పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. గడినుడి – 21 గురించి subhadra అభిప్రాయం:

    07/27/2018 3:19 am

    రువ్వే పువ్వమ్మలు అని పాటలోనిదే ఇచ్చానండి. పూయని పువ్వులు అనేదానికి తోడుగా అన్నమాట. మీరన్నది కూడా బాగుంది.

  2. గడినుడి – 21 గురించి తః తః అభిప్రాయం:

    07/27/2018 12:07 am

    సుభద్ర వేదుల గారికి,

    నమస్కారాలమ్మా. నేను 36 అడ్దంకు కొమ్మలు అని, సమాధానం రాశాను. తప్పు అని చూపిస్తోంది లంకె. మీరిచ్చిన ఆధారంలో ‘రువ్వే పువ్వమ్మలు’ (కామాని గూడా గమనించండి) అని ఉంది. ఫూయని పువ్వులు: ‘నవ్వులు’ సరే మరి ఇంక ‘రువ్వే పువ్వమ్మలు’ దేనికి? పువ్వుల అమ్మలు (స్త్రీలు) కొమ్మలు అనడమే సరియైన సమాధాన మేమో. ఆలోచించండి.

    తః తః

  3. ఒక ఆషాఢపు రాత్రి గురించి వంశీ అభిప్రాయం:

    07/24/2018 7:31 pm

    చాలా అద్భుతంగా వ్రాశారు. గొప్ప చిత్రీకరణ ఉంది. మళ్ళీ మళ్ళీ చదవకుండా ఉండలేకపోయాను. మాటల గొడుగు చివికిపోవడం, కాలం బురదతో నిండడం, అమోఘమైన కవనాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

  4. 1 + 1 గురించి swatee sripada అభిప్రాయం:

    07/24/2018 12:35 pm

    ఒకటి, ఇంగ్లీష్ మాటలు లేకుండా కూడా ఈ కథ రాయవచ్చు. వివరణాత్మక శైలి బాగా నప్పింది. ఒక యాంత్రిక జీవన శైలికి వ్యసనపరులవుతున్న ప్రస్తుత సమాజంలో పిల్లలు ఒక హోదానా, విలాసమా, సమాజం కోసమా … పిల్లలకోసం ఆర్తి ఎక్కడా కనబడలేదు, ఎంతసేపు అతని అమ్మకీ ఆమె అమ్మకీ ఉన్న ఉత్సుకత తప్ప. పిల్లలు లేరన్న బాధ తప్ప కావాలన్న కాంక్ష వ్యక్తం కాలేదు.

    కథనం బాగుంది.

  5. జీవితానందం ఎక్కడున్నది? గురించి Subha అభిప్రాయం:

    07/23/2018 8:16 am

    వ్రాసిన అన్వర్ గారికి, కామెంటు పెట్టిన ఖ్వాజా ఉస్మాన్ గారికి కృతజ్ఞతలు. ఎంత బాగా ఆలోచించేట్టుగా వున్నాయో.

  6. 1 + 1 గురించి Chaithanya అభిప్రాయం:

    07/21/2018 11:51 am

    పూర్ణిమ, ఈ కథ ఇప్పుడే చదివాను. ఒక్క పదం ఎక్కువా తక్కువా లేకుండా… ఇలాంటి కథని రాయటానికి ఎంత నేర్పు కావాలో తెల్సు. IVF సెంటర్లు కుప్పలు తెప్పలు అవుతున్న. ఈ టైమ్ లో ఇలాంటి కథని రాసినందుకు Thanks a lot.

  7. 1 + 1 గురించి aparna అభిప్రాయం:

    07/21/2018 2:15 am

    పూర్ణిమా,

    నేను మీ అభిమానిని. మూస నుంచి బయటపడేసే కథలు మీవి. కాంటెంపరరి జీవితాలలో సవాళ్ళని అర్థంచేసుకుని రాయగలిగే మీరు, కామెంట్లకు అతీతులు.

    మీ అన్ని కథల్లానే ఇదింకో మంచి అద్భుతమైన కథ. ప్రతి వాక్యమూ అర్థవంతంగా ఉంది.

  8. వేలూరి వారి కథల పుస్తకం గురించి నాగేస్రావ్ అభిప్రాయం:

    07/18/2018 7:33 am

    అన్వర్ గారూ, ఆయన రామారావు బొమ్మకి రాసిన కవిత చూశారా? – బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ ఇక్కడ

    నాగేస్రావ్

  9. గడినుడి – 21 గురించి తః తః అభిప్రాయం:

    07/18/2018 7:30 am

    “గడి ముగింపు తేదీ: జూలై 25 అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే, లేకుంటే ముగింపు తేదీ దాటగానే, గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు.”

    “కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్”కి బహు చక్కని ఉదాహరణ ఈ వాక్యాలు.
    నమస్కారాలతో
    తః తః

  10. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి భాగవత గణనాధ్యాయి అభిప్రాయం:

    07/17/2018 2:18 am

    చాలా బాగుందండి పరచూరి శ్రీనివాసు గారూ మీ విశ్లేషణ. ఇంతగా విశ్లేషించి చెప్పడం రాదు కానండి, మన సాహిత్యం సుళువుగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆధునిక మాధ్యమాలలో ప్రచురించాలి. అంతర్జాలంలోనూ, చరణి గ్రంథాలుగానూ అందించాలి. ధరపెట్టి అమ్మినా కొంటారు. ప్రస్తుతం టీకా టిప్పణులు కావల్సి ఉన్నా కొన్నాళ్ళ తరువాత అవసరం ఉండదు. ప్రజలకు అలవాటు అవుతుంది. ఇది నా నమ్మకం. మా విషయంలో ఋజువైన విషయం.

    15వ శతాబ్దం నాటి పద్యాలు ఇప్పుడు అర్థం అవుతున్నాయి ప్రజలకు. మరి తరువాతి రచనలు ఎందుకు ఎక్కవు అనువుగా అందించేవాడు లేక కానీ… అని నా బాధండి. ఇందేం కష్టమైన పని కాదు, చదువుకుంటూ ఒక్కమారు టైపు చేసుకుంటే మరింత ఆస్వాదించవచ్చు, చక్కగా వినియోగించవచ్చును కదండి…