పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తఃతః అభిప్రాయం:

    05/07/2015 9:51 pm

    మిత్రులు ఫిజిక్స్ ఆచార్యులు దాసు నేతాజీ మధుసూదన రావు గారు మొన్న వారు ‘వన్ ఇండియా – తెలుగు, మే 05, 2015’కు రాసిన ఒక వ్యాసం లింక్ పంపారు. అందులో నుంచి రెండు ముక్కలు – తెలుగు విశాఖపట్న వ్యవహార భాషగా ఎలా వెలిగి పొతోందో చూడండి.

    “ఒకసారి ఒక ‘మహాంగడి’ (సూపర్ మార్కెట్)కి వెళ్ళి కందిపప్పు కావాలని అక్కడున్న అమ్మాయి (తెలుగుపిల్లే) నొకెత్తెను అడిగితే, ఆపిల్ల “ఓ తూర్ దాలా సార్, ఇదిగోండి” అని తీసి ఇచ్చింది. ఇంకొకసారి అలాంటి అంగడిలోనే బీరకాయలు కొని ‘గల్లాబల్ల’ (క్యాష్ కౌంటర్) దగ్గర డబ్బు ఇవ్వబోయాను. అప్పుడక్కడున్న పిల్ల (మళ్ళీ తెలుగుపిల్లే) నా చేతిలోని కాయల ధర తెలియక “ఈ రిట్జ్ గోర్డ్” (Ridge gourd) ‘రేటెంతో’ చెప్పమని పక్కనున్న తన సహోద్యోగినిని అడిగింది. నేను అవాక్కయ్యాను. ఇక కుతూహలం చంపుకోలేక అక్కడ గోడలకమర్చిన అరలలో చూశాను. పప్పులు, ఉప్పులు ప్లాస్టిక్ పొట్లాలలో అందంగా అమర్చి ఉన్నాయి. వాటిలో కొన్నిటి మీద ‘మూంగ్ దాల్’ (Green gram) అని, కొన్నిటి మీద ‘ఊరద్ దాల్’ (Black gram-split) అని, మరి కొన్నింటి మీద ‘చన్నా దాల్’ (Bengal gram) అని ఆయా పొట్లాలలో ఉన్న వస్తువుల హిందీ పేర్లు, ఇంగ్లీషు పేర్లు రోమన్ లిపిలో రాసి ఉన్నాయి గాని ఒక్కపొట్లం మీదా పెసరపప్పు అనిగాని, మినపపప్పు అనిగాని, శనగపప్పు అని గాని రాసిలేదు. ఇక కూరగాయల సంగతి సరేసరి, ‘ఓక్రా’లు, ‘బైంగన్’లు ఉన్నాయిగాని, మన బెండకాయలు, వంకాయలు లేవు.”

    తఃతః

  2. జీవితం గురించి Nandamudi venkata subbaeao అభిప్రాయం:

    05/07/2015 9:49 pm

    వయసు బట్టి అనుభుతులు తమ అర్థాలు మారుస్థాయి…

  3. నేను పులిని గురించి Nandamudi venkata subbaeao అభిప్రాయం:

    05/07/2015 9:44 pm

    నేటి మనిషి నైజం పులి తో పొలిక కూడ తక్కువ ఆనిపించింది….బాగు బాగు

  4. కవికులగురువు గురించి దేశికాచారి అభిప్రాయం:

    05/07/2015 2:34 pm

    శ్రీభాస్కర్ గారి వ్యాసం కాళిదాసంటే గొప్పకవి అని అందఱూ చెప్తున్నా, ఆయన ఎందుకు గొప్పకవియో అనే అంశాన్ని తెలియనివాండ్లకు ఈ అంశాన్ని కొంతవఱకు విశదం చేసే విధంగా సాగింది. దీనికి వారికి నా అభినందనలు. కాని కొంత సూక్ష్మంగా చూస్తే ఎందుకో ఏమో అనేకశ్లోకాలలో ముద్రారాక్షసాలు కనిపించినాయి. శరీరంలో పుండులాగ ఇవి పరిహార్యము లని తలచి, నాకు దట్టిన ఆ దోషములను, వాని సవరణలను ఇక్కడ పేర్కొంటున్నాను. అసందర్భం కాదు కనుక వారిచ్చిన ఋతుసంహారంలోని మూడు శ్లోకాలకు నా ఆంధ్ర ఋతుసంహారంలోని అనువాద రూపాలను కూడా ఇస్తున్నాను. దోషాల ప్రక్కనే సవరణలను బ్రాకెట్లలో చూపెట్టినాను.

    సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి(ప) శోభితం
    ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణం(ణామ్)

    చ.సతతము సుందరంబులయి,సంస్వనదుత్సవతత్పరంబులై,
    వితతవిలోలవిస్ఫుటితపింఛములై,అనురాగసంభ్రమా
    యతిఁ బరిరంభచుంబనసమాకులితాంగములై మయూరముల్
    ప్రతినవనర్తనంబుల విరాజిలె నభ్రరవానుకారులై.

    నితాంత లాక్షారసరాగరంజింతైః (రంజితైః)నితంబినీనాం చరణైః సనూపురైః
    పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్

    తే.గీ. పదపదంబున హంసలపలుకు లూను
    హంసకంబుల నందమై, యావరసము
    చేత నరుణంబులై యున్న స్త్రీలపదము
    లతనుసందీపన మొనర్చు నభికతతికి.

    ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః
    జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం
    మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్
    సోఽయం వో వితరీతరీషు (వితరీతరీతు)వితనుర్భద్రం వసంతాన్వితః

    ఉ. ఎవ్వని విండ్లు కింశుకము, లెవ్వని బాణము లామ్రమంజరుల్,
    ఎవ్వని మౌర్వి తేఁటిగమి, యెవ్వని తెల్లని ఛత్ర మిందుఁడున్,
    ఎవ్వని దంతి గంధవహుఁ, డెవ్వని బంట్లు పికాళి, లోకజి
    త్తెవ్వఁడు తత్స్మరుండు ప్రజ కిమ్ము లొసంగుతఁ జైత్రయుక్తుఁడై.

    అసంశయం క్షత్రపరిగ్రహక్షమా య దార్య మస్యా మభిలాషి మే మనః
    సతాం పి (హి)సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః

    ఇందీవరశ్యామతనుర్ నృపోఽసౌ త్వం రోచనాగౌరశరీరయష్టిః
    అన్యోన్యశోభా పరివృద్ధయే వాం యోగస్తటిట్టో(త్తో)యదయో రివాస్తు

    అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహై
    రనావిద్ధం రత్నం మధు నవ మనాస్వ(స్వా)దితరసమ్
    అఖండం పుణ్యానాం ఫలమివ అ (చ)తద్రూప మనఘం
    న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః

    [కృతజ్ఞతలు దేశికాచారి గారూ. ఆ తప్పులని వెంటనే సవరిస్తాము – సం.]

  5. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/07/2015 12:17 pm

    ఈ విషయం మీద ఇంత మంది వ్యక్తపరచిన అభిప్రాయాలు చదివిన తరువాత –
    మనకి “అంతర్జాతీయత” కంటె “ఆధునికత” ఎక్కువ అవసరమేమో? ఈ రోజుల్లో వివిధ రంగాల్లో మన దైనందిన అవసరాలని తీర్చడానికి కావలసిన సత్తా తెలుగులో లేకపోవడం వల్లనే కదా మనం ఇంగ్లీషుని ఆశ్రయించవలసి వస్తోంది. ఆ సత్తా ఎప్పుడు వస్తుంది? తెలుగు సాహిత్యపు గొప్పతనాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చాటి చెప్పడం ఒక అంశం కావచ్చు. అలాగే పాశ్చాత్య ప్రపంచంలో – వ్యాపార, వాణిజ్య, వైద్య, విజ్ఞాన, సాంకేతిక రంగాలలో – వస్తూన్న విప్లవాలని తెలుగులో వ్యక్తపరచే స్థోమత వచ్చిన నాడు మనం కలలు కంటూన్న ఆధునికత సంతరిస్తుంది. ఏ భాష అయినా వాడుతూన్నకొద్దీ వాడి తేరుతుంది, వాడకపోతే వాడిపోతుంది. – వేమూరి

  6. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి ది ఆంధ్రా హ్యూమనిస్ట్ అభిప్రాయం:

