ఈ వ్యాసము నేను ప్రచురించిన రోజు నుండీ, రోజూ చదువుతున్నాను. మరి ఎంచుకున్న పద్యాలు అంత అందమైనవి. వ్యాసకర్తకు విషయం పైన అధికారము, అభిమానము, పాఠకులమీద ప్రేమతో, ఓర్పుతో విషయాన్ని విశదీకరించటం, భాషమీది మమకారం గౌరవంతో చక్కని (మధ్యలో ముక్కలు కాని, చివర్లో తునిగిపోని) వాక్యాలు రాయటం – ఇవి కొన్ని నాకు నచ్చిన గుణాలు. ఈ రచయిత వ్యాసాలు నాకు ఒయాసిస్సులు.
హంస గీతికలు అన్న శీర్షిక ఎంతో బాగుంది. కాని ఇంగ్లీషు సంగతి ఎత్తినప్పుడు ‘swan song’ అన్నమాటే వ్యాసము లో ఉండాలని నా అభిప్రాయం.
కామేశ్వర రావు వివరణ కూడా ఎంతో ఎంతో బాగుంది. మళ్ళీ భారతంలో ఈ ఘట్టంలో ముందు వెనుకల పద్యాలన్నీ చదివాను. నాకు మీకున్న పాండిత్యం లేదు. చాలా పద్యాలు అర్థం చెప్పి, వివరణలిస్తేనే చదువుకోగలను.
ఐనా, “అబ్జజు యానముతో సమానమై” అన్నచోట ఆ హంస బ్రహ్మ వాహనమైన హంస కాదా? అబ్జజుడు బహ్మ కదా?
@రాజారావు తాడిమేటి్ గారు, lalithasravanthiగారు, varudhini గారు,ramani గారు, Sujatha గారు, KSSPrasad గారు, radhika గారు,suma గారు,మధు గారు,Vihaari గారు, CJ గారు. నా కథ ని చదివి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ప్రతి కథా ఏదో సందేశం ఇవ్వాలని నేనూ ఆశించను కానీ, హాస్య రచనకి ప్రత్యేకమైన ఉద్దేశం లేనపుడు, భాషలో, సంభాషణలో చతురత అన్నా ఉండాలి. దయ్యాలూ, దేవుళ్ళూ, సిమెట్రీ, క్వాంటం థియరీ – ఇవేవీ నా బలహీనతలని గుర్తు తేలేదు – అన్వయించుకొని నవ్వుకోడానికి. పూజా, పూరీలకు మించి కథలో తెలుగు వాతావరణమే తక్కువనిపించింది. (తెలుగుతనం గురించి పెద్దగా తెలుసని కాదు. దేశం వదిలి పాతికేళ్ళవుతోంది. చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)
నాయకులు కలలోకి రావడమంటే గుర్తొచ్చింది. పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు” లో సీత భర్తకి ఇందిరా గాంధీ కలలోకొచ్చి దోశెలు తిన్న వైనం ఉంది. అది చదివి నవ్వకుండా ఉండలేము. అదీ ఇతరులవి మరి కొన్నీ, భార్గవీరావు గారు సంకలనించి “ఆహా … ఓహో! (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు)” క్రింద ప్రచురించారు. హాస్య రచనలంటే ఇష్టమున్నవాళ్ళు చదవదగ్గది.
మీ వెబ్ సైట్ చూశాను. చాలా బావుంది. నేను తెలుగు, కన్నడ కథల పైన తులనాత్మక పరిశీలన చేస్తున్నాను. నేను నాదగ్గర ఉన్న కథల్ని పంచుకుంటాను. ఎవరిదగ్గరయినా ఐ వి. ఎస్ అచ్యుతవల్లి గారి “సన్నాట” కథ ఉంటే పంపించమని మనవి. నాదగ్గర ఐలీపు సాఫ్ట్ వేరు ఉంది.
నమస్తే, జగన్నాథ రావు.
