కడుపు నిండిపోయింది.
మహాదేవన్ తెలుగు పాటలు స్వరపరిచేడు.
నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు.
ఈ ట్యూను మార్చి ఇళయరాజాని కానీ రెహమాన్ని
కానీ అద్భుతంగా వాయించమనండి చూద్దాం.
ట్యూనుకి పాట రాసినా, పాటని ట్యూను చేసినా బాగుంటే బాగుంటుంది, అంతే కదా?
మీరు ఒక విషయం గురించి విశదీకరించాలి, (మీరు రాయరు అయినా నేను వదల్ను) హిందీ పాటల ఆర్కెస్ట్రైజేషన్ మన పాటల కంటా ఎందుకు బాగుంటుందీ?
ఇంకోటి, “అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టము భామినీ..” గొప్ప ఫీటు, కవి గారికీ, స్వరకర్తకీ, దర్శకుడికీ. వే.ఆ.క్రు.రంగారావుగారు రాసేరు. మీరూ రాస్తే బాగుంటుంది.
మీరిలా జెనరల్ గా రాయడం కంటే ఒకొక్క సినిమా తీసుకుని అందులోని సంగీతం గురించి రాస్తే ఇంకా బాగుంటుంది.
వాస్తవికత ద్రుష్ట్యా పాటలుండాలావద్దా అనుకునే ముందు వాస్తవికత ద్రుష్ట్యా పాటల్నెలా ఇంట్రొడ్యూస్ చెయ్యాలి చూడాలి.
శాంతారాం సినిమల్లో పాటల సంగతి చెప్పండి.
టూకీగా చెప్పుకుంటే “దో ఆంఖే బారాహాత్” పాటల విషయం ఏవిటిట?
“ఉమఢ్ గుమఢ్ కర్ ఆయిరె ఘటా..” పాట తో వానాకాలం, పంట చేతికి రావడం చూపించడం గొప్ప ఫీటు కాదా?
సరిగ్గా వాడుకుంటే “చతుష్షష్టి కళలూ” సినిమాకి ఉపయోగ పడవా? చౌర్యం తో సహా.
సుబ్బరామన్ గారికి దండం పెట్టుకోడం తప్ప ఇప్పుడేం చెయ్యగలం.
ఈసారి దేవదాసు పాటలు మాపిల్లలకి వినిపించినపుడు ఈ మహానుభావుడి గురించి చెప్పాలి.
గానంచేసేవ్యక్తి కి సవాలు ఆవిడచెప్పింది నిజం.
అయితే మీరడిగిన శాస్త్రీయ సంగీతం కి పాప్యులారిటీ పట్ల ఆవిడ సమాధానం బాధ కలిగిస్తుంది.
పోనీ రాజదర్బారుల్లో వున్నప్పుడు, సామాన్యుడు అక్కర్లేదు. ఇప్పుడో?
లేకపోతే సామాన్యుడు అప్పుడూ ఇప్పుడూ సామాన్యుడేనా?
గురువుగారూ,
సామాన్యుణ్ణి పట్టించుకోక మహా మహా సంస్క్రుతులే మట్టి కలిసిపోయేయి. బుధ్ధుడు పాళీ భాషని ఎందుకు ఎంచుకున్నాడండీ?
వ్యావహారిక భాషోద్యమం సామాన్యుడి గురించి కాదా?
మిమ్మల్ని “టప్పాంగుత్తు” పాటలు పాడమనటం లేదు.
సామాన్యుడి ఖర్మ. లేకపోతే శాస్త్రీయ సంగీతం ఖర్మా?
ఇంతకుముందు తెలీక అవాకులూ, చవాకులూ వ్యక్తీకరించాను. ఈ వ్యాసంలో మీరు రాసిన “కంక్లూడింగ్ పేరాగ్రాఫ్” చదివేక తెలిసింది లోతైన వేళ్ళు గురించి.
సంగీత్ సరితా గురించి చిన్న ముచ్చట. లేకపోతే వివిధ్ భారతి గురించి:
మా పిల్లలు, అందరి పిల్లల్లాగే, పొద్దున్న స్కూలుటైముకి తయారవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, ఏందారిరా “బగమంతుడా” అని తెగ ఆలోచించి, వివిధ్ భారతి టెక్నిక్ కనిపెట్టేను. సరిగ్గా ఏడు గంటలకి “భూలేబిసరే గీత్”. భూలేబిసరే గీత్ మొదలయిపోయింది లేవండి, లేవండి అంటే, అదేదో ఆటనుకుని లేచీ వాళ్ళు.
ఇప్పుడు వాళ్ళే “నాన్నా ఇంకా సైగల్ మొదలెట్టలేదు, నువ్వుండు” అంటున్నారు.
దీనివల్ల ఇంకో ఎడ్వాంటేజ్ లేక డిసెడ్వాంటేజ్ ” అదేంటి, సైగల్ సైగలంటావు, మై క్యాజానూ క్యా జాదూ హై.. అలా పాడతాడు? అంటారు వాళ్ళు. “తప్పు, అలా అనకూడదంటే”, ఓకే అనేస్తారు.
నాకే సైగల్ తెలీదు, ముఖేష్ తప్ప.
అయితే “అప్పట్లో సైగల్ షాన్ లేపోతే కైలాష్ ఖేర్” అని నేను చెప్పినప్పుడు “అవునా” అని వాళ్ళు విచిత్రంగా నా వేపు చూస్తారు. అప్పుడు నాకు వేగుంట మోహన్ ప్రసాదు గారు మిగిలిన వాళ్ళు కలిసి ఎప్పుడో ఎనభైల్లో తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి ఆ పుస్తకానికి “టెన్స్ టైంస”ని పేరు పెట్టేరు. అద్భుతవయిన పేరు.
వీళ్ళకి బాలసుబ్రహ్మణ్యవే పాత. ఘంటసాల దాటి, నాగయ్య, సైగల్ అంటే ప్రెజెంట్ టైం కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదనిపించి ఏడవాలో నవ్వాలో తెలీక వెర్రి నవ్వు నవ్వేస్తాను.
మార్గ సంగీతం అంటే ఏవిటండీ? ఇంకో ముక్కకి మీరు విశదీకరించాలి. “శ్రావ్యత” అంటే. శ్రావ్యత రిలెటివ్ కాదా?
తెల్లవారుఝామున ఏమీసేతురలింగా బావుంటుంది. ప్రపంచం పరుగులెడుతున్నపుడు అంత శ్రావ్యంగా వుండదనుకుంటున్నాను. రణగొణధ్వనులమధ్య “జరజర పాకేవిషంలా..”సరిపోతుంది. ఇది తెల్లవారుఝామున చికాగ్గ వుంటుంది. చికాగ్గావున్నప్పుడు, టిట్టిట్టిట్టీం, టిట్టిట్టిట్టీం, టిట్టిట్టిటిటిటీం, టిటిటీంటిటి టిటిటీంటిటి, టిట్టిటీం… వింటే దరిద్రం తీరిపోతుంది. చిట్టిబాబు మ్యూజింగ్స్ ఆఫ్ ఎ మ్యుజీషియన్. ఇంకో వింత. మా ఫ్రెండు, రైల్వేలో గెజిటెడ్ ఆఫీసరు, వాడు ఎంతో ఆనందవయిన మూడ్ లో “బొమ్మనుచేసీ ప్రాణము పోసీ…” అని హుషారుగా బాడీ లాంగ్వేజీ చూపిస్తూ ఆ పాటని కరెక్టుగా పాడతాడు. అదేవిట్రా అంటే, ఏమో ఆపాటే గుర్తొస్తుంది అంటాడు. (సైకాలజీ మాట్లాడొద్దు)
అర్థవంతంగా, అర్థమయ్యేలా పాట సాగితే, అది శాస్త్రీయమా,జానపదమా,సినిమా పాటా లేక విప్లవ గీతమా అనే తేడా లేకుండా ఆస్వాదించొచ్చు. ఆస్వాదన సద్యోజనిత మన:స్పందన. కానీ, శాస్త్రీయ సంగీతాన్ని మెచ్చుకోవడానికి రాగ,తాళ జ్ఞానాలు కావాలంటారు.
