ధ్రుపధ్ ని వెనక్కి నెట్టేసి “పాప్” గా ముందుకొచ్చిన ఖయాల్ చక్కని, కరెక్టయిన విశ్లేషణ.అన్ని రంగాల్లో నూ ఇంతే అవుతుంది. నిష్పక్షపాతంగా రాయగలిగడం మీకు బాగా వచ్చు.
అమీర్ ఖుస్రో ప్రస్తావన ఎక్కడా రాలేదేమిటి? ఆయనే తబ్లా తయారుచేసేడంటారు?
బాలమురళీ, భీమ్ సేన్ జోషీ ల జుగల్ బందీలో హిందుస్తానీ పధ్ధతి చమక్కు మొదటిసారి తగిలింది.
బాలమురళీ క్రుతి, పాఠం సరిగ్గా గుర్తులేదు,…. మనసుకి హాయి..” ఇదీ పల్లవి. ఇద్దరూ హాయిని హాయ్ హాయ్ గా చాలాసార్లన్నారు. కానీ జోషీగారు చివరగా హా తరవాత శ్రుతి ని తాపీగా తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు యి పలకడం ఒహోయ్ అనిపించింది.
మరి, “యోగ్యతా పత్రం” లో చలంగారు అనుభవించి పలవరించమన్నారు? తూనిక రాళ్ళు లేవన్నారు?
బహుశా ఈ డెభ్భయ్యాళ్ళలో తూనిక రాళ్ళు తయారుచేసుకోగలిగేవా?
మీరు చెప్పినది నిజంగా అక్షర లక్షలే.
ఉదాహరణకి, తాపీ ధర్మారావు గారి ధర్మమాని “విజయవిలాసం” చదివీసేను.
గురువు గారూ,
మధురా(నా)పంతుల పేరయ్య శాస్త్రి గారు తంజావూరులో సాధన చేసేరని రాసేరు.అక్కడ వారు త్యాగరాజ కీర్తనలు సాధన చెయ్యలేదా? ఎందుకంటే, వారి శిష్యులు కంఠస్తం చేసి పాడుకునీవి ఆ నాటికి ప్రచారంలో వున్నవనికదా రాసేరు.
మానాంబుచావడి వెంకటసుబ్బయ్యగారు దక్షిణామూర్తిశాస్త్రి గారికి నేర్పి, పుస్తకం ఇచ్చీ వరకూ త్యాగరాజ కీర్తనలు మనకెవరికీ తెలీవా?
మన సాహిత్యాన్ని, పాశ్చాత్య సాహిత్యంలో ఎప్పటి నుంచో జోరుగా సాగుతున్న “తర్జుమా” జరగవలసిందని మీరు రాసింది, అక్షరలక్షల లాంటి ముక్క.
అయితే మత్తేభాలకి, శార్దూలాలకీ, మిగిలిన వాటికీ ప్రతిపదార్థాలు సరిపోతాయి. మరి ఈ “వెర్స్ లిబర్” కుర్రాళ్ళ సంగతి? దీనికి వ్యాఖ్యానాలు రాయించాలా?
శ్రీశ్రీ, లేకపోతే, మహాప్రస్తానం విషయంలో ఇంతకు ముందు “మిరియాల కషాయం” పట్టించడానికి ప్రయత్నం జరిగింది కదా?
“ముక్కస్యముక్కానువాదాలు” జరగకుండా చూసుకోవడం చాలా అవసరం.
రజనీ గారి జీవిత చరిత్ర కోసం ఇప్పటి నుంచే ఎదురుచూడ్డం ప్రారంభించీసేను.
ఎందుకంటే అది ఖచ్చితంగా లలిత సంగీతం, సినిమా సంగీతం, శాస్త్రీయ సంగీతాల ఎనభైయ్యేళ్ళ చరిత్ర అవుతుంది.
హైదరాబాదు లో రజనీ గారి విలాసం?
రవి గారూ, పెదరాయుడు గారూ ధన్యవాదాలు.
Rama గారూ, ధన్యవాదాలు. ఈ వ్యాసంలో scientific philosophy గురించి చేసిన చర్చ సమగ్రమైనది కాదు. మొదటి వ్యాసం కామెంట్లలో రాజారావు గారు చెప్పినట్టు ఎవరైనా దీని గురించి తెలుగులో వివరమైన వ్యాసాలు రాస్తే బాగుంటుంది.
