శ్రీ మోహన – ధన్యోస్మి – Any article that gets a comment from you is blessed. So I say, this essay NOW has officially been blessed. Thank you
అదలా పక్కనబెడితే, ఇహ ఇప్పుడు వచ్చే, రాబోయే ఒకటో రెండో రాళ్ళకు, ఆ రాళ్ళేసేవాళ్ళకు చివరి పేరా ఒకసారి మళ్ళీ చదువుకోమనిన్నీ – ::P, ఆ పైన వచ్చే మూడో నాలుగో పూలకు, ఆ పూలేసేవాళ్ళకు వ్యాసం చివరలో చెప్పినట్టు ఈశ్వరాశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ…మరొక్కసారి రాళ్ళవారైనా, పూలవారైనా, రెండూ కాక ఇంక వేరేవారెవరైనా అందరికీ కృతజ్ఞతలతో…ఏదైనా బాగుపట్టం కావాలె, అది ఏ రీతిలోనైతేనేమి ? అది, ఆ బాగుపడేది వచన కవిత్వం అయితే బాగుంటుందని కోరిక.
మంచి భాష వున్నవారు, మంచి కవిత్వం రాసేవారు చక్కగా క్లాసులూ అవీ పెట్టి ఒక ఫ్రేమువర్కు నేర్పిస్తే ఆ తర్వాత అల్లుకుపోయేవాడు అల్లుకుపోతాడు, అలుక్కుపోయేవాడు అలుక్కుపోతాడు… ల వత్తు, క వత్తు తేడాలతో – ఒక్క వత్తు అంత పని చెయ్యగలిగితే, మొత్తం భాష ఎంత పని చెయ్యగలదండీ ?
క్లాసులూ అవీ పెట్టినా ఈ అహంకారమిదం పుణ్యం ఎక్కువైపోయిన జగత్తులో ఎవడు వస్తాడు, నేర్చుకుంటాడు అన్నది మీ ప్రశ్న అయితే – ఇహ ఓం తత్ సత్ అన్నదే శరణ్యం!
వ్యాసాన్ని ఆసాంతం చదివి ఎంతో దయతో స్పందించిన సహృదయులు, మాన్యులు శ్రీ కామేశ్వరరావు గారికి, శ్రీ తాడేపల్లి పతంజలి గారికి, శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారికి, శ్రీ కె.వి.యస్. రామారావు గారికి, శ్రీమతి యెర్నేని లైలా గారికి, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి, శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ రవి గారికి సాదర ప్రణామం!
చాలా కాలంగా మదిలో మెదలుతున్న ఆలోచనలను మరచిపోయే తరుణం ఆసన్నమవుతున్నదని రెండు పూటలు నిర్విరామంగా కూర్చొని పూర్తిచేశాను. తీరా ఫిబ్రవరి నెలాఖరు అని, ముందనుకొన్న వ్యవధి లేదని గ్రహించి వ్యాసాన్ని యథాతథంగా పంపిస్తూ అనువిద్ధ గ్రంథసూచికాదులను సమకూర్చి పంపిస్తానని సంపాదకులు శ్రీ మాధవ్ గారికి వ్రాశాను. శ్రీ మాధవ్ గారు ఎంతో దయతో దీనిని ప్రకాశింపజేసినా, వ్యవధి లేనందువల్ల నా ఇతరవ్యాసాలకు లభించిన వారి పరిష్కరణలాభం దీనికి లేకపోయింది.
శ్రీ సాయి బ్రహ్మానందం గారి సూచనానుసారం దీనిని ఆవశ్యకమైన చోట్ల పూర్తిగా పునఃపరిష్కరించి, పునారచించి పునఃప్రచురణార్థం రెండు మూడు వారాలలోగా పంపింపగలనని విన్నవించికొంటున్నాను. ఈలోగా తక్కిన సూచనలూ వస్తాయి.
ధ్వనివిషయకమై శ్రీ కామేశ్వరరావు గారి, శైలీమాత్రకృతకర్తృనిర్ధారణవిషయమై శ్రీ రామారావు గారి, అనుమిత్యాదిసంప్రదాయాలను గురించి శ్రీ రవి గారి సూచనలను అనుసరించి కొంత సవరణతో, మరికొంత వివరణతో యథాయోగ్యంగా అందులో మార్పులు చేయగలనని విన్నపం.
ముక్తక కావ్యాలైన అమరుకాదులలోనూ, నాటకాలలో సూత్రధారకృతాశీర్వచనరూపం గానూ “త్వాం పాతు” ఇత్యాదికం భావ్యమే. కావ్యాలలో అది సుప్రతిష్ఠితమైన సంప్రదాయం కాదు. దామరాజు సోమన మరొక పద్యంలో “విఘ్నపతి భాసురఫూత్కృతి మమ్ముఁ బ్రోచుతన్” అని ఉండటమే అందుకు సాక్ష్యం. ‘భారతీయము’ నాట్యప్రబంధం కాక కావ్యమాత్రమే అయితే, అవతారికలో యుష్మదర్థకం ఉండి ఉండదు. విశిష్టమైన సంవిధానంతో రచింపబడిన బొడ్డుచెర్ల చిన తిమ్మయ గారి ప్రసన్నరాఘవనాట్యప్రబంధం తప్ప తెలుగులో నాట్యప్రబంధాలు లేవు. “అంబరసీమఁ దారలు” పద్యం వంటి పద్యాలు అందులోనూ లేవని నా ఇప్పటి జ్ఞాపకం. ఒకవేళ నా జ్ఞాపకం పొరపాటై యుష్మదర్థకం ఉన్నప్పటికీ అది నాటకానువాద నాట్యప్రబంధమే కనుక భావ్యమే అవుతుంది. అందుకే, “ఆడెడు శంభుఁడు మమ్ముఁ బ్రోవుతన్” అని దిద్దుకోవటం కంటె పద్యం అన్యస్థానీయం కావచ్చునన్న భావన కలిగింది.
