పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 14 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    02/03/2018 8:44 am

    10 నిలువుకు ఆధారం ఇవ్వలేదు. ఇవ్వమని మనవి.

    టి. చంద్రశేఖర రెడ్డి
    [ఇప్పుడు జత చేసాం. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు — సం. ]

  2. పది రోజులు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    02/02/2018 9:32 pm

    ” మనుషుల్లోనూ కొందరిలో ఇలాంటి ఆజ్ఞలు వాళ్ళ జీన్స్‌లో రాయబడి ఉన్నాయేమో” ఈ వాక్యం మనసు లోపలి పొరలను కదిలించి వేస్తుంది. “చాతీ విరుచుకుని” అన్న పద ప్రయోగం మగవాళ్ళకు మాత్రమే అన్వయిస్తుందని నాకు అనిపించింది. కధ, కధనం, అనువాదం మూడూ మంచి కధగా నిలబెట్టాయి.

  3. నిర్నిమిత్తం గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/02/2018 9:10 pm

    చాలా బాగుంది.

  4. లోలోపలగా… గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    02/02/2018 9:07 pm

    చెప్పాల్సినవి ఇంకా ఉన్నప్పుడే, ఉన్నాయనిపిస్తున్నప్పుడే. ఔను.
    బాగుంది.

  5. నాకు నచ్చిన పద్యం: పౌలస్త్యుని అంతరంగం గురించి VSTSayee అభిప్రాయం:

    02/02/2018 1:33 pm

    కాటూరి వేంకటేశ్వరరావుగారి పౌలస్త్య హృదయము, గుడిగంటలు ‘ఆంధ్రభారతి’లో చదువుకొనవచ్చును.

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి.

  6. నాకు నచ్చిన పద్యం: పౌలస్త్యుని అంతరంగం గురించి తః తః అభిప్రాయం:

    02/02/2018 10:07 am

    శ్రీ బృందావన రావు గారూ!

    మీకు ఆనేకానేక నమస్కారాలు! ఢన్యవాదాలు! కాటూరిని ఏనుగు మీద కూచోబెట్టి తీసుకువచ్చి ‘ఈ మాట’కు పరిచయం చేశారు!

    ‘చూడుము నెచ్చెలీ విభుని చూచితివేగద’, ‘చంద్రహాసము నా చేయి జారలేదు’, ‘లేదు పతంగ వాహనము లేవు కరంబుల పాంచజన్య కౌమోదకులున్ ,సుదర్సనము బూనడు రావణు గెల్వ వచ్చె” వంటి పద్యాల్తో పౌలస్త్య హృదయం చదువరిని పరవశింపజేస్తుంది. ‘పౌలస్త్య హృదయము’ పై గాంధీ అహింసా సిద్ధాంత ప్రభావం ఉంది అన్నాడు సినారె! ఎలా అన్నాడొ గానీ! ‘పౌలస్త్య హృదయము’, ‘గుడిగంటలు’ పక్కనే ఉన్న వారి ‘మా ఊరు’ ను పేర్కొన లేదేమండీ? ‘మా ఊరు’ లోని, ‘అంతట ఇంద్ర కీలగిరి’ని కూడా మీ నోటి మాటలతో పరిచయం చెయ్యరూ!

    మరొకపరి నమస్కారాలతో
    తః తః

  7. నీళ్ళ బయ్యం గురించి మురళీ మోహన్ డింగరి అభిప్రాయం:

    02/02/2018 9:45 am

    మాధవ్ చాలా బాగా కుదిరిందోయ్

  8. బట్టలు ఆరేయడంలోని లింగస్పృహ గురించి poorva paaThakuDu అభిప్రాయం:

    02/02/2018 5:22 am

    పరిణామక్రమంలో ఇలాంటి ఆలోచన రావడమే మొదటి అడుగు. మన పిల్లల జనరేషన్ వరకు ఈ స్పృహ కాస్త తగ్గి రెండో అడుగు పడొచ్చు. సంపన్న దేశాల్లో చూస్తున్నదే . మనసులోపల తచ్చట్లాడే ఇలాంటి ఇన్సెకురిటీస్నీ కుహక పద్ధతిలో కడిగేసే మీ మ్యూజింగ్స్ బాగున్నాయి.

  9. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Rao అభిప్రాయం:

    02/01/2018 11:51 pm

    Your promised concluding part did not appear in the January or February issues. When is it going to be published?

  10. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి తః తః అభిప్రాయం:

    02/01/2018 3:17 pm

    శ్రీ శాయి A touching acknowledgement Thank you very much .
    నమస్కారాలతో
    తః తః