వేమూరి గారు మొదట్లోనే చెప్పారు – మహాప్రభో ఇది నేను ఆచరించిన పద్ధతి ఈ కాలేజీలో ఎందుకంటే క్లాసుకొచ్చిన కుర్రాళ్లకి/కుర్రమ్మలకీ ఏమీరాదు కాబట్టీ, ఇలా చెయ్యాల్సొచ్చింది అని. చివర్లో మళ్ళీ ఇంకోసారి నేను నేర్పిన తెలుగుతో వాళ్ళేమీ ఉద్ధండ పండితులైపోలేదు సారూ అని మొత్తుకున్నారు కదా?
దేశికాచారి గారు: మీరెప్పుడైనా – దండం విదల్చకుండా – ఎక్కడైనా తెలుగు పాఠాలు చెప్పారా (అంటే ఉత్తర అమెరికాలో)? మీ పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? అలు, అలూలూ, బండి-ర నేర్పించారా? నేర్చుకున్నాక ఏమైంది? మీకు తెలిసిన తెలుగువాళ్లలో (ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా), ఎంతమందికి మీరు చెప్పిన, మీకు వచ్చినటువంటి తెలుగు తెలుసు? వచ్చినా రోజువారీ చదవడం, రాయడంలో దానిని ఎంతమంది వాడుతుంటిరి? అదేమీ తప్పో, ఒప్పో దయచేసి స్థాలీపులక న్యాయంగా (అంటే ఏమిటో నన్ను అడక్కండి దయచేసి. అది తెలిస్తే ఇలా ఉండేదా నా భాష) వివరింపుడు. మీరు చెప్పినట్టూ మాంఛి కాంక్రీటు స్థంభాల్లంటి పునాదుల మీద తెలుగు నేర్చుకోవాలంటే పదిహేనేళ్ళు పడుతుంది నాలాంటివాడికి. అమెరికా కుర్రమ్మలకి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. అయినా ప్రతీదానికి ఇప్పుడు ” గూగిలించేస్తే ” చాలు కదా ఎందుకు ఆపసోపాలు పడడం.
వేమూరిగారు: మీకు తెల్సిన విషయమే కానీ మరో సారి చెప్తున్నాను. గిడుగు వారు భాషా ఉద్యమం (వాడుక భాషకి అనుకుంటా, నాకు తెలిసి ఏడిస్తే కదా!) మొదలుపెట్టినప్పుడు ఇలాగే హంసపాదులు మొదలయ్యాయి అని విన్నాను. చిన్నయసూరి (1809-61) బాలవ్యాకరణం, నీతిచంద్రికా మీరు కనక మొదలుపెట్టి ఉంటే మీ కాలేజీలో తెలుగు కి ఈ పాటికి దహన సంస్కారం జరిగి ఆ బూడిద గంగలో కలపడానికి మిమ్మల్నే కాశీ పంపించి ఉండేవారు కదా. ఇవన్నీ పట్టించుకోకండి. మీరు రాసిన ఈ తేలిక తెలుగు వ్యాసం నేను చదువుకునే రోజుల్లోనే వచ్చి ఉండవల్సింది.
అసలిప్పుడు ఆంధ్రా/తెలంగాణా లో ఉన్నవాళ్లకే తెలుగు రాదు. దీనిలో తమిళులు, మళయాళీలు మనకన్నా చాలా బెటర్. వాళ్ళకి కాస్త భాషభిమానం ఉంది. నన్నడిగితే ఇప్పుడు ఈ తేలిక తెలుగు వచ్చినవాళ్ళు కూడా అతి తక్కువమంది. నా స్వంత బాబయ్య (కజిన్స్ అనుకోండి) పిల్లలూ వాళ్ళు కూడా “మేము తెలుగు చదవం” అని గొప్పగా చెప్పుకుంటారు.
ఇది ఈ మధ్యన ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఒక అద్భుతమైన వ్యాసం.
