పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:

    11/06/2016 5:39 pm

    శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి యీ ప్రసంగ సాంగత్యము వలన ఎప్పటి వలె నేను కొన్ని క్రొత్త పదాలు నేర్చుకున్నాను. అవి మస్తిష్కములో యెన్ని దినాలు నిలుస్తాయో తెలియదు కాని యా క్రొత్త పదాల కర్ధాలు మిగిలిన పాఠకుల సౌలభ్యము కొఱ కిక్కడ నిలుపుతున్నాను.

    అనుష్ఠానము = నడవడి, ఆచారము ; ఉపలక్షించు = వీక్షించు, చూచు
    అతిరిక్తము = మించినది, హెచ్చినది ;
    అభిధేయము = శబ్దార్ధములు, గ్రంధ ప్రాతిపదిక విషయము, పేరు
    అతివేలము = హెచ్చు ; ఉపస్కారము = సంబారము
    సంతరించు = ఆదరించు ; ప్రకల్పించు = కలిగించు ; సుభగము = మనోహరము
    ఆకీర్ణము = సంకీర్ణము , కలిసినది , వ్యాపించినది,
    అధికరణము = ఆధారము ; నైయాయికుడు = న్యాయశాస్త్ర కోవిదుడు ;
    ఆత్మప్రత్యయము = ఆత్మవిశ్వాసము ; (అ) సమీచీనము = ( అ ) పరిశుద్ధము
    అధ్వము = త్రోవ ; వివక్షితము = చెప్పదలచిన విషయము
    శీర్షణ్యము = శిరస్త్రాణము, తలమానికము ; వ్యపదేశము = కపటము, ఆంతర్యము ;
    ముకుటము = మకుటము ; స్థగితము = కప్పపడినది
    అనుస్యూతి = కూర్పు

  2. Yippee! I’m a poet, and I know it గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    11/06/2016 4:44 pm

    వాడ్రేవు చినవీరభద్రుడు గారికి,శ్యామ్‌ గారికీ కృతజ్ఞతలు.

    నేను నా వ్యాసం క్లుప్తంగా ఉంచుదామన్న ఉద్దేశంతో బాబ్‌ డిలన్‌ ‘ప్రేమ’ కవితల గురించి రాయలేదు. చినవీరభద్రుడుగారు, ఆ ప్రస్తావనతెచ్చి, ప్రేమ కవితలగురించి చెప్పవలసిన అవసరం సూచించారు.

    1965 లో లాస్‌ యాంజెలస్‌ లో పత్రికాముఖంగా డిలన్‌ చెప్పిన మాటలు:

    What does the word protest mean to you?

    “To me? Means uh — singing when I don’t really wanna sing.”

    What?

    “It means singing against your wishes to sing.”

    Do you sing against your wishes to sing?

    “No, no.”

    Do you sing protest songs?

    “No.”

    What do you sing?

    ” I sing love songs.”

    ….

    Of course, the song, Lay, Lady, Lay ‘has become one of Dylan’s best-known love songs, almost by accident.’ — (From the note in the album ‘Biograph.’)

    In addition, “On a Night Like This,” is also equally worth listening to. Both the poems are available on Bob Dylan’s web page.

    Regards,

    Veluri Venkateswara Rao

  3. Yippee! I’m a poet, and I know it గురించి Rao Vemuri అభిప్రాయం:

    11/06/2016 12:21 pm

    డిల్లన్ పేరు చాల రోజులబట్టి వింటున్నాను కాని ఇంత సమగ్రంగా తెలుసుకోలేదు. తెలుగు సాహిత్యకారుల గురించే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇతర భాషలలోని సాహిత్య చరిత్రని కూడ తెలుసుకోవడం మంచిది కదా! వ్యాసం బాగుంది.

