పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ గురించి Lakshmi Priya అభిప్రాయం:

    12/22/2015 6:16 am

    Very rare and invaluable archival treasure. Many thanx for this . I laud the efforts of the ppl on this site and those individuals like Sreenivasgaru responsible for bringing this and other treasures to us. Best wishes and Regds.

  2. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    12/22/2015 5:22 am

    నా అభ్యర్థనని మన్నించిన అశ్మాచంగారికి ధన్యవాదాలు. అయితే, “అండు కో” లో నన్ను కలపడమే కాకుండా, దానికి నన్నే ప్రథముణ్ణి చేసి “కామేశ్వరరావు & కో” అని సంబోధించడం కొండంత ఆశ్చర్యాన్నీ, కాస్తంత చీకాకునీ కలిగించింది. అతిశయోక్తులవల్ల వచ్చే యిబ్బందే యిది! అది అలా పక్కన పెట్టి, ఆయన లైలాగారి వ్యాఖ్యల్లోంచి తీసి చూపించిన రెండు పాయింట్ల గురించి నా ఆలోచనలివి:

    మోహనగారు: గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది.
    లైలాగారు: I disagree with you…..notes run into one another, musical thought does not break at measures, it over flows…..What does music have to do with sentences? …You are overthinking chandassu

    నేను: ఇక్కడ మోహనగారు చెపుతున్నదీ, లైలాగారు చెపుతున్నదీ వేరువేరు విషయాలని నా భావన. సంగీతం అంటే కేవలం స్వరమూ రాగమే కాదు కదా. లయ, తాళాలు కూడా సంగీతానికి అంగాలే. మోహనగారు చెపుతున్నది లయ గురించి, లైలాగారు చెపుతున్నది రాగం గురించీను అనిపిస్తోంది. జానపదగేయాలకి రాగం కన్నా లయే ప్రధానం. వాటిలో లయకి తగ్గట్టుగానే వాక్యాలు సాగుతాయి, విరుగుతాయి. ఇక్కడ మోహనగారు ప్రస్తావించినది అలాంటి లయ ప్రధానమైన గేయాల గురించే. ఎందుకంటే ఛందస్సు, మరీ ముఖ్యంగా మాత్రాఛందస్సు లయకి సంబంధించినది తప్ప రాగానికి సంబంధించినది కాదు.

    లైలాగారు: ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను,display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?

    నేను: లైలాగారు అలా అర్థం చేసుకొన్నారు తప్ప, మోహనగారు చెప్పిన దానిలో ఆ అర్థం లేదు. మోహనగారు అన్నది “‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు.” “78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు.”
    ఇందులో శ్రీశ్రీ ఛందశ్శాస్త్రానికి లక్ష్యగ్రంథంగా తన కవిత్వాన్ని సృష్టించాడన్న అర్థం ఎక్కడుంది? శ్రీశ్రీ తెలిసి రాసినా, తెలియక రాసినా, కావాలని రాసినా రాయకపోయినా, అతని కవితల్లో మాత్రాఛందస్సు విస్పష్టంగా కనిపిస్తోంది. మోహనగారు వివరించి చూపించినది అదే. ఇందులో మోహనగారి “ఊహ” అంటూ ఏదీ లేదు. “(అ)త్త సొమ్ము (అ)ల్లుడు దానం”, “అ(త్త) మీద కోపం దు(త్త)మీద చూపించినట్టు” యిలా అధికశాతం తెలుగు సామెతలలో యతి/ప్రాసయతి కనిపిస్తుంది అంటే – దాని అర్థం ఆ సామెతలు పుట్టించిన వాళ్ళు అనంతుని ఛందస్సునో సులక్షణసారాన్నో చదువుకొని, అందులో యతి/ప్రాసయతులన్నిటికీ లక్ష్యాలుగా ఆ సామెతలను ఏర్పరిచారని కాదు అర్థం. తెలుగుసామెతల్లో ఎక్కువగా యతి/ప్రాసయతి కనిపిస్తుంది అన్నది ఒక ఊహా కాదు. అది ఒక observation. మోహనగారు ఈ వ్యాసంలో నిరూపించబూనినది కూడా అలాంటిదే.
    మరొక విషయం – శ్రీశ్రీ వద్దు మొర్రో అన్న ఛందస్సు మార్గ కవిత్వంలో కనిపించే వృత్త పద్యాలకి సంబంధించిన ఛందస్సు అనీ, మాత్రాఛందస్సుపై శ్రీశ్రీకి అమితమైన గౌరవమూ, అభినివేశమూ కూడా ఉన్నాయనీ (కనీసం మహాప్రస్థానం రాసే కాలానికి), శ్రీశ్రీ వచన సాహిత్యం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. మాత్రాఛందస్సు విషయమై గురజాడనుండి శ్రీశ్రీ ఎలా స్ఫూర్తిపొందిందీ తెలియజేసే కొన్ని శ్రీశ్రీ మాటలు పై వ్యాఖ్యలలో చూడగలరు.

