బాబ్జీలు గారు రాసింది చూసాక, సరదాకి రాసున్నా. ఎవరినీ ఉద్దేశించి కాదు. :)-
“పాఠక మహాశయా! ఏమంటిరి? ఏమంటిరి? ఇది వస్తు విమర్శయే కానీ, వ్యక్తి విమర్శ కాదే ! అర్హత నిర్ణయించునది ఏదో ఒక పేరే కానీ, ఇంటి పేరూ, అసలు పేరూ కాదే? “పేరూ”, “పేరూ”, “పేరూ?”
సొంత పేరుతో రాసినవే రాతలా? కలం పేరుతో రచనలు చేసిన వాళ్ళు లేరా? అంతయేల? అలనాటి పోతన మాత్యుల భాగవత కథలో ఎంతమంది తమ తమ రాతల్ని ప్రక్షిప్తం చేయలేదు? పరులు రాసిన కావ్యాలకింద, తమవీ దూర్చేయ లేదా? పరాయి భాషల్లో రాసినవి తమ సొంత రచనలనీ, పేరు పేరునా భుజాలు చరుచుకోలేదా? పేరుకోసం పాకులాడుతున్న కవులతో సాహిత్యం ఏనాడో నామహీన మయ్యింది. కాగా నేడు “పేరూ” పేరూ” అంటూ ఇలా రచ్చకెక్కుట………….”
అంటూ ఆ ఎంటీవోడు గొంతు సించుకొని, అదేంటంటారమ్మా, సెవులో ఉంటాది, ఆ గుర్తొచ్చీనాదీ. కర్ణభేరి పగలగొట్టీసీడు. సెప్పద్దూ, సరొస్సతీ జంచనులో యా డవిలాగు యినుకుంటూ కూకుంటే “ఆరు సారాలు” కొట్టీసిన కిక్కొచ్చీ సీనాది. చావులమదంలో శవాలు కూడా లేచి కూకునేవని మా పైడితల్లి తెగ రొప్పీసీనాడు. ఒరే యడ్డబుర్రా, నుయ్యెంతైనా సెప్పు. ఆ ఎంటీ వోడు, ఎంటీ వోడేరా?
ఆఖరుసారిగా నా పాయింటు ఇంకొక్క సారి చెప్పి వొదిలేస్తాను.
నా పేరు నేను మార్చుకోవడానికీ, ఇంకొకరు మార్చడానికీ తేడా వుంటుందని వొప్పుకుంటారా? మీ పేరు మొద్దబ్బాయిగా మీరు పెట్టుకోవడానికీ, ఇంకొకరు పెట్టడానికీ తేడా వుంటుందని ఒప్పుకుంటారా? లేదని మీరంటే, ఇక చెప్పడానికి ఏమీ లేదు. వుంది అని అర్థం చేసుకుంటే, అప్పుడు మీ పేరు మీకిష్టమైనట్టు మీరు పెట్టుకుని, ఇంకొకరు నా పేరు మార్చడానికి వీల్లేదు అని మీరు అనవచ్చు. అలాగే ఇంకొకరి పేరు ఎందుకు మార్చారు అని కూడా అడగవచ్చు. మీ కారు లైట్ల వుదాహరణ ఇక్కడ అన్వయించడానికి కుదరదు. నేను నా పేరు బయట పెట్టకుండా, మీ అసలు పేరు అడిగితే అది తప్పు.
ఇది కూడా డబాయింపు లాగే కనబడితే ఇక వొదిలేద్దాం. ఇప్పటికే సాహిత్యంలో విషయాల గురించి వొదిలేసి, చర్చ పక్కదారి పడుతోంది.
పాఠకుడుగారూ,
నేనూ మీలాగే అనుకున్నాను ముందు. కానీ బాలసుబ్రహ్మణ్యం అభిమానిగా చాలా సంతోషపడ్డాను. ఘంటసాల పాటకి వారసుడు కాబట్టి ఎస్పీబీ “ఘంటసాల” బాలసుబ్రహ్మణ్యం అయిపోయేడు. “సిరివెన్నెల” సీతారామశాస్త్రి లాగ.
