పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    10/04/2015 8:51 am

    పూజ్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
    ప్రణామములతో,

    మీ అనుమోదం ఎల్లకాలం నాపై కురిసే చల్లని దీవెనల పెల్లు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    10/04/2015 8:49 am

    మాన్య శ్రీమతి లక్ష్మీదేవి గారికి
    నమస్కారములతో,

    వర్ధమాన శబ్దవ్యపదేశం వామనమూర్తి ఉత్తరోత్తరవృద్ధికి, అలంకారాభిధేయానికి సంసూచకమన్న వాక్యం మీ రసజ్ఞతకు పరిచాయకంగా ఉన్నది. వ్యాసాన్ని ముద్రించేటప్పుడు మీ అనుమతితో దీనిని వినియోగించికొంటాను.

    ఉదాహృతశ్లోకం జయరథునిదేనా? లేక, తత్పూర్వులదా? అన్న విచికిత్సకు సమాధేయమేమిటో తోచక నేను త్వరితగతిని కూర్చిన వ్యాసంలో ఆ ప్రసక్తిని చేయలేకపోయాను. జయరథుడు చెప్పలేదు. కొంత స్తిమితంగా పరిశీలించి, దీని కర్తృత్వాన్ని గురించి నాకేమైనా సమాచారం లభిస్తే విన్నవించికొంటాను.

    మీ సహృదయానికి ధన్యవాదాలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  3. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    10/04/2015 8:43 am

    పూజ్యులు శ్రీ గంటి లక్ష్మీనారాయణమూర్తి గారికి
    నమస్కారములతో,

    మీరు ప్రతాపరుద్రయశోభూషణమును ప్రస్తావించినది చూసి, మళ్ళీ ఒకసారి సారోల్లేఖముల వర్ణనలకై అన్వేషింపగా – మనకు అలంకార శాస్త్రవాఙ్మయచరిత్ర వెలువడినంతగా సర్వాలంకారముల యొక్క సర్వాంతర్వర్తనీయమైన చరిత్ర వెలువడలేదని అనిపించింది. విశ్వవిద్యాలయాలు, కొంతమంది ఆచార్యులు పూనుకొని అధ్యాయక్రమానుసారం పరిశోధకులచే రచింపజేస్తే అయిదారు సంవత్సరాలలో సాహిత్యంలో ఒక లోటు పరిపూర్ణింపబడినట్లవుతుందని తోచింది.

    విద్వదముష్యాయణులైన మీ ఔదార్యపూర్ణవాక్యావళికి మనఃపూర్వక ధన్యవాదములను విన్నవించికొంటున్నాను.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  4. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి ఈ వ్యాస రచయితలు అభిప్రాయం:

    10/03/2015 7:15 pm

    మేం రాసిన వ్యాసం మీద రకరకాలుగా స్పందించిన వారందరికీ మా నమస్కారాలు. మా వ్యాసంలో మేం ప్రధానంగా ప్రస్తావించిన విషయం ఈ ఉత్తరాలు రాసినవారందిరిలో ఇద్దరో, ముగ్గురో గుర్తించారు. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. తెలుగు ప్రచురణలో ఒక సంప్రదాయం ఏర్పడాలన్నా, ఒక ప్రామాణికత రావాలన్నా సంస్ఠలే పూనుకోవాలి. తెలుగులో ఇలాంటి సంస్థలు మూడు. లాభాపేక్షలేకుండా పనిచేసే తిరుపతి దేవస్థానం, తెలుగు సాహిత్య ఎకాడమీ, లాభాపేక్షతో పనిచేసే విశాలాంధ్ర, ఈ మూడింటిని సంస్థలుగా ఏర్పడిన ప్రచురణ కర్తలుగా మేం గమనించి వాళ్ళ ప్రచురణల గురించి చర్చించాం.

    స్టైల్ మాన్యువల్ గురించి కొంతమంది మాట్లాడారు. స్టైల్ మాన్యువల్ ఒకరు ఏర్పరిచి బయటపెట్టినంత మాత్రాన అందరూ దాన్ని ఆమోదించరు, అలాటి ఆమోదానికి కూడా పెద్ద సంస్థల తోడ్పాటు కావాలి.