  3. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    12/21/2015 9:33 pm

    కొన్ని అక్షరాలు చేరితే పదములవుతాయి. కొన్ని పదములు చేరితే వాక్య మవుతుంది. కొన్ని వాక్యములు చేరితే ఒక paragraph అవుతుంది. అదే విధముగా సంగీతములో కొన్ని స్వరములు చేరితే స్వరపదములు అవుతాయి, ఆ స్వరపదములు కొన్ని చేరితే musical phrase అవుతుంది. స్వర పదముల మధ్య కాని, స్వరపదముల సముదాయముల మధ్య కాని ఒక విరామము (pause) ఉంటుంది. ఈ విరామము అన్ని విధములైన సంగీత శాఖలలో ఉంటుంది. సంగీతములో ఈ విరామము ఛందస్సులోని పదచ్ఛేదయతి వంటిది. ఉదాహరణముగా – తనతననా తనతననా తనతననా తానాతానా తనతననా అని ఉంటే దానికి బదులు సరిగరిగా సరిగరిగా సరిగరిగా సారీసారీ సరిగరిగా అని పాటలో ఉంచుకొనవచ్చును. అప్పుడు వీటి మధ్య విరామము ఉంటుంది. పదములు వీటికి సరిపోయినట్లుగా ఉండకపోతే వినడానికి బాగుండదనే నా ఉద్దేశము. ఒక భాషా-పదము రెండు సంగీతస్వరపదముల మధ్య వ్రేలాడుతూ ఉంటే దానిని ఉచ్చరింఛి రంజింప చేయుట కష్టమే. అందుకే పదచ్ఛేదయతి, పాదాంతయతి గేయములలో అత్యవసరము.

    “పాయింటు ఒకటిన్నర రాగం, బిళహరి తాళం, ఇంద్రవజ్ర గతి”

    ఇంద్రవజ్రగతి అన్నది serious గానా లేక అశ్మాచంగారి వేళాకోళమా? వారి కామెంటులు చదువుతూ ఉంటే నా బుఱ్ఱకు ఏది హాస్యమో కాదో అన్నది తెలియకుండా ఉన్నది. I am humor impaired, you see! ఇంద్రవజ్రకు ఒక గతి ఉన్నది. ఐదుమాత్రలు, నాలుగు మాత్రలు, ఐదు మాత్రలు, నాలుగు మాత్రలు –
    మాణిక్య | వీణాం | ఉపలాల | యంతీం. ఈ 5,4,5,4 గతి ఖండజాతి త్రిపుట తాళానికి సరిపోతుంది, ఉదా. ఓ బాటసారీ నను మఱువకోయీ.

    “పోనీలే రచయిత గారు చాంతాడంత కామెంటులో చిటికెడంతముక్క నా అభిప్రాయం అని కనీసం చెప్పినారు.”

    అందులోని నిజానిజాలను విమర్శించి ఉంటే సంతోషపడి ఉండేవాడిని. ఏదో చాంతాడు, నైలాన్ తాడు, అని అంటే ఏమి అర్థమవుతుంది?

    “ఇక ఈ వ్యాసానికి మీకు నాకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం ఆనందార్ణేభ్య: అర్ణవమస్తు నిత్యం ఈమాటా: సమస్తా సుఖినోభవంతు!”

    ఇలా వ్యాసాన్ని అపహసించకుండా స్వంత పేరుతో my dear friend శ్రీమతి లైలావలె వ్రాస్తే బాగుంటుంది కదా? Let us meet next time, lailA gAru!

    విధేయుడు – మోహన

  4. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి ALLAMARAJU CHAKRAPANI అభిప్రాయం:

    12/21/2015 8:04 am

    Dear sir,

    I am common man and not having scientific qualification but had interest in science.

    The article is superb written by sri vemuri.