శ్రి రొహిణి ప్రసాద్ గారు,
మీ వ్యాసం చలా బాగుంది.సాలూరి వారి అభిమానులలొ నెను ఒకడినడి.భీష్మ లొ ‘మనసులొని కొరిక”,’మహదేవ శంభొ’ ‘అలాగే ఆరాధన లొ
‘నా హ్రు దయం లొ నిదురించె చెలీ” ‘వెన్నెల లొనీ వికాసమే’,’నీ చెలిమీ” పాటల గురించి రాయగలరు
ఇంత మంచి కథ చదవటానికి అవకాశం అందించిన ఈమాటకు ధన్యవాదములు. కథను అత్యద్భుతంగా మలిచిన తమ్మినేని యదుకులభూషణ్ గారి శైలికి జోహార్లు… ఈ కథ చదువుతున్న అరగంటలో రాలిన కన్నీరు చెబుతుంది, రచయిత గొప్పదనం.
ఇంత పాత, మంచి కథపై అభిప్రాయాలేమీ లేకపోవటం కొంత ఆశ్చర్యం.
– యువ
వివరించినందుకు “థేంక్స్”.
దేశి నుంచే మార్గ పధ్ధతి వస్తుంది.సహజంగా.
దేశి పధ్ధతి అంటే జానపద సంగీతవా? జానపద సంగీతం కూడా, పాట అంతా తాళసహితంగా, లయతప్పకుండా, రాగం ప్రకారం వుంటుంది. ఇదెలా సాధ్యం?
జానపదుల అనుభూతులు, అనుభవాలు రాగసాహిత్యాలుగా మారేయనుకుందాం.
ఉదాహరణకి:
“చితచిత్త వానా కురిసె, చిత్త వాన కురిసె,
బంగారు వానగురిసే,
ఔనొదిన
బంగారు వాన గురిసె, బాగాయె పనులూ…”
అనే జానపద గీతం తొలకరి కోసం ఎదురు చూస్తూ, చినుకు పడ్డంతోటే ఆ వూరి ఆడపడచు లందరి “అసంకల్పిత ప్రతీకార చర్య” అనుకుందాం. మొదటి సారి వింజమూరి సీత, అనసూయగార్లంత బాగా పాడివుండరు, ఆ అమ్మాయిలు. తరవాత్తరవాత కొన్ని తరాలకి “దేశి” రాజేస్వర రావు వరసని రసవంతం చేసి ఉంటాడు.
అనుభవాన్ని అందరూ అనుభవించడానికి, రాగం, సాహిత్యం, తాళం అన్నీ ఒకేసారి వచ్చి వుండాలి.
రాగం సాహిత్యానికి వెన్నుముకయి మంచి దన్నిస్తుందికదా? అలాటిది రాగం ప్రధానవయిపోయిందెందుకు, మన “మార్గం” లో? చదువెక్కువయిపోడవా? మనల్ని నేను అపహాస్యంచెయ్యట్లేదు.
లేకపోతే, వానచినుకుల్లో తడిసిన ఆ అమ్మయిల కేరింతలకీ, గావు కేకలకీ, తరవాత ఆ వూళ్ళోవున్న సముద్రాల (సీ) గారు సాహిత్యం అతికుంచుంటారా?
ఒక విషయం అనుభవమయింది. మీరు రాసిన “శ్రీ రఘురాం, జయరఘురా..” హంసధ్వని రాగం ఆధారంగా తయారయినదని తెలిసేక ఇంకా బాగునంట్టనిపిస్తోంది.
పరికిణీ, కబ్బా వేసుకుని ఓ బుజ్జి పాప ని చూసి ఎంత ముద్దుగా వుందో అనుకుని, ఎవరిపిల్లో తెలిసేక తెలిసిన వాళ్ళ పిల్లయితే ఇంకా ముద్దనిపించినట్టు. ఇంటర్లూడ్స్ తో సహా గుర్తుండిపోయిన పాటల్లో ఇదొకటి.
Few suggestions on improving the analysis: Apart from the theory of falsifiability, you also should consider Occam’s razor. That one eliminates the teacup in the orbit scenario. Finally, all these theories suffer from a problem — consistency is no guarantee for completeness or correctness (to qualify correctness of a model is that it denotes what you are seeking to model). Karl Popper does not consider the model theoretic point of view — perhaps you can look to philosophers like Wittgenstein to explain that better.
హిందూస్తానీ సంగీతం గురించి baabjeelu అభిప్రాయం:
07/19/2008 3:32 pm
ధ్రుపధ్ ని వెనక్కి నెట్టేసి “పాప్” గా ముందుకొచ్చిన ఖయాల్ చక్కని, కరెక్టయిన విశ్లేషణ.అన్ని రంగాల్లో నూ ఇంతే అవుతుంది. నిష్పక్షపాతంగా రాయగలిగడం మీకు బాగా వచ్చు.
అమీర్ ఖుస్రో ప్రస్తావన ఎక్కడా రాలేదేమిటి? ఆయనే తబ్లా తయారుచేసేడంటారు?