నమస్తే
అయ్యవారు గారు: నారాయణ సూక్తం వేరు, మంత్రపుష్పం వేరు కానీ రెండింటిలోనూ మంత్రాలు దాదాపుగా ఒకేలాగ ఉంటాయి. బొంబాయి రామాకృష్ణా మఠం వారు ప్రచురించిన మంత్రపుష్పం పుస్తకం మీదగ్గిర ఉంటే చూడండి (స్వామి దేవరూపానందగారు రాసినది). యోపామాయతనం అనేది నారాయణ సూక్తంలో లేదు. అలాగే “అధః నిత్యో నారాయణః, బ్రహ్మా నారాయణః….యద్భూతం యశ్చభవ్యం…” అనేవి మంత్రపుష్పం లో లేవు. గూగిల్లో జాగ్రత్తగా చూస్తే దొరకచ్చేమో.
అసలీ మంత్రపుష్పం వినాలంటే మా ఊరు వెళ్ళాల్సిందే (పంచారామాలలో ఒకటి). ఏకాదశి నాడు రుద్రాభిషేకం చేస్తారు 11 మందితో. పొద్దున్న అభిషేకం అయ్యాక కాస్త విశ్రాంతి (ఫలహారం) తీసుకుని మధ్యాహ్నం బిల్వార్చన. సాయంత్రం అవుతూంటే గుడిలో మైకు పెద్ద స్థాయికి ఊరంతా వినబడేలా (గుడి ఊరికి 2/3 మైళ్ళు దూరం కాబోలు; శివాలయం కదా)పెంచి మంత్రపుష్పం చదవడం మొదలుపెడతారు. యోపాం పుష్పం దగ్గిరకొచ్చేసరికి ఈ 11 మంది రెండు గ్రూపులుగా విడిపోయి, “యోపామాయతనం వేద,” అని ఒకరు అంటే “ఆయతనవాన్ భవతి” అంటూ రెండో గ్రూప్ అందుకుంటారు. ఇలా అవుతూనే మంత్రాలని బట్టి ఆ గ్రూప్ అనేది వీళ్ళూ, వీళ్ళనేది వాళ్ళూ చెప్తారు. మొత్తమ్మీద ఒక పదిహేను నిముషాలు ఒళ్ళు గగుర్పొడిచే వేద పఠనం. ఆ తర్వాత మహా ఆరతి, అవీను. విని కళ్ళతో చూడాలి తప్పితే ఎంతరాసినా వివరించడం కష్టం. ఆ రోజు కనక అదృష్టం ఉంటే గర్భ గుడిలోపలకి వెళ్ళి ఆభిషేకం చేసుకోవచ్చు. అసలీ మంత్ర పుష్పం ఒక్కదానికోసం ఆ రోజు శివాలయానికి వెళ్ళొచ్చు. నేను అనుకోవడం ప్రతీ శివాలయంలోనూ ఇలాగే జరగొచ్చు కానీ నేను మా ఊరి బావిలో కప్పని కాబట్టి నాకు తెల్సింది ఇంతవరకే.
లక్శ్మిగారు: మీకీ వివరణ నచ్చినందుకు సంతోషం.
మరో విషయం. ఈ కధలో పద్యం పోతన రాసినది *కాదు*. ఆ విషయం మూడో పాదం చదవగానే తెలిసిపోతుంది. ఎందుకంటే పోతన ఎప్పుడూ “నాపై కొంతరానిమ్ము” అని రాయడు (నాకు తెల్సినంతలో). రాముడు రాయమంటే రాసాను తప్ప నాదేం లేదు అనే ఆయన చెప్పాడు కదా “పలికించెడువాడు రామభద్రుండట…” అంటూ.
సుమారు 50+ కవితలతో జూన్ నెలాఖరికి ద్విభాషాసంకలనం తేవాలని ప్రయత్నం. అన్ని కవితలూ ఆత్మనేపది పుస్తకం నుంచి కాదు. కొన్ని కవితలు మధ్యపదలోపి సంకలనం నుంచి, మరికొన్ని నఈ పహారా సంకలనం నుంచీ తీసుకున్నాను.
