వేమూరి మహాశయులకు ఎనానిమస్సు నమస్సులు. ఉభయకుశలోపరి. సమాధానం రాయటానికి ఆలస్యం అయ్యింది. అయితే, ఈ ఆలస్యానికి కారణం లేకపోలేదు.
ఈమధ్య విశ్వవిద్యాలయాలనుంచి విశ్రాంతి తీసుకున్న ఆచార్య శ్రేష్టులు, అందులోనూ కలనయంత్ర శాస్త్ర విభాగంలో ప్రసిద్ధికెక్కిన ఆచార్యవర్యులు,
ఐ. ఆర్. యస్ లో తాత్కాలిక పదవులు స్వీకరిస్తున్నారని చూచాయగా విన్నాను. అందుకని భయపడి ఎనానిమస్సుగా ఉండిపోయాను.
నేను మీరనుకున్న బాదరాయుణ్ణి కాదు. నేను సోదిరాయుణ్ణి.
సందేహమువలదు, ‘చక్రి సర్వోపగతుండు,’ గదా!
వయసులో పెద్దవారు, గంగా భాగీరథి సమానులు లైలా, ఈశ్వరోపాసకులు శాయి – సంతోషం. మీ ఇరువురి చెర్లాటలు ఎంతో చూడముచ్చటగా వున్నవి. 🙂
పోతే, మేనర్సు కాదని శాయి అన్నారు కాబట్టి, మేనర్సు తెలిసిన నేను నా దగ్గరే ఉన్న దుడ్డుకర్రను బయటకు తీయను. ఆ దుడ్డు బయటకు రాదు కాబట్టి – నడుములు వగైరా వగైరా, వాటి వాటి స్థానాల్లో చక్కగానే ఉంటవని అనుకోలు. 🙂
ఈమాట అభిప్రాయాలు కొద్దిసేపు పనిచేయలేదు. అందువల్ల జవాబివ్వడం ఆలస్యమయింది.
lyla yerneni:
వంశీ యొక్క-వచనం గారు పద్యానికి లేఖ రాసి ఉండాలి. ఆ లేఖను వంశీ బట్టబయలు చేస్తే బాగుండు. నాకు ఆ లేఖ చదవాలని ఉంది.
ఆ లేఖలో – దుడ్డుకర్రలు, నడుములు, శ్మశానాలు, సంకెళ్లు, సర్పాలు, పరిష్వంగాలు – అనే పదాలు ఉంటాయని ఊహ. యావంటే మేనర్స్ కాకపోయినా, ఆయన బయటపెడితే, నాకూచదవాలనే ఉంది!
ఇంతకీ అంటూ నన్ను అడిగినవిషయానికొస్తే!
రాయప్రోలువారి కావ్యము “స్నేహలతాదేవి” కావ్యపాఠము DLIలో ఇక్కడ – (DLI స్కాన్‍లో పీఠికలేదు)
స్నేహలతాదేవి వృత్తాంతము, లేఖ వివరములు కావ్యపీఠికలో ఇక్కడ
శాయి గారు ఇంకా జవాబివ్వనందున 🙂 1914 ప్రాంతంలో వంగ దేశాన వరకట్న దురాచారానికి నిరసనగా ఆత్మార్పణం చేసుకున్న ఓ యువతి వృత్తాంతం పత్రికలో చదివి, రాసిన విషాద కావ్యం, “స్నేహలత”:
పద్యం గురించిన ప్రస్తావన కావున రాయప్రోలు గురించి కొన్ని వివరాలు. మొదట్లో తను కూడా అష్టావధాన, సతావధానాల మోజులో పడ్డా, 1911 నాటికి ఆశుకవిత్వం పట్ల విముఖత ప్రకటించాడు:
తెలుగులో చెప్పినా, ఇంగ్లీషులో చెప్పినా, ఈమాట చదివేవారికి వార్త అందింది కదా! విషయం ముఖ్యం; ఆ విషయంలో ఉన్న విశేషం అంతకన్నా ముఖ్యం.
అటు బంగాలీవాడు,ఇటు అరవవాడు; ఎవడైతేనేం! వాడు, వాడి భాషలో గొంతు చించుకున్నంతమాత్రాన వాడికి వాడి భాషమీద ప్రేమ, గౌరవం ఉన్నాయని భ్రమపడి, మనని మనం కించపరుచుకోవడం ఒక రకంగా చేతకానితనం! అటు వాడికి, ఇటు వీడికీ — భాష ‘వాడి ‘ కన్నా, భేషజం, దానితో పుట్టిన వేడీ ఎక్కువ.