బాలమురళీ, భీమ్ సేన్ జోషీ ల జుగల్ బందీలో హిందుస్తానీ పధ్ధతి చమక్కు మొదటిసారి తగిలింది.
బాలమురళీ క్రుతి, పాఠం సరిగ్గా గుర్తులేదు,…. మనసుకి హాయి..” ఇదీ పల్లవి. ఇద్దరూ హాయిని హాయ్ హాయ్ గా చాలాసార్లన్నారు. కానీ జోషీగారు చివరగా హా తరవాత శ్రుతి ని తాపీగా తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు యి పలకడం ఒహోయ్ అనిపించింది.
అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి baabjeelu అభిప్రాయం:
07/19/2008 2:49 pm
మరి, “యోగ్యతా పత్రం” లో చలంగారు అనుభవించి పలవరించమన్నారు? తూనిక రాళ్ళు లేవన్నారు?
బహుశా ఈ డెభ్భయ్యాళ్ళలో తూనిక రాళ్ళు తయారుచేసుకోగలిగేవా?
మీరు చెప్పినది నిజంగా అక్షర లక్షలే.
ఉదాహరణకి, తాపీ ధర్మారావు గారి ధర్మమాని “విజయవిలాసం” చదివీసేను.
సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు గురించి baabjeelu అభిప్రాయం:
07/19/2008 2:41 pm
గురువు గారూ,
మధురా(నా)పంతుల పేరయ్య శాస్త్రి గారు తంజావూరులో సాధన చేసేరని రాసేరు.అక్కడ వారు త్యాగరాజ కీర్తనలు సాధన చెయ్యలేదా? ఎందుకంటే, వారి శిష్యులు కంఠస్తం చేసి పాడుకునీవి ఆ నాటికి ప్రచారంలో వున్నవనికదా రాసేరు.
మానాంబుచావడి వెంకటసుబ్బయ్యగారు దక్షిణామూర్తిశాస్త్రి గారికి నేర్పి, పుస్తకం ఇచ్చీ వరకూ త్యాగరాజ కీర్తనలు మనకెవరికీ తెలీవా?
త్యాగరాజు కీర్తనల ముందు అందరూ పాడీ కీర్తనలు ఏవి?
అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి baabjeelu అభిప్రాయం:
07/19/2008 2:23 pm
మన సాహిత్యాన్ని, పాశ్చాత్య సాహిత్యంలో ఎప్పటి నుంచో జోరుగా సాగుతున్న “తర్జుమా” జరగవలసిందని మీరు రాసింది, అక్షరలక్షల లాంటి ముక్క.
అయితే మత్తేభాలకి, శార్దూలాలకీ, మిగిలిన వాటికీ ప్రతిపదార్థాలు సరిపోతాయి. మరి ఈ “వెర్స్ లిబర్” కుర్రాళ్ళ సంగతి? దీనికి వ్యాఖ్యానాలు రాయించాలా?
శ్రీశ్రీ, లేకపోతే, మహాప్రస్తానం విషయంలో ఇంతకు ముందు “మిరియాల కషాయం” పట్టించడానికి ప్రయత్నం జరిగింది కదా?
“ముక్కస్యముక్కానువాదాలు” జరగకుండా చూసుకోవడం చాలా అవసరం.
88 ఏళ్ళ యువకులు గురించి baabjeelu అభిప్రాయం:
07/19/2008 4:14 am
రజనీ గారి జీవిత చరిత్ర కోసం ఇప్పటి నుంచే ఎదురుచూడ్డం ప్రారంభించీసేను.
ఎందుకంటే అది ఖచ్చితంగా లలిత సంగీతం, సినిమా సంగీతం, శాస్త్రీయ సంగీతాల ఎనభైయ్యేళ్ళ చరిత్ర అవుతుంది.
హైదరాబాదు లో రజనీ గారి విలాసం?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి అభిప్రాయం:
07/19/2008 3:50 am
రవి గారూ, పెదరాయుడు గారూ ధన్యవాదాలు.
Rama గారూ, ధన్యవాదాలు. ఈ వ్యాసంలో scientific philosophy గురించి చేసిన చర్చ సమగ్రమైనది కాదు. మొదటి వ్యాసం కామెంట్లలో రాజారావు గారు చెప్పినట్టు ఎవరైనా దీని గురించి తెలుగులో వివరమైన వ్యాసాలు రాస్తే బాగుంటుంది.