    His opinion to select Telugu words for scientific words also to be appreciable.

    But what i was felt upset was after reading the opinion of Mr Ravi kiran was that he has wrong and low opinion about Hindu vedanta and AS ILLOGICAL and also usage of technical terms in Telugu.Of course definitely
    he has right to air his views.

    Our bad luck is that they were very secretive and believed to be informative if explored with Linguists and scientists and who has authority over them. If people like vemuri and others DE-codify these TEXTS worthwhile information may come out.

    Regards
    Chakrapani.

  5. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/20/2015 1:28 am

    కామేశ్వరరావు గారు

    పండితుడిని కాను అని మీరెంత గింజుకున్ననూ ఆ మాట, ఆ వాదమూ చెల్లదు. మీరు ఖచ్చితముగా పండితులే. ఈ పత్రికలోని మీ వ్యాసమొక్కటి చదివిన చాలును. మీరు పండితులో సామాన్యులో తోలొలిచిన అరటిపండు వలె విచ్చితెరచుకొనును. సరే అది అలా ఉండనిండు.

    మీరడిగిన పాయింట్ల సెక్షను చూస్తూ ఉంటే మీరు లెక్కల మాష్టారులా ఉన్నారు. అతిశయోక్తి పాయింటు పొలో నుంచి అలంకారం పాయింటు అలో దాకా లంబకోణం సరిగ్గా గియ్యలేకపోతే మీరో మెట్టు కిందకు, నా స్థాయినకు దిగవలసి వచ్చునో ఏమోనని భయము భయంకరముగా పీడించుచున్నది. సరే! నిండా మునిగినాక నీళ్ళైనా ఒకటే పేడైనా ఒకటే. చల్లుకుందాం రండి.

    మీరు పైనుంచి ఓ సారి మళ్ళీ అన్ని కామెంట్లు చదివి సారం తీసుకోండి. కొంత సారం (సార, కుదరకపోతే రం) నేనివ్వటానికి ప్రయత్నిస్తా, మీక్కావల్సింది మీరు పుచ్చుకోండి. ఇదిగో!

    పాయింటు ఒకటిన్నర రాగం, బిళహరి తాళం, ఇంద్రవజ్ర గతి

    మోహనరావు: గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది

    లైలా: I disagree with you…..notes run into one another, musical thought does not break at measures, it over flows…..What does music have to do with sentences? …You are overthinking chandassu

    కామేశ్వరరావు & కో: good taste is essentially a moral quality.

    అశ్మాచం [లోపల్లోపల]: ఛా!

    మోహనరావు: పదములను సరిగా విడదీసి పదచ్ఛేద, పాదాంత యతులను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుంది.అది నా వ్యక్తిగతమైన అభిప్రాయము…. ఇంతకుముందు ఏ ఛందోగ్రంథములో వివరించబడని క్రొత్త నడకను మాలికావృత్తములకు నిరూపించగా, వాటినిగుఱించి ఒక్క ముక్క కూడ ఎవ్వరు వ్రాయకుండుటను గమనిస్తే ఇట్టి పరిశోధనలు అవసరమేనా అనే భావము కలుగుతుంది.

    అశ్మాచం [లోపల్లోపల]: హమ్మయ్య. పోనీలే రచయిత గారు చాంతాడంత కామెంటులో చిటికెడంతముక్క నా అభిప్రాయం అని కనీసం చెప్పినారు.

    కామేశ్వరరావు & కో: అనుభూతి” “అభిరుచి” కి ఎంత దూరం ?

    అశ్మాచం [లోపల్లోపల]: భూతి నుంచి భవభూతి దాకా, పాచి నుంచి పావ్ భాజీ దాకా అనుకుంటా

    కామేశ్వరరావు & కో: Personally, I believe what you are experimenting in prosody is extremely important. Of course, there are always a few people (no personal accusation intended, please!)who might think it is a worthless pursuit. Do you remember what Chalam said to the guy who wondered about looking at “sandhya?”in his preface to SriSri?

    అశ్మాచం [లోపల్లోపల] : What the heck was the argument and where did it begin and what in the world are these answers! Darn! లంబకోణం గురితప్పటమ్మొదలురా అశ్మిగా! లైలాగారడిగిన “ఓవరుఫ్లోకు” సమాధానం చెప్పలేని దాటవేత. రచయిత ఒక మూలగా అర ముక్కలో నా అభిప్రాయము అని చెప్పి తప్పించుకొనె కానీ, ఓవరుఫ్లోకు సమాధానము ఇల్లె. నిజసత్యముగా సమాధానము పూరిల్లె.