మదర్స్ డే
గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
05/09/2008
6:00 pm
జులై నాలుగున, ఆగస్టు పదిహేనున ఇంక రోజంతా జండాలు పట్టుకోని తిరుగాలేవో! లేకపోతే ప్రొద్దునంతా జండాలతో ఊరు తిరిగి, మధ్యాహ్నం దాకా స్వతంత్ర పోరాట కథలిని, సాయంత్రంవరకు గాంధీ గారినో, వాషింగ్టన్ గారినో స్మరించుకోని, సాయంత్రం ఏ దెశభక్తి సినిమానో చూసి, రాత్రి దెశభక్తి గీతాలు పాడుకుని ఆ విధంగా రోజుని గడపాలనమాట. అదే విధంగా శ్రీరామనవమికి రాముడితోనూ, వినాయక చవితికి వినాయకుడితోనూ, దీపావళికి సత్యభామతోనూనో, తలుస్తూనో, చూస్తూనో గడిపితేనే ఆ రోజులకి సరి ఐన విలువిచ్చినట్లనమాట సుందరం ఆలోచనల్లో. ఆహః అప్పుడుకూడా కాదండోయ్, “‘మదర్స్ డే’ నాడు మనం కూడా మదర్స్ లా ప్రవర్తించాలి కదా? అంటే మన పిల్లలతో గడపాలి కదా?”, స్వాతంత్ర దినం నాడు మన స్వాతంత్రం గురించి మనవానంద పడితే చాలదు, బ్రిటీషోల్లని ద్వేషిస్తూ, కనీసం తిడ్తూ గడపాలనమాట (ఇది మీరు అమెరికన్ సిటిజన్ ఐనా భారత పౌరులు ఐనా కూడా సరిపోతుంది).
సుందరం అమెరికా వచ్చి నిండా రెండు నెలలౌతుందేవో, రాకముందు అమెరికా గురించి, ఇక్కడి జీవన విధానం గురించి కనీస పరిఙ్ఞానం కూడా లేదని అర్థం అవుతుంది, మదర్స్ డే గురించి తెలియదన్నాడంటే. మదర్స్ డే గురించి ఏవీ తెలియని సుందరం, “అయినా యేడాదంతా తల్లుల్ని గౌరవించరా ఏమిటీ?” అని నవ్వుతూ అడగగలిగిన సుందరం, మదర్స్ డే అంత నెగటివ్ అనుకోని సుందరం (ఏవీ తెలియని దానికి మంచి చెడులని అపాదించెయ్య గల గొప్పతనం), మదర్స్ డే గురించి చెప్పిన తన స్నేహితులకి ఆ రోజు ఎలా గడపాలనే దాన్ని గురించి ఉపన్యసించడం ఎంత మూర్ఖంగా వుందో కదా! బహుమతి అన్న మాట వినగానే మదర్స్ డేకి నెగటివిటీ ని అంటగట్టగలిగిన సుందరం, భారద్దేశంలో పండగలన్నీ పైసా ఖర్చు పెట్టకుండానే చేసుకునుంటాడు. ఏ పండగకీ ఆడబిడ్డలకి జాకెట్ ముక్క కూడా పెట్టుండని గొప్ప అభ్యుదయభావాలు కలవాడనుకుంటాను.
పోనీ ఇంత గొప్ప వ్యక్తి, సరే మదర్స్ డే, మదర్స్ కి సంభందించిన విషయం, ముందర వరలక్ష్మి ఆలోచనేవిటో అడుగుదావనుకున్నాడా, ఊహూ, తనకా అవకాశం ఇవ్వాలన్న ఆలోచ్న కూడా లేకుండా “ ‘మదర్స్ డే’ సెలబ్రేషను అనంటూ, ఆ రోజున మీరు పిల్లలకి దూరంగా, ‘మదర్స్’ లా కాకుండా గడపడం ఏమిటీ? ఇందులో అసలు అర్థమే లేదు” అని తన గొప్ప లాజికల్ ఆలోచనతో మిత్రులకి ఙ్ఞాన భోధ చెసేడు మన సుందరం. తల్లులారా జాగ్రత్త, మీరు మీ పిల్లలతో వున్నప్పుడు మాత్రవే మీరు తల్లులు. ఆఫీసులో వున్నప్పుడూ, పిల్లలని బేబీ సిట్టర్ దగ్గర (లేకపోతే, చుట్టపుచూపుకొచ్చిన, అమ్మ దగ్గరో, అత్త దగ్గరో) వదిలి మీరు సినిమాకో, షికారుకో పోయినప్పుడూ, పిల్లల్ని వాళ్ళరూములో వాళ్ళనొదిలి, రాత్రిపూట మీ రూమ్ లో మీరు వెచ్చవెచ్చగా పడుకున్నప్పుడూ, మీరు తల్లులు కాదనే సత్యాన్ని సుందరం గారు ఈ మదర్స్ డే సందర్భంగా మీకు తెలియచేస్తున్నారు.