ఓహో యాత్రికుడా.. గురించి ramakrishna peddada అభిప్రాయం:
07/19/2008 3:26 am
శ్రి రొహిణి ప్రసాద్ గారు,
మీ వ్యాసం చలా బాగుంది.సాలూరి వారి అభిమానులలొ నెను ఒకడినడి.భీష్మ లొ ‘మనసులొని కొరిక”,’మహదేవ శంభొ’ ‘అలాగే ఆరాధన లొ
‘నా హ్రు దయం లొ నిదురించె చెలీ” ‘వెన్నెల లొనీ వికాసమే’,’నీ చెలిమీ” పాటల గురించి రాయగలరు
పొలి గురించి Yuva అభిప్రాయం:
07/19/2008 3:20 am
ఇంత మంచి కథ చదవటానికి అవకాశం అందించిన ఈమాటకు ధన్యవాదములు. కథను అత్యద్భుతంగా మలిచిన తమ్మినేని యదుకులభూషణ్ గారి శైలికి జోహార్లు… ఈ కథ చదువుతున్న అరగంటలో రాలిన కన్నీరు చెబుతుంది, రచయిత గొప్పదనం.
ఇంత పాత, మంచి కథపై అభిప్రాయాలేమీ లేకపోవటం కొంత ఆశ్చర్యం.
– యువ
రాగాలూ స్వరాలూ గురించి baabjeelu అభిప్రాయం:
07/18/2008 5:56 pm
వివరించినందుకు “థేంక్స్”.
దేశి నుంచే మార్గ పధ్ధతి వస్తుంది.సహజంగా.
దేశి పధ్ధతి అంటే జానపద సంగీతవా? జానపద సంగీతం కూడా, పాట అంతా తాళసహితంగా, లయతప్పకుండా, రాగం ప్రకారం వుంటుంది. ఇదెలా సాధ్యం?
జానపదుల అనుభూతులు, అనుభవాలు రాగసాహిత్యాలుగా మారేయనుకుందాం.
ఉదాహరణకి:
“చితచిత్త వానా కురిసె, చిత్త వాన కురిసె,
బంగారు వానగురిసే,
ఔనొదిన
బంగారు వాన గురిసె, బాగాయె పనులూ…”
అనే జానపద గీతం తొలకరి కోసం ఎదురు చూస్తూ, చినుకు పడ్డంతోటే ఆ వూరి ఆడపడచు లందరి “అసంకల్పిత ప్రతీకార చర్య” అనుకుందాం. మొదటి సారి వింజమూరి సీత, అనసూయగార్లంత బాగా పాడివుండరు, ఆ అమ్మాయిలు. తరవాత్తరవాత కొన్ని తరాలకి “దేశి” రాజేస్వర రావు వరసని రసవంతం చేసి ఉంటాడు.
అనుభవాన్ని అందరూ అనుభవించడానికి, రాగం, సాహిత్యం, తాళం అన్నీ ఒకేసారి వచ్చి వుండాలి.
రాగం సాహిత్యానికి వెన్నుముకయి మంచి దన్నిస్తుందికదా? అలాటిది రాగం ప్రధానవయిపోయిందెందుకు, మన “మార్గం” లో? చదువెక్కువయిపోడవా? మనల్ని నేను అపహాస్యంచెయ్యట్లేదు.
లేకపోతే, వానచినుకుల్లో తడిసిన ఆ అమ్మయిల కేరింతలకీ, గావు కేకలకీ, తరవాత ఆ వూళ్ళోవున్న సముద్రాల (సీ) గారు సాహిత్యం అతికుంచుంటారా?
ఒక విషయం అనుభవమయింది. మీరు రాసిన “శ్రీ రఘురాం, జయరఘురా..” హంసధ్వని రాగం ఆధారంగా తయారయినదని తెలిసేక ఇంకా బాగునంట్టనిపిస్తోంది.
పరికిణీ, కబ్బా వేసుకుని ఓ బుజ్జి పాప ని చూసి ఎంత ముద్దుగా వుందో అనుకుని, ఎవరిపిల్లో తెలిసేక తెలిసిన వాళ్ళ పిల్లయితే ఇంకా ముద్దనిపించినట్టు. ఇంటర్లూడ్స్ తో సహా గుర్తుండిపోయిన పాటల్లో ఇదొకటి.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Rama Kanneganti అభిప్రాయం:
07/18/2008 3:15 pm
Few suggestions on improving the analysis: Apart from the theory of falsifiability, you also should consider Occam’s razor. That one eliminates the teacup in the orbit scenario. Finally, all these theories suffer from a problem — consistency is no guarantee for completeness or correctness (to qualify correctness of a model is that it denotes what you are seeking to model). Karl Popper does not consider the model theoretic point of view — perhaps you can look to philosophers like Wittgenstein to explain that better.
:-), enough name dropping on my part,
With thanks,
Rama