు అనం దగి” తోచాయి. ప్రసూనములు అయిపోలేదు. నీటిలో ప్రతిఫలించినప్పుడు పుష్పాంజలి వేళ ఉంచిన ప్రసూనములో అన్నట్లుగా తోచాయి. సప్తశతీసారంలో “అర్ఘ్యాఞ్జలౌ పుష్పం వా ఫలం వా నిక్షేప్తవ్యమ్” అని వేమభూపాలుడు చెప్పాడు. అర్ఘ్యాంజలిలో పువ్వో పండో ఉంచమన్నాడు. ఆ అన్వయాన్ని చదువుకొన్న తెలుగు కవి పువ్వులతోపాటు పండ్లనుకూడా ఉంచాలనుకొన్నాడు. అందువల్ల రెండవ దళంలో “మౌక్తిక తుల్య గంగాంబుకణంబులు ఉట్టిపడ” అని చెప్పాడు. గంగాంబుకణాలకు మౌక్తికాలతో తుల్యత్వకల్పనకు ప్రయోజనం అవి ముక్తాఫలములు కావటమే. ముక్తాఫలములతో తుల్యములైన గంగాంబుకణంబులు ఉట్టిపడటం పువ్వులతోపాటు పండ్లను ఉంచటానికే.

    గాథాసప్తశతిలో పరమశివుడు సంధ్యాదేవికి ప్రణమిల్లినప్పుడు గౌరీదేవి ముఖపద్మం ఎర్రబడి ఆయనచే సద్గృహీతమైన అర్ఘ్యపంకజము వలె తోచింది. వేమభూపాలుని వ్యాఖ్యానంలో అంజలిబంధంలోకి పుష్పఫలాదుల ప్రసక్తి వచ్చింది. తెలుగు పద్యంలో నటేశ్వరనాట్యగతమైన పుష్పాంజలి మాత్రమే చిత్రీకృతమయింది కనుక పువ్వు, పండు అన్న అన్వయంకోసం తారకాదులు, గంగాజలకణాలు పరికరించాయి.

    పద్యమంతా (మౌక్తికతుల్య) గంగాంబుకణాల గురించే అనటం సరికాదు. ఆ పక్షాననైనా, మౌక్తికతుల్యగంగాంబుకణాలు = ముత్యాల వంటి అంబుకణాలు – అవి ఎంత తెల్లనివైనా ఆకాశంలో తారకల్లాగా కానరావటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం. ముత్యములను తారకలతో పోల్చటం, నీటిచుక్కలను తారకలతో పోల్చటం సిద్ధకల్పనలు కావు. తారకలు పువ్వులవలె కానరావటం అనేకకవిప్రయుక్తమైనదే. ఆ తారకలు పరమశివుని ఆహార్యంలో ఉన్నవే. ధూర్జటి గారి కవితలో తారకలు అమృతపు బిందువుల శంకను కలుగజేశాయి. అది సహజకల్పన. సమాసంలో “ముత్యాల వంటి నీటి చుక్కలు” అన్నాక, ముత్యాలను విడిచి నీటిచుక్కలను మాత్రమే వ్యస్తంచేసి పఠించటం సాధ్యం కాదు. ముత్యాల వంటి నీటి చుక్కలు తారకల వలె ఉండటమూ, ముత్యాలు తారకలలె ఉండటమూ కల్పనాగతం కాదు. కపర్దం మీదికి చిందిన ముత్యాల వంటి అంబుకణాలు జడలో మల్లెపూలలాగా గోచరించటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం. తెల్లనివన్నంతమాత్రాన జలకణాలకు పువ్వులతో ఉపమానసిద్ధి లేదు. ముత్యాలవంటి నీటిచుక్కలు అన్నాక, అవి పరమశివుని కంఠసీమను ఆవర్తించి వక్షఃస్థలాన హారములవలె కనబడటం కూడా సిద్ధకల్పన కాదు. “ముత్యాల వంటి అంబుకణాలు” (మౌక్తిక తుల్య గంగాంబుకణాలు) అన్నాక, అవి (ఆ ముత్యాలు) సత్కృతాంజలిలో పువ్వులై కనబడటం లోకవిరుద్ధం; కవిసమయ విరుద్ధం.

    మౌక్తిక తుల్య మౌళి గంగాంబుకణాలు అంబరసీమలోని తారకల లాగానూ, (ఆయన) జటాటవిలోని మల్లెపువ్వుల లాగానూ, భుజమధ్యంలోని పుష్పహారాల లాగానూ, (జారవిడిచిన తర్వాత) భూమిపై కురుస్తున్న పువ్వుల వర్షాల లాగానూ, (జారవిడువక మునుపు) సత్కృతాంజలిలోని పువ్వుల లాగానూ ఉట్టిపడుతుండగా నాట్యం చేస్తున్న శివుడు – అన్నప్పుడు తాత్పర్యం ఎలా ఉంటుందో చూడండి. అంబుకణాలకు ఒకసారి తారకోపమానం, ఒకసారి పుష్పోపమానం చెప్పిన తర్వాత, వేరే ఉపమానాలు తోచక మళ్ళీ మళ్ళీ పుష్పోపమానాన్ని ఎందుకు పునరుక్తం చేస్తాడు? భుజాంతరాళంలోనివి పుష్పహారాలు కావు, ముత్యాల దండలు అని చెబితే, ముత్యాల లాంటి అంబుకణాలు ముత్యాల దండల లాగా ఉన్నాయి – అని చెప్పాలి. అది వాక్యపద్ధతేనా? సత్కృతాంజలిలోని పువ్వులు ఇలాస్థలి పువ్వుల వర్షాలు కావటమేమిటి?