సహృదయిని, విదుషీతల్లజ డా. లైలా గారి అద్భుతావహమైన శివతాండవ దృశ్యదర్శనానికి ఏమి చెప్పను?
నమస్కారం వంశీ గారికి, లైలా గారికీను
కథ గురించి నేను మాట్లాడుతూంటే లైలా గారే మొదట్న ఆవిడ కలలోకి వస్తారేమో అన్నారు (సరదాగానే లెండి). నేనూ అలాగే సరదాగా అన్నాను. ఇంక అక్కడకీ సరదాగా తీసుకోరేమో అని (చురక అంటిస్తే… అనేది బుద్ధిలేక రాసాను). ఆవిడ సరదాగానే తీసుకుంటున్నట్టున్నారు. ఎందుకో సడన్ గా నా పేరూ, బొమ్మ, వ్రాతలూ అన్నీ మొదలెట్టారు. ఇక్కడ పేరు ప్రసక్తి దేనికో మరి. పోనీయండి.
నేను భ్రూణహత్యలు చేసేంత పాపాత్ముణ్ణి కాదు. ఎందుకంటారా? ఈ చిన్న కధ వినండి. ఇంజినీరింగ్ చదివే వేడి వయసులో (వయస్సు వేడి ఎలా అంటే మరో కథ రాయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ మాత్రం ఈశ్వరానుగ్రహం ఉంటే నా బతుకు ఇలా ఏడిచేదా?) ఒక అమ్మాయిని ప్రేమించాను – దూరం నుంచే లెండి. మాట్లాడే అంత ధైర్యం ఏడిసిందా ఏమిటి? కూడా ఉండే స్నేహితుడు అన్నాడు,”నువ్వు అలా మాట్లాడకుండా చూస్తూ ఉంటే ఆ అమ్మాయ్ పెళ్ళైపోతుంది ఎవరితోటో.” నా సమాధానం -“ఏం చేస్తాం తమ్ముడూ. పోనీ ఆవిడకి పెళ్ళైపోయినా ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంటే అదే చాలు.” అదండీ నా ప్రేమ విషయం. అలా ఉత్తరోత్తరా ఇంకో అమ్మాయిని (కాస్త వేడి తగ్గాక, ఉద్యోగం చేసే రోజుల్లో) ప్రేమించాను కానీ ఆవిడా కూడా అలాగే దూరమైపోయింది. ఇద్దర్లో ఎవరికీ కూడా కలలో కూడా హాని తలపెట్టలేదు; ఇంక భ్రూణ హత్యల సంగతి దేనికీ? మనలో మనమాట మహాలక్ష్ములు ఈమాట చూడ్డానికి వస్తూనే ఉన్నారు. కాని కామెంటరు అంతే. ఇది నా – పనికిరాని – ఉద్దేశ్యం.
ఇంక ఇక్కడివరకూ వచ్చాక తెలిసినది ఏమిటంటే, నేను ఇప్పుడు పానకం లో పుడక లాగా తయారయ్యాను; ఇక్కడతో మీ ఇద్దరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు ఇస్తూ తప్పుకుంటున్నాను.
ఈ మాట సంపాదకుల గారికి
నమస్కారములు.
పత్రిక చాలా బాగున్నది.మీ కృషి ప్రశంషనీయం.నేను “అక్షర సేద్యం ” కవితా సంపుటి ని రచించాను.మీ గ్రంథాలయంలొ పుస్తకానికి అవకాశం ఉన్నదా?
ఉంటే ఎలా? దయచేసి తెలుపగలరు.
అయ్యా ఒకానొకడు గారు – అసలు ఊరకే మాటవరసకు అనుకుందాం – ఈమాట వంక ఆడవారు చూచేదే తక్కువని. కామెంట్ల వొంక చూచితేనేమో అలా ఈమాట వొంక చూచిన ఆడవారిలో రాసేవారు మరింత తక్కువని ఇక్కడ చదివేవారందరికీ తెలిసిన విషయమే. అలా లింగభేదాన్వితసమన్వయస్వరూపావధానం చేయగలిగినవారిలో లైలాగారు ఒకరు. వారిమీద మీరు చేయి నోరు ఆడిస్తే బుల్లీయింగు కిందకు వస్తుందండీ!
