గాన్ విత్ ది విండ్ రాసిన నవలా రచయిత అప్పటి అక్కడ సమాజాన్ని చాలా సునిశితంగా పరిశిలించి అధ్యయనం చేసి మనుష్యులు పరిస్తితులను బట్టి ఎలా మారూతారో సమాజంని నవలలో ఆద్భుతంగా వ్యక్తీకరించారు అన్ని పాత్రలను వాస్తవానికి దగ్గరగా రాశారు. వేయిపడగలు సమాజం లో వర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తు ఇది దేవుడే ఇలా చేశాడు. మానవప్రమేయం మన పుట్టుకలో లేదు అని చెబుతారు.
ఈ శ్లోకం మీద ఇంత చర్చ జరుగుతున్నప్పుడు, ఈ శ్లోకార్ధానికున్న వెసులుబాటుని exploit చేస్తూ, గణపతి నవలాప్రారంభంలో చిలకమర్తి వారు వ్యంగ్యంగా సాధించిన విపరీతార్ధాన్ని కూడా ఎవరైనా పెద్దలు ఉటంకిస్తే, సందర్భోచితంగా ఉంటుంది.
“ఈ ఏనుగు ముఖమాయన వినాయకుడేనా? అలా అయితే ఆయనను అంత చులకన చేసిన శ్లోకాన్ని ఆయన ప్రార్థన వెనుకనే భక్తిగా ఎందుకు పఠిస్తున్నారు?”
నాకు తెలిసి –
శ్రీవైష్ణవసంప్రదాయంలో విష్వక్సేనుడు – కొంత స్కందుడు, కొంత గణపతి. (వైష్ణవ) సేనాపతి, విఘ్ననాశకుడు. శ్రీవైష్ణవకుటుంబాలలో తొలిపూజ విష్వక్సేనుడికే.
ఈ విష్వక్సేనుడి పరివారంలో ఒక “గజాననర్” అనే ఒక “నిత్యసూరి” ఉంటాడు. “వీర”వైష్ణవదేవాలయాలలో గణపతికి బదులు ఈ గజాననుడి విగ్రహాలు ఉంటాయట. ఈయన ఏకదంతుడు కాదు (రెండు దంతాలూ పూర్తిగా ఉన్న మూర్తి ఈయనది). తుంబిక్కై ఆళ్వారని కూడా ఈయనకి పేరు. విఘ్నహర్తలలో ఈయనా ఒకడట.
“శుక్లాంబరధరం…” కూడా విష్వక్సేనస్తుతి అని ఒక వాదము ఉన్నది.
వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం గురించి viswam అభిప్రాయం:
09/05/2017 9:40 am
గాన్ విత్ ది విండ్ రాసిన నవలా రచయిత అప్పటి అక్కడ సమాజాన్ని చాలా సునిశితంగా పరిశిలించి అధ్యయనం చేసి మనుష్యులు పరిస్తితులను బట్టి ఎలా మారూతారో సమాజంని నవలలో ఆద్భుతంగా వ్యక్తీకరించారు అన్ని పాత్రలను వాస్తవానికి దగ్గరగా రాశారు. వేయిపడగలు సమాజం లో వర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తు ఇది దేవుడే ఇలా చేశాడు. మానవప్రమేయం మన పుట్టుకలో లేదు అని చెబుతారు.
నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి వీరభద్రం అభిప్రాయం:
09/05/2017 9:01 am
ఈ పద్యం, దాని క్రిందనున్న పద్యాలు సూర్యాస్తమ వర్ణనగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
http://www.andhrabharati.com/kAvyamulu/manu/manu302.html
బ్రేకప్ గురించి viswam అభిప్రాయం:
09/05/2017 8:10 am
సహజంగానే ఉన్నది. ఉన్నది ఉన్నట్టుగా వున్నది.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వీరభద్రం అభిప్రాయం:
09/05/2017 1:47 am
ఈ శ్లోకం మీద ఇంత చర్చ జరుగుతున్నప్పుడు, ఈ శ్లోకార్ధానికున్న వెసులుబాటుని exploit చేస్తూ, గణపతి నవలాప్రారంభంలో చిలకమర్తి వారు వ్యంగ్యంగా సాధించిన విపరీతార్ధాన్ని కూడా ఎవరైనా పెద్దలు ఉటంకిస్తే, సందర్భోచితంగా ఉంటుంది.
