పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/04/2017 11:04 am

    ఇండియాలో ఉన్నరోజుల్లో ఓ సారి ఏదో పనిమీద హోస్పేట వెళ్ళాను గుంతకల్ లేకపోతే గుత్తి స్టేషన్లో దిగి ఒక స్నేహితుడింటికి. మర్నాడు అతను నన్ను మోటార్ సైకిల్ మీద హంపీలో ఒక శివాలయానికీ, ఈ స్థంభాలదగ్గిరకీ, తుంగభద్ర నది ఒడ్డుకీ, అక్కడ డామ్ దగ్గిరకీ తీసుకెళ్ళాడు.

    ఆ శివాలయం ఈ విరూపాక్ష స్వామిదే కాబోలు గుర్తు లేదు. ఎంత ఆలోచించినా పేరు గుర్తు రావట్లేదు కూడా. కానీ ఆ గోపురం ఎత్తూ అవీ వివరించి చెప్పాడు స్నేహితుడు. ఈ విద్యారణ్యస్వామి వారి విగ్రహం చూసిన గుర్తే లేదు. చూడకపోతే మంచి ముఖ్యమైనది అంతవరకూ వెళ్ళి కూడా చూడలేదన్నమాట. మళ్ళీ అటువంటి అవకాశం రాదు కదా?

    అయితే, స్థంభాలని తాకితే స-రి-గ-మ-ప-ద-ని-స అని వస్తుందని స్నేహితుడు చెప్పినప్పుడు ఘంటశాల పాట గుర్తుకు వచ్చింది అక్కడ. చాలాసేపు అక్కడే కూర్చుని దాన్ని నెమరువేసుకోవడం మంచి గుర్తున్న క్షణం ఇప్పటికీ – రాతి స్థంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదనిసా స్వరములే పాడగా …కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలనీ కోరుకున్నారనీ… అనేది.

    ఆ డామ్ మీదకి ఎక్కాక నిజంగా గాలికి ఎగిరిపోతామేమో అనిపించింది. ఉధృతమైన గాలి. గంగా, గోదావరి కనిపించగానే ఒళ్ళుమర్చిపోయి నీళ్లలోకి దూకేసి స్నానం చేసే నేను ఆ రోజు వేరే కారణాల వల్ల తుంగభద్ర లో స్నానం చేయలేకపోయేను. అది మరో పోగొట్టుకున్న అవకాశం.

    ఇది చదివాక అవన్నీ గుర్తొచ్చాయి. ఇటువంటివి కుటుంబంతో వెళ్తే ఆస్వాదించలేము అని అనుకుంటున్నా. మన మనసులో అనిపించేది అవతలి వాళ్లకి అనిపించదు కదా?

    ధన్యవాదములు కామేశ్వర్రావు గారు.

  2. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    06/04/2017 2:21 am

    తఃతః గారూ,

    ప్రత్యేకంగా ఏమీ లేదండి. నా వ్యాసాల్లో, మీరు చూసినట్టయితే, సాధారణంగా కవి గురించి ఎప్పుడూ చాలా తక్కువే ఉంటుంది. హంపీ క్షేత్రం పుస్తకంలో ఇచ్చిన వివరాలు తప్పిస్తే నాకు ప్రత్యేకంగా కవి గురించి తెలియదు, అందుకే మరేమీ చెప్పలేదు. అలాగే ఆ పుస్తకం చదివేవాళ్ళకి నేను మేనమామ పేరు ఎందుకు ప్రస్తావించలేదో తెలుస్తుంది 🙂 అందుకే అలాంటి వివరాలు ప్రస్తావించ లేదు.

    మీకు కొడాలి సుబ్బారావుగారి గురించి ఇంకేమైనా విషయాలు తెలిస్తే తప్పక యిక్కడ మాతో పంచుకోండి!

  3. ఒకప్పుడు గురించి Vijay Koganti అభిప్రాయం:

    06/04/2017 1:56 am

    Beautiful.

  4. కోడ్ కూలీ గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    06/03/2017 9:35 pm

    ఆధునిక పరిస్థితులకి అద్దం పట్టారు. విదేశాల్లొ కోడ్ కూలీగా ఉండాలొ స్వదేశానికి సేవ చేయాలో యువత నిర్ణయించుకోవాలి.

  5. పునరావృతమ్ గురించి Madhu Chittarvu అభిప్రాయం:

    06/03/2017 9:23 pm

    అన్నిటికంటే తేలికయినది ఆడా మగా కలుసుకోవడం. నాకిష్టమయిన సైఫై బాగా రాసారు. అయితె ఇంగ్లీష్ పదాలు యెక్కువ అయిపొయినాయి.

  6. ఒకప్పుడు గురించి దడాల వెంకటెశ్వరరావు అభిప్రాయం:

    06/03/2017 1:29 pm

    మరి ఇప్పుడు?

  7. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి దే.రవి అభిప్రాయం:

    06/03/2017 5:28 am

    నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.

    కోయంబత్తూర్లో ఇలాగే వాడుతున్నాము.

  8. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి తః తః అభిప్రాయం:

    06/02/2017 2:27 pm

    కామేశ్వర రావు గారూ! కవి గురిచి ఆయన పేరు తప్ప మరొక మాట చెప్ప లేదు ఏమిటి కారణం?

    హంపీ క్షేత్రం రచయితలుగా పుస్తకం మీద ఇద్దరి పేర్లు కనపడతాయి రెండవది సుబ్బారావు (కవి) మేన మామది (కామరాజుగడ్ద శివయోగానంద రావు). (ఈ కవికి) “వచ్చిన కవిత్వము పూర్వ జన్మమునుండి; వచ్చిన భాష ఏటి కెదురీది నేర్చినది” అన్నారు విశ్వనాథ. హంపీ క్షేత్రం ఇంటెర్నెట్లో దొరుకుతోంది.

    నమస్కారాలతో,
    తః తః

  9. మిథ్య ఎగ్జిబిషన్ గురించి రాఘవ అభిప్రాయం:

    06/02/2017 2:08 am

    నిజమే. అంతా మిధ్య… బాగా చెప్పారు.

  10. తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు? గురించి పూడూరి రాజిరెడ్డి అభిప్రాయం:

    06/02/2017 2:06 am

    మీ కాలమ్ బాగుంటోంది.