The subject of the interview is something very close to the heart of my father, Sri Sangeetha Rao garu. He wrote articles about Vizianagaram. In his unpublished “Chinthaasakthi” he dealt elaborately with many personalities he came across in his life who happened to be the people of Vizianagaram District. Everybody wanted to hear him talk about Vizianagaram, Bobbili, Saluru and the great personalities there. Because it was not just a talk, it was always an extempore Lec-Dem. He has phenomenal memory, which continues to be so even today, and ability to perform the works of those great personalities. The interview will give an inkling of this aspect. I am happy that you had recorded it when you had. I wish you had mentioned the date of the recording too.
A piece of information which I think is not out of place is that my father was not a student of Vizianagaram Maharaja Sangeetha Kalashaala. He had his initiation into music through Sri Akundi Narayana Murthy garu. The blog has more information about the early days of his career.
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి Vasu అభిప్రాయం:
05/07/2016 12:20 pm
గురువు గారూ, సంతోషం. నన్నూ గుర్తుంచుకోండి.
-వాసు
తేలిక తెలుగు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/07/2016 10:05 am
ఇదేనండి మన తెలుగువాళ్ల దగ్గిర వచ్చిన చిక్కు.
వేమూరి గారు మొదట్లోనే చెప్పారు – మహాప్రభో ఇది నేను ఆచరించిన పద్ధతి ఈ కాలేజీలో ఎందుకంటే క్లాసుకొచ్చిన కుర్రాళ్లకి/కుర్రమ్మలకీ ఏమీరాదు కాబట్టీ, ఇలా చెయ్యాల్సొచ్చింది అని. చివర్లో మళ్ళీ ఇంకోసారి నేను నేర్పిన తెలుగుతో వాళ్ళేమీ ఉద్ధండ పండితులైపోలేదు సారూ అని మొత్తుకున్నారు కదా?
దేశికాచారి గారు: మీరెప్పుడైనా – దండం విదల్చకుండా – ఎక్కడైనా తెలుగు పాఠాలు చెప్పారా (అంటే ఉత్తర అమెరికాలో)? మీ పరిస్థితి ఎలా ఉంది అప్పుడు? అలు, అలూలూ, బండి-ర నేర్పించారా? నేర్చుకున్నాక ఏమైంది? మీకు తెలిసిన తెలుగువాళ్లలో (ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా), ఎంతమందికి మీరు చెప్పిన, మీకు వచ్చినటువంటి తెలుగు తెలుసు? వచ్చినా రోజువారీ చదవడం, రాయడంలో దానిని ఎంతమంది వాడుతుంటిరి? అదేమీ తప్పో, ఒప్పో దయచేసి స్థాలీపులక న్యాయంగా (అంటే ఏమిటో నన్ను అడక్కండి దయచేసి. అది తెలిస్తే ఇలా ఉండేదా నా భాష) వివరింపుడు. మీరు చెప్పినట్టూ మాంఛి కాంక్రీటు స్థంభాల్లంటి పునాదుల మీద తెలుగు నేర్చుకోవాలంటే పదిహేనేళ్ళు పడుతుంది నాలాంటివాడికి. అమెరికా కుర్రమ్మలకి ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. అయినా ప్రతీదానికి ఇప్పుడు ” గూగిలించేస్తే ” చాలు కదా ఎందుకు ఆపసోపాలు పడడం.
వేమూరిగారు: మీకు తెల్సిన విషయమే కానీ మరో సారి చెప్తున్నాను. గిడుగు వారు భాషా ఉద్యమం (వాడుక భాషకి అనుకుంటా, నాకు తెలిసి ఏడిస్తే కదా!) మొదలుపెట్టినప్పుడు ఇలాగే హంసపాదులు మొదలయ్యాయి అని విన్నాను. చిన్నయసూరి (1809-61) బాలవ్యాకరణం, నీతిచంద్రికా మీరు కనక మొదలుపెట్టి ఉంటే మీ కాలేజీలో తెలుగు కి ఈ పాటికి దహన సంస్కారం జరిగి ఆ బూడిద గంగలో కలపడానికి మిమ్మల్నే కాశీ పంపించి ఉండేవారు కదా. ఇవన్నీ పట్టించుకోకండి. మీరు రాసిన ఈ తేలిక తెలుగు వ్యాసం నేను చదువుకునే రోజుల్లోనే వచ్చి ఉండవల్సింది.