ఆవిడ బుల్లీయింగుకు భయపడే రకం కాదు కానీ, ఇలాటివాటి వల్ల విముఖత వొచ్చి దూరంగా పోతే మహాలక్ష్ములు లేని ఇల్లైపోయి మీ దీపం నేను, నా దీపం మీరు ఆర్పుకోవాల్సి వస్తుంది. ఆడసంతానం లేని చోట వున్న ఒకరిద్దరినీ పోగొట్టుకుని భ్రూణహత్యలని గోల పెడుతున్న సమాజమైపోతుంది ఈ ఈమాట. అప్పుడు చెమ్మచెక్కలు, అష్టాచెమ్మలు అన్నీ మగవాళ్ళే ఆడుకోవటం, ఆ ఆటలు మీరూ నేనూ సమస్త పాఠకజనం చూడవలసి రావటం. అది ప్రళయస్వరూపం. ఈశ్వరానుగ్రహం అందాకా సాగకూడదని కోరిక…
అయినా వున్న ఒక్క ఆడపడుచునూ ఈ ఈమాటలో వారే మాట సభ్యంగా అన్నా వదిలేసి అపురూపంగా చూస్కోపోతే మగాళ్ళం మనమెందుకు ? ఒకడు అని ముగించారు కాబట్టి మీరు పుంసకులేనని అనుకోలు… అదీ కాక చురక అన్నారని రంగంలోకి దిగటం, అది శ్లేషాపూర్వకమైనా సరే!
అదలా పక్కనబెడితే ఈ నా కామెంటు మూలాన, మీరు ఏవిటనుకున్నా సరే
ఈమాట రూల్సు ప్రకారం నేను శ్రీ. మాగంటి వంశీ మోహన్ ని ఇక్కడ సంభోదించకూడదు. అందుకని, ఎడిటర్జీ,
భావాలు, మనోభావాలు, చెత్త భావాలు, చిత్తు భావాలు ఎన్నున్నా, ప్రతి వాడికి ఒక భావం వుండటం లో తప్పేవుంది ఎడిటర్జీ?
ఎవరో నాలాటి తలతిక్క వున్నోడు ఏదో వ్రాస్తే ఎవరి భావాలో దెబ్బతినటం లో అంత ఆశ్చర్యం ఎవుంది. కానీ మీ భావాలు దెబ్బతింటే, ఎందుకో అదీ ఆ విమర్శ కాస్త విపులంగా వ్రాయొచ్చు కదా, మనిషిని చంపేసే బదులు, కవిని, రచయితని మర్డర్ చేసే బదులు.
ప్రతివాడికి ఒక భావం వుండటం మీ దృష్టి లో తప్పు లాగా వ్రాశారు,
“ప్రతి వాడికి ఒక భావం.
ఒక మనోభావం.
అందరివీ దెబ్బతినటమే.”
అంటే కొందరికి మాత్రమే ఆ హక్కుందా ఎడిటర్జీ?
కొందరు మాత్రవే మనుషులా?
వాళ్ళ నమ్మకాల ప్రకారవే లోకం సాగిపోవాలా?
ఎవరన్నా, కాదు కూడదు, ఇది నిజం అంటే
వాళ్ళని వీలైతే ఫిసికల్ గాను, కాకపోతే
మానసికంగాను హత్య చేసే అధికారం మాత్రం మీ
సాంప్రదాయ వాదులకి వుందా?
అందుకనే కదా మీరు ఆ మొన్నెప్పుడెప్పుడో
పెరుమాళ్ మురుగన్ గారిని ఎమోషనల్ గా చంపేసేరు
నిన్న “ఇండియా డాటర్” ని బాన్ చేసేసేరు.
మనుషుల్లో కూడా సాంప్రదాయవాదులుంటారు
గురజాడ గారు అదేదో చెప్పినట్టు
కానీ మనుషులందరు సాంప్రదాయవాదులే కాదు కదా!
మనసు గాయ పడటం తప్పు కాదు ఎడిటర్జీ,
కానీ ఆ గాయానికి ప్రతిగా మరో మనసుని నలిపెయ్యటం,
మరో మనిషిని నరికెయ్యటం తప్పే కదా ఎడిటర్జీ?
మీరు సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటే నిలబెట్టుకోండి
కాదని ఎవరంటున్నారు, కానీ ఇదిగో ఇది సాంప్రదాయం అప్పుడు
అని చెప్పిన వాళ్ళని మాత్రం హత్య చేయకండి.
మీరు చంపినంత మాత్రాన, ఆ సాంప్రదాయం నిజం కాకుండా పోదు.
చరిత్రకి మీరు చేతిని అడ్డం పెట్టగలరేవో, చరిత్ర కారుల్ని,
రచయితల్ని, కవుల్ని, మీరు హత్య చెయ్యగలరేవో,
ఆ చరిత్రలో సాంప్రదాయాల్ని మాత్రం మీ మడిబట్టలేనాకాల దాచేసి
మీ చేతుల పైన రక్తాన్ని సంస్కృతి పరిరక్ష్కుల పంచలకి తుడిచేసుకోలేరు.
సంభాషణ కూడా మారుపేరుతో,ముసుగు లోంచి ఆ ఫొటోతోనే చెయ్యరాదా. మారుపేరుతో రాయటంలో ఏమైనా అదనపు లాభాలు ఉన్నాయేమో ఆ బొమ్మతోనే చెప్పండి. కథ! ‘బొమ్మలు చెప్పిన కమ్మని కధలు’ అక్కడే వినగలరేమో.
నిజానికి ‘చురక అంటించటం’ అనే ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు. మోటుగా, సేడిస్టిక్ గా అనిపిస్తుంది. నేను వాడలేను. కాని మీరు స్నేహపూరితంగా చేస్తున్నారు, అది నాకు తెలుసు. కాబట్టి, మీరు మార్చుకోనవసరం లేదు.
