మారుతుందని తెలుసు మరి కొందరికి, మారడం అంటే చంపడం కాదనుకున్నారు ఆ కొందరు. శిల్పి తదేకంగా శిల్పం చెక్కినట్లు, కెంపు కంటి కోయిలల నుంచి కొత్త రాగాలు సంగ్రహించినట్లూ అవే 56 అక్షరాలకి రోజూ లాల పోసి కొత్త ముస్తాబు చేసినట్లూ – అంతెందుకు దప్పిక గొన్న నాలుక మీద నీటి చుక్కలు చిలకరించినట్లూ అలకరించడం మొదలు పెట్టారు. రుచిని తోసిరాజనే ఆకలిలా సౌఖ్యాన్ని పట్టించుకోని నిద్రలా – ఇలలోనూ కళలోనూ భద్రంగా గుండెలోనూ ప్రేమని దాచుకుని సాగిపోతుంటారు.
(ఈ చిన్నకథ కలిగించిన కలవరం చాలా పెద్దది.)
ఇచ్చిన అధారంలో అడ్డం 24, అని స్పష్టంగా లేదు. కేవలం “24 కి మరో రూపు” అని మాత్రమే ఉంది.అది కొంచెం దారి తప్పించింది.
గౌతమి
గురించి ముక్కా సత్యనారాయణ పెనుగంచిప్రోలు కృష్ణా జిల్లా అభిప్రాయం:
07/02/2017
12:42 am
స్త్రీ మనోభావాల పరిశీలన, అదే సమయంలో పాత్ర స్థానంలో తనను తాను ప్రతిష్టించుకోవడం, ఊహాశక్తి కలగలసినపుడు మాత్రమే ఈ రచన సాధ్యం అవుతుంది.
రచయిత్రి ఏ ప్రాంతంలో బహుకాలం నివసించినా, మౌలిక ఉపాధ్యాయ భావన, పరిసరాలపై మమకారం జాలారి చెట్టు, పలవరేణి కాయలు గురించి వివరించే విధంగా చేశాయి.
మహిళలు తమ ఆలోచనలు ఏలాగున దమనం చేసుకుంటారో, నిర్లిప్తత కు గురై ఏకాంత నిశీధి ని సృజించుకుంటారో చక్కగా చెప్పారు. దురదృష్టవశాత్తు కడలి తో పోలుస్తూ వస్తున్న మహానుభావులు, అతివ అంతరంగం లోతులను స్పృశించలేకపోతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి కొరకు ఎమ్.ఎస్. అమ్మ ఆలాపించిన అన్నమాచర్య కీర్తనలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయని శ్లాఘించారట కంచి కామకోటి పీఠ పరమాచార్యులవారు.
సుస్వరలక్ష్మి సుబ్బలక్ష్మి అమ్మ జీవిత చరిత్ర పుస్తక పరిచయం చేసిన వేణు గారికి కృతజ్ఞతలు.
శవం గురించి మల్లీశ్వరి అభిప్రాయం:
07/02/2017 2:13 am
మారుతుందని తెలుసు మరి కొందరికి, మారడం అంటే చంపడం కాదనుకున్నారు ఆ కొందరు. శిల్పి తదేకంగా శిల్పం చెక్కినట్లు, కెంపు కంటి కోయిలల నుంచి కొత్త రాగాలు సంగ్రహించినట్లూ అవే 56 అక్షరాలకి రోజూ లాల పోసి కొత్త ముస్తాబు చేసినట్లూ – అంతెందుకు దప్పిక గొన్న నాలుక మీద నీటి చుక్కలు చిలకరించినట్లూ అలకరించడం మొదలు పెట్టారు. రుచిని తోసిరాజనే ఆకలిలా సౌఖ్యాన్ని పట్టించుకోని నిద్రలా – ఇలలోనూ కళలోనూ భద్రంగా గుండెలోనూ ప్రేమని దాచుకుని సాగిపోతుంటారు.
(ఈ చిన్నకథ కలిగించిన కలవరం చాలా పెద్దది.)
