పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి సూర్యుడు అభిప్రాయం:

    04/03/2015 1:40 am

    Nice review

  2. మరి నువ్వేమో… గురించి తఃతః అభిప్రాయం:

    04/02/2015 8:40 am

    నిషిగంధ:

    చాలా చాలా సంవత్సరాల క్రితం ‘ద లండన్ మాగజీన్’లొ చదివిన ఒక పద్యంలొ మరచిపోని ఒక చరణం: “…టు మాల(ర్)మె హు హాడ్ ఇన్వెంటెడ్ ఎ స్టైల్ దట్ మేడ్ రైటింగ్ ఇంపాసిబల్.” బాలమురళి పాట విన్నప్పుడొక సారి హఠాత్తుగా ఈ చరణానికి అర్థం స్ఫురించింది. (బాలమురళి హాడ్ ఇన్వెంటెడ్ అ స్టైల్ దట్ మేడ్ సింగింగ్ ఇంపాసిబల్ ఫర్ అదర్స్).

    మీ శైలి సరిగ్గా అటువంటిది. …దట్ మేడ్ రైటింగ్ ‘ఇంపాసిబల్ ఫర్ అదర్స్’. ఇతరులందుకోలేనిది. ఎప్పుడైనా ఎన్ని సారులైనా చదువుకోవచ్చు. చదివిన కొద్దీ అందం ఇనుమడించే కవిత.

    తఃతః

  3. అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి తఃతః అభిప్రాయం:

    04/01/2015 6:12 pm

    “కానీ, మా భాగ్యస్థానంలో కదలక వున్నది మందగ్రహం!”

    శ్రీ తమ్మినేని:

    విశాఖ వీధుల్లో –
    వాటర్‌మెలన్, పైనాపిల్
    అంటూనే అమ్ముడు.
    పుచ్చకాయ, అనాస అంటే
    తెలీదెవరికీ తమ్ముడూ!

    తఃతః

  4. కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి aravind అభిప్రాయం:

    03/31/2015 10:50 am

    చాలా బాగుంది. శీను ఏమయ్యాడో కూడ చెబితే బాగుండేది.

  5. కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి aravind అభిప్రాయం:

    03/31/2015 6:46 am

    చాలా బాగుంది కధ . మీ పాత్రలన్ని కళ్ళముందు కనిపిస్తున్నట్టు ఉన్నాయి.

  6. థాంక్స్‌ గివింగ్‌ గురించి aravind అభిప్రాయం:

    03/31/2015 6:35 am

    హ్హ హ్హ బావుంది కథ..

  7. ఊర్మిళ రేఖ గురించి aravind అభిప్రాయం:

    03/31/2015 6:27 am

    చాలా బాగూందీ కథ. నారేషన్ చాలా బాగుంది.

  8. దేశభక్తి గేయాలు గురించి Lakshmi అభిప్రాయం:

    03/31/2015 4:40 am

    ఇంకా అప్పట్లో రేడియోలో వచ్చే పాటలు ఏవైనా వినే భాగ్యం కలిగించండి

  9. దేశభక్తి గేయాలు గురించి Lakshmi అభిప్రాయం:

    03/31/2015 4:38 am

    అవునండీ, డౌన్ లోడ్ చేసుకోగలిగితే బావుంటుంది
    ఎంత హాయిగా వుందో వింటుంటే

  10. అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    03/31/2015 3:07 am

    భాష కోసం ఒక పది కోట్లు సమర్పించడం ముదావహం
    కానీ, మా భాగ్యస్థానంలో కదలక వున్నది మందగ్రహం!
    (ఎనిమిది అభిప్రాయాల్లో మూడు జెంటూ,ఐదు ఆంగ్లం)
    ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
    ఇంగ్లీషులోనే కొట్టుకొంటుంది తెలుగువాడి ప్రాణ నాడి!
    మా వ్యాధి నిదానించదు మిత్రమా ఏ మైసీన్ వాడినా
    అవ్యాజంగా పరభాషనే ప్రేమిస్తాం,ఏ పూవు వాడినా!!

    -తమ్మినేని యదుకుల భూషణ్