    లైలా: శ్రీశ్రీ – ఈ ఛందస్సు 325 విధాలుగా రాయవచ్చని తెలిసి, అన్నీ రాసుకుని, అందులో 78 ఎంచుకొని, ఎక్కడ ఏవి వాడాలో అన్న పరిజ్ఞానంతో, సరిగా అక్కడ అవి వాడినాడని అర్థం వస్తుంది. మీ ఉద్దేశం అదేనా? రకరకాల ఛందస్సులను,display చెయ్యటానికి, శ్రీశ్రీ తన కవిత్వం రాసాడా? ఛందస్సు వద్దు మొర్రో, నాకు నిబంధనలు వద్దంటున్న శ్రీశ్రీ అలాటి పని ఎందుకు చేస్తాడు? అది మీకు నచ్చిన ఊహ. ఆ ఊహను అతని ఛందోపరిజ్ఞానంగా గాని, అతని అభిలాషగా గాని రాయటం, అది true finding ఎలా అవుతుంది? అది మీరు ఎలా నిరూపిస్తారు? నేను ఈ విషయం నిరూపించి చూపాను, అని వ్యాసంలో మీరంటే, శ్రీశ్రీ పరంగా అది సరి ఎలా అవుతుంది? అతని గురించిన అతని మాటలనే ఖాతరు చేసుకోటం లేదే మీరు? ఎవరి మాటల ఆధారంగా ఏమి నిరూపిస్తారు?

    అశ్మాచం [లోపల్లోపల]: ఒకే ఒక్క ఓవరుఫ్లోకే సమాధానం లేనిది, ఇన్ని ప్రశ్నలేస్తే చచ్చింది గొర్రె, ఎక్కింది బర్రె అవుతుందేమో! చూద్దాం!

    సరే ఇలా యోజనసహస్రమైన కామెంటు రాసే ఓపిక లేదు కానీ కామేశ్వరరావు గారు – ఇక ఇక్కడినుంచి ఇదే లెక్కన మిగిలిన కామెంట్లలోని ప్రశ్నలు సమాధానాలు పండితులైన మీరు అందుకొని అల్లుకుపోవచ్చు.

    సమాధానం కుదిరితే లంబం తప్పని అశ్మాచం
    సమాధానం కుదిరకపోతే లంబం తప్పిన అశ్మాచం

    అటైనా ఇటైనా అశ్మాచమే! మృత్తికాచమే!

    ఇక ఈ వ్యాసానికి మీకు నాకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం ఆనందార్ణేభ్య: అర్ణవమస్తు నిత్యం ఈమాటా: సమస్తా సుఖినోభవంతు!

  6. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    12/18/2015 8:27 am

    శ్రీ వారణాసి సుందరరామయ్య గారికి
    నమస్కారములతో,

    అది శ్రీనాథుని చాటువు కాదండి. దాసు శ్రీరాములు గారి ‘తెలుగునాఁడు’ కావ్యం ‘బ్రాహ్మణప్రశంస’ అధ్యాయంలోనిది.

    నీళ్ళకు, నిఱ్ఱిత్రోళ్ళకును, నేతికరుళ్ళకు, దొడ్డయుత్తరేణ్
    వేళ్ళకు, దర్భముళ్ళకును, వేదపు నోళ్ళకు, సన్నకుట్టు వి
    స్తళ్ళకు, రావిపేళ్ళ కనిశంబును మళ్ళకు, పప్పుగూర ప
    చ్చళ్ళకు, రాగిబిళ్ళకును సంతస మందుదు రాంధ్రవైదికుల్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    12/18/2015 6:29 am

    అశ్మాచంగారు నా గురించి చెప్పినది నూరుపాళ్ళూ నిజమే. లైలాగారి వ్యాఖ్యలలో, నాకు ఆసక్తి కలిగించినవి, కొద్దిమాత్రంగా తెలిసున్నవి, అయిన విషయాలకు నేను స్పందించాను. దానితో పాటుగా, ఈ వ్యాసంలో విషయానికి కాస్తోకూస్తో సంబంధం ఉన్న విషయాలు అవి మాత్రమే అని నాకు అనిపించడం కూడా నా స్పందనకు కారణం.

