పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. తెలుగు, ఇతర ద్రావిడ భాషలు: వాటి ప్రాచీనత గురించి సంజై అభిప్రాయం:

    11/20/2017 7:49 am

    నిద్రించిన జాతికి మీ ద్వారా మేలుకొలుపు… భ్రమలు తొలగాయి, తప్పుడు ప్రచారం ముగిసింది. నా జాతి, నా భాష నిండుకలశం అని మీ వ్యాసం ద్వారా మా తరానికి పట్టిన తుప్పు వదలగొట్టారు. ఇన్ని రోజులు మీ వ్యాసం చదవనందుకు క్షమించండి. మీ కృషికి పాదాభివందనం.

  2. ముగింపు గురించి lyla yerneni అభిప్రాయం:

    11/18/2017 10:59 am

    కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.

    I can’t understand why a tall handsome young affable guy like Chandra is so hung up on death. Look at his recent writings. Either a person in nursing home is dying. Or love is dying. If not the writer is dying, or his lover is dying. In short or long formats, he had been revolving around this theme for some time now. And he is not even a Doctor. What’s going on!

    Can we please live a little and love a little Chandra! Before the war mongers finish us all off.

    If the editors are thinking you are doing some sort of Diabelli Variations, I am not thrilled. Get the hell out of that crappy mood, I beg you. Write something.

    With Love -Lyla.

  3. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Chandra Sekhar Devarakonda అభిప్రాయం:

    11/17/2017 11:36 pm

    మురుగన్ గారు సృజనాత్మక రచయిత. ఆయన వ్యాసం సాంస్కృతిక వ్యాసం. అటువంటి వ్యాసాలకు సాహిత్య పత్రికల్లో తప్పక చోటివ్వాలి. కళను సిద్ధాంతం మింగేయకూడదని ఈరోజుల్లో మార్క్సిస్టులు కూడా ఒప్పుకుంటారు. అలాగే కళ వెనుక ఏదో ఒక భావజాలం ఉండి తీరుతుందని మార్క్సిస్టులు కాని వాళ్ళు కూడా ఈరోజుల్లో ఒప్పుకుంటున్నారు. భారతరామాయణాలు రసవత్తరంగా రాయబడిన కారణం చేతనే అవి ప్రచారం చేసిన భావజాలాలు ఇప్పుడు కూడా ప్రభావితం చేస్తున్నాయి. కళ కళ కోసమే అన్న భావన మన సంప్రదాయంలో ఎప్పుడూ లేదని నా అభిప్రాయం. కవిత్వం విలువ నిర్ణయించడానికి ఆర్ద్రహృదయం ఒక్కటే చాలదు. ఆ కవిత్వం వెనుకనున్న రాజకీయాలు కూడా తెలియాలి. లేకపోతే అందమైన ప్రకటన చూసి కరిగిపోయి అది ప్రకటించే వస్తువు కొనుక్కొనే వినియోగదారుడిలా మిగిలిపోతాం. ప్రకటన అందాన్ని మెచ్చుకోవచ్చు. కాని వస్తువు నాణ్యతను ఇంకా ముఖ్యంగా పరిగణించాలి.

  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 3 గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    11/17/2017 9:52 pm

    ఒక పత్రిక పేరు. :).

    పుస్తకం హస్తభూషణం కదా.

  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 3 గురించి manjari.lakshmi అభిప్రాయం:

    11/17/2017 9:53 am

    6 నిలువు ఆధారం “మీ చేతికి అలంకారం” కు సమాధానం ఏమిటండీ ?

  6. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1 గురించి manjari.lakshmi అభిప్రాయం:

    11/16/2017 6:05 am

    ఈ శ్రీ శ్రీ పదబంధ ప్రహేళికకు సమాధానాలు లేవాండి?

  7. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/15/2017 8:22 am

    ప్రియమైన శ్రీ దేశికాచారి గారికి, శ్రీ నాగేశ్వరరావు గారికి,

    “ప్రచారమే ధ్యేయంగా రాయబడిన వ్యాసము”, “సాహిత్యపు విలువలు” వంటి విషయాల గురించి మీతో వాదించాలనుకుంటున్నా కాని, బహుశా ఇది సమయం కాదేమో అని సందేహిస్తున్నా.

    “భావవ్యక్తీకరణ విషయంలో జరిగే తిరుగుబాటుకీ కులవ్యవస్థకీ ఉన్న సంబంధం అతి కీలకమైనది” అంటూ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌గారు చేసిన ప్రసంగపాఠంలో నాకు యెలాంటి తప్పులు కాని, వాస్తవాలకు విరుద్ధమైన తప్పుడు ప్రచారం లాంటిది కాని కనబడుటలేదు. ఇది ఆర్ద్రహృదయముతో వారు చేసిన ప్రసంగంగా అనిపించటం లేదా.

    మన కుల వ్యవస్థ, కులవిచక్షణ సాంఘిక రుగ్మతల వల్ల జరుగుతున్న అన్యాయాలు, అనర్థాలు మనకు తెలియని విషయాలా. దేశపురోగమనానికి ఇవి ఆటంకాలు కావా. దయచేసి యీ కోణంలో మరొక్కసారి ఆలోచించగలరు.

    కథ, నవల, నాటకం, కవిత్వం ఇంకా అనేక ప్రయోగాలు సాహితీ ప్రక్రియలు అయినట్లే వ్యాసాలు కూడా సాహితీ ప్రక్రియ క్రింద రావా. యీ వ్యాసం ప్రచురించటం వల్ల ఉన్నత సాహితీ విలువలు కలిగి ఉన్న ఈమాట అంతర్జాల పత్రికకు యేవైనా అపకీర్తి చుట్టుకుంటుందా.

  8. షోబిజ్ డేస్ గురించి కోట ప్రసాద్ అభిప్రాయం:

    11/14/2017 10:11 pm

    మంచి వ్యాసం. ముఖ్యంగా నాటక రంగానికి చెందిన వారు ఖచ్చితంగా చదవాలి పాశ్చాత్య నాటక పోకడలను. నేటికి అభివృద్ధి చెందని తెలుగు నాటక రంగం తెలుసుకోవడం ఎంతో అవసరమని నా అభిప్రాయం.

  9. బండలు గురించి కృష్ణ వేణి అభిప్రాయం:

    11/13/2017 11:46 pm

    థేంక్యూ శ్రీనివాస్ సత్తిరాజు గారూ-కథ చదివినందుకు, నచ్చినందుకు, మీ మెప్పుకి కూడా.
    ఏకంగా ఆర్ కే నారాయణ్ గారితోనే పోలికా! 🙂
    >ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే నిర్లక్ష్యం ఒక భాద్యతా రహిత<
    ప్రభుత్వపు ఎయిర్లైనే అయిన KLM కానీ భారతదేశంలో మొదలైన ప్రైవేట్ కేరియర్లు కానీ వీటికి అతీతం కావు. ఇలాంటివే కాదు, ఇంక ఎక్కువ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, జరుగుతున్నాయి కూడా.
    ధన్యవాదాలు.

  10. ‘జ్ఞాపిక’ గురించి Dvrao అభిప్రాయం:

    11/13/2017 11:10 pm

    చాన్నాళ్ల కి మంచి సరదా కధ చదివా.