అసలిప్పుడు ఆంధ్రా/తెలంగాణా లో ఉన్నవాళ్లకే తెలుగు రాదు. దీనిలో తమిళులు, మళయాళీలు మనకన్నా చాలా బెటర్. వాళ్ళకి కాస్త భాషభిమానం ఉంది. నన్నడిగితే ఇప్పుడు ఈ తేలిక తెలుగు వచ్చినవాళ్ళు కూడా అతి తక్కువమంది. నా స్వంత బాబయ్య (కజిన్స్ అనుకోండి) పిల్లలూ వాళ్ళు కూడా “మేము తెలుగు చదవం” అని గొప్పగా చెప్పుకుంటారు.
ఇది ఈ మధ్యన ఈమాటలో వచ్చిన వ్యాసాల్లో ఒక అద్భుతమైన వ్యాసం.
సత్య దర్శనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/07/2016 9:33 am
నమస్తే
అయ్యవారు గారు: నారాయణ సూక్తం వేరు, మంత్రపుష్పం వేరు కానీ రెండింటిలోనూ మంత్రాలు దాదాపుగా ఒకేలాగ ఉంటాయి. బొంబాయి రామాకృష్ణా మఠం వారు ప్రచురించిన మంత్రపుష్పం పుస్తకం మీదగ్గిర ఉంటే చూడండి (స్వామి దేవరూపానందగారు రాసినది). యోపామాయతనం అనేది నారాయణ సూక్తంలో లేదు. అలాగే “అధః నిత్యో నారాయణః, బ్రహ్మా నారాయణః….యద్భూతం యశ్చభవ్యం…” అనేవి మంత్రపుష్పం లో లేవు. గూగిల్లో జాగ్రత్తగా చూస్తే దొరకచ్చేమో.
అసలీ మంత్రపుష్పం వినాలంటే మా ఊరు వెళ్ళాల్సిందే (పంచారామాలలో ఒకటి). ఏకాదశి నాడు రుద్రాభిషేకం చేస్తారు 11 మందితో. పొద్దున్న అభిషేకం అయ్యాక కాస్త విశ్రాంతి (ఫలహారం) తీసుకుని మధ్యాహ్నం బిల్వార్చన. సాయంత్రం అవుతూంటే గుడిలో మైకు పెద్ద స్థాయికి ఊరంతా వినబడేలా (గుడి ఊరికి 2/3 మైళ్ళు దూరం కాబోలు; శివాలయం కదా)పెంచి మంత్రపుష్పం చదవడం మొదలుపెడతారు. యోపాం పుష్పం దగ్గిరకొచ్చేసరికి ఈ 11 మంది రెండు గ్రూపులుగా విడిపోయి, “యోపామాయతనం వేద,” అని ఒకరు అంటే “ఆయతనవాన్ భవతి” అంటూ రెండో గ్రూప్ అందుకుంటారు. ఇలా అవుతూనే మంత్రాలని బట్టి ఆ గ్రూప్ అనేది వీళ్ళూ, వీళ్ళనేది వాళ్ళూ చెప్తారు. మొత్తమ్మీద ఒక పదిహేను నిముషాలు ఒళ్ళు గగుర్పొడిచే వేద పఠనం. ఆ తర్వాత మహా ఆరతి, అవీను. విని కళ్ళతో చూడాలి తప్పితే ఎంతరాసినా వివరించడం కష్టం. ఆ రోజు కనక అదృష్టం ఉంటే గర్భ గుడిలోపలకి వెళ్ళి ఆభిషేకం చేసుకోవచ్చు. అసలీ మంత్ర పుష్పం ఒక్కదానికోసం ఆ రోజు శివాలయానికి వెళ్ళొచ్చు. నేను అనుకోవడం ప్రతీ శివాలయంలోనూ ఇలాగే జరగొచ్చు కానీ నేను మా ఊరి బావిలో కప్పని కాబట్టి నాకు తెల్సింది ఇంతవరకే.
