పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. తుపాకి గురించి సుజాత (మనసులో మాట) అభిప్రాయం:

    07/10/2008 9:00 am

    నిషి చెప్పినట్టు ఎక్కడా ఆగకుండా చదివేసాను. చదివి చాలా సేపయింది, కానీ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను! పిల్లలకు అంత వోర్పుగా చెప్పగలిగే శంకర్ లాంటి తండ్రులు ఎంతమంది కావాలి మనకి? ప్రతి ఇంట్లో!

    పిల్లలతో డీల్ చేయడం కత్తి మీద సామే! అది మాత్రం నిజం!

    మీ కథలన్నీ ఒకే చోట దొరకడం చాలా బాగుంది. మొత్తం చదివేయాలి!

  2. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నరేంద్ర భాస్కర్ S.P అభిప్రాయం:

    07/10/2008 7:47 am

    భయ్యా నమస్కారములు.

    నేను బ్లాగు లొకానికి కొత్త; జ్యోతిషం మీద తెలుగు బ్లాగు లేదెమో, మొదలెడదాం (నేనో ఔత్సాహిక జ్యోతిష్కుణ్ణి లెండి) అనుకున్నాను. మీరు రాసిన మూడు భాగాలూ ఎంతో ప్రేమతో చదివాను, చదివింతర్వాత నోరు వెళ్ళబట్టాను. ఇంత జ్ఞానం ఉండీ విస్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఉన్నారంటే, మీరు మిధున జాతకులు కామోసు. ఏది ఏమైనా ప్రశ్న అనే తీగను పట్టుకొని లాగితే ఇంత విషయం బయటకు (పనికి వచ్చిందో , పనికి రానిదో) వచ్చిందన్నమాట!

    నెనర్లు & ధన్యవాదములు
    నరేంద్ర భాస్కర్ S.P.

  3. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/10/2008 7:29 am

    పంచరత్న కీర్తనల స్వరాల్లో ఉన్న symmetry అద్భుతం. సాహిత్యం మటుకు స్వరరచన చేసిన తరవాత ‘కిట్టించినట్టుగా’ అనిపిస్తుంది. ఎందరో మహానుభావులు మొదటి స్వరకల్పన ఒక మంచి ఉదాహరణ. జగదానందకారకా వింటే సనిపమానిపా మరిసనీరిసా సనిపసాసరీ సరిసపాపనీ సనిపరీరిసా అంటూ ఒక fantastic racy pattern వినిపిస్తుంది. సాహిత్యం దానికి adjust చేసినట్టుగా ఉంటుంది.

    వినతా సుతవాహన (జయంతసేన రాగం) మొదలైన రచనల్లో స్వరాల అందమే ప్రధానం. పెద్ద విద్వాంసులు ఇంకొన్ని ఉదాహరణలు చెప్పగలరేమో. వెంటనే గుర్తుకొచ్చినవి రాశాను. ముత్తుస్వామి దీక్షితర్ తదితరులు రాసిన నవగ్రహ కీర్తనలు వగైరాల్లో మటుకు సాహిత్య వివరాలెన్నో కనిపిస్తాయి. త్యాగరాజు రచనలు intensely musical గా అనిపిస్తాయి.

  4. తడి గురించి Jyothi అభిప్రాయం:

    07/10/2008 6:58 am

    It’s a good and inspiring story. If everyone thinks that way, there won’t be any child labor. I have read ‘reader’ comments. If we rely on government, nothing is going to happen. People like author of the story should donate to street kids organisations.

  5. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి అభిమాని అభిప్రాయం:

    07/10/2008 6:31 am

    రోహిణీ గారూ,

    మీరు ” కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.” అని రాసారు.
    దయచేసి ఆ ఉదాహరణలు చెప్ప గలరా?

    – అభిమాని

  6. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:

    07/10/2008 6:18 am

    శశాంక్ గారూ, విశ్లేషణ నచ్చినందుకు నెనర్లు. సంక్లిష్టత భాష లోనా, భావ ప్రకటనలోనా చెబితే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను.