    సంస్థలుగా ఏర్పడబోతున్న ప్రచురణకర్తలు మనకి లేకపోలేదు. అటువంటి ప్రయత్నాలు కొన్నింటిని ఈ వ్యాసంలో మేం ప్రస్తావించాం, ఇటువంటి ప్రయత్నాలు మరెందరో కూడా చేస్తున్నారు. కాని అవన్నీ ఇప్పటివరకూ ఒక వ్యక్తి బలంవల్ల నడుస్తున్నవి. అవి సంస్థలుగా ఎదగడానికి ఇంకా కొంత కాలం పడుతుంది.

    వ్యాసంలో ఉన్న ప్రధాన విషయాన్ని ఆలోచనాత్మకంగా పొడిగించడానికి పనికొచ్చే ఉత్తరాల కోసం ఎదురుచూస్తాం. నమస్కారాలు.

  5. మిగారమాత గురించి ayyavaru అభిప్రాయం:

    10/01/2015 4:41 pm

    మీ కధలో బుధ్ధుడి నోట కర్మ సిద్ధాంతం ప్రతిపాదింప చేశారు. అది బౌధ్ధం కి విరుధ్ధం అనుకుంటా? లేదా నేను అనుకునేది తప్పు కావచ్చు.

  6. పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి vijaya kumar అభిప్రాయం:

    10/01/2015 12:14 pm

    కవి ఇష్టం …..నీకు నాకు ఎందుకు? ఆయన్ను విమర్శించే స్థాయికి మీరు రాగలరా?నచ్చితే….ఓకే లేకపోతే….ఒదిలేయ్….ఏ పరిస్థితిలో రాశారో?

  7. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/26/2015 11:25 pm

    “ప్రస్తుతం గ్రంథాలయోద్యమం స్పూర్తి సన్నగిల్లి, మంచి సాహిత్యం, నవలలు వెలువడక, టీవీ ప్రభావం వల్లా తెలుగు ప్రచురణ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ నేటి పాఠకులు అవసరాల మేరకు కాల్పనికేతర సాహిత్యం ప్రచురిస్తున్న సంస్థల పరిస్థితి మాత్రం చాలా బాగుంది.”
    ~ నవోదయ రామమోహనరావు, నవభారత్ ప్రకాశరావు.
    http://pustakam.net/?p=2808

    తెనాలి,విజయవాడ,మచిలీపట్నం,ఏలూరు,కర్నూలు,మద్రాసులలోని పుస్తక ప్రచురణ ప్రెస్సులూ, హైద్రాబాదులోని అత్యాధునిక సౌకర్యాలు కల కళాజ్యొతి ప్రెస్సు,చరితా ప్రెస్సు, చిత్తూరు పలమనేరు లోని నాయని కృష్ణమూర్తి గారి ప్రెస్సులలో గల సౌకర్యాల గురించి కూడా యీ సందర్భంలో ముచ్చడించవచ్చు.

  8. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/26/2015 12:15 pm

    తెలుగు పుస్తక ప్రచురణల ద్వారా సమాజానికి వెలకట్టలేని సేవలందించిన ఎమెస్కో, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయా, పర్స్ పెక్టివ్స్, హైద్రాబాదు బుక్ ట్రస్ట్ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు – పర్స్ పెక్టివ్స్ RK, కధ వాసిరెడ్ది నవీన్, పాపినేని శివశంకర్, ‘మనసు’ మన్నం రాయుడు, వాసిరెడ్డి వేణుగోపాల్, పాలపిట్ట గుడిపాటి, నండూరి పార్థసారథి ప్రభృతులను యీ సందర్భంలో అభినందించాలి.

    ఇంటింటా గ్రంధాలయం, పిల్లలలో పుస్తక పఠనానుసక్తిని ప్రోత్సహించటము పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి.