నాకంత జ్ఞానం లేదుకానీ, పదాల్ని ఎటుబడితేఅటు విరిచేసి, భావ సంకరం, అర్థవంకరం చేసే శాస్త్రీయ సంగీతం యొక్క శాస్త్రీయతను మాత్రం నేను నిరసిస్తాను. రాగంతో పాటూ భావయుక్తంగా ఆలపిస్తే అది వీనులవిందు, లేకుంటే అది అర్థరహితమైన రాగయుక్తమైన అరుపు అంతే!
బాబ్జీలు గారి పుణ్యమా అంటు ఎప్పుడొ చదివి మరిచి పోయిన ఒక చక్కటి వ్యాసమ్ మళ్ళి చదవగలిగాను. రొహిణి ప్రసాద్ గారి articles are always, Timeless, informative and interesting, with innovative comments. It seems, swarams are necessary in a ragam, but not sufficient., like mathematical conditions. Right sir?
పగలైతే దొరవేరా అనే పాటకు క్రెడిట్ బి.గోపాలంగారికి కూడా దక్కాలనుకుంటాను. పరుచూరి శ్రీనివాస్ గారు బహుశా చెప్పగలరు. రాజేశ్వర్రావుగారి గురించి ఎంత రాసినా తక్కువే. చరణదాసిలోని గులాబీల తావులు పాట దగ్గర్నుంచీ అన్నీ అద్భుతమే. మొదట్లో శ్రీ పెండ్యాల కూడా కావాలని ఆయన దగ్గర అసిస్టెంటుగా కొన్నాళ్ళు పనిచేశారట.
స్వర్గసీమ రోజులనుంచీ బి.ఎన్. గారికి ఆనందభైరవి రాగమంటే ఇష్టం. బంగారుపాప (సత్యం పాడిన ఆటమ్మా పాటమ్మా) మొదలైన సినిమాల్లో దాన్ని సంప్రదాయపద్ధతిలో వాడారు. గుర్తుపట్టడం కష్టం కావచ్చుగాని భాగ్యరేఖలో పెండ్యాల స్వరపరిచిన నీవుండే దాకొండపై అనే పాట ఆనందభైరవి రాగమే. అలాగే బంగారు పంజరంలో రాజేశ్వర్రావు చేసిన మనిషే మారేరా అనే అద్భుత యుగళగీతం కూడా http://chimatamusic.com/. ఇటువంటి subtleties ఈరోజుల్లో కోట్లు గడించే కంపోజర్ల నుంచి ఆశించడం వృథా.
శాస్త్రీయసంగీతమంతా ఆత్మానందం కోసమే అని చెప్పినవారు డా. నేరెళ్ళ వేణుమాధవ్. దాన్ని కాదనడం కష్టమని నాకూ అనిపించింది. ఒకప్పుడు ‘మార్గ’ సంగీతానికి సోషల్ రెలెవెన్సు ఉండే ఉంటుంది కాని ఈరోజుల్లో అటువంటిదేమీ కనబడదు. సాహిత్యం, నాటకం, కొంతవరకూ చిత్రకళ సమకాలీన సమాజానికి సంబంధించినవిగా ఉంటాయనేది తెలిసినదే.
పిల్లలూ, పెద్దవారూ కూడా సంగీతానికి ‘సహజం’గా స్పందించడం స్వాభావికమే. సాహిత్యప్రధానమైన గద్దర్ పాటలవంటివి vibrantగా అనిపించడానికి కారణం వాటికి సమాజంతో ఉండే సంబంధమే కదా.
పాటల్లో లయవిన్యాసాలు గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 11:30 am
కడుపు నిండిపోయింది.
మహాదేవన్ తెలుగు పాటలు స్వరపరిచేడు.
నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు.
ఈ ట్యూను మార్చి ఇళయరాజాని కానీ రెహమాన్ని
కానీ అద్భుతంగా వాయించమనండి చూద్దాం.