    అసలు ప్రశ్నలు వదిలి వేసి, సరియైన సమాధానము చెప్పక తప్పించుకొను పండితులూ ఉండినారు, ఉన్నారు, ఉంటారు.

    నేను పండితుణ్ణి కాదు కాబట్టి నాకిది వర్తించదు. కానీ ఒక సాధారణ పాఠకునిగా ఆ “అసలు” ప్రశ్నలు ఏమిటో, వాటికీ ఈ వ్యాసానికీ ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం నాకుంది. వాటిని నాకోసం అతిశయోక్త్యాది అలంకారాలను పక్కన పెట్టి, మామూలు భాషలో, పాయింటు వారీగా ఇక్కడ చెప్పమని అశ్మాచంగారిని అభ్యర్థిస్తున్నాను. అన్ని పాయింట్లూ అవసరం లేదు, ఈ వ్యాస విషయంతో నేరుగా సంబంధం ఉన్నవి మాత్రం చెపితే చాలు.

  8. ప్రేమ ఎంత మధురం! గురించి G B Sastry అభిప్రాయం:

    12/15/2015 7:05 am

    ఇదే తీరులొ ఒకర్ని పెళ్ళాడి, యు ఎస్ లొ ఉన్న తనకిష్టమైన వాని దగ్గరకు చేరడానికి ఆ పెళ్ళిని వాడుకున్న నేటి విలువలని చాటి చెప్పిన సంఘటనని దగ్గరలో చూసి నివ్వేర పోయాను. ఇలా కూడా చేయగలరని తెలుసుకున్నాను అది ప్రేమ కాదు మనుషులలో మితిమీరుతున్న విలువలలేమికి అవధులు లేని స్వార్ధానికి తార్కాణమని ఇలాటివారివల్ల నలిగిపోతున్న మీకధలోని అమాయక అబ్బాయి/అమ్మాయిలాంటివారికి నా సానుభూతి అందించుకున్నాను. చక్కగ కధని చెప్పరు

  9. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తః తః అభిప్రాయం:

    12/10/2015 11:58 pm

    శ్రీ మోహన: మౌలికంగా సాహిత్య ప్రయోజనం ఆశించి చేసిన రచన పాడుకోవటానికి వీలుగా లేదని వెలగట్టటం ఎబ్బెట్టు గా తోస్తుంది . ఒక శ్లోక లో ఏదైనా పాదం చివర పదాన్ని విరవకుడా ముగిసినప్పటికీ , ఆ పాదం దగ్గర ఆపి చదివితే / పాడితే అర్థవంతంగా ఉండని సందర్భాలూ కనపడతాయి. ఊదా: ( భారత రత్న సుబ్బులక్ష్మి స్వరం లో )
    “(……. …………….జన్మ సంసార బంధనాత్ )
    విముచ్యతే నమస్తస్మై నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే!
    నమస్కారాల తో
    తః తః

  10. చెట్టు నా ఆదర్శం గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/10/2015 5:03 pm

    ఇస్మాయిలూ! ఇస్మాయిలూ!
    ఏం రాశిపెట్టినావయ్యా!
    ఏం రాశి పోసిపెట్టినావయ్యా!
    ఏం వారాశి పోసిపెట్టినావయ్యా!
    సరే కానీ, నీ చిటపటను ఇట్లా మార్చా, ఊరకే!

    (అశ్మాచం)

    _____________________

    8. ఎందుకయ్యా ఉంచినావూ రుబ్బుఱోలులో

    చిటపట…..
    చీకటిఊటలో పొట్టుమినపబంతులు
    బంతులన్నీ అదేమాట
    అంతుమరచి అంటాయి.
    ఎందుకయ్యా ఈ ఆర్ద్రోక్తి
    ఎవరిదీ కుయుక్తి?

    అకటకట
    పొద్దుపొడుపు విలాసంలో
    ఆగబోని ఉదూఖలసడి.
    దేనినించీ పలాయనం
    దొరకదా ఇక విమోచనం?

    చిటపట……
    ఎడతెగక మోగు మంగలపుఢక్క
    కడుపులో శూన్యపుప్రేవుని
    ఏలమోగు నగార
    ఎచటదీనికి మేర?

    అకటకట
    వికట ఫాండబింబాల
    కేకల చెరసాల
    అట్టు నేనె
    పెసరట్టు నేనె.

    (కార్నె అసాడ 12-10-15)