పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. బండలు గురించి srinivas sathiraju అభిప్రాయం:

    11/13/2017 2:37 pm

    చాలా కాలం తరువాత అంచనాలకి భిన్నంగా అద్భుతంగా ఒక కధ చదివాను అనిపించింది. నేను ఆ బండలే నీరజ్ గారి కార్గొ అని ఊహించినా అవి వెండివి అని ఊహించ లేక పోయా.. బహుశా కధకి అదే నిజమైన మలుపు. కానీ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే నిర్లక్ష్యం ఒక భాద్యతా రహిత ప్రవర్తనా మేం ఏం చేసినా చెల్లు తుంది అనే విషయానికి ఒక ఉదాహరణగా ఈ కధ మిగిలిపోతుంది. చూస్తుంటే వాస్తవంగా జరిగిన విషయాన్ని అందంగా వ్యక్తీకరించి అద్భుతంగా మలచిన తీరు నిజంగా అలరించింది. ఇలాంటి పొట్టి కధలు మీ దగ్గిరనుంచి మరెన్నో రావాలని ఆశిస్తున్నా..ఆర్కే నారయణ్ గారిని గుర్తు చెసారు మీ కధనంలో…

  2. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి desikachary అభిప్రాయం:

    11/13/2017 10:41 am

    I stand by my word. Since it is propagandish devoid of any literary value I said this is not the right forum for that. There are other forums too willing to publish such stuff where it can go. As for the quote by Ramayyagaru, it is irrelevant, because it is not a piece of literature we are talking about. It is a pity that people are too willing to quote foreigners than Indian Laakshanikas on literature. Here is a quote from respected modern poet and scholar Sri Indraganti Hanumacchaastrigaru regarding the true nature of poetry, which, by extension is relevant to all literature.
    “కవిత్వము సిద్ధాంతములను మ్రింగివేసి జీర్ణించుకొని తన జీవశక్తితో తాను నిలబడవలెను. కాని సిద్ధాంతములే కవిత్వమును మ్రింగి తూర్యారవములు ప్రారంభించినచో నాటితో ఆ సాహిత్యపు విలువ సరి. నాదములు, వాదములు తాత్కాలికములు. కవిత్వపు విలువ శాశ్వతము. తిక్కన భారతమును, పోతన భాగవతమును, పెద్దన మనుచరిత్రమును సమకాలిక సిద్ధాంతదర్శనమునకై చదువుట లేదు. వాని లోకోత్తర కవితాశిల్పము, వ్యంగ్యప్రభావము తరతరములనుండి చదివించుచున్నవి. కనుక కవిత్వపు విలువను నిర్ణయించుటకు వేరు పరికరములు కాక, ఒక్క ఆర్ద్రహృదయము మాత్రమే ప్రయోజకమని సమ్మతించినచో ఏ రచనకైనను న్యాయము జరుగును” – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.

  3. Nails గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/11/2017 11:02 pm

    సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం లోని ఎర్రాప్రగడ మన ఎనకపడ్డ పెకాశం జిల్లా ప్రాంతం వారే కదా ఇంద్రాణి తల్లీ. “వానకు తడిసిన పువ్వొకటి” రచనకు గాను ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇచ్చే ఇస్మాయిల్ అవార్డు అందుకున్న ఇంద్రాణి గారూ! కాకినాడ పెద ఇస్మాయిల్ గారి మిత్రులు త్రిపుర గారి కధలూ, కవితలను చదివి మీరు పులకిత యామినివి కావాలమ్మా.

  4. బండలు గురించి కృష్ణ వేణి అభిప్రాయం:

    11/11/2017 7:19 am

    విజయ కర్రాగారూ,
    మీకు నచ్చిందుకు సంతోషం అండీ.
    ధన్యవాదాలు.

  5. బండలు గురించి కృష్ణ వేణి అభిప్రాయం:

    11/10/2017 11:57 pm

    @దమయంతిగారూ,
    ‘కిటుకులూ” అవీ నాకస్సలు తెలియవండి.
    ఇకపోతే, మీ ఇంత మెప్పూ చదువుతుంటే అది అసలు నా గురించేనా అన్న సందేహం కలుగుతోంది. ఎంత వివరమైన కామెంట్ పెట్టారో!
    Thank you, thank you.

    @విజయ కర్రాగారూ,
    మీకు నచ్చిందుకు సంతోషం అండీ.
    ధన్యవాదాలు.

  6. బండలు గురించి Vijaya Karra అభిప్రాయం:

    11/10/2017 10:12 pm

    రొటీన్ కథలకి భిన్నంగా చాలా హాయిగా వుంది మీ కథ !