  4. Yippee! I’m a poet, and I know it గురించి Chinaveerabhadrudu అభిప్రాయం:

    11/05/2016 11:11 pm

    చాలా చక్కటి వ్యాసం. డిలన్ కి నోబెల్ బహుమతి వచ్చిన తరువాత, ఇంత సవివరంగా, సమగ్రంగా ఉన్న వ్యాసం ఇంటర్నెట్ లో మరెక్కడా (ఇంగ్లీషులో) కూడా కనిపించలేదు. పాట,పద్యం- ఈ రెండింటి గురించీ శ్రీశ్రీ చాలా స్పష్టంగా చెప్పాడు: Poetry that is spoken and poetry that is sung. అని. ఆయన కవిత్వప్రస్థానమంతా పాడుకునే కవిత్వం నుంచి మాటాడుకునే కవిత్వం వైపు నడిచింది. తిక్కన పద్యం రాసినా, అది మాటాడుకునే తరహాలోనే ఉంటుందనీ, నన్నయ, కృష్ణశాస్త్రి వంటి కవులు పాడుకునే తరహాలో రాసారనీ శ్రీశ్రీ భావన. అయితే ఆయన ఆధునిక కవి. ఆధునికానంతర కాలంలో కవిత్వం తిరిగి మాటాడుకునే తరహానుంచి పాడుకునే తరహాకు మలుపు తిరిగింది. తెలుగులో ఇది విరసం ఆవిర్భావంతో మొదలయ్యింది. డిలన్ కవిత్వం పాటనే గాని, అది మాట్లాడినట్టే ఉంటుంది. బహుశా ఆ కవిత్వం సమ్మోహనీయంగా ఉండటానికి అది కూడా కారణమనుకుంటాను. ఇక డిలన్ కేవలం సామాజిక నిరసన కవి మాత్రమే కాదు, అంతకన్నా కూడా అరుదైన ప్రేమకవి. సమకాలికప్రపంచంలో ప్రేమ కవిత్వానికి అతడొక కొత్త డిక్షన్ ఇచ్చాడు. డిలన్ లోని ఆ అపురూపమైన పార్శ్వాన్ని ఈ వ్యాసం చాలా స్పష్టంగానూ, ఆవశ్యకంగానూ పైకెత్తి చూపింది. తెలుగు సాహిత్య, కళా ప్రశంసలకు వేలూరి అందిస్తున్న ఉపాదానం వెలకట్టలేనిది.

  5. తెగులుకి శిక్ష గురించి Lalitha TS అభిప్రాయం:

    11/05/2016 8:19 pm

    మీ – “పచిసూ శిక్ష”, “భస్మ ఖచిత తృణ సింహాసనం” – లకు చప్పట్లు.
    బావుందండీ మీ తెలుగు బ్లాగుల వి”శ్లేష”ణ 🙂

  6. ఫ్రాగ్మెంట్స్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    11/05/2016 8:34 am

    ధన్యవాదాలు అండి. మీ వ్యాఖ్య నాకు చాలా విలువైనది సర్.

  7. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి T V Reddy అభిప్రాయం:

    11/05/2016 7:22 am

    Till Telugu language exists on the earth there is no death for the poetry of Navayuga Kavichakravarthi Sri Gurram Jaushua. One has to immerse while reading his poetry. May HIS soul rest in peace for ever….

  8. తెగులుకి శిక్ష గురించి MANOHAR అభిప్రాయం:

    11/05/2016 1:24 am

    చాలా బాగుంది. బ్లాగుల పేరుతో తెలుగు భాషను(తల్లిని) హింసిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పారు. కృతజ్ఞతలు.

    మనోహర్

  9. ఇంక పోతారనగాను గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    11/04/2016 5:15 pm

    It’s brilliant,Kanakaprasad!

    In the nineteen-sixties, the photographer Barry Feinstein asked his friend Bob Dylan to write some text to accompany a series of pictures of Hollywood. The result of their collaboration was rejected by a publisher at that time. I read somewhere that in November 2008, a book of Feinstein’s photographs with Dylan’s poems was published. I could not lay my hands on the book.

    And, I had been planning on such a venture for a long time, with poems of great Telugu writers, but gave up on the idea for pecuniary reasons. Now, you rekindled my interest.

    May be, I should start over again!

    Regards,

    వేలూరి వేంకటేశ్వర రావు

  10. Yippee! I’m a poet, and I know it గురించి శ్యామ్ అభిప్రాయం:

    11/04/2016 12:35 am

    బాగుంది. చాలా బాగా రాసేరు వేంకటేశ్వరరావు గారు. తన జ్ఞాపకాల్లోంచి చాలా మంచి విషయాలు వారు చెప్పగలరు. ఇలాంటి మరిన్ని వ్యాసాలు వారిచేత రాయిస్తారని ఆశిస్తున్నాను.

    శ్యామ్