ట్యూనుకి పాట రాసినా, పాటని ట్యూను చేసినా బాగుంటే బాగుంటుంది, అంతే కదా?
మీరు ఒక విషయం గురించి విశదీకరించాలి, (మీరు రాయరు అయినా నేను వదల్ను) హిందీ పాటల ఆర్కెస్ట్రైజేషన్ మన పాటల కంటా ఎందుకు బాగుంటుందీ?
ఇంకోటి, “అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టము భామినీ..” గొప్ప ఫీటు, కవి గారికీ, స్వరకర్తకీ, దర్శకుడికీ. వే.ఆ.క్రు.రంగారావుగారు రాసేరు. మీరూ రాస్తే బాగుంటుంది.
మీరిలా జెనరల్ గా రాయడం కంటే ఒకొక్క సినిమా తీసుకుని అందులోని సంగీతం గురించి రాస్తే ఇంకా బాగుంటుంది.
అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 11:02 am
వాస్తవికత ద్రుష్ట్యా పాటలుండాలావద్దా అనుకునే ముందు వాస్తవికత ద్రుష్ట్యా పాటల్నెలా ఇంట్రొడ్యూస్ చెయ్యాలి చూడాలి.
శాంతారాం సినిమల్లో పాటల సంగతి చెప్పండి.
టూకీగా చెప్పుకుంటే “దో ఆంఖే బారాహాత్” పాటల విషయం ఏవిటిట?
“ఉమఢ్ గుమఢ్ కర్ ఆయిరె ఘటా..” పాట తో వానాకాలం, పంట చేతికి రావడం చూపించడం గొప్ప ఫీటు కాదా?
సరిగ్గా వాడుకుంటే “చతుష్షష్టి కళలూ” సినిమాకి ఉపయోగ పడవా? చౌర్యం తో సహా.
సుబ్బరామన్ గారికి దండం పెట్టుకోడం తప్ప ఇప్పుడేం చెయ్యగలం.
ఈసారి దేవదాసు పాటలు మాపిల్లలకి వినిపించినపుడు ఈ మహానుభావుడి గురించి చెప్పాలి.
గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 10:39 am
గానంచేసేవ్యక్తి కి సవాలు ఆవిడచెప్పింది నిజం.
అయితే మీరడిగిన శాస్త్రీయ సంగీతం కి పాప్యులారిటీ పట్ల ఆవిడ సమాధానం బాధ కలిగిస్తుంది.
పోనీ రాజదర్బారుల్లో వున్నప్పుడు, సామాన్యుడు అక్కర్లేదు. ఇప్పుడో?
లేకపోతే సామాన్యుడు అప్పుడూ ఇప్పుడూ సామాన్యుడేనా?
గురువుగారూ,
సామాన్యుణ్ణి పట్టించుకోక మహా మహా సంస్క్రుతులే మట్టి కలిసిపోయేయి. బుధ్ధుడు పాళీ భాషని ఎందుకు ఎంచుకున్నాడండీ?
వ్యావహారిక భాషోద్యమం సామాన్యుడి గురించి కాదా?
మిమ్మల్ని “టప్పాంగుత్తు” పాటలు పాడమనటం లేదు.
సామాన్యుడి ఖర్మ. లేకపోతే శాస్త్రీయ సంగీతం ఖర్మా?
సితార్,సుర్‌బహార్‌ల సవ్యసాచి ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్ గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 10:22 am
పేదరికవే.
పేదరికం గురించి భయవే.
ఫ్యూజన్ సంగీతం మనకేనా? అయ్యో ఖర్మ.
నిజెంగా పేదరికవే, పేదరికంగురించి భయవే.
శ్రుతిలయల నందనవనం గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 10:06 am
గురువుగారూ,
ఇంతకుముందు తెలీక అవాకులూ, చవాకులూ వ్యక్తీకరించాను. ఈ వ్యాసంలో మీరు రాసిన “కంక్లూడింగ్ పేరాగ్రాఫ్” చదివేక తెలిసింది లోతైన వేళ్ళు గురించి.