నిజవే, సుందరం లాంటి వాళ్ళు, మెజారిటీ సగటు మనుషులకన్నా విశాలంగానే ఆలోచిస్తారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు గీసుకునే గిరి విశాలంగానే వుంటుంది. ఐతే వాళ్ళూ ఆ గిరి దాటి అడుగెయ్యడానికి ఇష్టపడరు, తన గిరిలో తానుండే సగటు మనుషులంటే వాళ్ళకి ఏ మాత్రం గౌరవం వుండదు. ఉదాహరణకి సౌజన్యారావు పంతులు వేశ్యలని పొగపెట్టి తరివెయ్యాలన్నట్టు (వాళ్లకి మరో బతుకు దారి కల్పించకుండా). ఆఖరి పేరా చూడండి “‘మదర్స్ డే’ సెలబ్రేషన్లో సుందరం, వరలక్ష్మీ పాల్గో లేదు. మిగిలిన మూడు కుటుంబాలూ ఒక చోట కలిశాయనీ, పిల్లల్నందర్నీ ఓ గదిలో పడేసి, వాళ్ళకి వీడియా గేములూ, ‘వీ’లూ ఇచ్చారనీ, మగ వాళ్ళు పీజా తెప్పించుకుని, బీర్ తాగుతూ, వీడియా చూస్తూ, మధ్య మధ్యలో పిల్లల్ని గమనిస్తూ వుంటే, ఆడ వాళ్ళంతా బయటి కెళ్ళి, రెస్టారెంటులో భోజనం చేసి, ఓ సినిమా చూసి, షాపింగులో ముత్యాలు కొనుక్కుని, ఇల్లు చేరుకున్నారనీ సుందరానికీ, వరలక్ష్మికీ తెలిసింది.”
“అయితే, వరలక్ష్మికీ, సుందరానికీ మాత్రం ఆ రోజు మిగిలిన రోజుల్లాగానే గడిచి పోయింది ఆనందంగా.” తమగిరిలో లేని వాళ్ళ పట్ల ఎంత తేలిక తనాన్ని ఈ నాలుగు లైన్లు వ్యక్థపరుస్తున్నాయో, అమ్మలంటె అంత గౌరవం వున్న వ్యక్తి తనతో విభేదించిన ఆడవాళ్ళ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో గమనించండి.
కథలో “జక్స్టపొజిషన్” అనేది చాలా అవసరవైన విధానవే, కథని నిజానికి దగ్గరగా తీసుకపొయ్యే దారిలో, బతుకు వైరుద్యాల్ని మనసుకు హత్తుకునేట్టు చెప్పడానికి. అక్కడిటో ఆగిపోకుండా ఆ వైరుద్యాల్లో మంచి చెడ్డల నిర్ణయాల్ని పాఠకులకి వదిలెయ్యకుండా రచయిత చెప్పడానికి ప్రయత్నిస్తే అది కథ నుంచి కరపత్రంగా పరిణామం చెందుతుంది (కవికి మాత్రవే ఆ సౌలభ్యం వుంది). ఈ కథ కూడా కరపత్రం లాగుందని నా అభిప్రాయం.
@Malathi garu, Vijay, Mahesh, Sai Lakshmi and kosyasuraa: Thanks.