ఎంతమంది స్నేహితులుంటే జీవితం, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. రకరకాల కల్చర్స్ నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ రకరకాలుగా నాతో మాట్లాడుతారు. స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంది. నా సంబరం కూడా!
కాని, ఇలాటి సందర్భాలలో ఆ స్నేహం ఎవరితో చేస్తున్నానో తెలియకుండా ఎలా చెయ్యటమో తెలియటం లేదు.
ఇంతకు ముందు మీరు సూచించిన విశ్వనాథ కథలు బాగున్నవి. చిన్న కథలు కూడా బాగా రాశాడాయన. – లైలా
అత్యద్భుతమైన వ్యాసం. ఈ విధమైన వ్యాసం బహుశా నేడు ఎవరూ వ్రాయలేరేమో.ఈ మాట వారికి వేల కృతజ్ఞతలు.
రెఫరెన్స్ పుస్తకాల జాబితా, వీలైతే లంకెలు ఇచ్చి ఉంటే బావుండేది.
మొదటి పద్యంతోనే అర్థశక్త్యుద్భవ వస్తుధ్వని, అపహ్నవం, వ్యాజోక్తి, ఉపసర్జనీకృతత్వం, అనుమితి వాదం వంటివి ప్రస్తావించి ఆయా విషయాలకు సంబంధించిన పుస్తకాలను చదువుకునే ఆసక్తి కలిగించారు. ఈ వ్యాసపు సారాన్ని యథాతథంగా స్వీకరించే తెలివిడీ, పాండిత్యమూ, ఎలానూ లేవు కనుకా, ప్రస్తావించిన విషయాల గురించీ బయట ఎక్కడా తెలుసుకోవడం కుదరదు కనుకా కొన్ని సంశయాలు.
1. “వాతెఱ గంటిఁ గంటి కెవ్వారికిఁ గెంపు రాదె;” – అని చక్కగా పరిష్కరించారు. అయితే వాతెఱ గంటిన్ – అన్న ద్వితీయా విభక్తి ప్రత్యయంతో వచ్చే ఒకింత క్లిష్టాన్వయం కన్నా “వాతెఱగంటి కంటికెవ్వారికిఁ గెంపు కాదె” – అనుకుంటే సరళాన్వయం దొరుకుతుంది కదా. అలా చదువుకోగల వీలుందా?
2. అంబరసీమఁ దారలు…శంభుడు మిమ్ము బ్రోవుతన్ – ఈ పద్య విచారణలో
>>శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం >>లోనిదన్న నిర్ణయానికి ప్రతిబంధకంగా ఉన్నది…..ఆశీరర్థకమైన మంగళం ఆశీరర్థంలో >>లూణ్మధ్యమంలో అక్కడా విధాయకం కాదు. ”
అందులో “త్వాం పాతు” అన్న యుష్మదర్థ లోట్ ప్రయోగం ఉంది కదా? ఇంకా కొన్ని నాటకాదుల నాందిలో ఇలాంటి ప్రయోగం ఉన్నది కదా,విధాయకం ఎందుకు కాదు? ఆ కారణమేమిటి?
3. లచ్చీ దుహిఅ…ఈ శ్లోక ప్రస్తావనలో
“ఆనందవర్ధనుడు చెప్పిన అభిధా లక్షణా వృత్తులను అంగీకరిస్తూనే వ్యంజనకు గల ప్రాధాన్యాన్ని తిరస్కరించి,మహిమభట్టు..”
మహిమభట్టు శబ్దానికి లక్షణ వృత్తిని తిరస్కరించాడని వ్యక్తివివేకం ప్రథమ విమర్శలో ఒక పాఠం విన్నాను. మమ్మటుని కావ్యప్రకాశంలో వివరించిన ముఖ్యార్థబాధ, ముఖ్యార్థ సంబంధాలను తిరస్కరించి “గంగాయాం ఘోషః” ఉదాహరణ కూడా అనుమితికిలోబడి ఉందని వ్యాఖ్యానించినట్టు ప్రథమ విమర్శ. (శబ్దః పునః స్వార్థాభిధానమాత్రవ్యాపారపర్యవసితసామర్థ్యః). శబ్దానికి అర్థాంతరం ఉంటుందనడం కుసుమం వికసించడానికి పూలతీవెకు నీరు పోసిన కుండ చేసిన కుంభకారుడు కారణం అన్నట్టు ఉంటుందని ఆయన విసురు విసిరాడని విన్నది.ఈ పరంపర లో భట్టలోల్లటుడు ప్రతిపాదించిన అభిధా వృత్తికి గల దీర్ఘదీర్ఘతరవ్యాపారఖండన కూడా రోచకమైన పాఠం.
ఇది మీరు వ్రాసిన “లచ్చీ దుహిఅ..” పద్యార్థానికి సంబంధించని విషయమయినా, ఏదో ఆసక్తి కలిగి వ్యాఖ్య వ్రాశాను.
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శ్రీనాథుని వాచ్యకవి అని నొక్కి చెప్పి వ్యాఖ్యానించారు. శ్రీనాథుని ధ్వనిప్రధాన గాథాపద్యాలను మీరు వివరిస్తూంటే ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి. మరో పది పదిహేను మార్లు నిదానంగా చదువుకుని అర్థం చేసుకోవాలి.
వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
03/10/2015 4:13 pm

భవదీయుడు
వంశీ
వచనానికి ఒక జాబు గురించి మోహన అభిప్రాయం:
03/10/2015 1:52 pm
రచయితకు జోహరులు! <>
వచనకవికి –
వటమా దు-
వ్వటమా యీ-
డ్వటమా యే-
డ్వటమొ నీర-
వటమా చనిపో-
వటమా రు-
వ్వటమా త్ర-
వ్వటమా చద-
వటమొ యెఱుగ
వటదళశయనా
పద్యకవికి –
వటమా దువ్వటమా యీ-
డ్వటమా యేడ్వటమొ నీర-వటమా చనిపో-
వటమా రువ్వటమా త్ర-
వ్వటమా చదవటమొ యెఱుగ – వటదళశయనా
విధేయుడు – మోహన
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/10/2015 12:40 pm
వ్యాసాన్ని ఆసాంతం చదివి ఎంతో దయతో స్పందించిన సహృదయులు, మాన్యులు శ్రీ కామేశ్వరరావు గారికి, శ్రీ తాడేపల్లి పతంజలి గారికి, శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారికి, శ్రీ కె.వి.యస్. రామారావు గారికి, శ్రీమతి యెర్నేని లైలా గారికి, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి, శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ రవి గారికి సాదర ప్రణామం!
చాలా కాలంగా మదిలో మెదలుతున్న ఆలోచనలను మరచిపోయే తరుణం ఆసన్నమవుతున్నదని రెండు పూటలు నిర్విరామంగా కూర్చొని పూర్తిచేశాను. తీరా ఫిబ్రవరి నెలాఖరు అని, ముందనుకొన్న వ్యవధి లేదని గ్రహించి వ్యాసాన్ని యథాతథంగా పంపిస్తూ అనువిద్ధ గ్రంథసూచికాదులను సమకూర్చి పంపిస్తానని సంపాదకులు శ్రీ మాధవ్ గారికి వ్రాశాను. శ్రీ మాధవ్ గారు ఎంతో దయతో దీనిని ప్రకాశింపజేసినా, వ్యవధి లేనందువల్ల నా ఇతరవ్యాసాలకు లభించిన వారి పరిష్కరణలాభం దీనికి లేకపోయింది.
శ్రీ సాయి బ్రహ్మానందం గారి సూచనానుసారం దీనిని ఆవశ్యకమైన చోట్ల పూర్తిగా పునఃపరిష్కరించి, పునారచించి పునఃప్రచురణార్థం రెండు మూడు వారాలలోగా పంపింపగలనని విన్నవించికొంటున్నాను. ఈలోగా తక్కిన సూచనలూ వస్తాయి.
ధ్వనివిషయకమై శ్రీ కామేశ్వరరావు గారి, శైలీమాత్రకృతకర్తృనిర్ధారణవిషయమై శ్రీ రామారావు గారి, అనుమిత్యాదిసంప్రదాయాలను గురించి శ్రీ రవి గారి సూచనలను అనుసరించి కొంత సవరణతో, మరికొంత వివరణతో యథాయోగ్యంగా అందులో మార్పులు చేయగలనని విన్నపం.
శ్రీ రవి గారికి: “వాతెఱ గంటిఁ గంటి కె, వ్వారికిఁ గెంపు రాదె” అన్నచోట వాతెఱ = క్రింది పెదవి మీది, గంటిన్ = క్షతిచే (ద్వితీయకు తృతీయార్థం, బాలవ్యా: కారక. ౨౨), కంటి కెవ్వారికిఁ గెంపు రాదె – అని అన్వయం. “వాతెఱగంటి కంటి కె, వ్వారికిఁ గెంపు రాదె” అన్నప్పుడు ప్రథమకు ద్వితీయార్థం చెప్పుకోవాలని మీరన్నట్లున్నారు. అప్పుడైనా ప్రథమ మీది పరుషానికి సరళాదేశం వచ్చి “వాతెఱగంటి గంటి కె, వ్వారికిఁ గెంపు రాదె” కావలసిందే కదా. వాతెఱ గంటిన్ – సులభాన్వయం.
ముక్తక కావ్యాలైన అమరుకాదులలోనూ, నాటకాలలో సూత్రధారకృతాశీర్వచనరూపం గానూ “త్వాం పాతు” ఇత్యాదికం భావ్యమే. కావ్యాలలో అది సుప్రతిష్ఠితమైన సంప్రదాయం కాదు. దామరాజు సోమన మరొక పద్యంలో “విఘ్నపతి భాసురఫూత్కృతి మమ్ముఁ బ్రోచుతన్” అని ఉండటమే అందుకు సాక్ష్యం. ‘భారతీయము’ నాట్యప్రబంధం కాక కావ్యమాత్రమే అయితే, అవతారికలో యుష్మదర్థకం ఉండి ఉండదు. విశిష్టమైన సంవిధానంతో రచింపబడిన బొడ్డుచెర్ల చిన తిమ్మయ గారి ప్రసన్నరాఘవనాట్యప్రబంధం తప్ప తెలుగులో నాట్యప్రబంధాలు లేవు. “అంబరసీమఁ దారలు” పద్యం వంటి పద్యాలు అందులోనూ లేవని నా ఇప్పటి జ్ఞాపకం. ఒకవేళ నా జ్ఞాపకం పొరపాటై యుష్మదర్థకం ఉన్నప్పటికీ అది నాటకానువాద నాట్యప్రబంధమే కనుక భావ్యమే అవుతుంది. అందుకే, “ఆడెడు శంభుఁడు మమ్ముఁ బ్రోవుతన్” అని దిద్దుకోవటం కంటె పద్యం అన్యస్థానీయం కావచ్చునన్న భావన కలిగింది.
