పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి G K S Raja అభిప్రాయం:

    05/12/2015 5:12 am

    శ్రీనివాస్ గారూ! రమేష్ నాయుడు గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. గత సంవత్సరం వి.ఎ.కె. రంగారావు గారిని కలిసే అదృష్టం కలిగింది. అంతగానూ మీ వ్యాసం సంతొషాన్ని కలగ చేసింది. . ధన్యవాదాలు. రాజన్ నాగేంద్ర గారి గురించి కూడా మీరు వ్యాసం వ్రాస్తే బావుంటుంది.
    gksraja.blogspot.in

  2. గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/12/2015 1:39 am

    కవిరాజమార్గంలో మహాకావ్యలక్షణాలు తెలిపే పద్యాలు ఇలా ఉన్నాయి:

    మహాకావ్యలక్షణ
    అతిశయమితిహాసోపాశ్రయం మేణ్ కథావి
    శ్రుత చతుర వికాశోత్పాదితార్థోత్కరం మే
    ణతి కుశల సులీలాచార లోకోపకారో
    దిత పరమ గుణైకోదార ధిరాధికారం 209

    పరమ సుఖ పద శ్రీ ధర్మ కామార్థ మోక్ష
    స్థిర విషయ విశేషాఖ్యాన విఖ్యాత తత్త్వం
    పుర జనపద శైలాదిత్య చంద్రోదయాస్తాం
    తర సమృగ గణ వ్యావర్ణనా నిర్ణయార్థం 210

    సముదిత కుసుమామోదోదయోద్యాన లీలా
    క్రమ విహిత జల క్రీడా వినోదాదినీతం
    ప్రమద మదన మాద్యద్యౌవనోద్యాన రామం
    రమణ రచిత గోష్ఠీ బంధ సంధి ప్రబంధం 211

    వివిధ విభవ శోభారంభ లంభ ప్రలంభో
    ద్భవ విహిత వివాహోత్సాహ సాకల్య కల్ప
    ప్రవర నృప కుమారాత్తోదయాది ప్రమోదా
    సవ సముదిత సేవారాతి వృత్తాంత వృత్తం 212

    నయ వినిమయ నానా మంత్ర దూత ప్రయాణా
    క్షయ సమయ విళాసోల్లాసి సంగ్రామికాంగం
    భయ విరహిత వీర్యౌదార్య గంభీర కార్యా
    శ్రయ విశద గుణ శ్రీ నాయకోత్కర్ష వేద్యం 213

    విళసిత సదళంకారాది సంసాధితార్థం
    కుళ విదిత పదోద్యత్ కోమళాళాప శీలం
    సుళలిత గుణ నానా వృత్త జాతి ప్రవృత్తా
    స్ఖళిత రస విశేషోపాశ్రయ శ్రీ నివేశం 214

    నయవిదుదిత యుక్తి వ్యక్తి లోక ప్రతీత్యా
    శ్రయ సకళ కళా లీలాకరాల్పోపజల్పం
    నియత సమయ సారా సాధనీయాధికారా
    న్వయ పరమ తపోనుష్ఠాననిష్ఠార్థసిద్ధం 215

    విగత మళముపాత్తారాతి సార్థార్థ వీరం
    స్థగితమమిత నానా శబ్ద వీచి ప్రపంచం
    నిగదిత గుణ రత్నైకాకరం సాగరంబోల్
    సొగయిసి ధరణీ చక్రాంబరాక్రాతమక్కుం 216

    ఇంతు మిక్క వర్ణనెగళ్
    సచితతమొందాగి పేళ్ద కావ్యం ధరెయొళ్
    సంతతి కెడదె నిల్కుమాక
    ల్పాంతబరమమోఘ వర్ష యశంబోల్ 217

    కవిరాజమార్గంలో పేర్కొన్న మహాకావ్య లక్షణాలకు దండి తన కావ్యాదర్శంలో చెప్పిన మహాకావ్య లక్షణాలు మూలాధారమని చెప్పవచ్చు:

    సర్గబన్ధో మహాకావ్యం ఉచ్యతే తస్య లక్షణమ్
    ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశో వాపి తన్ముఖమ్ 1.14

    ఇతిహాసకథోద్భూతం ఇతరద్వా సదాశ్రయమ్
    చతుర్వర్గఫలాయత్తం చతురుదాత్తనాయకమ్ 1.15

    నగరార్ణవశైలార్తుచన్ద్రార్కోదయవర్ణనైః
    ఉద్యానసలిలకృఈడామధుపానరతోత్సవైః 1.16

    విప్రలమ్భైర్వివాహైశ్చ కుమారోదయవర్ణనైః
    మన్త్రదూతప్రయాణాజినాయకాభ్యుదయైరపి 1.17

    అలంకృతం అసంక్షిప్తం రసభావనిరన్తరమ్
    సర్గైరనతివిస్తీర్ణైః శ్రవ్యవృత్తైః సుసంధిభిః 1.18