ఇంకోటి, “ఘంటసాల” అన్నది వేంకటేశ్వర రావు గారి పేరయిపోయింది, సామాన్యుల ద్రుష్టిలో.
తార్నాకా నుంచి, సైకిల్ మీద, పొద్దున్న ఏడు గంటలకి, బేగంపేట రొప్పుకుంటూ వచ్చిన వెంకట్రావుని “ఏవయింది?” అనడిగితే.
“ఘంటసాలనిజెప్పి ఆడెవుడిదో ఫోటో యేసేరు సూడు” అని చేతిలో వున్న పత్రిక చూపించేడు. ఫోటో బలరామయ్య గారిది. ఆడూయీడూ అనొద్దనిచెప్పి, “వేంకటేశ్వర రావు గారిది కాదు” అన్నాను.
హిరణ్యకశిపుణ్ణి లేపీసేక ఇంకా “గాండ్రు గాండ్రు” మంటూ “కనిపించినోణ్ణి, కనిపించినట్టూ యేసేస్తాను” అని తిరుగుతున్న నరిశిమ్మూర్తి లాగ వున్నోడు, వొక్కసారి చెంచులక్ష్మి ని చూసిన నరసింహమూర్తి గారయిపోయి “చెస్. మన ఘంటసాల అసలు పేరు వెంకటేశ్వర్రావు కదూ. మర్చిపోయేను. వొస్తాను డూటీకి లేటయిపోద్ది” అని తిరుగు టపాలో సైకిలు మీద తార్నాకా బయల్దేరేడు. అదీ ఘంటసాల ఏల్యూయేషను.
ఘంటసాల పాటకి వారసుడు “వీడా” అని మీరు బాధపడొచ్చు. గుర్రాన్నీ, గాడిదనీ ఒకే గాట ఎలా కట్టీసేరూ? అని బాధపడుతూ అడగొచ్చు.
ఇంకొంచెం ముందుకెళ్ళి, హంస “కెపాసిటీ” వుంటే పాలూ నీళ్ళూ వేరు చేయిస్సి అందరికీ చూపించీ వ్యాసం రాసి “ఈ మాట” కి పమ్మించొచ్చు.
ఇంకోటి. అభిప్రాయవేదిక లో మలబారు పోలీసు గేంగీలు తిరుగుతున్నాయి. జార్తగుండండి. మామూలు పోలీసోడు మంచోడు, మలబారోడి ముందు. మలబారోడి చేతిలో పడ్డావా, మన పని అంతే. ఆ బాధ మలబారోడిక్కూడా వద్దు. సంపాదకుల్ని “ఇదేటి బావూ ఈ అన్నేయం” అనడిగితే. వెబ్ జైన్ లో మలబారు “టెక్నిక్ ” మాత్రమే “సూటబుల్” అనన్నారు. అలాగని “నోట్లో నాలుక లేనోళ్ళనీ” యేసేస్తారా అంటే ఆయన సిర్నవ్వు నవ్వి “భక్తిలోపం వుంటే తగలవా?” అన్నారు. మద్దెలో అదేటిదన్నాను జడుసుకుని. వొక్కసారి కుర్సీలోంచి్ “ఆఫీసుచరత్ కరేణుకర కంపిత సాలము” అయిపోయి “ఆయమ్మ ఎర్రిపీరునీ, సాతాను మనవాళ్ళయ్యనీ, మిగిలినోళ్ళనీ యేసుకోని గుండం తొక్కిందా లేదా? అందులో కొంతమందికి కాళ్ళు కాల్నాయా లేదా? ఏటలా సూస్తావు చెప్పూ” అని డబాయించేరు. అవునన్నాను. ఎందుకంటావన్నారు. భక్తిలోపం బాబూ అనొప్పేసుకున్నాను. మరంచేత జార్త.
నాకు ఇప్పటికి అర్ధం అయ్యింది. సీతాఫలం చెట్టు కొమ్మలు ఎందుకు విరిగిపోయి ఉండేవో 🙂 Anyway, let me know some more details about you. May be I know you. I live in seattle.
