పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/27/2008 9:24 am

    శ్రీనివాస్ గారూ

    “ఈ చిత్రంలో ఎస్‌.వి. రంగారావు నటనను,లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు” అని రాసారు. చిన్నప్పుడు, Mill on the Floss నుంచి ఓ సంఘటనని పాఠంగా చదువుకున్నాము మేము. Silas Marner, ఇంకా Mill on the Floss రాసిన జార్జ్ ఇలియట్ నిజానికి Mary Evans అనే పేరు గల రచయిత్రి కదా!

    శ్రీనివాస్

  2. ప్రతీకగా శరీరం గురించి bollojubaba అభిప్రాయం:

    06/27/2008 8:28 am

    మంచి వ్యాసం. పరిచయం చేసిన పద్యాలు అద్భుతాలు. మూడు కవితలు మూడు ప్రపంచాలకు ప్రతినిధులు. ఒకటి ఆధ్యాత్మికత, రెండు అధివాస్తవికత, మూడు భావుకత. మూడూ హృదయంలోని భిన్న నాడులను స్పందింపచేసేవే.
    ఇంతకంటే మాటలు రావటం లేదు.

  3. ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి narish అభిప్రాయం:

    06/27/2008 1:03 am

    చాలా బావుంది.

  4. నువ్వు నాకొద్దు గురించి నెటిజన్ అభిప్రాయం:

    06/26/2008 9:49 pm

    కొత్తపాళీ గారి బ్లాగునుండి ఇక్కడకు చేరడం జరిగింది.
    వైద్యులకి empathy కూడ ఉండాలి.
    దురదృష్టం చాల మందికి అది ఉండదు.
    కధలో నిషి దానిని ఎలా ఆచరించిందో చక్కగా చెప్పారు.

  5. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/25/2008 9:07 pm

    హనుమంతరావుగారూ, ఎంత మాటన్నారు! 🙂
    ఏపీవీక్లీలో గత నాలుగేళ్ళకు పైగా వారానికో సైన్సు వ్యాసం చొప్పున రాస్తున్నాను. నా మొత్తం వ్యాసాల సంఖ్య 300 పైనే ఉంటుందేమో. ‘ఇంకా’ రాయమనడం భావ్యమా?!
    ‘బహుముఖప్రజ్ఞ’ మాట ఎలా ఉన్నా నలుగురికీ పనికొచ్చే విషయాల గురించి సులువైన పద్ధతిలో ఎవరు రాసినా మంచిదే.
    నిజానికి నాకున్న తక్కువ వ్యవధివల్లనే మీ వ్యాసాలన్నీ చదివి తాపీగా అభిప్రాయం రాయలేకపోతున్నాను. ఈమధ్యనే జనసాహితివాళ్ళు నా 53 వ్యాసాల సంకలనం ఒకటి విడుదల చేశారు. మీవంటివారు తేలిక భాషలో ఎన్ని పత్రికల్లో సమాచారాన్ని అందించగలిగితే అంత మంచిది. మన రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా కనబడింది. మహా అయితే ఈ మెయిల్స్ చదువుతారేమో. అందుచేత తెలుగులో అచ్చయే పత్రికలని మనం మరిచిపోకూడదు.

  6. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    06/25/2008 8:32 pm

    స్వర్గసీమకు షా ‘పిగ్మెలియన్’ స్ఫూర్తా… కథా వస్తువులో పోలికెక్కడుందబ్బా? తను సృష్టించిన (తీర్చిదిద్దిన) ఎలైజా డూలిటిల్ తో ప్రేమలో పడే ప్రొఫెసర్ కథ అది.. ఇది ఒక కుటుంబాన్ని ముక్కలుచేసే పడతి కథ కదా!

  7. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    06/25/2008 1:35 pm

    రోహిణీప్రసాద్ గారు: దేవత (1941), స్వర్గసీమ (1945) సినిమాలు వాణిజ్యపరంగా కూడా విజయం సాధించినవే. ఆ మాటకొస్తే “రంగులరాట్నం” కంటే కూడా!

    ఎల్.వి. ప్రసాద్ కూడా హెచ్.ఎం.రెడ్డినుండి దూరంగా వచ్చేసినట్లు మీరనటానికి ఆధారేలేమయినా వున్నాయా! నిజానికి వారిద్దరూ 1931 నుండి (ఇంకా బొంబాయిలో యింకా కొంచెం ముందునుండే) 1942 వరకు కలిసి పని చేశారు (చివరిగా తెనాలి రామకృష్ణ-41, ఘరానా దొంగ-42). 1943-1951 ల మధ్యలో HM సినిమా రంగానికి దూరంగా వున్నాడు. చివరిలో తీసిన నిర్దోషి (1951), ప్రతిజ్ఞ (1953) గురించి గొప్పగా చెప్పుకోవలసినదేమీ లేదు.