    05/07/2015 9:40 am

    అంతర్జాతీయత అనేది ఒక రాజకీయ కాన్సెప్టు. సాంస్కృతిక అంశాల్లోని సున్నితత్వాలకి ఏ మాత్రం తావులేని, సంబంధం లేని ఒక మొఱటు, మాస్ కాన్సెప్టు. ముందు ఈ విషయాన్ని గుర్తించాలి అందరూను! మన భాష అంతర్జాతీయ భాష అవ్వాలంటే – ముందు మనం ఏదైనా ఒక అభారతీయ దేశంలో ఒకే చోట (ఒక పెద్ద జిల్లా అంత ప్రదేశంలో అనకండి) కనీసం ౧౦ – ౨౦ లక్షల తెలుగు జనాభాని పోగేసుకోవాలి. ఆ కొద్ది ప్రదేశంలోనైనా మనం మిగతావాళ్ళ మీద మెజారిటీ అనిపించుకోవాలి. అక్కడ స్థానికంగా తెలుగు వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అప్పుడు మనదీ ఒక అంతర్జాతీయ భాష అనిపించుకుంటుంది. కేవలం అకాడమిక్ కార్యకలాపాలతోనూ, వాటిల్లోని స్వకీయతతోనూ ఏ భాషా అంతర్జాతీయ భాష అవ్వదు. జర్మన్ అన్ని యూరోపియన్ భాషల్లోకీ చాలా స్వతంత్రమైన పదజాలం గల భాష. అందులో నానా సబ్జెక్టుల మీద చాలా ఒరిజినల్ రిసర్చ్ కూడా వచ్చింది. కానీ అందరికీ తెలుసు – అది అంతర్జాతీయ భాష కాదని! ఎందుకంటే తెలుగు లాగే అదీ ఒక భూభాగానికి పరిమితం. ఇంగ్లీషుకి మల్లే జర్మన్ భాషకి వలసదేశాలేవీ లేవు.

  7. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    05/07/2015 7:03 am

    సంపాదకీయం ఒక మంచి వ్యాసం అయి తీరాలి. ఒక క్రమం, నిర్మాణం అంటూ కనిపించాలి. అయోమయాన్ని ప్రోది చేస్తే అది వచన కవిత్వం అవుతుందే తప్ప చక్కని వ్యాసం కాదు. సాహిత్య సమావేశాల్లో తరచూ చూస్తుంటాము; అరగంట ఉపన్యాసానికి వక్త ఒక విషయాన్ని ఎంచుకొనడం ,ఐదు నిమిషాల్లో ఆ విషయం ముగిసి పోయాక ,తతిమ్మా పాతిక నిమిషాలు అక్కరకు రాని ఉడుకు సోదిలోకి దిగి అందరిని విసిగించడం, జనాలు మర్యాదకు కిమ్మనకుండా వింటూ ఉంటే , ఓహో అని గర్వపడి లోకాభిరామాయణం లోకి దిగి సభకు ఎందుకు వచ్చామురా భగవంతుడా అని అందరూ కునికిపాట్లు పడుతున్నప్పుడు ముగించడం.

    ఇందులో వ్యాస లక్షణాలు సకృతు వచన కవిత్వం/ఉపన్యాసం తాలూకు లక్షణాలు జాస్తి.విమానాశ్రయాలతో మొదలుకొని ఈ మధ్య ప్రతిదీ అంతర్జాతీయమే.

    అంతర్జాతీయ భాష అన్న బ్రహ్మపదార్థం అనగా ఏమిటి దానికి వీలయినంత సమగ్రంగా నిర్వచించే పనికి పూనుకోలేదు, అక్కడినుండి అన్నీ కప్పదాట్లే!

    “Why is English the main international language? Because of widespread ‘official’ and international use (not because of mother tongue use) – Intranationally as a lingua franca, and internationally – as the major language of business, media, technology, diplomacy, etc. etc. How did English become an international language? • Migration by English speakers • Colonialism by the British • The international role and influence of the USA • Commerce, international communications, media, films, etc.” (Critical Issues for 21st Century ELT: What English? Whose methods? Which culture? -Richard Smith University of Warwick, UK)

    తమ ఉపన్యాసాన్ని యూనివర్సిటి నాలుగు గోడల మధ్యకు పరిమితం చేశారు. పైన ఉటంకించిన విద్యావేత్తలా నిలబడి యోచన చేసే ఓపిక లేకపోయింది జంట కవులకు.

    ఈ రచన పీర్ల చావిడికి వెళ్లినట్టు లేదు. ఈ వాక్యాలను చదివి తరించవలెను:

    1. ఆ పుస్తకాలలో వున్న జ్ఞ్ఞానం ప్రపంచం గుర్తించదగినదైతే అది ఇప్పుడు ప్రపంచంలో ప్రచారంలో వున్న భాషల్లోకి అనువాదం కావాలి.
    జ్ఞానం మీద భారం మోపుతున్నారు గనుక పుల్లెలను మెచ్చుకొని పుల్లను విరిచేద్దాం!