గడి నుడి – 8 సమాధానాలు గురించి వీరభద్రం అభిప్రాయం:
07/02/2017 12:59 am
ఇచ్చిన అధారంలో అడ్డం 24, అని స్పష్టంగా లేదు. కేవలం “24 కి మరో రూపు” అని మాత్రమే ఉంది.అది కొంచెం దారి తప్పించింది.
గౌతమి గురించి ముక్కా సత్యనారాయణ పెనుగంచిప్రోలు కృష్ణా జిల్లా అభిప్రాయం:
07/02/2017 12:42 am
స్త్రీ మనోభావాల పరిశీలన, అదే సమయంలో పాత్ర స్థానంలో తనను తాను ప్రతిష్టించుకోవడం, ఊహాశక్తి కలగలసినపుడు మాత్రమే ఈ రచన సాధ్యం అవుతుంది.
రచయిత్రి ఏ ప్రాంతంలో బహుకాలం నివసించినా, మౌలిక ఉపాధ్యాయ భావన, పరిసరాలపై మమకారం జాలారి చెట్టు, పలవరేణి కాయలు గురించి వివరించే విధంగా చేశాయి.
మహిళలు తమ ఆలోచనలు ఏలాగున దమనం చేసుకుంటారో, నిర్లిప్తత కు గురై ఏకాంత నిశీధి ని సృజించుకుంటారో చక్కగా చెప్పారు. దురదృష్టవశాత్తు కడలి తో పోలుస్తూ వస్తున్న మహానుభావులు, అతివ అంతరంగం లోతులను స్పృశించలేకపోతున్నారు.
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి Palaparthy Indrani అభిప్రాయం:
07/01/2017 9:03 pm
ఎన్నేళ్ళ తరువాత ఓ మంచి కథ చదివానో.
ఎంత నవ్వుకున్నానో.
ఎన్ని మాట్లు మళ్ళీ మళ్ళీ చదివానో.
ప్రచురించినందుకు వంద వందనాలు.
పాలపర్తి ఇంద్రాణి.
మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం గురించి Sujata అభిప్రాయం:
07/01/2017 8:36 pm
ఎంత బాగా రాసారు. తప్పకుండా చదవాలనిపిస్తుంది.
గడి నుడి – 8 సమాధానాలు గురించి వీరభద్రం అభిప్రాయం:
07/01/2017 1:17 pm
నిలువు3కి, నిలువు 14కి కూడా వివరణలు తెలియజేయగలరు.
[3ని: మనాది అన్నా మనేద అన్నా ఒకటే, దిగులు. 14ని. 24అడ్డం డమరుకం. దానికి మరోరూపు డమరువు – సం.]
గెలుపు గురించి Sujata అభిప్రాయం:
07/01/2017 11:56 am
ఫార్మ్యులా ప్రకారం… అద్భుతమైన ముగింపు. మంచి ఎంపిక. అహం తో ఆటలు. ఆవిడ గెలుచింది – ఆఖర్న నిజం చెప్పి. చాలా బావుంది.
గడి నుడి – 9 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:
07/01/2017 9:27 am
సంపాదకులకు,
34 నిలువుకీ, 37 అడ్డానికీ ఆధారాలు ఇవ్వలేదు. గమనించండి.
టి. చంద్రశేఖర రెడ్డి.
[గడిలో పొరపాటు అది. సరిదిద్దాము. క్షమాపణలు – సం.]
మధుర గాయని బతుకు పాట: పుస్తక పరిచయం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/01/2017 8:55 am
తిరుమల తిరుపతి దేవస్థానం వారి కొరకు ఎమ్.ఎస్. అమ్మ ఆలాపించిన అన్నమాచర్య కీర్తనలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయని శ్లాఘించారట కంచి కామకోటి పీఠ పరమాచార్యులవారు.
సుస్వరలక్ష్మి సుబ్బలక్ష్మి అమ్మ జీవిత చరిత్ర పుస్తక పరిచయం చేసిన వేణు గారికి కృతజ్ఞతలు.
రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం గురించి html అభిప్రాయం:
07/01/2017 8:39 am
ఈ ఒక్క మాట కోసం అయినా మీ యాత్ర చదవొచ్చు. ఒక్కరిగా అయితే వెళ్లగలం గానీ పిల్లా జెల్లా ఉంటే ఇంత సౌలభ్యం కుదరదేమో?