@Raja Sankar: నాకు సందేశాత్మక ముగింపు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ప్రతి కథకీ ఓ సందేశం ఉండాలన్న పట్టుదలేదీ నాకు లేదు. ఈ కథ రాయడంలో నా ఉద్దేశ్యం కేవలం చదివి నవ్వుకోవడం కోసమే. ఇలాంటి సంఘటనలు మన జీవిత స్రవంతిలో ఎంత విరివిగా ఉన్నా కూడా కథ విషయానికొస్తే వాటి సహజమైన దోవలో పోనీయం మనం చాలావరకు. అలా కాకుండా దాని దోవన దాన్ని పోనిచ్చే విధంగా రాయాలనిపించి రాసిన కథ ఇది.
@కొడవళ్ళ గారు: పైన చెప్పినట్లే, ఈ కథకి ప్రత్యేకంగా ఓ ఉద్దేశ్యం అంటూ లేదు. ఏదో ఒక సమయంలో పేజీ తెరిచి, చదువుకుని, ఒకటో అరో చిర్నవ్వులు (వస్తే) నవ్వుకుని, ఇలాంటి బలహీనత ఒకటో అరో మీలో ఉన్నది గుర్తొస్తే , గుర్తుతెచ్చుకోడం. అది జరిగితే ఈ కథ ఉద్దేశ్యం నెరవేరినట్లే.
While I was getting into the pathos of the person in the poem and was ready to shed tears, and settle for – yeah! that’s it. there is nothing more left in life – the person turns tables on me and surprises me in the penultimate verse – Hey! I still feel young. My desire and lust had not died .
And I perk up saying “what!” and read on.
Then he really kicks butt in the final stanza making God wait around for him, while he makes no bones that he is surely never going to change.
At that time, I just grin and grin thinking of అజామిళ the unreformed sinner, into whose hands some నార and అణా are pushed in, by people eager to send him to heaven, and try to make him utter నారాయణా!
Good poem. Smart poem. I love this spunky poem.
మంచి పద్యాల గురించి మంచి వ్యాసం!
ఈ పద్యాల కథ, ధర్మరాజు సారస్వత యాగం జరిగిన తీర్థంలో స్నానమాడి పొందిన మహానుభూతి దగ్గర మొదలౌతుందని “నన్నయ్యగారి అక్షర రమ్యత”లో వి.వి.ఎల్. నరసింహారావు గారి అభిప్రాయం. ఇక్కడ నన్నయ్యగారు పేర్కొన్న “ప్రసన్న సరస్వతీకము” రాబోయే కథలోని సరస్వతీ గీతకి (తార్క్ష్యునికి సరస్వతి చెప్పిన గీత) సూచన అని అతనుద్దేశం. అయతే ఆ భాగాన్ని ఎఱ్ఱన పూరించాడు.
ఈ భాగం చదువుతూ ఉంటే నాకూ, అంతర్లీనంగా సాగే ఏదో అంతస్సూత్రం కనిపించీ కనిపించకుండా కనిపిస్తుంది.
ఎఱ్ఱన చేసే సరస్వతీ నది వర్ణనకీ నన్నయ్య “భూసతికిన్…” పద్యానికీ చాలా సామ్యం కనిపిస్తుంది. ఈ పద్యంలో, భూమినీ ఆకాశాన్నీ హంసతో పోల్చినట్టుగా మీరన్నారు. కానీ ఇక్కడ శరత్కాలాన్ని సరస్వతీ బ్రహ్మల సమేతమైన “శారద”హంసతో పోల్చినట్టు నాకనిపిస్తోంది. శారద రాత్రులు, సరస్వతీ ఒకదానికొకటి విడదీయలేనంతగా అనిపిస్తాయి. ఇది ఎఱ్ఱన సరస్వతీ గీత తర్వాత చేసిన సరస్వతీ స్తుతి “అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి!” అనడంతో పరిపూర్ణమైనట్టుగా తోస్తుంది.
ఈ మొత్తం భాగంలో (నన్నయ్య శరత్కాల వర్ణన మొదలు ఎఱ్ఱన సరస్వతీ స్తుతి వరకూ), చాలా పద్యాల్లో తిరిగి తిరిగి కనిపించే పదాలూ పదబంధాలూ కూడా ఈ ఏక సూత్రతని స్ఫురింపజేస్తాయి.