  7. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/10/2017 8:43 am

    Desikachary garu,

    “ The relationship between literature and politics is a multilane freeway with traffic flowing freely in both directions. Any work of literature is in part a product of sociological and political factors. Important works of literature or whole literary movements have had profound effect on society by setting up or destroying taboos, conventions and social prejudices, thus contributing to changes in values which in turn have brought about social and political changes “ ~ Literature and Politics by John D Lindberg.

    నాగేశ్వరరావు గారు,

    భావజాల ప్రచారకుల వాదనలోని అసత్యాలని, వాస్థవ పరిస్థుతులకు విరుద్ధంగా వీళ్లు చేస్తున్న ప్రచారాన్ని గురించి సోదాహరణంగా వివరించరా.

    భావజాలంగాళ్లే సారంగ అంతర్జాల పత్రికను భ్రష్టుపట్టించారు అని అన్నారు. ఆ భ్రష్టు అనేదానికి నిర్వచనము, ప్రమాణికాలను కూడా వివరించరా.

    మన దేశ రాజ్యాంగంలో దేశ పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛను కలిగిస్తూ ప్రకటించటం కూడా మీ వాదన ప్రకారం సరైనది కాదా

    ” భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:

    – సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం;
    – ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;
    – హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;
    – వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము “

  8. బండలు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    11/10/2017 4:48 am

    రొటీన్‌కి భిన్నమైన కథని పాఠకులకందించారు వేణి.
    కథనం బావుంది.
    ‘పాఠకునిలో పఠనాసక్తి పెరగాలంటే కథ చెప్పే విధానం కొత్తగా వుండాలి.’ అనే కిటుకు మీకు బాగా తెలుసనడానికి ఈ మీ కథే ఒక సాక్ష్యం.
    🙂
    మీరు పరిచయం చేసిన పాత్రల స్వభావాలు ఎంతో సహజంగా వున్నాయి. నాకు బాగా నచ్చాయి.

    అసలు కన్సైన్మెంట్ ఏమైందా అనే ఉత్సుకత కథని శ్రధ్ధగా చదివించింది. అదే మీ కథలోని ప్లస్ పాయింట్.
    కథ పూర్తయ్యక ఒక సామెత గుర్తొచ్చింది. ఒళ్లో పాపాయిని పెట్టుకుని, ఊరంతా వెదికొచ్చిందట ఒక తల్లి.

    ఈనాటి లేడీ రైటర్స్‌లో ఇలాటి కథలు రాసే వాళ్ళు చాలా అరుదు వేణి! మీరు ఆ లోటుని భర్తీ చేస్తున్నందుకు ఆనందంగా వుంది. మరెన్నో ఇలాటి వెరైటీ కథలు రాయాలని అభిలషిస్తూ, అభినందనలు తెలియచేసుకుంటున్నాను.

  9. గడి నుడి – 3 గురించి manjkari.lakshmi అభిప్రాయం:

    11/08/2017 3:33 am

    గడి నుడి 2 లో గళ్ళు కనపడుట లేదండీ. దాన్ని తీసేసారా?

    [ గడి నుడి 2 ను సవరించాము. ఎత్తి చూపినందుకు కృతజ్ఞతలు — సం. ]

  10. మరికొన్ని అరుదైన పాటలు గురించి lyla yerneni అభిప్రాయం:

    11/06/2017 5:48 pm

    But, Rohini Prasad gaaru put it quite well here:

    It is a different context. At that point of time of his comment – ‘rp’ is thinking of playback singing in Indian movies, and why certain singers are chosen over others. (Read it before, enjoyed it. Liked the singing.)
    In here, I am not thinking about movies, actors, voice lending to actors. No.

    Still, since he brought up the names of Lata Mangeshkar and Suseela, I don’t think for one minute he would estimate – as musicians – Lata and Suseela are of the same caliber.

    In the song – నిదురపోరా తమ్ముడా, Lata transforms the words into Music.

    జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే…….చితికి పోయిన జీవితమంతా

    Where am I? In the Land of Music.

    Whereas, when listening to Suseela’s song:

    ఎదురుగా ఉన్నాను నేను. ఇంకెవరినో కాను మీ అమ్మను.
    నువు రోజుకొక్క ఏడూ పెరగాలనీ, నీ ముద్దూ మురిపాలూ చూడాలనీ…

    Where are you? I am with the Telugu words, in Telugu Land. I am In Vijayawada.

    Lyla
    PS: Always a Pleasure hearing you! Sreenivas Paruchuri.
    I was thinking of Rohini Prasad when I noticed a Sarod event of Amzad Ali Khan on Nov 4th at Carnegie Hall.