లక్శ్మిగారు: మీకీ వివరణ నచ్చినందుకు సంతోషం.
మరో విషయం. ఈ కధలో పద్యం పోతన రాసినది *కాదు*. ఆ విషయం మూడో పాదం చదవగానే తెలిసిపోతుంది. ఎందుకంటే పోతన ఎప్పుడూ “నాపై కొంతరానిమ్ము” అని రాయడు (నాకు తెల్సినంతలో). రాముడు రాయమంటే రాసాను తప్ప నాదేం లేదు అనే ఆయన చెప్పాడు కదా “పలికించెడువాడు రామభద్రుండట…” అంటూ.
ధన్యవాదములు
చిరంజీవి గురించి రవి వీరెల్లి అభిప్రాయం:
05/06/2016 11:43 pm
గండు మీనులు.. దండెం మీది బట్టలు… లేరంగుల ఇంద్రధనుస్సు ..
భలే ఉంది మీ పద్యం.
మీ పద్యాలలో, వ్యాసాలలో తెలుగువాక్యం మీద మీకున్న నమ్మకం, శ్రద్ధ కనిపిస్తాయి. మీరింకా రాయాలి.
సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
05/05/2016 4:13 pm
వాసు గారూ:
సుమారు 50+ కవితలతో జూన్ నెలాఖరికి ద్విభాషాసంకలనం తేవాలని ప్రయత్నం. అన్ని కవితలూ ఆత్మనేపది పుస్తకం నుంచి కాదు. కొన్ని కవితలు మధ్యపదలోపి సంకలనం నుంచి, మరికొన్ని నఈ పహారా సంకలనం నుంచీ తీసుకున్నాను.
మీ అభిమానానికి కృతజ్ఞుడిని.
వేలూరి వేంకటేశ్వర రావు.
చిరంజీవి గురించి Anand అభిప్రాయం:
05/05/2016 3:25 am
చాలా బావుందండీ.
విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు గురించి P V Gopalakrishna అభిప్రాయం:
05/04/2016 9:44 pm
Paruchuri Srinivas garu,
The subject of the interview is something very close to the heart of my father, Sri Sangeetha Rao garu. He wrote articles about Vizianagaram. In his unpublished “Chinthaasakthi” he dealt elaborately with many personalities he came across in his life who happened to be the people of Vizianagaram District. Everybody wanted to hear him talk about Vizianagaram, Bobbili, Saluru and the great personalities there. Because it was not just a talk, it was always an extempore Lec-Dem. He has phenomenal memory, which continues to be so even today, and ability to perform the works of those great personalities. The interview will give an inkling of this aspect. I am happy that you had recorded it when you had. I wish you had mentioned the date of the recording too.
A piece of information which I think is not out of place is that my father was not a student of Vizianagaram Maharaja Sangeetha Kalashaala. He had his initiation into music through Sri Akundi Narayana Murthy garu. The blog has more information about the early days of his career.
http://patrayani.blogspot.in/2010/04/blog-post_1811.html.
By 1936 when Sri Ghantasala Garu arrived in Vizianagaram he was already a solo performer and played Harmonium in his katcheries.
I thank you once again for recording the interview for posterity.
P V Gopalakrishna
చిరంజీవి గురించి మమత కొడిదెల అభిప్రాయం:
05/04/2016 7:45 pm
ఇంకేమీ చెప్పలేక – హగ్స్
సత్య దర్శనం గురించి Lakshmi అభిప్రాయం:
05/04/2016 1:04 pm
Excellent writing!!!
అమ్మ ఉత్తరం గురించి Indira అభిప్రాయం:
05/04/2016 12:43 pm
చాలా బాగుంది. మళ్ళీ చాలా రోజులకి ఉత్తరం రాసినట్టు వుంది చదివితే.
ఇందిర