“ఏ కారణం చేత గానీ, నా ఇంటి పేరు మార్చేస్తే నాకు ఒళ్ళు మండదూ?” అని ప్రశ్నించడానికి మన పేరు చెప్పాల్సిన అవసరం లేదా? నా పేరు గుట్టుగా ఉంచుకుంటాను, ఎదుటి వాళ్ళ పేర్లు సరిగ్గా లేకపోతే తన్ని తగలేస్తానడం మీకే చెల్లింది. రాతలు పోల్చుకోగలరు చదివేవాళ్ళు. నా అంత మొద్దులు కారు లెండి. నేను లైట్లు వేయకుండా అర్థరాత్రి కారు నడుపుతాను కానీ ఎవరి కారు కైనా ఒక లైటు సరిగ్గా లేకపోతే ప్రశ్నించే హక్కు నాకుండదా అని అడగడం ఎక్కడి వ్యంగ్యమో మీకే తెలియాలి? పైగా ట్రాఫిక్ పోలీసులు సరిగ్గా పట్టించుకోరనడం హాస్యాస్పదం కాదా? పేరు చెప్పకపోతే పొండి. ఎవరూ పట్టించుకోరు.
అప్పుడా గంతలే నా జీవితం
నా బరువులే నాటి మనుగడ
నా జీనే అప్పటి నా స్వర్గం
ఝాటీ దెబ్బే నా నరకం
రౌతే నా భగవంతుడు
చిక్కంపోతే భోజనం;
పని చిక్కితే ఉపవాసం
గంతలుపోతే వీక్షణం;
విశ్రాంతికే అప్పుడు కాటకం
నుంచుంటే ఒక శోష,
పడుకుంటేనొక మైకం
అలా ఆ సాహిత్య సాగరాన్ని
లంఘించడమసాధ్యం!
అందుకేనోయ్! మళ్ళీ ఇప్పుడు
మూర్ఖత్వాన్ని మట్టుబెట్టి
మరోసారి పద్య వస్తువు
కళ్ళెం లేని గుఱ్ఱం!
స్వేచ్ఛాప్రాణీ,
స్వైరవిహారీ,
పంచకళ్యాణి.
అయ్యా బాబ్జీలు గారు
మీరు ప్రతిభావంతులనీ, పండితులనీ, విటులనీ [:-) as in English wit; యిటువంటి తర్జుమాలతో వచ్చిన గొడవే ఇది. వెధవది మనం చెప్పొచ్చేదొకటి, ఇతరులకి అర్థమయ్యేది యింకోటీను. పోనీ విట్టులందామా అంటే అది యింకా ఘోరం కదండీ! మొత్తానికి నేను చెప్పొచ్చేది మీకు అర్థమయ్యింది కదా, అదే చాలు] అందరూ ఒప్పుకున్నారు కదా! మరి గజేంద్రుడి మొర ఆలకించని విష్ణు మూర్తిలా ఎన్నాళ్ళు వుంటారు చెప్పండి?
మొద్దబ్బాయి గారూ,
అసలు పేరు చెప్పకపోవడానికీ, అసలు ఇంటి పేరు వేరే వాళ్ళు మార్చేయడానికీ తేడా తెలుసుకోకుండా, మోకాలికీ, బోడిగుండుకీ ముడి పెట్టి, సార్థకనామ ధేయులనిపించుకున్నారు.
ఒక మనిషి తన అభిప్రాయంలో రాసిందే ముఖ్యం. ఆ మనిషి ప్రవర సెకండరీ. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అని మీరంటే, అది మీ అభిప్రాయం అవుతుంది. ఎవరి వ్యంగ్యాలు వారికుంటాయి.