ఇది భ్రమ కాదు; స్వానుభవం!
మరొక చిన్న విషయం. ఒక్కొక్కసారి కొంతమందికి తెలుగులో చెప్పటంకన్నా ఇంగ్లీషులో చెప్పటం సులువుగా ఉండచ్చుకదా!
సముద్రం గురించి DURGA PRASAD అభిప్రాయం:
04/15/2015 6:59 am
కధ చాలా బాగుంది.
నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు గురించి ramamohan అభిప్రాయం:
04/14/2015 12:00 am
నాగార్జున కిల్లర్ సినిమా లో తులసి నాగార్జున నటించిన సన్నివేశం (అన్నా- చెల్లి) గుర్తొస్తుంది
మానవ సంబంధాలు తెలిపే సంధర్భం
శబ్ద తరంగాలు గురించి ns murty అభిప్రాయం:
04/13/2015 3:10 pm
మీరు గొప్ప విషయాలు సేకరించి దాచి ఉంచారు. మీ కృషి బహుధా అభినందనీయం
వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
04/13/2015 11:19 am
చలం గారి మీద యావంటూ యావ చూపిచ్చారో కానీ, లంకెలు అవీ చాలా సులభంగా లభ్యమయ్యే కాలంలో కష్టపడి వెతుక్కొస్తిని 😛 –
ఉత్తరాల లంకె ఇదిగో
అలాగే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఆంధ్రాలో చలం అన్నది ఇక్కడ
ఇంకొహటి
ఇహ మీ యావ, ప్రేమ రెండూ చలమ్మీద కురిపిచ్చుకోవచ్చు… 😉
భవదీయుడు
మాగంటి వంశీ
ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్ గురించి ఎనానిమస్సు అభిప్రాయం:
04/13/2015 10:51 am
వేమూరి మహాశయులకు ఎనానిమస్సు నమస్సులు. ఉభయకుశలోపరి. సమాధానం రాయటానికి ఆలస్యం అయ్యింది. అయితే, ఈ ఆలస్యానికి కారణం లేకపోలేదు.
ఈమధ్య విశ్వవిద్యాలయాలనుంచి విశ్రాంతి తీసుకున్న ఆచార్య శ్రేష్టులు, అందులోనూ కలనయంత్ర శాస్త్ర విభాగంలో ప్రసిద్ధికెక్కిన ఆచార్యవర్యులు,
ఐ. ఆర్. యస్ లో తాత్కాలిక పదవులు స్వీకరిస్తున్నారని చూచాయగా విన్నాను. అందుకని భయపడి ఎనానిమస్సుగా ఉండిపోయాను.
నేను మీరనుకున్న బాదరాయుణ్ణి కాదు. నేను సోదిరాయుణ్ణి.
సందేహమువలదు, ‘చక్రి సర్వోపగతుండు,’ గదా!
ఇతి.
వచనానికి ఒక జాబు గురించి మాగంటి వంశీ అభిప్రాయం:
04/13/2015 5:50 am
వయసులో పెద్దవారు, గంగా భాగీరథి సమానులు లైలా, ఈశ్వరోపాసకులు శాయి – సంతోషం. మీ ఇరువురి చెర్లాటలు ఎంతో చూడముచ్చటగా వున్నవి. 🙂
పోతే, మేనర్సు కాదని శాయి అన్నారు కాబట్టి, మేనర్సు తెలిసిన నేను నా దగ్గరే ఉన్న దుడ్డుకర్రను బయటకు తీయను. ఆ దుడ్డు బయటకు రాదు కాబట్టి – నడుములు వగైరా వగైరా, వాటి వాటి స్థానాల్లో చక్కగానే ఉంటవని అనుకోలు. 🙂
ధన్యవాదాలతో
భవదీయుడు
మాగంటి వంశీ
బ్రౌన్ పురస్కారం 2014 గురించి SeshaKumar KV అభిప్రాయం:
04/13/2015 3:43 am
శ్రీ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం అందించడం చాలా మంచి నిర్ణయం.ఈ వయసులో కూడా వారు చేస్తున్న కృషి కి పాదాభి వందనం తెలపాలి.