నన్నయకి హృదయఘాతం వంటిది సంభవించి ఉంటుందని కన్నా, శారద హంసనెక్కి బ్రహ్మలోకానికి ఎగిరిపోయి ఆ సరస్వతిలో కలసిపోయాడని ఊహిస్తే మనకి ఆత్మసంతృప్తి కలుగుతుంది కదా!
మధునాపంతుల వారు ఇంచుమించు ఇలాగే ఊహించారు. ఊహించడమే కాక, దానికి ఈ వ్యాసంలో మీరిచ్చిన ఈ నన్నయ్య చివరి పద్యాలని ఆధారం చేసుకొని ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు, “నన్నయ్య భారతి” పుస్తకంలో “నన్నయగారి వెన్నెల రేయి” అన్న వ్యాసంలో.
( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి గురించి rao అభిప్రాయం:
05/10/2008 6:16 pm
అంతా బాగుంది, కాని ఫొటొ లేదు. … .. ఆర్టికిల్ చప్పగా ఉంది.
నన్నయ హంసగీతికలు గురించి Lyla yerneni అభిప్రాయం:
05/10/2008 9:00 am
ఈ వ్యాసము నేను ప్రచురించిన రోజు నుండీ, రోజూ చదువుతున్నాను. మరి ఎంచుకున్న పద్యాలు అంత అందమైనవి. వ్యాసకర్తకు విషయం పైన అధికారము, అభిమానము, పాఠకులమీద ప్రేమతో, ఓర్పుతో విషయాన్ని విశదీకరించటం, భాషమీది మమకారం గౌరవంతో చక్కని (మధ్యలో ముక్కలు కాని, చివర్లో తునిగిపోని) వాక్యాలు రాయటం – ఇవి కొన్ని నాకు నచ్చిన గుణాలు. ఈ రచయిత వ్యాసాలు నాకు ఒయాసిస్సులు.
హంస గీతికలు అన్న శీర్షిక ఎంతో బాగుంది. కాని ఇంగ్లీషు సంగతి ఎత్తినప్పుడు ‘swan song’ అన్నమాటే వ్యాసము లో ఉండాలని నా అభిప్రాయం.
కామేశ్వర రావు వివరణ కూడా ఎంతో ఎంతో బాగుంది. మళ్ళీ భారతంలో ఈ ఘట్టంలో ముందు వెనుకల పద్యాలన్నీ చదివాను. నాకు మీకున్న పాండిత్యం లేదు. చాలా పద్యాలు అర్థం చెప్పి, వివరణలిస్తేనే చదువుకోగలను.
ఐనా, “అబ్జజు యానముతో సమానమై” అన్నచోట ఆ హంస బ్రహ్మ వాహనమైన హంస కాదా? అబ్జజుడు బహ్మ కదా?
లైలా
అటో యిటో గురించి ramya అభిప్రాయం:
05/10/2008 5:22 am
@రాజారావు తాడిమేటి్ గారు, lalithasravanthiగారు, varudhini గారు,ramani గారు, Sujatha గారు, KSSPrasad గారు, radhika గారు,suma గారు,మధు గారు,Vihaari గారు, CJ గారు. నా కథ ని చదివి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/09/2008 10:51 pm
“ఇందిరా గాంధీ, నేనూ రెండు దోసెలూ!”