ఈమాట వారు వ్యక్తిగత వ్యంగ్యాలకి చోటు ఇవ్వం అంటూనే, ఇలాంటీ వ్యక్తిగత వ్యంగ్యాలని అనుమతించడం భావ్యంగా లేదు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. “నీ పేరు చెప్పూ, నీ పేరు చెప్పూ, అప్పుడే నువ్వన్న విషయాలు పట్టించుకుంటాము” అని అనడం భావ్యం కాదు. ఒకవేళ అలాగే వుండాలీ అని అనుకుంటే, ఈమాట వారు ఆ రూలే పెట్టాలి.
నా అబిప్రాయంలో విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. వ్యాసకర్తని ఒక్క మాట అనలేదు.
అభిప్రాయాలతో ఎవరూ మారరు సాహిత్యానికి సంబంధించిన వరకూ. కానీ అలాంటి అభిప్రాయాలు వుంటాయి అని తెలియడం కోసమే ఈ అభిప్రాయ వేదిక. ఆ పైన సెన్సార్ చెయ్యడానికి పెద్దలున్నారు.
పేరు చెప్పకపోవడం వల్లనే, నా అభిప్రాయానికి విలువ లేదని మీరంటే, అలాగే కానియ్యండి.
పాఠకుడు
ఛందోధర్మము
గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
“అలాగే బాల సుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు మార్చేసి నట్టు పేరు పెడితే, ఆయనకి మాత్రం ఒళ్ళు మండదూ? ” అంటూ చక్కగా సెలవిచ్చారు.
నాకయితే భలే నచ్చింది.
అసలు పేరే ప్రపంచానికి చెప్పడానికి వెనకాడే వాళ్ళు ఇలా అడగొచ్చా?
“బాబీ, చంటీ, బుజ్జీ, నానీ, పండూ” లాంటి ముద్దుపేర్లతో ముద్దుముద్దుగా విమర్శించే వాళ్ళంటే ఎవరికిష్టం ఉండదూ?
( మీరే నాకు ఆదర్శం. నేనూ నా పేరు మొద్దబ్బాయి గా మార్చేసుకున్నా, చూసారా? )
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/21/2008 6:29 am
బాబ్జీలు గారు రాసింది చూసాక, సరదాకి రాసున్నా. ఎవరినీ ఉద్దేశించి కాదు. :)-
“పాఠక మహాశయా! ఏమంటిరి? ఏమంటిరి? ఇది వస్తు విమర్శయే కానీ, వ్యక్తి విమర్శ కాదే ! అర్హత నిర్ణయించునది ఏదో ఒక పేరే కానీ, ఇంటి పేరూ, అసలు పేరూ కాదే? “పేరూ”, “పేరూ”, “పేరూ?”
సొంత పేరుతో రాసినవే రాతలా? కలం పేరుతో రచనలు చేసిన వాళ్ళు లేరా? అంతయేల? అలనాటి పోతన మాత్యుల భాగవత కథలో ఎంతమంది తమ తమ రాతల్ని ప్రక్షిప్తం చేయలేదు? పరులు రాసిన కావ్యాలకింద, తమవీ దూర్చేయ లేదా? పరాయి భాషల్లో రాసినవి తమ సొంత రచనలనీ, పేరు పేరునా భుజాలు చరుచుకోలేదా? పేరుకోసం పాకులాడుతున్న కవులతో సాహిత్యం ఏనాడో నామహీన మయ్యింది. కాగా నేడు “పేరూ” పేరూ” అంటూ ఇలా రచ్చకెక్కుట………….”
అంటూ ఆ ఎంటీవోడు గొంతు సించుకొని, అదేంటంటారమ్మా, సెవులో ఉంటాది, ఆ గుర్తొచ్చీనాదీ. కర్ణభేరి పగలగొట్టీసీడు. సెప్పద్దూ, సరొస్సతీ జంచనులో యా డవిలాగు యినుకుంటూ కూకుంటే “ఆరు సారాలు” కొట్టీసిన కిక్కొచ్చీ సీనాది. చావులమదంలో శవాలు కూడా లేచి కూకునేవని మా పైడితల్లి తెగ రొప్పీసీనాడు. ఒరే యడ్డబుర్రా, నుయ్యెంతైనా సెప్పు. ఆ ఎంటీ వోడు, ఎంటీ వోడేరా?