    “ఓహో పావురమా” పాట గురించి యిదే పత్రికలో రజని గారిపైన రాసిన వ్యాసంలో ప్రస్తావించడం జరిగింది. ఆ పాటపైన యెప్పటికైనా ఒక చిన్న సైజు వ్యాసం రాసే ఆలోచనొకటుంది.

    సుగాత్రి గారు విజయా సంస్థకి వాహిని మాతృసంస్థ అన్నారు. ఎలాగవుతుందో అర్థం కాలేదు. “విజయ” నాగిరెడ్డి, చక్రపాణుల సంస్థ. వాళ్ళకీ B.Nకి ఆలోచనా పరంగా (/వ్యాపారపరంగా) పొత్తు కుదర(లే)దు. నా దృష్టిలో పెద్దాయన తమ్ముడి సంస్థకి సినిమా తీయకపోవడం విషాదమేమీ కాదు!

    చక్రపాణి “స్వర్గసీమ”కు నాలుగు సంవత్సరాల ముందే “ధర్మపత్ని” కి (1941, ANR మొదటి సినిమా) పని చేసారు.

    “మల్లీశ్వరి” సినిమా కథకు ఆధారాలు/ప్రేరణపైన 2-3 సంవత్సరాల క్రితం “నవ్య” వారపత్రికలో చాలా మంచి చర్చ జరిగింది. ఈ సందర్భంలో శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు, శివరాజు సుబ్బలక్ష్మి గారు (బుచ్చిబాబు గారి భార్య) ఎంతో విలువైన సమాచారం అందించడం జరిగింది. రజని గారి మొదటి వ్యాసం ముందు కాసింత వేడి పుట్టించినా చర్చ చాలా శాంతియుతమైన వాతావరణంలో 🙂 జరిగింది.

    భవదీయుడు,
    శ్రీనివాస్
    P.S.”కర్పూరవసంతరాయలు” సినిమాగా తీద్దామనుకున్నారా! ఈ విషయం నాకు తెలియదు. ఏమైనా అదృష్టవంతులం , అది విడుదల కానందులకు 🙂

  8. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    06/25/2008 1:23 pm

    శ్రీనివాస్ గారు, చాలా అద్భుతమయిన వ్యాసం. ఇంత విపులంగా సమయం వెచ్చించి, మాకు తెలియని విషయాలు సేకరించి, పరిపూర్ణ రూపంలో మా ముందుంచినందుకు మీకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. I am really thrilled to see this. మీ నుండి మరిన్ని వ్యాసాల కోసం ఎదురు చూస్తూ

    మాగంటి వంశీ
    http://www.maganti.org

  9. చాదస్తం గురించి జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    06/25/2008 6:56 am

    శుభ గారికి తెలియదనుకుంటాను. రంగనాయకమ్మ గారు ముప్ఫై యేళ్ళ కిందటే, ఆ ఇంటి పేరు “ముప్పాళ్ళ”నీ, ఆ ఇంటి పేరుతో సంబంధం వున్న మనిషినీ వదిలేసి, “రంగనాయకమ్మ”గా మాత్రమే రాస్తున్నారు. కాబట్టి “ముప్పాళ్ళ” అని సంభోధించడం కరెక్టు కాదు.

    – ప్రసాద్

  10. (సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/25/2008 3:44 am

    వ్యాపారపరంగా బి.ఎన్.గారి చిత్రాల్లో విజయం సాధించినది రంగులరాట్నం ఒక్కటే.
    పుణ్యభూమీ కళ్ళు తెరు ఆయన చేత తీయిద్దామని ప్రయత్నించినది కనకాల దేవదాస్ తదితరులు.
    దేవత సినిమాకు టాల్ స్టోయ్ రిసరెక్షన్ నవల కొంతవరకూ ప్రేరణ.
    ఓహో పావురమా పాట బాలాంత్రపు రజనీకాంతరావుగారిది.
    ఎచ్.ఎం.రెడ్డిగారిది మరీ కమర్షియల్ ధోరణి అనిపించి బైటికొచ్చేసినవారిలో బి.ఎన్.గారూ, ఎల్.వి.ప్రసాద్ తదితరులున్నారట.
    ఇప్పటి సినీనిర్మాతలూ, దర్శకులతో పోలిస్తే బి.ఎన్., కె.వి. తదితరులది ఎటువంటి సంస్కారమో చెప్పనక్కర్లేదు. బి.ఎన్. ఏం తీసినా తాను నమ్మిన విలువలకు కట్టుబడే తీశారు. డబ్బుకన్నా అదే ఆయనకు ముఖ్యం. ‘కళాఖండాలు’ ఖర్చుతో కూడిన వ్యవహారం. అన్నగారు సినిమా తీయకపోతే ఆయనకు లక్ష రూపాయలిస్తానని నాగిరెడ్డిగారన్నారని ఒక జోక్ ఉండేది.