సౌమ్య గారూ,
ప్రతి కథా ఏదో సందేశం ఇవ్వాలని నేనూ ఆశించను కానీ, హాస్య రచనకి ప్రత్యేకమైన ఉద్దేశం లేనపుడు, భాషలో, సంభాషణలో చతురత అన్నా ఉండాలి. దయ్యాలూ, దేవుళ్ళూ, సిమెట్రీ, క్వాంటం థియరీ – ఇవేవీ నా బలహీనతలని గుర్తు తేలేదు – అన్వయించుకొని నవ్వుకోడానికి. పూజా, పూరీలకు మించి కథలో తెలుగు వాతావరణమే తక్కువనిపించింది. (తెలుగుతనం గురించి పెద్దగా తెలుసని కాదు. దేశం వదిలి పాతికేళ్ళవుతోంది. చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)
నాయకులు కలలోకి రావడమంటే గుర్తొచ్చింది. పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు” లో సీత భర్తకి ఇందిరా గాంధీ కలలోకొచ్చి దోశెలు తిన్న వైనం ఉంది. అది చదివి నవ్వకుండా ఉండలేము. అదీ ఇతరులవి మరి కొన్నీ, భార్గవీరావు గారు సంకలనించి “ఆహా … ఓహో! (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు)” క్రింద ప్రచురించారు. హాస్య రచనలంటే ఇష్టమున్నవాళ్ళు చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
ఈమాట గురించి గురించి Jagannatha Rao అభిప్రాయం:
05/09/2008 8:10 pm
మీ వెబ్ సైట్ చూశాను. చాలా బావుంది. నేను తెలుగు, కన్నడ కథల పైన తులనాత్మక పరిశీలన చేస్తున్నాను. నేను నాదగ్గర ఉన్న కథల్ని పంచుకుంటాను. ఎవరిదగ్గరయినా ఐ వి. ఎస్ అచ్యుతవల్లి గారి “సన్నాట” కథ ఉంటే పంపించమని మనవి. నాదగ్గర ఐలీపు సాఫ్ట్ వేరు ఉంది.
నమస్తే, జగన్నాథ రావు.
మదర్స్ డే గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
05/09/2008 6:00 pm
జులై నాలుగున, ఆగస్టు పదిహేనున ఇంక రోజంతా జండాలు పట్టుకోని తిరుగాలేవో! లేకపోతే ప్రొద్దునంతా జండాలతో ఊరు తిరిగి, మధ్యాహ్నం దాకా స్వతంత్ర పోరాట కథలిని, సాయంత్రంవరకు గాంధీ గారినో, వాషింగ్టన్ గారినో స్మరించుకోని, సాయంత్రం ఏ దెశభక్తి సినిమానో చూసి, రాత్రి దెశభక్తి గీతాలు పాడుకుని ఆ విధంగా రోజుని గడపాలనమాట. అదే విధంగా శ్రీరామనవమికి రాముడితోనూ, వినాయక చవితికి వినాయకుడితోనూ, దీపావళికి సత్యభామతోనూనో, తలుస్తూనో, చూస్తూనో గడిపితేనే ఆ రోజులకి సరి ఐన విలువిచ్చినట్లనమాట సుందరం ఆలోచనల్లో. ఆహః అప్పుడుకూడా కాదండోయ్, “‘మదర్స్ డే’ నాడు మనం కూడా మదర్స్ లా ప్రవర్తించాలి కదా? అంటే మన పిల్లలతో గడపాలి కదా?”, స్వాతంత్ర దినం నాడు మన స్వాతంత్రం గురించి మనవానంద పడితే చాలదు, బ్రిటీషోల్లని ద్వేషిస్తూ, కనీసం తిడ్తూ గడపాలనమాట (ఇది మీరు అమెరికన్ సిటిజన్ ఐనా భారత పౌరులు ఐనా కూడా సరిపోతుంది).
సుందరం అమెరికా వచ్చి నిండా రెండు నెలలౌతుందేవో, రాకముందు అమెరికా గురించి, ఇక్కడి జీవన విధానం గురించి కనీస పరిఙ్ఞానం కూడా లేదని అర్థం అవుతుంది, మదర్స్ డే గురించి తెలియదన్నాడంటే. మదర్స్ డే గురించి ఏవీ తెలియని సుందరం, “అయినా యేడాదంతా తల్లుల్ని గౌరవించరా ఏమిటీ?” అని నవ్వుతూ అడగగలిగిన సుందరం, మదర్స్ డే అంత నెగటివ్ అనుకోని సుందరం (ఏవీ తెలియని దానికి మంచి చెడులని అపాదించెయ్య గల గొప్పతనం), మదర్స్ డే గురించి చెప్పిన తన స్నేహితులకి ఆ రోజు ఎలా గడపాలనే దాన్ని గురించి ఉపన్యసించడం ఎంత మూర్ఖంగా వుందో కదా! బహుమతి అన్న మాట వినగానే మదర్స్ డేకి నెగటివిటీ ని అంటగట్టగలిగిన సుందరం, భారద్దేశంలో పండగలన్నీ పైసా ఖర్చు పెట్టకుండానే చేసుకునుంటాడు. ఏ పండగకీ ఆడబిడ్డలకి జాకెట్ ముక్క కూడా పెట్టుండని గొప్ప అభ్యుదయభావాలు కలవాడనుకుంటాను.