    ఇంతకీ పరమశివుడు నాట్యవేళ “సత్కృతాంజలి” (పుష్పాంజలి) ని ఎవరికి సమర్పించాడు? విష్ణువుకో, బ్రహ్మకో, గౌరికో, ఆత్మార్థానికో కాదు. సంధ్యాదేవికి అయితేనే అది సమర్థనీయం. అది వేమభూపాలాదులు చెప్పిన అన్వయమే. సంధ్యాదేవికి సమర్పితమైనది పుష్పాంజలిహస్తంతోడి సత్కృతాంజలి కనుక మూలంలోని గౌరి అసూయను తీసివేసి, వేమభూపాలుడు చెప్పిన అర్ఘ్యంలో ఉంచవలసిన పువ్వులు, పండ్లను మాత్రం నిలిపి తెలుగు కవి ఆలంకారికపరికరాలను అందంగా మలచుకొన్నాడు. సప్తశతిలోని గాథ, సప్తశతీసారంలోని వ్యాఖ్య, ఆ అభిజ్ఞానం శ్రీనాథునికి సంగతం; ఇతరులకు అసాధ్యం కాబట్టి ప్రతిపాదన.

  5. చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:

    03/05/2015 2:07 pm

    లైలా గారూ,
    నవలలో చెప్పిన లాజిక్ ప్రకారం స్థితిగతులు మాత్రమే సమాధానం చెప్పగలవు. దారుణమైన మృత్యువులోకి లాగేందుకు దాన్నొక ఎరగా వాడుకుంటూంటే మొత్తం సైన్యం, రాజ్య ప్రయోజనాలు బలిపెట్టి నాయకుణ్ణి కాపాడే పనిచేయడాన్ని ఈ వ్యూహం సమర్థించదు. కాపాడుకోవచ్చు. కాకుంటే సమయం అనుకూలించినప్పుడే యుద్ధరంగంలో ఏదైనా సాధించాలి తప్ప ఆవేశాలు నాశనానికే దారితీస్తాయన్నది నవలలోని యుద్ధనీతి.

  6. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    03/05/2015 9:33 am

    ఇంకా రెండవ పద్యం వరకే చదివాను. రెండవ పద్యానికి (అంబరసీమఁ దారలు…) శ్రీ మురళీధరరావుగారు చెప్పిన విధంగా గాక నాకు వేరే అర్థం తోచింది (వారి అర్థం చదవక ముందు, చదివాక కూడా).

    మొత్తం పద్యమంతా గంగాంబుకణాల గురించే. శివుడు నాట్యం చేస్తున్నప్పుడు అతని శిరసుపైనున్న ముత్యాల్లాంటి గంగాంబుకణంబులు (అవి తెల్లగా మెరుస్తాయి కాబట్టి) – ఆకాశంలో తారకల్లాగా, శివుని జడలో మల్లెపూలలాగా, ఎడదపై ముత్యాలదండలలాగా, నేలపై పడేటప్పుడు పూలవానలాగ, అతను అంజలి పట్టినప్పుడు అతను విడిచే పుష్పాంజలిలాగా ఒప్పారుతూ ఉండగా, నాట్యం చేస్తున్న శివుడు మిమ్ములను రక్షించు గాక.

    శివుడు స్థిరంగా ఉన్నప్పుడు, గంగ ఒక పాయలా కుదురుగా నేలపైకి ప్రవహించడమే తప్ప, యిన్ని చిందులు పోయే అవకాశం బహుశా ఉండదు కదా! అదే అతను నాట్యమాడేటప్పుడు, ఆ కదలికల వల్ల గంగ నీటిజల్లు (అంబుకణాలు – నీటి చుక్కలు) శివుని శరీరాన్ని అలంకరిస్తాయి. ఆ సందర్భంలో ఆ నీటిచుక్కలను ఆయా రూపాలతో పోల్చడం రమ్యతరం అనిపిస్తోంది. పైగా “నేలపై కురిసే పూలవానలు” అని ప్రత్యేకించి చెప్పి, అవి ఎత్తిపట్టిన శివుని అంజలిపుటంలోని నీటిలో ప్రతిబింబించాయని అనడం అంత సమంజసంగా తోచడం లేదు. “పైనుండి దేవతలు కురిపిస్తున్న పూలు” అన్న భావం పద్యంలో లేదు. “ఆడెడు” అన్న పదం ద్వారా శివుడు నాట్యం చేస్తున్నాడన్న అర్థం స్పష్టంగా ఉన్నప్పుడు, అతను సంధ్యావందనం చేస్తున్నాడని భావించడమూ పొసగటం లేదు. చేసేది సంధ్యావందనం కాక నాట్యమైనప్పుడు, చేతిలో నీరు, అందులో ఇతర వస్తువుల ప్రతిబింబమూ ప్రసక్తే ఉండదు! అంచేత ఈ పద్యానికీ సప్తశతిలోని గాథకూ నాకెలాంటి సంబంధం కనిపించడం లేదు.