    సర్వత్ర భిన్నవృత్తాన్తైరుపేతం లోకరఞ్జనమ్
    కావ్యం కల్పాన్తరస్థాయి జాయతే సదలంకృతి 1.19

    తెలుగులో రేచన రాసిన కవిజనాశ్రయంలో కూడా మహాకావ్య లక్షణాలు ఉన్నాయా (నాకు కవిజనాశ్రయ పాఠం అందుబాటులో లేదు)? అయితే, దండి పేర్కొన్న మహాకావ్య లక్షణాలను, తెలుగు కవిజనాశ్రయంలో పేర్కొన్న లక్షణాలను, కవిరాజమార్గంలో పేర్కొన్న లక్షణాలతో పోలుస్తూ సుందరం గారు విపులంగా వచ్చే సంచికకు ఒక వ్యాసం రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  3. యద్భావం తద్భవతి గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    05/12/2015 12:30 am

    శర్మ దంతుర్తి గార్కి,
    స్పందనకు ధన్యవాదములు.
    నమస్తే.

  4. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    05/11/2015 11:01 am

    కొంతమందికి ఇది ఉపయోగపడచ్చు:
    ఓపిక ఉన్నవారు ప్రయత్నించవచ్చు 🙂

    ———————————-
    ‘జాతీయ సదస్సు’కు పత్రాలు పంపండి
    ‘జాతీయ భాషగా తెలుగు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును జూన్‌ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నాం. తెలుగు భాషా పరిరక్షణ సమితి, శ్రీవెంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థ, ఎస్‌.వి. విశ్వవిద్యాలయం, తిరుపతి, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా జాతీయ సదస్సును తిరుపతిలో నిర్వహించనున్నాయి. దేశవ్యాప్తంగా పత్రసమర్పకులు తమ పత్రాల సారాంశాన్ని సంగ్రహంగా రాసి drtsrphd@gmail.comకు పంపాలి. లేదా డా. టి. సాయిశంకర రెడ్డి, అధ్యక్షులు, తెలుగు భాషా పరిరక్షణ సమితి, కొత్తపేట, పుంగనూరు, పిన్‌ : 517247, చిత్తూరు జిల్లాకు పంపాలి. మే 25వ తేదీలోగా పంపాలి. వివరాలకు ఫోన్‌ : 9441633845, 8790518092లో సంప్రదించాలి. తెలుగు భాషకు జాతీయ భాషగా చలామణి కావడానికున్న అర్హతలు, సామాజిక, చారిత్రక, భాషా, సాహిత్య, సంస్కృతీ సంబంధ నేపథ్యాలను వివరిస్తూ పత్రాలు రాయాలి. పూర్తి పత్రాలను పోస్టు ద్వారా పంపవచ్చు లేదా జాతీయ సదస్సులో నేరుగా సమర్పించవచ్చు. పత్ర సమర్పకులు రూ. 400, విద్యార్థులకైతే రూ. 200 ప్రవేశరుసుము చెల్లించాలి.
    – తెలుగుభాషా పరిరక్షణ సమితి

  5. యద్భావం తద్భవతి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/11/2015 8:13 am

    దేవరకొండ శర్మ గారికి: సాధారణంగా భాగవతంలో ఒక కధ ఐపోయేక దానికి సంబంధించిన ఫలశృతి, పాతకాలంలో/క్రితం జన్మలో ఏదో జరిగితే ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో రాస్తారు. ఉదాహరణకి గజేంద్రమోక్షంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్యుల వారి శాపానికి గురై గజరూపంలో పుట్టడం, తర్వాత మొసలి చేత పట్టుబడడం అవీను. కానీ నేను చదివినంత మటుక్కు ఈ విషయంలో (రజకుడు, త్రివక్ర) రామాయణ కాలానికి ఎక్కడా సంబంధం చూపించలేదు. మరి ఈ విషయం నేను చదివిన పోతన భాగవతంలో (తి.తి.దే వారి ప్రచురణ) లేదేమో. వ్యాస భాగవతం చదివి అర్ధం చేసుకోవడానికి అనేకానేక అడ్డంకులున్నాయి నాకు. మరి అందులో ఏమి రాశారో? ధన్యవాదములు.

  6. వాన – గులాబీ – పాము గురించి Vijay Kumar అభిప్రాయం:

    05/11/2015 6:03 am

    Very interesting one !

  7. ఈమాట మే 2015 సంచికకు స్వాగతం! గురించి seshakumarkv అభిప్రాయం:

    05/10/2015 6:47 am

    ముందుమాటలో VEDIC VOICES: ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  8. గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం గురించి తఃతః అభిప్రాయం:

    05/09/2015 9:03 pm

    నమస్కారాలు సుందరం గారూ! శ్రీవిజయుణ్ణి, ఆయన లక్షణ గ్రంథాన్ని చక్కగా పరిచయం చేశారు అందరికీ తేలిగ్గా అర్థమయ్యే రీతిలో.

