పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం? గురించి మురళి అభిప్రాయం:

    09/01/2016 11:20 am

    చాలా చక్కగా, వివరంగా, విపులంగా రాశారు.

  2. ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం గురించి nageswara rao Ghattamaneni అభిప్రాయం:

    08/31/2016 4:55 pm

    ఇక్కడ ఇన్ని తెలుగు కథలు మరియు విషయాలు చదువుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అమెరికాలో ఉండే వారే చెయ్యగలిగినప్పుడు, తెలుగుదేశంలో ఉండే వారు ఎందుకు పాటించలేరు. నా హృదయపూర్వక ధన్యవాదములు.

  3. ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం గురించి nageswara rao Ghattamaneni అభిప్రాయం:

    08/31/2016 4:50 pm

    ఈ కథలు అన్ని ఎక్కడ దొరుకుతాయి, భవిష్యత్తు లో అయిన వీటిని పుస్తకాలుగా ప్రచురించి తక్కువ ధరకె పంపిణి చెయ్యాలి.

  4. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    08/30/2016 5:03 pm

    వేమూరి గారు:

    మీరన్నది నిజమే! నోబెల్ బహుమతి గ్రహీత చంద్ర జీవిత చరిత్ర రాసిన వారు సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రొఫెసర్ వాలి. The title of the book on Nobel prize winner in Astrophysics is ” Chandra – A Biography of S. Chadrashekhar by Kamaleshwar Wali.

    I met Prof. Chandrasekhar twice in my life. First when I was a graduate student in TIFR, Mumbai and the second time in Yale University, CT when I was a Post Doctoral Fellow.

    Both times I immensely enjoyed his talks.

    మీరు ఈ విషయం పై వ్యాసం రాస్తే నేను తప్పకుండా చదువుతాను!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి Rao Vemuri అభిప్రాయం:

    08/30/2016 1:59 pm

    రామయ్య గారికీ, రజనీకాంత్ గారికీ ధన్యవాదాలు. రాజ్ రెడ్డి గారి గురించీ, చంద్రశేఖర్ గారి గురించీ రాయమని అడిగేరు. ప్రయత్నిస్తాను. ఫెర్మా గురించి రాయమని ఈమాట సంపాదకులు – మాధవ్ – అడిగి ఉండకపోతే రాసేవాడినే కాదు. మా అన్నయ్య స్నేహితుడు – సిరక్యుస్ యూనివర్శిటీలో ఉండేవాడు – పేరు వాలీ అనుకుంటాను, చంద్రశేఖర్ జీవిత చరిత్ర రాసినట్లు లీలగా జ్ఞాపకం ఉంది. అది సంపాదించి, చదివి, ఆ తరువాత ప్రయత్నిస్తాను. చంద్రశేఖర్ చేసిన పని చాలమట్టుకు నాకు పరిచయమే కాని ఆయన జీవిత విశేషాలు సేకరించాలి. చూద్దాం.
    – వేమూరి

  6. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి కె. రజనీకాంత్ అభిప్రాయం:

    08/30/2016 10:40 am

    అంత క్లిష్టమైన విషయం గురించి ఇంత సొంపుగా, సమగ్రంగా వివరించిన మీకు ధన్యవాదాలు. (బి.బి.సి వారు వైల్స్ గురించి రూపొందించిన డాక్యుమెంటరీ, 2000 లో బ్రాడ్వేలో ప్రదర్శించబడిన సంగీత రూపకం “ఫెర్మాట్స్ లాస్ట్ టాంగో” కూడా యూట్యూబ్ లో లభ్యమవుతున్నాయి!)

  7. ఫెర్మా చివరి సిద్ధాంతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/30/2016 10:34 am

    “ఏ రామానుజన్ లాంటి వ్యక్తి అయినా తారసపడితే” … మాలాంటి సామాన్యులకి అదంత సులభ సాధ్యం కాదు. అందుకే తారసపడ్డ మీకే చేతులు ముకుళించేటందుకు నమస్సుమాంజలి అనేటందుకు, అనుమతి ఇవ్వరా ఆచార్యవర్యా.

    Carnegie Mellon University ( Robotics Institute ) డా. రాజ్ రెడ్డి గారి గురించి కాని, Chicago University ఖగోళ శాస్త్రవేత్త “చంద్ర” ( సుబ్రహ్మమణ్య చంద్రశేకర ) గారి గురించి కాని మీ మరే రచనలైనా కాని చదవాలని కుతూహలంతో,

    ఆ టాపిక్స్ అంత తేలిగ్గా అర్ధం అవుతాయని కాకున్నా, మీరు కదళీ పాకంలో చెపుతారనే ఆశతో

  8. దేశభక్తి గేయాలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    08/30/2016 3:28 am

    Thanks Sreenivas garu.

    lately you are not heard . We do undestand your calling is quite demanding as to truncating your total time.

    My request to the editors is to pester you to see to it that your earlier promise to give some rear material on A M Raja is fulfilled .

    i am taking liberty . I do not know i am welcome or not to intrude. I am sending you request to your mail for the song of A. M. Raja. Pardon for hijacking your kind invitation extended to some body else.

    Regards.

    Siddineni Bhava Narayana.

  9. దేశభక్తి గేయాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    08/29/2016 5:29 pm

    భావన్నారాయణ గారు: అది రత్నంగారి గొంతే!

  10. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    08/29/2016 5:24 pm

    రవికృష్ణ గారు: నాకు హైదరాబాదు రేడియో కేంద్ర ప్రసారాల గురించి తెలియదు కానీ విజయవాడ కేంద్రంలో మీరు చెప్పిన మొదటి రెండు పాటలూ, చివరిగా “ఘల్‌ఘల్‌ఘల్అని గజ్జెలు మ్రోగ రావయ్య కృష్ణయ్యా” తరచుగా ప్రసారమయ్యేవి. మూడూ ఆరుద్ర రాసిన పాటలే. ఇవన్నీ ఇప్పుడు తేలికగానే దొరుకుతున్నవనుకుంటాను. అలాగే మీరు అడిగిన “సోజా రాజకుమారి” (అనార్కలి-1955, A.M. రాజా) పాట కూడా. లేని పక్షంలో నాకొక (sreeniATgmxDOTde) మైలు రాయండి.