సంగీత్ సరితా గురించి చిన్న ముచ్చట. లేకపోతే వివిధ్ భారతి గురించి:
మా పిల్లలు, అందరి పిల్లల్లాగే, పొద్దున్న స్కూలుటైముకి తయారవడానికి చాలా ఇబ్బంది పడుతుంటే, ఏందారిరా “బగమంతుడా” అని తెగ ఆలోచించి, వివిధ్ భారతి టెక్నిక్ కనిపెట్టేను. సరిగ్గా ఏడు గంటలకి “భూలేబిసరే గీత్”. భూలేబిసరే గీత్ మొదలయిపోయింది లేవండి, లేవండి అంటే, అదేదో ఆటనుకుని లేచీ వాళ్ళు.
అమ్మో సైగల్ పాడేస్తునాడు, ఏడున్నరయిపోయింది. సంగీత్ సరితా అయిపోయింది పావుతక్కువ ఎనిమిది. సంగీత్ సరితా ట్యూను మా పిల్లలిద్దరికీ కంఠతా.
ఇప్పుడు వాళ్ళే “నాన్నా ఇంకా సైగల్ మొదలెట్టలేదు, నువ్వుండు” అంటున్నారు.
దీనివల్ల ఇంకో ఎడ్వాంటేజ్ లేక డిసెడ్వాంటేజ్ ” అదేంటి, సైగల్ సైగలంటావు, మై క్యాజానూ క్యా జాదూ హై.. అలా పాడతాడు? అంటారు వాళ్ళు. “తప్పు, అలా అనకూడదంటే”, ఓకే అనేస్తారు.
నాకే సైగల్ తెలీదు, ముఖేష్ తప్ప.
అయితే “అప్పట్లో సైగల్ షాన్ లేపోతే కైలాష్ ఖేర్” అని నేను చెప్పినప్పుడు “అవునా” అని వాళ్ళు విచిత్రంగా నా వేపు చూస్తారు. అప్పుడు నాకు వేగుంట మోహన్ ప్రసాదు గారు మిగిలిన వాళ్ళు కలిసి ఎప్పుడో ఎనభైల్లో తెలుగు కవిత్వాన్ని ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి ఆ పుస్తకానికి “టెన్స్ టైంస”ని పేరు పెట్టేరు. అద్భుతవయిన పేరు.
వీళ్ళకి బాలసుబ్రహ్మణ్యవే పాత. ఘంటసాల దాటి, నాగయ్య, సైగల్ అంటే ప్రెజెంట్ టైం కాదు, ప్రెజెంట్ టెన్స్ కాదనిపించి ఏడవాలో నవ్వాలో తెలీక వెర్రి నవ్వు నవ్వేస్తాను.
టెన్స్ టైం గురించి మాట్లాడండి
రాగాలూ స్వరాలూ గురించి baabjeelu అభిప్రాయం:
07/17/2008 8:10 am
మార్గ సంగీతం అంటే ఏవిటండీ? ఇంకో ముక్కకి మీరు విశదీకరించాలి. “శ్రావ్యత” అంటే. శ్రావ్యత రిలెటివ్ కాదా?
తెల్లవారుఝామున ఏమీసేతురలింగా బావుంటుంది. ప్రపంచం పరుగులెడుతున్నపుడు అంత శ్రావ్యంగా వుండదనుకుంటున్నాను. రణగొణధ్వనులమధ్య “జరజర పాకేవిషంలా..”సరిపోతుంది. ఇది తెల్లవారుఝామున చికాగ్గ వుంటుంది. చికాగ్గావున్నప్పుడు, టిట్టిట్టిట్టీం, టిట్టిట్టిట్టీం, టిట్టిట్టిటిటిటీం, టిటిటీంటిటి టిటిటీంటిటి, టిట్టిటీం… వింటే దరిద్రం తీరిపోతుంది. చిట్టిబాబు మ్యూజింగ్స్ ఆఫ్ ఎ మ్యుజీషియన్. ఇంకో వింత. మా ఫ్రెండు, రైల్వేలో గెజిటెడ్ ఆఫీసరు, వాడు ఎంతో ఆనందవయిన మూడ్ లో “బొమ్మనుచేసీ ప్రాణము పోసీ…” అని హుషారుగా బాడీ లాంగ్వేజీ చూపిస్తూ ఆ పాటని కరెక్టుగా పాడతాడు. అదేవిట్రా అంటే, ఏమో ఆపాటే గుర్తొస్తుంది అంటాడు. (సైకాలజీ మాట్లాడొద్దు)
శ్రావ్యత గురించి మీరు విపులంగా విశదీకరించాలి.