    “రష్యన్ పుస్తకాలు చాలా అద్భుతమైన బైండింగ్ లో చక్కటి పేపరు మీద చూడ ముచ్చటి బొమ్మలతో 1970లలో ప్రచురణ జరిగింది. ఆ ప్రచురణా స్టాండర్డ్స్ కాపీ కొట్టినా చాలు, మన తెలుగు పుస్తక ప్రచురణ నాణ్యం పెరుగుతుందని నా అభిప్రాయం “ అన్న కప్పగంతుల శివరామప్రసాదు గారి మాటల్లో ఎంతో నిజం ఉంది.

    పత్రిక, టీవీ, సినిమా, వ్యాపార రంగంలోని ప్రముఖుల సాయం పొందటం ద్వారా కూడా తెలుగు ప్రచురణని మరో మెట్టుకి పెంచవచ్చు అనుకుంటా.

    Indian publishing is a Rs 10,000 crore business ( with school book market Rs. 3,500 Crore, higher education book Rs. 2,500 Crore, trade book market worth Rs. 4,000 Crore, of which the English language segment may be worth about Rs. 2,400 Crore).

    The per capita number of book titles published in India is around 8 per 100,000 population. This number is much lower in comparison to those of the countries like the UK, US, France and Germany. In terms of languages, the per capita number of titles published per 100,000 persons is English (23), Tamil (11), Malayalam (8.7), Marathi (6.9), Bengali (6.3) and Gujarati (6.2) are all higher than Hindi at 5. Kannada (4.8) is higher than Telugu (4.2) and Urdu (3.9). In the US, the growth in per capita book title output increased from 7.6 per 100,000 people in 1950 to 43.2 per 100,000 in 2000.

  9. టూఎయిటీన్ డీ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/26/2015 11:06 am

    పర్స్పెక్టివ్స్, హైద్రాబాదు వారు ప్రచురించిన ‘త్రిపుర కధలు’ మూడో ముద్రణ లోని ‘హోటల్లో’ అనే కధ అది. కినిగే సంస్థ వారి క్రింద ఇచ్చిన లింకు ద్వారా ప్రింటు కాపీ కాని, e-పుస్తకం కాని చెప్పించుకునే సౌకర్యం కలదు.
    http://kinige.com/book/tripura+kathalu+print+book.

    ప్రతిభావంతురాలైన కవయిత్రి, రచయిత్రి, త్రిపుర గారి వీరాభిమాని అయిన స్వాతికుమారి గారు కధా విషయం, విషయ పరిధి మీద ఇంకొంచం శ్రద్ద పెట్టలేదేమో అనే దుగ్ధతో; త్రిపుర గారి ‘హోటల్లో’ కధలోని అంతర్వాహిని లాంటి మానవత్వపు తడిచెమ్మ ( ‘గుడిసెలోని తన కొడుకు సివంచెలంకి మందెవరు తెస్తారు’ అని ఖాళీ కళ్లతో చూస్తున్న రాములు గురించిన సృహ; ‘వెధవ కమ్యూనిస్టులతో చేరి జండాలు అవీ పట్టుకు తిరుగుతూ అల్లరి పెడుతున్నాడు ధర్డ్ ఫెలో’ ఆకాలమే వేరు అంటున్న తండ్రి గురించిన సృహ ) యీ కధలో కనబడక కసితో అలా అవాకులూ చవాకులూ రాసాను. రచయిత్రి మన్నింపు దృష్ఠితో మిన్నకున్నారు. యీ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

  10. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/25/2015 9:14 am

    హృదిమై బమ్మెర పోతనార్యు గవితారీతిం బ్రపంచించు న
    స్మదపక్వార్థఫలమ్ము నర్చయిడఁగా స్వాదుత్వ మింపారు స్వాం
    తదయావ్యక్తినిఁ బ్రీతిదాయ మిడు చింతా రామకృష్ణార్య! శా
    రద మీ రూపముగా గ్రహించితి నఖర్వాశీర్హరిద్రాక్షతల్!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు