పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/05/2015 10:48 pm

    * నాగలక్ష్మి గారు, చాలామంది సందేహాన్ని మీరు ఎంతో సూటిగా, సున్నితం గా అడిగారు. నిజానికి నిజం లో కూడా..నేను అలానే చూసినట్టు చెబుతున్నా. ఎప్పుడు, ఎక్కడ ఎలా అనేవి పాఠకుల ఊహా చిత్రానికే వదిలేసాను. ఐతే ఇదంతా నేను కావాల్సొచ్చి చేసిన పని కాదు. కథంతా పూర్తయ్యాక పబ్లిష్ అయ్యాకే నాకూ ఇదంతా అవగాహనకొస్తోంది. చాలా చక్కటి వ్యాఖ్యనిచ్చారు నాగలక్ష్మి. నా హృదయపూర్వక ఢన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    * ‘Your command over language & observation of humans and nature are second to none to weave a story of supreme artistic heights. Super like for the story. ‘ – రమేష్ గారు, 🙂 ఎంత గొప్ప కామెంట్! థాంక్స్ తప్ప మరి మాటలేవీ రావడం లేదు. బహు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
    శుభాకాంక్షలతో..
    * శొభ గారు! అమ్మ గురించి చెప్పగానే మనసొక్కసారిగా ఉప్పొంగింది మీ మాటలకి. కానీ, అమ్మ ఈ రచన చదవలేదు. పొంగిపోతూ నా వైపు చూసే ఆ చూపు, ఆ రూపు నాకు దూరమై పోయాయి. ‘మీ అక్షర సృష్థీ ఆ తల్లిని ఎంత సంతోష పరచిందొకదా.’ అని మీరంటుంటె కళ్ళు వర్షించాయి. అమ్మ ఎక్కడున్నా తప్పకుండా సంతోషిస్తుంది. దీవిస్తుంది. నిజమే. ఈ అక్షర సృష్టి ఆమె ఇచ్చిన వరమే. ఎంత విలువైన మాట చెప్పారు!
    మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ…

  2. శేషు మావయ్య గురించి G.S.lakshmi అభిప్రాయం:

    05/05/2015 9:42 pm

    గంభీరమైన సముద్రం ఆటుపోట్లకు గురైనప్పుడు కలిగే అలజడి యెలాగు వర్ణింపశక్యం కాదో అంత అలజడినీ రేపింది మీ కథ నా గుండెల్లో. మనసుని తాకిన అనుభూతిని మాటలలో తెలుపలేక వర్ణనలలో తెలిపిన మీ శైలి అద్భుతం దమయంతీ. కథ ముగిసినా మనసులో శేషుమామయ్య మాత్రం అలా నిలచిపోయారు. అభినందనలు.

  3. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

    05/05/2015 8:06 am

    శ్రీ మోహన: సైనిక విజయాలతో రాజకీయ,విజయాలతో కొన్ని దేశాల భాషలు వ్యాప్తి చెందటం నిజం. కానీ ఆధునిక కాలంలొ ముఖ్యంగా ఇంగ్లిష్, ఇంగ్లిష్ వారి పాలన (చాలా దేశాలనుంచి) వెళ్ళి పోయాక గూడా ఎందుకు మిగిలివుంది? పూర్వం కన్న ఏ కారణం చేత బలం పుంజుకుంది? శ్రీయుతులు నారా, పరుచూరి – వీరు రాసిన పద్ధతి నాకు నచ్చకపోయినా* – తెలుగు భాష ప్రపంచంలో విద్వద్విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నారని నాకు అర్థమైనది. [ఈ విషయాన్ని తెలుగుకు పరిమితం చేయకుండా భారత దేశాన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని తన ‘వెండీ’ వ్యాసంలో శ్రీ కొలిచాల ప్రస్తావించారన్నది నేను మరిచి పోను.] ఇక్కడ ఒక ప్రశ్న- సంస్కృతానికి అధ్యయన పీఠాలు పెట్టాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా? సంస్కృతం నిజమైన విద్వద్విజయాన్ని సాధించింది.సాహిత్యం ఒక్క దాంట్లోనే కాదు శాస్త్ర విషయాలలోనూ.