  7. సై కిల్ గురించి lyla yerneni అభిప్రాయం:

    03/04/2015 10:03 pm

    అంటే, రెండు మూడు రోజుల్లో, నేను మీ కల లోకి వచ్చినపుడు, అప్పుడు భయం వేస్తుందంటారా?
    బొడ్డుకు మసి రాసుకు కూర్చుంటారు.:-)
    మిస్టరీలు రాయటం కష్టం.అందులోనూ, నవలకన్నా, చిన్నకథలో మెప్పించటం ఇంకా కష్టం. ఈ రచయిత బాగా రాశారు.

    లైలా

  8. చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి lyla yerneni అభిప్రాయం:

    03/04/2015 9:53 pm

    భార్య నెత్తుకుపోతే, వెంటనే వెతుక్కుంటూ వెళ్లి, వెనక్కు తెచ్చుకోక పోవటం, తన భార్య కోసం, సైనికులను యుద్ధం లోకి దింపననటం – ఈ leadership, ఈ strategy – బాగుందండి.
    ఆ రామాయణం, ఆ భారతం, ఆ Trozen war, అవన్నీ “స్త్రీ” లంపటం వల్లనే కదండీ. నిజమేనండి, లీడర్ కి భార్య ఉండటం, లీడర్ కీ, సైనికులకీ, ప్రజలకీ unnecessary risk.
    భారతదేశానికి, ఇప్పటికి గదా సరియైన నాయకుడు లభించాడు!
    మరి నాయకుడిని గాని ఎత్తుకుపోతే, ఆయన గారిని విడిపించుకు రావాలా? అక్కర్లేదా?
    లైలా

  9. మహాలయం గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    03/04/2015 6:09 pm

    చంద్ర కన్నెగంటి గారికి కాళిదాసు తెలుసునని నేనిదివరకే నిరూపించాను; ఆయన ప్రచురించిన కవితాసంకలనం లో కొన్ని పద్యాలని ఉదహరిస్తూ! మానస చామర్తి గారు కూడా కాళిదాసు చదువుకున్నారని నాకు ఇప్పటివరకూ తెలియదు. #Mea Culpa#

    మార్చి 2015 ఈమాటలో వీళ్ళిద్దరి పద్యాల ప్రారంభ శబ్దాలు వినపడగానే – భోజరాజు తన ఆస్థానకవులకిచ్చిన సమస్య – దానికి కాళిదాసు పూరణ జ్ఞప్తికి వచ్చాయి.

    భోజరాజు ఇచ్చిన సమస్య:

    టమ్ టమ్ ట టమ్ టమ్ ట ట టమ్ ట టమ్ టమ్.

    (తెలుగు లో రాస్తే ‘మ్’ అక్కరలేదు; తెలుగు వాడికి చక్కగా సున్న ఉన్నదిగదా!)

    కాళిదాసు పూరణ:

    రాజాభిషేకే మదవిహ్వలా యా
    హస్తా చ్యుతో హేమ ఘటో యువత్యా,
    సోపాన మార్గేషు కరోతి శబ్దమ్
    టమ్ టమ్ ట టమ్ టమ్ ట ట టమ్ ట టమ్ టమ్.

    చాటువు చదివి ఆనందించడానికి ఆ చాటువు పూర్వకథ తెలియాలి. ఇదిగో ఆ అపూర్వ కథ.

    రాజుగారు స్నానం చేయడానికి నీళ్ళు తెమ్మన్నాడట. బంగారపుబిందెలో నీళ్ళు మోసుకొస్తున్న యువతి, రాజుగారి శరీర సౌందర్యానికి సమ్మోహిత అయ్యింది. పుటుక్కున చేతిలో ఉన్న బంగారు బిందెని జార విడిచింది. ఆ బిందె మెట్లమీదపడి టం టం టమ్మన్న శబ్దం చేసిందిట!

    (మిగిలిన వివరాలు మీరు ఉహించుకోండి!)

    వేలూరి వేంకటేశ్వర రావు
    తెలుగులో ఢం ఢం, — ఇక్కడ సంస్కృతంలో సున్నితంగా — టమ్ టమ్.

  10. సై కిల్ గురించి okAnokaDu అభిప్రాయం:

    03/04/2015 3:02 pm

    నేను పడుకోబోయే ముందు చదివాను. ఒకటే మొద్దు నిద్ర పట్టేసింది. కలా లేదు, భయంలేదు. మరి లైలా గారికలా ఎందుకనిపించిందో. ఏమో లెండి రెండు మూడ్రోజుల్లో నాక్కూడా కలలోకొస్తుందేమో? కధ బావుంది.