పోనీ ఇంత గొప్ప వ్యక్తి, సరే మదర్స్ డే, మదర్స్ కి సంభందించిన విషయం, ముందర వరలక్ష్మి ఆలోచనేవిటో అడుగుదావనుకున్నాడా, ఊహూ, తనకా అవకాశం ఇవ్వాలన్న ఆలోచ్న కూడా లేకుండా “ ‘మదర్స్ డే’ సెలబ్రేషను అనంటూ, ఆ రోజున మీరు పిల్లలకి దూరంగా, ‘మదర్స్’ లా కాకుండా గడపడం ఏమిటీ? ఇందులో అసలు అర్థమే లేదు” అని తన గొప్ప లాజికల్ ఆలోచనతో మిత్రులకి ఙ్ఞాన భోధ చెసేడు మన సుందరం. తల్లులారా జాగ్రత్త, మీరు మీ పిల్లలతో వున్నప్పుడు మాత్రవే మీరు తల్లులు. ఆఫీసులో వున్నప్పుడూ, పిల్లలని బేబీ సిట్టర్ దగ్గర (లేకపోతే, చుట్టపుచూపుకొచ్చిన, అమ్మ దగ్గరో, అత్త దగ్గరో) వదిలి మీరు సినిమాకో, షికారుకో పోయినప్పుడూ, పిల్లల్ని వాళ్ళరూములో వాళ్ళనొదిలి, రాత్రిపూట మీ రూమ్ లో మీరు వెచ్చవెచ్చగా పడుకున్నప్పుడూ, మీరు తల్లులు కాదనే సత్యాన్ని సుందరం గారు ఈ మదర్స్ డే సందర్భంగా మీకు తెలియచేస్తున్నారు.
నిజవే, సుందరం లాంటి వాళ్ళు, మెజారిటీ సగటు మనుషులకన్నా విశాలంగానే ఆలోచిస్తారు. వాళ్ళ చుట్టూ వాళ్ళు గీసుకునే గిరి విశాలంగానే వుంటుంది. ఐతే వాళ్ళూ ఆ గిరి దాటి అడుగెయ్యడానికి ఇష్టపడరు, తన గిరిలో తానుండే సగటు మనుషులంటే వాళ్ళకి ఏ మాత్రం గౌరవం వుండదు. ఉదాహరణకి సౌజన్యారావు పంతులు వేశ్యలని పొగపెట్టి తరివెయ్యాలన్నట్టు (వాళ్లకి మరో బతుకు దారి కల్పించకుండా). ఆఖరి పేరా చూడండి “‘మదర్స్ డే’ సెలబ్రేషన్లో సుందరం, వరలక్ష్మీ పాల్గో లేదు. మిగిలిన మూడు కుటుంబాలూ ఒక చోట కలిశాయనీ, పిల్లల్నందర్నీ ఓ గదిలో పడేసి, వాళ్ళకి వీడియా గేములూ, ‘వీ’లూ ఇచ్చారనీ, మగ వాళ్ళు పీజా తెప్పించుకుని, బీర్ తాగుతూ, వీడియా చూస్తూ, మధ్య మధ్యలో పిల్లల్ని గమనిస్తూ వుంటే, ఆడ వాళ్ళంతా బయటి కెళ్ళి, రెస్టారెంటులో భోజనం చేసి, ఓ సినిమా చూసి, షాపింగులో ముత్యాలు కొనుక్కుని, ఇల్లు చేరుకున్నారనీ సుందరానికీ, వరలక్ష్మికీ తెలిసింది.”