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు అభిప్రాయం:
08/21/2008 6:22 am
మొద్దబ్బాయి గారూ,
ఆఖరుసారిగా నా పాయింటు ఇంకొక్క సారి చెప్పి వొదిలేస్తాను.
నా పేరు నేను మార్చుకోవడానికీ, ఇంకొకరు మార్చడానికీ తేడా వుంటుందని వొప్పుకుంటారా? మీ పేరు మొద్దబ్బాయిగా మీరు పెట్టుకోవడానికీ, ఇంకొకరు పెట్టడానికీ తేడా వుంటుందని ఒప్పుకుంటారా? లేదని మీరంటే, ఇక చెప్పడానికి ఏమీ లేదు. వుంది అని అర్థం చేసుకుంటే, అప్పుడు మీ పేరు మీకిష్టమైనట్టు మీరు పెట్టుకుని, ఇంకొకరు నా పేరు మార్చడానికి వీల్లేదు అని మీరు అనవచ్చు. అలాగే ఇంకొకరి పేరు ఎందుకు మార్చారు అని కూడా అడగవచ్చు. మీ కారు లైట్ల వుదాహరణ ఇక్కడ అన్వయించడానికి కుదరదు. నేను నా పేరు బయట పెట్టకుండా, మీ అసలు పేరు అడిగితే అది తప్పు.
ఇది కూడా డబాయింపు లాగే కనబడితే ఇక వొదిలేద్దాం. ఇప్పటికే సాహిత్యంలో విషయాల గురించి వొదిలేసి, చర్చ పక్కదారి పడుతోంది.
పాఠకుడు
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి baabjeelu అభిప్రాయం:
08/21/2008 12:12 am
మొద్దబ్బాయి గారూ, “వొక్క సిటం ఆగాలి తవరు.”
పాఠకుడుగారూ,
నేనూ మీలాగే అనుకున్నాను ముందు. కానీ బాలసుబ్రహ్మణ్యం అభిమానిగా చాలా సంతోషపడ్డాను. ఘంటసాల పాటకి వారసుడు కాబట్టి ఎస్పీబీ “ఘంటసాల” బాలసుబ్రహ్మణ్యం అయిపోయేడు. “సిరివెన్నెల” సీతారామశాస్త్రి లాగ.
ఇంకోటి, “ఘంటసాల” అన్నది వేంకటేశ్వర రావు గారి పేరయిపోయింది, సామాన్యుల ద్రుష్టిలో.
తార్నాకా నుంచి, సైకిల్ మీద, పొద్దున్న ఏడు గంటలకి, బేగంపేట రొప్పుకుంటూ వచ్చిన వెంకట్రావుని “ఏవయింది?” అనడిగితే.
“ఘంటసాలనిజెప్పి ఆడెవుడిదో ఫోటో యేసేరు సూడు” అని చేతిలో వున్న పత్రిక చూపించేడు. ఫోటో బలరామయ్య గారిది. ఆడూయీడూ అనొద్దనిచెప్పి, “వేంకటేశ్వర రావు గారిది కాదు” అన్నాను.
హిరణ్యకశిపుణ్ణి లేపీసేక ఇంకా “గాండ్రు గాండ్రు” మంటూ “కనిపించినోణ్ణి, కనిపించినట్టూ యేసేస్తాను” అని తిరుగుతున్న నరిశిమ్మూర్తి లాగ వున్నోడు, వొక్కసారి చెంచులక్ష్మి ని చూసిన నరసింహమూర్తి గారయిపోయి “చెస్. మన ఘంటసాల అసలు పేరు వెంకటేశ్వర్రావు కదూ. మర్చిపోయేను. వొస్తాను డూటీకి లేటయిపోద్ది” అని తిరుగు టపాలో సైకిలు మీద తార్నాకా బయల్దేరేడు. అదీ ఘంటసాల ఏల్యూయేషను.