  7. పలాయనం గురించి Ravi అభిప్రాయం:

    07/09/2008 7:10 am

    సిల్లీ కథ. అసలిటువంటి పిచ్చి కథలు ఏ ప్రయోజనం ఆశించి రాస్తారో తెలియదు. కథలో బద్ధకస్తుడైన మొగుడు, అంతకంటే బద్ధకస్తురాలైన ఇల్లాలు. కనీసం ఒక సెలవు రోజు సరదాగా ఎంజాయ్ చేసే సరసులు కూడా కాదు వీళ్ళు. పైగా ఇలాంటి పాత్రల ద్వారా పాఠకులకి సందేశాలు – ఇంటి పన్లు చేసుకుంటే ఎక్సరసయిజు అక్కర్లేదు అని. ఈ ఒక్క వాక్యం రాస్తే చాలదూ? దానికింత చేట భారతం ఎందుకు? హాస్యంగానీ, ఒక శిల్పంగానీ, ఒక అనుభూతి గానీ లేని కథ. చిరాకు తెప్పించే కథ.

  8. తుపాకి గురించి నిషిగంధ అభిప్రాయం:

    07/09/2008 6:43 am

    ఎక్కడా ఆపకుండా చదివించారు! భిన్న సంస్కృతుల వల్ల పిల్లలు లోనయ్యే అయోమయం చాలా చక్కగా వివరించారు.. కిరణ్ తుపాకీ గురించి, నల్ల వాళ్ళ గురించి తన వాదన వినిపించడం చూస్తే ఒక క్షణం తమకు అంతా తెలుసన్నట్టు, ఆ మరుక్షణమే అసలేమీ తెలియనట్టు ఉండే ఇక్కడి పిల్లల మనస్తత్వం కళ్ళకి కట్టినట్లుంది..

  9. సార్థక నామధేయుడు సంగీతరావు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/09/2008 3:11 am

    నేనుకూడా బాలమురళి అభిమానినే.

    కర్ణాటక గాత్రసంగీతం వింటున్నప్పుడు తెలుగు సాహిత్యం ఏ కారణంవల్లనైనా చెడితే తెలుగువారికి కలిగే బాధను అర్థంచేసుకోవచ్చు. అయితే శైలి ఏదైనప్పటికీ శాస్త్రీయసంగీతంలో సాహిత్యానికుండే విలువ చాలా తక్కువ. ముఖ్యంగా హిందుస్తానీ పద్ధతిలో పదాలు ఒకంతట అర్థం కావు కూడా. రాగప్రధానంగా, గమక విన్యాసాలతో సాగే శాస్త్రీయసంగీతంలో మనం ఎక్కువగా విని ఆనందించవలసినవి సాహిత్యేతర అంశాలే. భావగీతాల్లోనూ, లలితసంగీతంలోనూ మాత్రం సాహిత్యభావం ముఖ్యమైనదిగా ఉంటుంది.

    కొన్ని త్యాగరాజ కీర్తనల్లో ట్యూన్ ముందుగా చేసి తరవాత పదాలను కూర్చినట్టుగా అనిపించే ఉదాహరణలు కనిపిస్తాయి. దీన్నిబట్టి చూస్తే పెద్ద వాగ్గేయకారులు కూడా కొన్ని సందర్భాల్లో సాహిత్యానికి చిన్నపీట వేశారనిపిస్తుంది.

    ఇవన్నీ వింటున్న మనవంటి పామరులు సాహిత్యం అందంగా వినిపిస్తున్నప్పుడు సంతోషిస్తూ, వినిపించనప్పుడు సంగీత అంశాలను ఆస్వాదిస్తూ ఉండాలే కాని పరిష్కారాలు వెతకడం వృథా ప్రయాస కావచ్చు.

  10. బంధుత్వం గురించి Surya అభిప్రాయం:

    07/09/2008 3:10 am

    కవిత బాగుంది