    లైలా గారూ! మంచి సందేహం. మీరడిగిన దానికి శ్రీ సుందరం గారి సమాధానం కోసం యెదురు చూస్తున్నాను.

    నమస్కారాలతో -తఃతః

  9. చేతన చేసిన పని గురించి దేశికాచారి అభిప్రాయం:

    05/09/2015 11:15 am

    ఈకథలోని భాషను చూస్తుంటే ఇది తెలుగు అంతర్జాలపత్రికలో ఎందుకు ప్రచురింపబడిందో అర్థం కావడం లేదు. దీనిని ఒక ఇంగ్లీషుపత్రికలో వేసినా సరిపోయేట్టుగా ఉంది. తెలుగు అంతర్జాలపత్రికకంటే అదే దీనికి సరియైన స్థాన మని నాకు తోస్తున్నది.

  10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Bhaskar అభిప్రాయం:

    05/09/2015 10:51 am

    భాష అంతర్జాతీయమా కాదా అన్నది అంత ముఖ్యం కాదు. అది జీవభాషగా నిలుస్తోందా లేదా అన్నది ముఖ్యం. దానికై చేయబడుతున్న కృషి గురించి చర్చించలేదు.
    ఉదాహరణకి సిలికానాంధ్రా మనబడి, పలు దేవాలయాల్లో, సాంస్కృతిక కేంద్రాల్లో ఎందరో శ్రమకోర్చి నడిపే తెలుగు బడులు కృషి ఎత్తిచెప్పబడలేదు.
    ఇక్కడ విశ్వ విద్యాలయాల్లో నాలుగు “కుర్చీలు”, పత్రికలు నడిపి నాలుగు తెలుగులో శాస్త్రీయ వ్యాసాలూ వ్రాస్తే తెలుగు అంతర్జాతీయ భాష అయితే చప్పట్లు కొట్టుకుంటే సుఖమేమిటి? ప్రజలు మాట్లాడాలి.

    ప్రజలు మాట్లాడాలంటే, చిన్నప్పటినుంచీ నేర్చుకోవాలి. తెలుగునాట బడుల్లో నేర్పాలి. ఇక్కడ కూడా బడిలో ఒక పాఠ్యాంశంగా నేర్చుకునే అవకాశం ఉండాలి.
    ఈ దిశలో ఒక ప్రయత్నాన్ని ఈ లింక్ లో చూసి హర్షించండి.
    http://www.andhrajyothy.com/Artical.aspx?SID=107888&SupID=42

    ఈ వ్యాసంలో సూచించినవి తెలుగు ఒకస్థాయికి చేరుకున్న తర్వాత జరవలసినవి. ఇవే సమస్యకి పరిష్కారాలు కావని నా అభిప్రాయం.
    తెలుగులో సాంకేతిక సమాచార ప్రచారం గురించి చెప్పేవారికి విన్నపం.
    నేను బి యస్సీ వరకూ తెలుగులోనే చదివా. ఎం ఎస్సీకి వచ్చి నానాపాట్లూపడ్డా.
    నాలాంటివాళ్ళు కొన్నివేల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు (ఒక 45 సంవత్సరాలుగా చదివిన వాళ్ళు.)

    సాంకేతిక విషయాలు చెప్పేందుకు ఒక నిర్దిష్టమైన పదజాలం కావాలి.తెలుగు అకాడమీ దాన్ని 10,15 సంవత్సరాల్లో తయారు చేసింది. అయినా ఎవరిష్టం వారిదన్నట్టు వ్రాస్తున్నారు. అంతవరకూ ఎందుకు? ఈ ఈమాటలోనే అనుకుంటా, ఒకాయన ఒకవ్యాసం వ్రాసారు. గొప్ప వ్యాసమే, కాని ఆయన స్వంత పరిభాషలో. ఏంచెప్తున్నారో తెల్సుకునే సరికే కష్టమైంది. నాలా తెలుగులో శాస్త్రాలు చదివినవాడికి, ఈ పునశ్చక్ర పరిశోధన దేనికి అనిపిస్తుంది. ప్రభుత్వం అది చెయ్యాలి, ఇది చెయ్యలని ప్రతిపాదించడమే కాని, ఇలా ఉన్నదాన్ని కూడా వాడుకోలేని పరిస్థితి మనది.

    ఈ శీర్షికలో స్పందించే అందరికీ తెలుగుపట్ల అభిమానముంది. కాబట్టి మన అందరి శక్తినీ ఒక ఉపయోగకరమైన దిశగా తిప్పుకోవాలి.
    చివరిగా ఒక ప్రశ్న: దీన్ని ఒక వ్యాసంగా కాకుండా, అతిథిసంపాదకీయం అనడంలో ఉద్దేశ్యమేమిటో అర్ధం కాలేదు.