వచనానికి ఒక జాబు గురించి VST Sayee అభిప్రాయం:
04/12/2015 7:32 pm
ఈమాట అభిప్రాయాలు కొద్దిసేపు పనిచేయలేదు. అందువల్ల జవాబివ్వడం ఆలస్యమయింది.
lyla yerneni:
ఆ లేఖలో – దుడ్డుకర్రలు, నడుములు, శ్మశానాలు, సంకెళ్లు, సర్పాలు, పరిష్వంగాలు – అనే పదాలు ఉంటాయని ఊహ. యావంటే మేనర్స్ కాకపోయినా, ఆయన బయటపెడితే, నాకూచదవాలనే ఉంది!
ఇంతకీ అంటూ నన్ను అడిగినవిషయానికొస్తే!
రాయప్రోలువారి కావ్యము “స్నేహలతాదేవి” కావ్యపాఠము DLIలో ఇక్కడ – (DLI స్కాన్‍లో పీఠికలేదు)
స్నేహలతాదేవి వృత్తాంతము, లేఖ వివరములు కావ్యపీఠికలో ఇక్కడ
నమస్తే,
శాయి.
వచనానికి ఒక జాబు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
04/12/2015 7:28 pm
శాయి గారు ఇంకా జవాబివ్వనందున 🙂 1914 ప్రాంతంలో వంగ దేశాన వరకట్న దురాచారానికి నిరసనగా ఆత్మార్పణం చేసుకున్న ఓ యువతి వృత్తాంతం పత్రికలో చదివి, రాసిన విషాద కావ్యం, “స్నేహలత”:
“ఇల్లు సొచ్చి, ద్వారము మెల మెల్ల మూసి,
వ్రాసి దాచిన యొక యుత్తరమును తీసి
వేదికోపరితలమున బెట్టె కన్నె;
సంతరించె కాబోలు నాసరికె యదియు.
తాను ధరియించియున్న ఉత్తమ దుకూల
మవల బడవైచి పూనె కన్యామతల్లి
స్నేహ కౌశేయ మొకటి కచ్చెలు విదిల్చి
నారచీర తాలిచిన జానకి విధాన.
అకట! యేమని పలుక నోరాడు నింక!
భగవతీ ధ్యానరతి భగ భగ వెలుంగు
అగ్నిలోన పూర్ణాహుతి యయ్యె నయ్యొ!
ధన్యగుణవల్లి స్నేహలతామతల్లి.”
పద్యం గురించిన ప్రస్తావన కావున రాయప్రోలు గురించి కొన్ని వివరాలు. మొదట్లో తను కూడా అష్టావధాన, సతావధానాల మోజులో పడ్డా, 1911 నాటికి ఆశుకవిత్వం పట్ల విముఖత ప్రకటించాడు:
“తెనుగే తీయని, దందు పద్యపద రీతి క్రీడ లత్యంతమో
హనముల్ శోభనముల్ తదీయ రసరక్తాలా పనంబుల్ లభిం
చిన వాగర్థ కళాకలాప జయలక్ష్మిన్ గాలికింబుత్తునే
జననీ! యేమిటి కింక ఆశుకవితా సన్యాస మిప్పించవే.”
“రసమో, భావమొ, జీవదర్థ సుకుమార వ్యంజనా మంజుశ
బ్ద సమాసా రచనంబొ, సాధు హృదయం స్పంద పతిష్ఠా కథా
వివరంబో! సకలార్థ శూన్యమగు నీ వేగాతి వేగోక్తి దు
ర్వ్యసనం బేటికి? త్రిప్పు మింక జననీ! రమ్యాక్షర క్షోణికిన్.”
మరిక ఆయన యెంచుకొన్న అభినవ కవితామార్గం:
“వంశిన్ వంచి, మృణాళమున్ మెలిచి, పక్వ ద్రాక్ష నెండించి వా
గంశల్ మార్దవ మాథురీ సుభగ విన్యాసంబు జిల్కన్, దశ
త్రింశల్లక్ష జనప్రసన్న రసనా దేవాలయాభ్యంతర
ప్రాంశు ప్రార్థన గీత మైన తెనుగుం బల్కున్ ప్రశంసించెదన్.”
ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నులు కట్టే పనికి బదులు ఓ పుస్తకం [1] చదివించినందుకు లైలా గారికి కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
[1] “రాయప్రోలు సుబ్బారావు,” యు. ఎ. నరసింహమూర్తి. ద్రావిడ విశ్వవిద్యాలయం, 2008.
అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి p.s. rao అభిప్రాయం:
04/10/2015 6:20 pm