సహృదయిని, విదుషీతల్లజ డా. లైలా గారి అద్భుతావహమైన శివతాండవ దృశ్యదర్శనానికి ఏమి చెప్పను?
సకలస్థావరజంగమాత్మకజగత్సామ్రాజ్యవిస్తార మాం
గికమై మించ, ననశ్వరార్థమధురోక్తిస్తుత్యసాహిత్యభూ
మికయే వాచికమై రహిల్ల, గగనోన్మేషాబ్జనక్షత్త్రతా
రక లాహార్యముగా నటించు శివునిన్ బ్రార్థింతు మి మ్మోమఁగన్!
_/|\_ !
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
03/10/2015 10:42 am
ఎక్కడా ఎటువంటి సంశయం కలుగలేదు అని అనడంలో, చర్చలో పాల్గొనగలిగే విద్వత్తు లేదని మాత్రమే నా ఉద్దేశ్యం.
సై కిల్ గురించి okAnokaDu అభిప్రాయం:
03/10/2015 9:10 am
నమస్కారం వంశీ గారికి, లైలా గారికీను
కథ గురించి నేను మాట్లాడుతూంటే లైలా గారే మొదట్న ఆవిడ కలలోకి వస్తారేమో అన్నారు (సరదాగానే లెండి). నేనూ అలాగే సరదాగా అన్నాను. ఇంక అక్కడకీ సరదాగా తీసుకోరేమో అని (చురక అంటిస్తే… అనేది బుద్ధిలేక రాసాను). ఆవిడ సరదాగానే తీసుకుంటున్నట్టున్నారు. ఎందుకో సడన్ గా నా పేరూ, బొమ్మ, వ్రాతలూ అన్నీ మొదలెట్టారు. ఇక్కడ పేరు ప్రసక్తి దేనికో మరి. పోనీయండి.
నేను భ్రూణహత్యలు చేసేంత పాపాత్ముణ్ణి కాదు. ఎందుకంటారా? ఈ చిన్న కధ వినండి. ఇంజినీరింగ్ చదివే వేడి వయసులో (వయస్సు వేడి ఎలా అంటే మరో కథ రాయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ మాత్రం ఈశ్వరానుగ్రహం ఉంటే నా బతుకు ఇలా ఏడిచేదా?) ఒక అమ్మాయిని ప్రేమించాను – దూరం నుంచే లెండి. మాట్లాడే అంత ధైర్యం ఏడిసిందా ఏమిటి? కూడా ఉండే స్నేహితుడు అన్నాడు,”నువ్వు అలా మాట్లాడకుండా చూస్తూ ఉంటే ఆ అమ్మాయ్ పెళ్ళైపోతుంది ఎవరితోటో.” నా సమాధానం -“ఏం చేస్తాం తమ్ముడూ. పోనీ ఆవిడకి పెళ్ళైపోయినా ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంటే అదే చాలు.” అదండీ నా ప్రేమ విషయం. అలా ఉత్తరోత్తరా ఇంకో అమ్మాయిని (కాస్త వేడి తగ్గాక, ఉద్యోగం చేసే రోజుల్లో) ప్రేమించాను కానీ ఆవిడా కూడా అలాగే దూరమైపోయింది. ఇద్దర్లో ఎవరికీ కూడా కలలో కూడా హాని తలపెట్టలేదు; ఇంక భ్రూణ హత్యల సంగతి దేనికీ? మనలో మనమాట మహాలక్ష్ములు ఈమాట చూడ్డానికి వస్తూనే ఉన్నారు. కాని కామెంటరు అంతే. ఇది నా – పనికిరాని – ఉద్దేశ్యం.
ఇంక ఇక్కడివరకూ వచ్చాక తెలిసినది ఏమిటంటే, నేను ఇప్పుడు పానకం లో పుడక లాగా తయారయ్యాను; ఇక్కడతో మీ ఇద్దరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు ఇస్తూ తప్పుకుంటున్నాను.
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి bhaithi durgaiah అభిప్రాయం:
03/10/2015 4:54 am
ఈ మాట సంపాదకుల గారికి
నమస్కారములు.
పత్రిక చాలా బాగున్నది.మీ కృషి ప్రశంషనీయం.నేను “అక్షర సేద్యం ” కవితా సంపుటి ని రచించాను.మీ గ్రంథాలయంలొ పుస్తకానికి అవకాశం ఉన్నదా?
ఉంటే ఎలా? దయచేసి తెలుపగలరు.