ఘంటసాల పాటకి వారసుడు “వీడా” అని మీరు బాధపడొచ్చు. గుర్రాన్నీ, గాడిదనీ ఒకే గాట ఎలా కట్టీసేరూ? అని బాధపడుతూ అడగొచ్చు.
ఇంకొంచెం ముందుకెళ్ళి, హంస “కెపాసిటీ” వుంటే పాలూ నీళ్ళూ వేరు చేయిస్సి అందరికీ చూపించీ వ్యాసం రాసి “ఈ మాట” కి పమ్మించొచ్చు.
ఇంకోటి. అభిప్రాయవేదిక లో మలబారు పోలీసు గేంగీలు తిరుగుతున్నాయి. జార్తగుండండి. మామూలు పోలీసోడు మంచోడు, మలబారోడి ముందు. మలబారోడి చేతిలో పడ్డావా, మన పని అంతే. ఆ బాధ మలబారోడిక్కూడా వద్దు. సంపాదకుల్ని “ఇదేటి బావూ ఈ అన్నేయం” అనడిగితే. వెబ్ జైన్ లో మలబారు “టెక్నిక్ ” మాత్రమే “సూటబుల్” అనన్నారు. అలాగని “నోట్లో నాలుక లేనోళ్ళనీ” యేసేస్తారా అంటే ఆయన సిర్నవ్వు నవ్వి “భక్తిలోపం వుంటే తగలవా?” అన్నారు. మద్దెలో అదేటిదన్నాను జడుసుకుని. వొక్కసారి కుర్సీలోంచి్ “ఆఫీసుచరత్ కరేణుకర కంపిత సాలము” అయిపోయి “ఆయమ్మ ఎర్రిపీరునీ, సాతాను మనవాళ్ళయ్యనీ, మిగిలినోళ్ళనీ యేసుకోని గుండం తొక్కిందా లేదా? అందులో కొంతమందికి కాళ్ళు కాల్నాయా లేదా? ఏటలా సూస్తావు చెప్పూ” అని డబాయించేరు. అవునన్నాను. ఎందుకంటావన్నారు. భక్తిలోపం బాబూ అనొప్పేసుకున్నాను. మరంచేత జార్త.
ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:
08/20/2008 9:06 pm
రాసీ వాళ్ళ “అర్హత” తో పేచీ?
రాసీ వాళ్ళూ “రాసినదాని” తో పేచీ?
“అర్హత” లేన్నివాళ్ళు మంచి కవిత్వం రాస్తే పేచీ?
“అర్హత” వున్న వాళ్ళు ఎలా గిలికినా “పేచీ”?
చాలా పెద్ద పేచీ.
వినాయక చవితి కథ గురించి Phanikumar Erramilli అభిప్రాయం:
08/20/2008 4:10 pm
నాకు ఇప్పటికి అర్ధం అయ్యింది. సీతాఫలం చెట్టు కొమ్మలు ఎందుకు విరిగిపోయి ఉండేవో 🙂 Anyway, let me know some more details about you. May be I know you. I live in seattle.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి మొద్దబ్బాయి అభిప్రాయం:
08/20/2008 1:45 pm
బావుంది మీ డబాయింపు!
“ఏ కారణం చేత గానీ, నా ఇంటి పేరు మార్చేస్తే నాకు ఒళ్ళు మండదూ?” అని ప్రశ్నించడానికి మన పేరు చెప్పాల్సిన అవసరం లేదా? నా పేరు గుట్టుగా ఉంచుకుంటాను, ఎదుటి వాళ్ళ పేర్లు సరిగ్గా లేకపోతే తన్ని తగలేస్తానడం మీకే చెల్లింది. రాతలు పోల్చుకోగలరు చదివేవాళ్ళు. నా అంత మొద్దులు కారు లెండి. నేను లైట్లు వేయకుండా అర్థరాత్రి కారు నడుపుతాను కానీ ఎవరి కారు కైనా ఒక లైటు సరిగ్గా లేకపోతే ప్రశ్నించే హక్కు నాకుండదా అని అడగడం ఎక్కడి వ్యంగ్యమో మీకే తెలియాలి? పైగా ట్రాఫిక్ పోలీసులు సరిగ్గా పట్టించుకోరనడం హాస్యాస్పదం కాదా? పేరు చెప్పకపోతే పొండి. ఎవరూ పట్టించుకోరు.