    తీవ్రమైన పూనిక ఉన్నట్లయితే పదిహెను ఇరవై సంవత్సరాలలో కొంత మేరకు ఈ పనిని సాధించవచ్చు. ఎవరినీ మెండుగా డబ్బులడగవలసిన పని లేదు. ఊరు కదలవలసిన పనిలేదు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ కలిసి కట్టుగా ముందుగా గణిత, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలలో పట్టు సాధించాలి. వీటిల్లో ప్రతి అంశంలోనూ మనది అన్న నేర్పరితనాన్ని తెచ్చుకోవాలి, అదే ఊపిరితో ఈ విద్యలలో నేర్పరితనాన్ని టెక్నాలజీకి అనువర్తింపజేసి సాధించిన సాంకేతిక శాస్త్ర విజయాలను ప్రపంచ విపణిలొ పెట్టి ఆర్ధిక బలాన్ని పేంచుకోవాలి. ఇది కష్టమైన పనేమో గానీ అసాధ్యం మాత్రం కాదు. చైనా నా కళ్ళముందు ఈ పని చేసి చూపించింది. ఒక చిన్న తెలుగు ఉదాహరణ: రత్నం పెన్స్.

    ఈ ఉద్యమ సారస్వతం అంతా తెలుగు లో ఉండాలి అన్నది చెప్పక్కర లేదనుకుంటాను.

    నమస్కారాలతో
    తః తః

    * సైన్స్ చదువుల వాళ్ళు సాహిత్యం గట్రా కొంత చదివి ఎంతో కొంత నేర్చుకుంటారేmO గానీ సాంఘికాలూ, సాహిత్యాల చదువుల వాళ్ళు సైన్స్ నుంచి – ఏమీ నేర్చుకో(లే)రేమొమో ననిపిస్తుంది. ‘సోషల్ రెసెర్చ్’ అన్న ఒక ప్రసిద్ధమైన సాంఘిక విజ్ఞాన పత్రిక ఉన్నది. చాలా సంవత్సరాల క్రితం ఈ పత్రిక ఒక సంచికలో ష్రాడింగర్ వంటి కొంతమంది సైంటిస్టుల జీవితాలపై వ్యాసాలను, సోషల్ సైంటిస్టులకు వీటి నుంచి కోంత ఉపయోగం ఉండవచ్చని ఉపొద్ఘాతం రాస్తూ ప్రచురించింది. ఆ వ్యాసాలు నేను చదివాను. వివరాలకు ఆసక్తి ఉన్న వాళ్ళు వెబ్ లొ వెతికవచ్చు.

  4. శేషు మావయ్య గురించి gurajadasobha అభిప్రాయం:

    05/05/2015 6:51 am

    దమయంతిగారు కుశలమా?ఈ కధ కదిలించింది. కధనం సముద్రతీరానికి పరుగు తీయించింది మీ ఆమ్మగారు మనసులొ మెదిలారు. మీ అక్షర సృష్థీ ఆ తల్లిని ఎంత సంతోష పరచిందొకదా. ఆమ్మల నెల కనక అమె మనసులొ మెదిలారు ఆమ్మో ఎంత కష్థం ఈ విధంగా రాసుకుపొవడం.

  5. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి శ్రీతెలుగు అభిప్రాయం:

    05/05/2015 5:02 am

    ఎక్కడికి పోయినా, ఎంత దూరం పోయినా తమ భాషనే పట్టుకుని వేళ్ళాడే మిలియన్లాదిమంది మూర్ఖపు, మొండి, అహంకారి వలసదార్లలోంచి అంతర్జాతీయ భాషలు ఉద్భవిస్తాయి. తెలుగువాళ్ళలా సొంతగడ్డమీదే దాన్ని నిస్సంకోచంగా పరిత్యజించేవాళ్ళలోంచి కాదు.

  6. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    05/05/2015 4:41 am

    I have a seemingly unrelated query to the writers, but it is also important as for as the language origins are concerned.

    Persons like Sriman Dasaradhi Ranghacharya garu who has single handedly translated ‘Vedas’, ‘Upanishads’, ‘Ramayana’, ‘Mahabharata’ etc., says ‘arya’ is only meant for addressing and does not designate ‘race.’

    And on the other we also read that the Aryan Invasion Theory is thrashed.

    In this context, why linguists still talk Telugu as Dravidian?

    Thanks in advance for a clarification.

  7. ఉదయం గురించి Damu ndm అభిప్రాయం:

    05/05/2015 4:25 am

    పిట్ట నోట చిన్నకూత. ప్రకృతి జోలపాట.
    కటిక నేల. చెయ్యి దిండు.
    ఆవు చుట్టూ గంతులేస్తున్న ఉడుత.

