పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. ℞: మారేజ్ గురించి సాయి పద్మ అభిప్రాయం:

    10/02/2017 2:31 pm

    ఇంత గొప్ప కథ ఈ మధ్య కాలంలో చదవలేదు.. పూర్ణిమా.. మీరు కేక .. నేనైతే పేరు మిరేజ్ అని పెట్టి ఉండే దాన్నేమో .. గొప్ప గొప్ప కథ .. నాలుగు రోజుల్లో పోయే వెధవ అందం కోసం మనసుల్ని జడ్జ్ చేసే వెధవతనం మీద సిగ్గేసింది.. వెధవది .. హ్మ్మ్

  2. కొత్త కథకులు గురించి Radhika అభిప్రాయం:

    10/02/2017 8:57 am

    ఆమరేంద్ర గారు
    వెంపర రాసింది నేనే, నా కథ భీష్మా … నాతో పోరాడు గురించి రాసినందుకు, అలాగే కొత్త కథకుల గురించి రాసినందుకు థాంక్ యూ.

  3. ℞: మారేజ్ గురించి Desu Chandra Naga Srinivasa Rao అభిప్రాయం:

    10/02/2017 7:51 am

    Apprehensions and quandary of present day life, nicely described…

  4. ℞: మారేజ్ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/02/2017 7:47 am

    ప్రిస్క్రిప్షన్ మీద ఎత్తు బరువు బిపి అదీ రాయరండి. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి ఈ కధలో. అయినా ఉజ్జోగం చేస్తూ అలా డాక్టర్ తనకిచ్చిన కాయితమ్ముక్క మీద ఏం రాసారో తెలియని నోట్లో వేలు పెడితే కొరకలేని అమ్మాయిని గురించి కెఫెటారియాలో ఏమనుకుంటున్నారో చెప్పడం అనవసరం. అది అందరికీ తెలిసిందే. అలాంటి వాళ్ళని ప్రపంచం – బాస్, సహోద్యోగులతో సహా అందరూ – శుభ్రంగా వాడుకుని చారులో కరివేపాకులా తీసి అవతల పారేస్తారు – అది ప్రపంచంలో జరిగే నిరంతర నిజం – మీరు ఒప్పుకున్నా, లేకపోయినా.

  5. కొత్త కథకులు గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    10/02/2017 7:42 am

    కొత్త కథకులని చక్కగా పరిచయం చేసారు అమరేంద్ర గారు. మీరన్న మాట కూడా నిజమే… “మరికొంతమంది ముఖ్యమైన కొత్త కథకులను నా పరిజ్ఞాన లేమి వల్ల స్పృశించలేకపోయానని నా ఆరోజ్ఞానం చెపుతోంది“.

    మీరు కథకులందరిని చదవలేదు మరి.

  6. మోహన్ దోస్తీలో ఆ కిక్కే వేరప్పా! గురించి Kurmanath అభిప్రాయం:

    10/02/2017 7:34 am

    Chakradhar gaari vyaasam baagundi. Mohan was always well-read, soft-spoken, unassuming and friendly. Incidentally, the picture used in this article was taken by me. FYI.

    [Omission regretted. You will be duly acknowledged – Ed.]

  7. కొత్త కథకులు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/02/2017 7:33 am

    అమరేంద్ర గారు, మీ వ్యాసంలో నా పేరు చూసి చేతిమీద గిల్లుకుని చూసుకున్నాను – ఇదేమేమైనా కలా అని. నా కధలు మీకు నచ్చి నాకో స్థానం కల్పించారు. కడుపు నిండిపోయింది. నాలో రచయితకి అది చాలు. ఈమాట లోనే నా కధలు దీనికన్నా నాకు బాగా నచ్చినవి ఉన్నాయి. మీరు ఉదహరించిన ‘గోదావరి మళ్ళీ లేటు ‘ కధని అక్షరాలా ఆరు వారాలు గూగిల్, రైల్వే అన్నీ మధించి, విషయ సేకరణ చేసి రాసాను. ఓ పాతిక సార్లు దిద్ది ఉంటాను దాన్ని. అది మొదట్లోనే పంపినది ఈమాటకి. దానికి సంపాదకులు తిరస్కరించారు. అయ్యో పూర్తిగా చదవినట్టు లేదు అనిపించి మనస్సు చివుక్కుమంది.

    బ్రహ్మాజీ రావుగారితో నన్ను ముడిపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆయన రైల్వే లో పనిచేసినాయన. నేను దేశం నాలుగు మూలలా – ఋషీకేష్ నుంచి కేరళా దాకా, ఏవో పంజాబ్ లాంటివి తప్ప – ఈ రైల్వే మీద తిరిగిన వాణ్ణి మాత్రమే. నాది ప్రయాణీకుడి వైపునుంచి ఆలోచించే మనసు. ఆయనకి తెలిసిన రైల్వే ఇంటర్నల్ విషయాలు నాకు తెలియడానికి ఆస్కారం తక్కువ. ధన్యవాదములు.

    శర్మ దంతుర్తి

  8. ℞: మారేజ్ గురించి Vadrevu Ch Veerabhadrudu అభిప్రాయం:

    10/02/2017 7:03 am

    చదివించే కథనం.

  9. ℞: మారేజ్ గురించి amarendra dasari అభిప్రాయం:

    10/02/2017 5:18 am

    Naaga Murali గారు అన్న ముఖ్యమైన విషయం గురించి ‘my two cents’:
    Life can be as simple as YOU want

  10. కొత్త కథకులు గురించి amarendra dasari అభిప్రాయం:

    10/02/2017 5:10 am

    వ్యాసం లొ చిన్న పొరపాటు దొర్లింది: ‘వెంపర’ రాసింది బండ్లమూడి స్వాతి కుమారి, రాధిక కాదు.

    అలాగే అక్కడ చెప్పాలనుకొన్నది వాంగ్మూలం గురించి, వెంపర గురించి కాదు.

    I feel sorry for the mistakes.