పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. సరస్సు నవ్వు గురించి పుట్టపర్తి నాగపద్మిని అభిప్రాయం:

    05/02/2017 6:17 pm

    పరమాద్భుత భావచిత్రం !!!

  2. సరస్సు నవ్వు గురించి అశితకేశ్‍ అభిప్రాయం:

    05/02/2017 4:12 pm

    పద్యం బాగుంది. అంతరంగంలోని మాట ఎప్పటికీ చెప్పలేం.చెప్పలేక నవ్వుకోడమో ఏడ్చుకోడమో చేస్తాం. కవులు కూడా అదే చేస్తారేమో. ఈ వ్యాఖ్య రాసేప్పుడు పైన‍ శర్మ గారి కామెంటు చదివాను. కవితలో లేని సముద్రాలెందుకు ఇక్కడ? రచనలో వున్నవి వదిలేసి, లేనివి తెచ్చిపెట్టడం మంచి విమర్శ కాదేమో.

  3. నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస గురించి విజయ సారధి అభిప్రాయం:

    05/02/2017 1:26 pm

    భైరవభట్ల కామేశ్వర రావు, ధన్యవాదాలండీ.. ఇంతకు మునుపు ఎప్పుడు వినని ఇటువంటి కావ్యాలని.. వాటిలో పద్యాలనీ వివరిస్తూ మాకు పద్య సాహిత్యం మీద ఆసక్తి పెంచుతున్నారు.. మీరు చేస్తున్న సేవ ఎనలేనిది.

  4. ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/02/2017 10:54 am

    సోదాహరణంగా వుండి అనేక విషయాలను తెలియచేసింది. అభినందనలు.

  5. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Vasu (Srinivasa Nyayapati) అభిప్రాయం:

    05/02/2017 10:54 am

    I thank all.

    -Vasu-

  6. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Lokesh అభిప్రాయం:

    05/02/2017 8:54 am

    అద్భుతమైన కవిత్వం. ధన్యవాదాలు.

  7. ఒక పాట – రెండు బాణీలు గురించి SeelaSubhadradevi అభిప్రాయం:

    05/02/2017 8:38 am

    మీ ఒకే పాట రెండు బాణీలు విన్నాను. మొదటిది నా దగ్గర మరో గాయని పాడిన మరో బాణీలో కూడా ఉంది. ఐదవ పాట మరో గాయని శ్రీరంగం గోపాలరత్నంగారు రాగమాలికలో పాడిన పాట. రెండవ పాట ఎందువలనో ఓపెన్ కాలేదు. ఇంత మంచి పోస్ట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు, పరుచూరి శ్రీనివాస్ గారు.

  8. అదీ నేనే… గురించి T V Sharma అభిప్రాయం:

    05/02/2017 4:44 am

    ఇదొక narcsisstic poem..

  9. సరస్సు నవ్వు గురించి T V Sharma అభిప్రాయం:

    05/02/2017 4:27 am

    సరస్సు నవ్వు ఒకానొక నిచ్చల నిచ్చింత స్వప్న కిలికించితాలకి తార్కాణం.
    సరస్సు నిలవనీటికీ ప్రవాహరాహిత్యానికీ నిదర్శనం. నిచ్చలత్వాన్ని నిద్రతో పోల్చడం కవితాత్మకమైనా ఈ కవిత అందించే శూన్య తాదామ్యత ఎవరికీ సుబోధకం కాదు సుమా!

    సరస్సు ప్రవహించదు, సముద్రమూ ప్రవహించదు.. కానీ సముద్రానికీ సరస్సుకీ అసలు పోలికెక్కడుందీ? సరస్సులోనే గిలకొట్టేవాళ్ళు సముద్రాన్ని తలచడం సాధ్యం కాదు గాక కాదు. అందుకే మీ మీ మనఃసరస్సులలోనే మనోవాంచితాలను సాధించుకోండి సలక్షణంగా!

  10. నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస గురించి ఇమ్మడిశెట్టి ఉమాకాంత రావు అభిప్రాయం:

    05/02/2017 3:30 am

    భైరవభట్ల కామేశ్వర రావు గార్కి,

    ప్రణామములు.

    చరిగొండ ధర్మన్న గారి చిత్రభారతం లోని మీకు నచ్చిన పద్య వివరణ బాగుంది అంటే చాలా చిన్న మాటే. అసలు సాంబ్రాణి తేజి అనడమే చాలా గొప్ప కవి ఊహ. ఇప్పటి కవులకు ఇది అందే అవకాశమే లేదనడం అతిశయోక్తి కాదు.

    తర్వాత, చతురంబోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకర పద్యంప్రారంభ పాదం సత్య హరిచ్చంద్ర పద్య నాటకంలో కనిపిస్తున్నది. చరిగొండ ధర్మన్న ప్రభావం బలిజేపల్లిపై కూడా ఉందన్న సత్యాన్ని ఎరుక పరుస్తున్నది కదా!

    పద్యాల సొబగులను వివరిస్తున్నందుకు ధన్యవాదములు.