సై కిల్ గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
03/09/2015 5:34 pm
అయ్యా ఒకానొకడు గారు – అసలు ఊరకే మాటవరసకు అనుకుందాం – ఈమాట వంక ఆడవారు చూచేదే తక్కువని. కామెంట్ల వొంక చూచితేనేమో అలా ఈమాట వొంక చూచిన ఆడవారిలో రాసేవారు మరింత తక్కువని ఇక్కడ చదివేవారందరికీ తెలిసిన విషయమే. అలా లింగభేదాన్వితసమన్వయస్వరూపావధానం చేయగలిగినవారిలో లైలాగారు ఒకరు. వారిమీద మీరు చేయి నోరు ఆడిస్తే బుల్లీయింగు కిందకు వస్తుందండీ!
ఆవిడ బుల్లీయింగుకు భయపడే రకం కాదు కానీ, ఇలాటివాటి వల్ల విముఖత వొచ్చి దూరంగా పోతే మహాలక్ష్ములు లేని ఇల్లైపోయి మీ దీపం నేను, నా దీపం మీరు ఆర్పుకోవాల్సి వస్తుంది. ఆడసంతానం లేని చోట వున్న ఒకరిద్దరినీ పోగొట్టుకుని భ్రూణహత్యలని గోల పెడుతున్న సమాజమైపోతుంది ఈ ఈమాట. అప్పుడు చెమ్మచెక్కలు, అష్టాచెమ్మలు అన్నీ మగవాళ్ళే ఆడుకోవటం, ఆ ఆటలు మీరూ నేనూ సమస్త పాఠకజనం చూడవలసి రావటం. అది ప్రళయస్వరూపం. ఈశ్వరానుగ్రహం అందాకా సాగకూడదని కోరిక…
అయినా వున్న ఒక్క ఆడపడుచునూ ఈ ఈమాటలో వారే మాట సభ్యంగా అన్నా వదిలేసి అపురూపంగా చూస్కోపోతే మగాళ్ళం మనమెందుకు ? ఒకడు అని ముగించారు కాబట్టి మీరు పుంసకులేనని అనుకోలు… అదీ కాక చురక అన్నారని రంగంలోకి దిగటం, అది శ్లేషాపూర్వకమైనా సరే!
అదలా పక్కనబెడితే ఈ నా కామెంటు మూలాన, మీరు ఏవిటనుకున్నా సరే
మాటలకేవుందీ, నోరు వుండగా బోల్డు వస్తై
రాతలకేవుందీ, చెయ్యి వుండగా బోల్డు వస్తై
అని మీరూ, ఆవిడ తరఫున వకాల్తా పుచ్చుకొన్న నేను బోల్డు విసురుకోవచ్చు. సంపాదకులకు ఇబ్బంది గానీ! అందువల్ల ఇంతటితో స్వస్తి వాక్యం… 🙂
భవదీయుడు
మాగంటి వంశీ
తా.క – పోతే బొడ్డుకు మసి మీద ఒక పిట్టకత రాసుకున్నాను ఒకానొకప్పుడు. అది కాస్త పెద్ద కతే, అందువల్ల టైపింగు పూర్తికాగానే ఇక్కడే వేస్తా…
ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం! గురించి ravikiran timmireddy అభిప్రాయం:
03/09/2015 1:33 pm
ఈమాట రూల్సు ప్రకారం నేను శ్రీ. మాగంటి వంశీ మోహన్ ని ఇక్కడ సంభోదించకూడదు. అందుకని, ఎడిటర్జీ,
భావాలు, మనోభావాలు, చెత్త భావాలు, చిత్తు భావాలు ఎన్నున్నా, ప్రతి వాడికి ఒక భావం వుండటం లో తప్పేవుంది ఎడిటర్జీ?
ఎవరో నాలాటి తలతిక్క వున్నోడు ఏదో వ్రాస్తే ఎవరి భావాలో దెబ్బతినటం లో అంత ఆశ్చర్యం ఎవుంది. కానీ మీ భావాలు దెబ్బతింటే, ఎందుకో అదీ ఆ విమర్శ కాస్త విపులంగా వ్రాయొచ్చు కదా, మనిషిని చంపేసే బదులు, కవిని, రచయితని మర్డర్ చేసే బదులు.
ప్రతివాడికి ఒక భావం వుండటం మీ దృష్టి లో తప్పు లాగా వ్రాశారు,
“ప్రతి వాడికి ఒక భావం.
ఒక మనోభావం.
అందరివీ దెబ్బతినటమే.”
అంటే కొందరికి మాత్రమే ఆ హక్కుందా ఎడిటర్జీ?
కొందరు మాత్రవే మనుషులా?
వాళ్ళ నమ్మకాల ప్రకారవే లోకం సాగిపోవాలా?
ఎవరన్నా, కాదు కూడదు, ఇది నిజం అంటే
వాళ్ళని వీలైతే ఫిసికల్ గాను, కాకపోతే
మానసికంగాను హత్య చేసే అధికారం మాత్రం మీ
సాంప్రదాయ వాదులకి వుందా?
అందుకనే కదా మీరు ఆ మొన్నెప్పుడెప్పుడో
పెరుమాళ్ మురుగన్ గారిని ఎమోషనల్ గా చంపేసేరు
నిన్న “ఇండియా డాటర్” ని బాన్ చేసేసేరు.
మనుషుల్లో కూడా సాంప్రదాయవాదులుంటారు
గురజాడ గారు అదేదో చెప్పినట్టు
కానీ మనుషులందరు సాంప్రదాయవాదులే కాదు కదా!