“అయితే, వరలక్ష్మికీ, సుందరానికీ మాత్రం ఆ రోజు మిగిలిన రోజుల్లాగానే గడిచి పోయింది ఆనందంగా.” తమగిరిలో లేని వాళ్ళ పట్ల ఎంత తేలిక తనాన్ని ఈ నాలుగు లైన్లు వ్యక్థపరుస్తున్నాయో, అమ్మలంటె అంత గౌరవం వున్న వ్యక్తి తనతో విభేదించిన ఆడవాళ్ళ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారో గమనించండి.
కథలో “జక్స్టపొజిషన్” అనేది చాలా అవసరవైన విధానవే, కథని నిజానికి దగ్గరగా తీసుకపొయ్యే దారిలో, బతుకు వైరుద్యాల్ని మనసుకు హత్తుకునేట్టు చెప్పడానికి. అక్కడిటో ఆగిపోకుండా ఆ వైరుద్యాల్లో మంచి చెడ్డల నిర్ణయాల్ని పాఠకులకి వదిలెయ్యకుండా రచయిత చెప్పడానికి ప్రయత్నిస్తే అది కథ నుంచి కరపత్రంగా పరిణామం చెందుతుంది (కవికి మాత్రవే ఆ సౌలభ్యం వుంది). ఈ కథ కూడా కరపత్రం లాగుందని నా అభిప్రాయం.
లింకన్ తో ఓ రాత్రి గురించి Sowmya అభిప్రాయం:
05/09/2008 4:12 pm
@Malathi garu, Vijay, Mahesh, Sai Lakshmi and kosyasuraa: Thanks.
@Raja Sankar: నాకు సందేశాత్మక ముగింపు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ప్రతి కథకీ ఓ సందేశం ఉండాలన్న పట్టుదలేదీ నాకు లేదు. ఈ కథ రాయడంలో నా ఉద్దేశ్యం కేవలం చదివి నవ్వుకోవడం కోసమే. ఇలాంటి సంఘటనలు మన జీవిత స్రవంతిలో ఎంత విరివిగా ఉన్నా కూడా కథ విషయానికొస్తే వాటి సహజమైన దోవలో పోనీయం మనం చాలావరకు. అలా కాకుండా దాని దోవన దాన్ని పోనిచ్చే విధంగా రాయాలనిపించి రాసిన కథ ఇది.
@కొడవళ్ళ గారు: పైన చెప్పినట్లే, ఈ కథకి ప్రత్యేకంగా ఓ ఉద్దేశ్యం అంటూ లేదు. ఏదో ఒక సమయంలో పేజీ తెరిచి, చదువుకుని, ఒకటో అరో చిర్నవ్వులు (వస్తే) నవ్వుకుని, ఇలాంటి బలహీనత ఒకటో అరో మీలో ఉన్నది గుర్తొస్తే , గుర్తుతెచ్చుకోడం. అది జరిగితే ఈ కథ ఉద్దేశ్యం నెరవేరినట్లే.
@CJ: నో కామెంట్స్. 🙂
అలిగితివా… గురించి arunkumar అభిప్రాయం:
05/09/2008 12:51 pm
చాలా కాలానికి మంచి కవిత చదివాను.
అరుణ్ కుమార్
చివరకు మిగిలేది గురించి Lyla yerneni అభిప్రాయం:
05/09/2008 12:14 pm
Kindred spirit!
While I was getting into the pathos of the person in the poem and was ready to shed tears, and settle for – yeah! that’s it. there is nothing more left in life – the person turns tables on me and surprises me in the penultimate verse – Hey! I still feel young. My desire and lust had not died .
And I perk up saying “what!” and read on.
Then he really kicks butt in the final stanza making God wait around for him, while he makes no bones that he is surely never going to change.
At that time, I just grin and grin thinking of అజామిళ the unreformed sinner, into whose hands some నార and అణా are pushed in, by people eager to send him to heaven, and try to make him utter నారాయణా!
Good poem. Smart poem. I love this spunky poem.
లైలా
నన్నయ హంసగీతికలు గురించి Kameswara Rao అభిప్రాయం:
05/09/2008 10:56 am