రాగాలూ స్వరాలూ గురించి కె.మహేష్ కుమార్ అభిప్రాయం:
07/17/2008 7:37 am
అర్థవంతంగా, అర్థమయ్యేలా పాట సాగితే, అది శాస్త్రీయమా,జానపదమా,సినిమా పాటా లేక విప్లవ గీతమా అనే తేడా లేకుండా ఆస్వాదించొచ్చు. ఆస్వాదన సద్యోజనిత మన:స్పందన. కానీ, శాస్త్రీయ సంగీతాన్ని మెచ్చుకోవడానికి రాగ,తాళ జ్ఞానాలు కావాలంటారు.
నాకంత జ్ఞానం లేదుకానీ, పదాల్ని ఎటుబడితేఅటు విరిచేసి, భావ సంకరం, అర్థవంకరం చేసే శాస్త్రీయ సంగీతం యొక్క శాస్త్రీయతను మాత్రం నేను నిరసిస్తాను. రాగంతో పాటూ భావయుక్తంగా ఆలపిస్తే అది వీనులవిందు, లేకుంటే అది అర్థరహితమైన రాగయుక్తమైన అరుపు అంతే!
రాగాలూ స్వరాలూ గురించి Jayasri అభిప్రాయం:
07/17/2008 7:31 am
బాబ్జీలు గారి పుణ్యమా అంటు ఎప్పుడొ చదివి మరిచి పోయిన ఒక చక్కటి వ్యాసమ్ మళ్ళి చదవగలిగాను. రొహిణి ప్రసాద్ గారి articles are always, Timeless, informative and interesting, with innovative comments. It seems, swarams are necessary in a ragam, but not sufficient., like mathematical conditions. Right sir?
ఓహో యాత్రికుడా.. గురించి Rohiniprasad అభిప్రాయం:
07/17/2008 7:29 am
పగలైతే దొరవేరా అనే పాటకు క్రెడిట్ బి.గోపాలంగారికి కూడా దక్కాలనుకుంటాను. పరుచూరి శ్రీనివాస్ గారు బహుశా చెప్పగలరు. రాజేశ్వర్రావుగారి గురించి ఎంత రాసినా తక్కువే. చరణదాసిలోని గులాబీల తావులు పాట దగ్గర్నుంచీ అన్నీ అద్భుతమే. మొదట్లో శ్రీ పెండ్యాల కూడా కావాలని ఆయన దగ్గర అసిస్టెంటుగా కొన్నాళ్ళు పనిచేశారట.
స్వర్గసీమ రోజులనుంచీ బి.ఎన్. గారికి ఆనందభైరవి రాగమంటే ఇష్టం. బంగారుపాప (సత్యం పాడిన ఆటమ్మా పాటమ్మా) మొదలైన సినిమాల్లో దాన్ని సంప్రదాయపద్ధతిలో వాడారు. గుర్తుపట్టడం కష్టం కావచ్చుగాని భాగ్యరేఖలో పెండ్యాల స్వరపరిచిన నీవుండే దాకొండపై అనే పాట ఆనందభైరవి రాగమే. అలాగే బంగారు పంజరంలో రాజేశ్వర్రావు చేసిన మనిషే మారేరా అనే అద్భుత యుగళగీతం కూడా http://chimatamusic.com/. ఇటువంటి subtleties ఈరోజుల్లో కోట్లు గడించే కంపోజర్ల నుంచి ఆశించడం వృథా.
రాగాలూ స్వరాలూ గురించి Rohiniprasad అభిప్రాయం:
07/17/2008 6:34 am