మనసు గాయ పడటం తప్పు కాదు ఎడిటర్జీ,
కానీ ఆ గాయానికి ప్రతిగా మరో మనసుని నలిపెయ్యటం,
మరో మనిషిని నరికెయ్యటం తప్పే కదా ఎడిటర్జీ?
మీరు సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటే నిలబెట్టుకోండి
కాదని ఎవరంటున్నారు, కానీ ఇదిగో ఇది సాంప్రదాయం అప్పుడు
అని చెప్పిన వాళ్ళని మాత్రం హత్య చేయకండి.
మీరు చంపినంత మాత్రాన, ఆ సాంప్రదాయం నిజం కాకుండా పోదు.
చరిత్రకి మీరు చేతిని అడ్డం పెట్టగలరేవో, చరిత్ర కారుల్ని,
రచయితల్ని, కవుల్ని, మీరు హత్య చెయ్యగలరేవో,
ఆ చరిత్రలో సాంప్రదాయాల్ని మాత్రం మీ మడిబట్టలేనాకాల దాచేసి
మీ చేతుల పైన రక్తాన్ని సంస్కృతి పరిరక్ష్కుల పంచలకి తుడిచేసుకోలేరు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
సై కిల్ గురించి lyla yerneni అభిప్రాయం:
03/09/2015 1:27 pm
చురక ఫొటోకి అంటించినారా?
సంభాషణ కూడా మారుపేరుతో,ముసుగు లోంచి ఆ ఫొటోతోనే చెయ్యరాదా. మారుపేరుతో రాయటంలో ఏమైనా అదనపు లాభాలు ఉన్నాయేమో ఆ బొమ్మతోనే చెప్పండి. కథ! ‘బొమ్మలు చెప్పిన కమ్మని కధలు’ అక్కడే వినగలరేమో.
నిజానికి ‘చురక అంటించటం’ అనే ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు. మోటుగా, సేడిస్టిక్ గా అనిపిస్తుంది. నేను వాడలేను. కాని మీరు స్నేహపూరితంగా చేస్తున్నారు, అది నాకు తెలుసు. కాబట్టి, మీరు మార్చుకోనవసరం లేదు.
ఎంతమంది స్నేహితులుంటే జీవితం, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. రకరకాల కల్చర్స్ నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ రకరకాలుగా నాతో మాట్లాడుతారు. స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంది. నా సంబరం కూడా!
కాని, ఇలాటి సందర్భాలలో ఆ స్నేహం ఎవరితో చేస్తున్నానో తెలియకుండా ఎలా చెయ్యటమో తెలియటం లేదు.
ఇంతకు ముందు మీరు సూచించిన విశ్వనాథ కథలు బాగున్నవి. చిన్న కథలు కూడా బాగా రాశాడాయన. – లైలా
శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి రవి అభిప్రాయం:
03/09/2015 12:30 pm
అత్యద్భుతమైన వ్యాసం. ఈ విధమైన వ్యాసం బహుశా నేడు ఎవరూ వ్రాయలేరేమో.ఈ మాట వారికి వేల కృతజ్ఞతలు.
రెఫరెన్స్ పుస్తకాల జాబితా, వీలైతే లంకెలు ఇచ్చి ఉంటే బావుండేది.
మొదటి పద్యంతోనే అర్థశక్త్యుద్భవ వస్తుధ్వని, అపహ్నవం, వ్యాజోక్తి, ఉపసర్జనీకృతత్వం, అనుమితి వాదం వంటివి ప్రస్తావించి ఆయా విషయాలకు సంబంధించిన పుస్తకాలను చదువుకునే ఆసక్తి కలిగించారు. ఈ వ్యాసపు సారాన్ని యథాతథంగా స్వీకరించే తెలివిడీ, పాండిత్యమూ, ఎలానూ లేవు కనుకా, ప్రస్తావించిన విషయాల గురించీ బయట ఎక్కడా తెలుసుకోవడం కుదరదు కనుకా కొన్ని సంశయాలు.
1. “వాతెఱ గంటిఁ గంటి కెవ్వారికిఁ గెంపు రాదె;” – అని చక్కగా పరిష్కరించారు. అయితే వాతెఱ గంటిన్ – అన్న ద్వితీయా విభక్తి ప్రత్యయంతో వచ్చే ఒకింత క్లిష్టాన్వయం కన్నా “వాతెఱగంటి కంటికెవ్వారికిఁ గెంపు కాదె” – అనుకుంటే సరళాన్వయం దొరుకుతుంది కదా. అలా చదువుకోగల వీలుందా?
2. అంబరసీమఁ దారలు…శంభుడు మిమ్ము బ్రోవుతన్ – ఈ పద్య విచారణలో
>>శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం >>లోనిదన్న నిర్ణయానికి ప్రతిబంధకంగా ఉన్నది…..ఆశీరర్థకమైన మంగళం ఆశీరర్థంలో >>లూణ్మధ్యమంలో అక్కడా విధాయకం కాదు. ”
అన్నారు. అమరుశతకం ఆరంభశ్లోకం
జ్యాకృష్టిబద్ధకటకాముఖపాణిపృష్ఠ
ప్రేఙ్ఖన్నఖాంశు చయసంవళితో మృడాన్యాః
త్వాం పాతు మఞ్జరితకర్ణపూర
లోభభ్రమద్భ్రమరవిభ్రమ భృత్కటాక్షః ||