గుర్రాల మావయ్య గురించి Vinay అభిప్రాయం:
09/05/2017 1:25 am
బాగుంది
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:
09/05/2017 12:53 am
“ఈ ఏనుగు ముఖమాయన వినాయకుడేనా? అలా అయితే ఆయనను అంత చులకన చేసిన శ్లోకాన్ని ఆయన ప్రార్థన వెనుకనే భక్తిగా ఎందుకు పఠిస్తున్నారు?”
నాకు తెలిసి –
శ్రీవైష్ణవసంప్రదాయంలో విష్వక్సేనుడు – కొంత స్కందుడు, కొంత గణపతి. (వైష్ణవ) సేనాపతి, విఘ్ననాశకుడు. శ్రీవైష్ణవకుటుంబాలలో తొలిపూజ విష్వక్సేనుడికే.
ఈ విష్వక్సేనుడి పరివారంలో ఒక “గజాననర్” అనే ఒక “నిత్యసూరి” ఉంటాడు. “వీర”వైష్ణవదేవాలయాలలో గణపతికి బదులు ఈ గజాననుడి విగ్రహాలు ఉంటాయట. ఈయన ఏకదంతుడు కాదు (రెండు దంతాలూ పూర్తిగా ఉన్న మూర్తి ఈయనది). తుంబిక్కై ఆళ్వారని కూడా ఈయనకి పేరు. విఘ్నహర్తలలో ఈయనా ఒకడట.
“శుక్లాంబరధరం…” కూడా విష్వక్సేనస్తుతి అని ఒక వాదము ఉన్నది.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/04/2017 8:51 pm
శుక్లాంబరధరం అన్న శ్లోకానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యను ఈ అనుబంధం ద్వారా ఈమాట పాఠకులకు అందజేస్తున్నాము.
శుక్లాంబరధరం … (విశ్వనాథ వ్యాఖ్య)
‘సాహిత్య సురభి’ అన్న పుస్తకంలోని ఈ వ్యాఖ్యను మాకు స్కాన్ చేసి అందజేసిన మిత్రుడు హేలీ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
సంపాదకుల తరఫున,
సురేశ్ కొలిచాల.
భూమి చాలని మనిషి గురించి amarendra dasari అభిప్రాయం:
09/04/2017 4:59 pm
థాంక్స్ రామయ్య గారూ
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి మోహన అభిప్రాయం:
09/04/2017 4:40 pm
రవి గారు – “నన్నయ, తిక్కన గారలది 11 వ శతాబ్దానికి ఈవల. వీరు తెలుగు భారతంలో గణపతిని స్తుతించకపోవడం Choice కావచ్చు.”
తిక్కన శిష్యుడు కేతన తిక్కనకు అంకితము చేయబడిన తన “దశకుమారచరితము”లో గణపతిని స్తుతిస్తూ క్రింది పద్యమును వ్రాసినాడు.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసి పట్టి యా
మిక్కిలికంటికిం దనదు మిక్కిలి హస్తము మాటు సేసి యిం-
పెక్కెడు బాల (కేళిఁ బరమేశ్వరు చి)త్తము పల్లవింపఁగా
దక్కక ముద్దునం బొలుచు దంతి ముఖుం గొలుతుం బ్రసన్నుఁగాన్
– కేతన దశకుమారచరితము, 1.005
తొమ్మిదవ, పదవ శతాబ్దములలో జీవించిన కన్నడ ఆదికవి పంపకవి వ్రాసిన “విక్రమార్జున విజయము” అనబడే పంప భారతములో వినాయకునిపైన ఈ పద్యము గలదు –
ఎన్న దానమిదాగళుం మధుపాశ్రయం ధరెగవ్యవ-
చ్ఛిన్న దానమిదగళుం విబుధాశ్రయం గెలవంద
నమ్నిజోన్నతియిందమీ పతి యెందు మెచ్చి వినాయకం
తాన్నిమిర్చుగె కబ్బమం నయదిం గుణార్ణవ భూపనా
– పంప భారతము, 1.007
విధేయుడు – మోహన
Breakrooమోపాఖ్యానము గురించి manjula అభిప్రాయం:
09/04/2017 4:33 pm
చాలా బావుంది!