    అనే మాటలు చాలా బాగున్నాయి…

  8. యద్భావం తద్భవతి గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    05/05/2015 4:04 am

    పౌరాణిక గాధలను చక్కని సమకాలీన వాడుక భాషలో కథలుగా అందించడం ఆసక్తికరం, అభినందనీయం. ఈ కథలోని రజకుడే అలనాడు సీతమ్మ తల్లి ని తూలనాడిన రజకుడనీ వాడి వాచాలత్వం ఈ జన్మలో కూడా కొనసాగిందనీ కృష్ణుడు రాముడు ‘కాదు’కాబట్టి వెంటనే వాడికి విదేహ ముక్తి లభించినదనీ విన్నాను. అలాగే ఈ త్రివక్రే అలనాటి మంధర అని కూడా! ఇలాంటి కథనాలకి ఏవైనా పౌరాణిక ప్రమాణాలున్నాయేమో తెలియచేయమని శర్మ గార్కి మనవి.

  9. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Marripoodi Mahojas అభిప్రాయం:

    05/05/2015 12:27 am

    శకునపక్షి ననుకోకపోతే నావీ కొన్ని పైసలు. తెలుగు పరిస్థితి ఇంట్లో (స్వదేశంలో) చాలా ఘోరం. అంతర్జాతీయ భాషలకి geographically vast territorial base ఉంది. తెలుక్కి అలాంటిదేదీ లేదు. అంతర్జాతీయ భాషలన్నీ కొన్ని స్వతంత్ర దేశాలకి అధికారభాషలు. తెలుగు మాట్లాడే రాష్ట్రాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద సబార్డినేట్ ప్రావిన్సులే తప్ప స్వతంత్రదేశాలు కావు. రాజకీయంగా స్వతంత్రులైనవాళ్ళకి మాత్రమే రిజర్వుచేయబడే అంతర్జాతీయ హోదా తెలుక్కి రావడం అవాస్తవికమైన ఆశింపే అవుతుంది. తెలుగు ఒకే ఖండంలో, ఒకే దేశంలో ఒక 3,25,000 చ.కి.మీ.ల ఏకాండీ భూభాగంలో మాత్రమే మాట్లాడబడే భాష. వేరే చోట్ల మన వాళ్ళున్నారు. కానీ వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా? లేదా వాళ్ళంతా ఆయా దేశాల్లో ఒకే సమాజంగా బ్రతుకుతున్నారా? వాళ్ళని ఆయా దేశాల్లో ఒకే homogenous society గా గానీ, race గా గానీ గుర్తిస్తున్నారా? లేదా వీళ్ళు తమని తాము ఇతరుల దగ్గర అలా అని (తమ ఇండియా మూలాల గురించి ప్రస్తావించకుండా) ఐడెంటిఫై చేసుకుంటున్నారా? ఇవన్నీ ప్రశ్నలే. అవి గాక మరో ప్రశ్న ఏంటంటే- మనకు స్వదేశంలోనే మన ఐడెంటిటీ గురించి ఒక స్పష్టత లేదు. తెలుగుని అంతర్జాతీయ భాష చేయాలి అన్నప్పుడు “ఏ తెలుగుని? కోస్తా తెలుగునా? రాయలసీమ తెలుగునా? తెలంగాణా తెలుగునా?” అనే ప్రశ్న వస్తుంది. మన రాష్ట్రాల్లో స్థిరపడ్డ పరాయిభాషలవారికే మనం తెలుగు నేర్పే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళ కన్నా ముందే మనం వాళ్ళ భాషలో మాట్లాడేసి ఇక్కడ తెలుగులో పనిలేదని అన్యాపదేశంగా సూచిస్తున్నాం. ఇక తెలుగు అంతర్జాతీయ భాష అయ్యే అవకాశమేదీ?

  10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి పాలూరి వెంకట రామారావు అభిప్రాయం:

    05/05/2015 12:13 am

    తెలుగు విశ్వవిద్యాలయాలూ శాఖలూ ప్రపంచానికి విజ్ఞానం అందించాలన్నారు, అంటే తెలుగుభాష గురించే కాక శాస్త్రవిషయాలని కూడాననే కదండి! ఇతర శాస్త్రాలూ పరిశోధనా ఆయా విభాగాల్లో తెలుగు మాధ్యమంలో జరిగితేనె తప్ప, ఇలాటి విషయాలన్నిi తెలుగుశాఖ ప్రాచుర్యంలోకి ఎలా తీసుకు రాగలదు? గ్రీక్ లేదా జపనీస్ భాషలని ఇతరుల్ నేర్చుకుంటున్నారంటే ఆ భాషల్లో వైజ్ఞానిక విభాగాలలో ఉన్న సాహిత్యమే, భాషా విభాగం ఒక్కటే సృష్టించిన సాహిత్యం కాదుకదా అదంతాను!