    2. చాలామంది తెలుగుకి దూరమై, ఇంగ్లీషు వదువులకి ఎగబాకడం.

    పై వాక్యం నా బోంట్లకు మింగుడు పడలేదు, ఇది అంతర్జాతీయ శృంగారానికి సంబంధించినది కాకూడదని ఆశిస్తాను.

    యునివర్సిటి పండితులకి ,వచన కవులకు గణితంలో శిక్షణ ఇప్పిస్తే తప్ప లాభం లేదు అన్న నా అంతర్జాతీయ అభిప్రాయానికి నా అభిమాన వ్యాసరచయిత వాక్యాన్ని వత్తాసుకు తెచ్చుకొని ఇక జాలింతును (తఃతః గారికి తప్పక తెలిసే ఉంటుంది ఈ సూక్తి)
    .
    If a man’s wit be wandering, let him study the mathematics.(Francis Bacon)

    -తమ్మినేని యదుకుల భూషణ్

    [ఎంత ప్రయత్నించినా కొన్ని అచ్చుతప్పులు దొర్లుతూనే ఉన్నాయి, ఉంటాయి. వాటికి మేము క్షంతవ్యులం. తప్పు చెప్పినప్పుడల్లా సరిదిద్దుకుంటున్నాం కూడా. కాకపోతే అదేదో మహాపరాధం అన్నట్టు ఇంత అసభ్యంగా ఎత్తిచూపడం ఏ రకం సంస్కారమో అర్థం చేసుకోలేకుండా ఉన్నాం, భూషణ్ గారి భాషాలక్షణాలు చిరపరిచితం అయివుండి కూడా. – సం.]

  8. ఏటి గట్టున ఇల్లు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/07/2015 1:40 am

    ‘ఇంతకీ మీ కథ గురించి చెప్పలేదు కదూ తెల్లవారుజామున వచ్ఛే అందమైన కల మీ కథ. అనుభూతిగా దాచుకోగలమే కానీ అనుభవంలో చెప్పలేము.’

    -పూర్ణిమ గారు! ఎంత సిన్సియర్గా చెప్పారండి, మీ మనసులోని మాటని. ఏ రైటర్ కైనా ఇంతకు మించి ఇంకేం కావలనేంత సంతృప్తినిచ్చే వ్యాఖ్యని అందించారు. ఇవాళ ఇక ఆకలీనిద్రలతో నాకు పనే లేదు. 🙂 ఇంత ఆనందాన్ని కలిగించిన మీ కామెంట్ కి బదులుగా ఏమివ్వగలను? – థాంక్స్ తప్ప.

    థాంక్ యు వెరీ మచ్ పూర్ణిమ గారు.
    శుభాభినందనలతో..

  9. రీ యూనియన్ గురించి Nandamudi venkata subbaeao అభిప్రాయం:

    05/06/2015 11:12 pm

    మేడం…కవిత వాస్థవికతకు దగ్గరె….కాని మా గుంటూర్ మెడికల్ కాలెజీ 40 సంవత్సరాల రి యూనియన్….నమ్మలెంత భిన్నం గా జరిగింది…అది అత్యంత అనందపు పండగ…..

    అభినందనలతొ. ఏన్ వి యెస్.

  10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి M.V.Ramanarao అభిప్రాయం:

    05/06/2015 2:18 pm

    నాకెంత ఆసక్తి ఉన్నా ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్న ప్రముఖుల. పండితుల అభిప్రాయాలతో ఏకీభవించడం తప్ప మరేమీ చెయ్యలేను. వారంతా రాసిన వాటిని ఇంకా బాగా అద్యయనం చెయ్యాలి. ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాడకం బాగా అభివృద్ధి చెయ్యాలి. విదేశాల్లో ఉన్న తెలుగువారిలో కూడా కృషి చెయ్యాలి. ప్రభుత్వాలనుంచి వాగ్దానాలు, నామమాత్ర సహాయం తప్ప ఆశించలేము. పెద్దేత్తున ఆర్థిక సహాయం అవసరం ఉండాలి. కాని అది ఎలా సమకూడుతుందన్నది చిక్కు ప్రశ్నే. తెలుగు అంతర్జాతీయ భాష కాకపోయిన కొన్ని యూరప్, ఏసియా దేశాల భాషల్లాగ దాని అస్తిత్వాన్ని నిలబెట్టుకొంటే చాలు.