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
08/20/2008 1:08 pm
పద్యవస్తువును నేను.
నేనొకప్పుడు కళ్ళెంలేని గుఱ్ఱం
స్వేచ్ఛాప్రాణీ, స్వైరవిహారీ, పంచకళ్యాణి
నా చూపే నా పరిధి, నా దారే నా వీధి
తిన్నదే భోజనం,
విన్నదే సంగీతం,
చూసిందే ఇంద్రజాలం,
చేసిందే చమత్కారం.
నాకు గతంలో కళ్ళెం తొడిగారు
డెక్కలకి లాడాలు కొట్టారు
కళ్ళకి గంతలు కట్టారు
మూతికేమో చిక్కం వేసారు
వీపుకి జీను తగిలించారు
మెడకి గంటలు కట్టారు
తమ పిచ్చన గమ్యాలు వివరించారు!
నా బాధ్యతలను ఘోషించారు!
రౌతులెందరో వీపెక్కారు
కర్మకొద్దీ బరుఘోలు మోయించారు
లేకపోతే బళ్ళు లాగించారు
ఉరుకులు పరుగులు వేయించారు
కాదంటే కొరడా ఝుళిపించారు
అప్పుడా గంతలే నా జీవితం
నా బరువులే నాటి మనుగడ
నా జీనే అప్పటి నా స్వర్గం
ఝాటీ దెబ్బే నా నరకం
రౌతే నా భగవంతుడు
చిక్కంపోతే భోజనం;
పని చిక్కితే ఉపవాసం
గంతలుపోతే వీక్షణం;
విశ్రాంతికే అప్పుడు కాటకం
నుంచుంటే ఒక శోష,
పడుకుంటేనొక మైకం
అలా ఆ సాహిత్య సాగరాన్ని
లంఘించడమసాధ్యం!
అందుకేనోయ్! మళ్ళీ ఇప్పుడు
మూర్ఖత్వాన్ని మట్టుబెట్టి
మరోసారి పద్య వస్తువు
కళ్ళెం లేని గుఱ్ఱం!
స్వేచ్ఛాప్రాణీ,
స్వైరవిహారీ,
పంచకళ్యాణి.
అయ్యా బాబ్జీలు గారు
మీరు ప్రతిభావంతులనీ, పండితులనీ, విటులనీ [:-) as in English wit; యిటువంటి తర్జుమాలతో వచ్చిన గొడవే ఇది. వెధవది మనం చెప్పొచ్చేదొకటి, ఇతరులకి అర్థమయ్యేది యింకోటీను. పోనీ విట్టులందామా అంటే అది యింకా ఘోరం కదండీ! మొత్తానికి నేను చెప్పొచ్చేది మీకు అర్థమయ్యింది కదా, అదే చాలు] అందరూ ఒప్పుకున్నారు కదా! మరి గజేంద్రుడి మొర ఆలకించని విష్ణు మూర్తిలా ఎన్నాళ్ళు వుంటారు చెప్పండి?
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ వ్రాలు
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు అభిప్రాయం:
08/20/2008 12:24 pm
మొద్దబ్బాయి గారూ,
అసలు పేరు చెప్పకపోవడానికీ, అసలు ఇంటి పేరు వేరే వాళ్ళు మార్చేయడానికీ తేడా తెలుసుకోకుండా, మోకాలికీ, బోడిగుండుకీ ముడి పెట్టి, సార్థకనామ ధేయులనిపించుకున్నారు.
ఒక మనిషి తన అభిప్రాయంలో రాసిందే ముఖ్యం. ఆ మనిషి ప్రవర సెకండరీ. శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అని మీరంటే, అది మీ అభిప్రాయం అవుతుంది. ఎవరి వ్యంగ్యాలు వారికుంటాయి.
ఈమాట వారు వ్యక్తిగత వ్యంగ్యాలకి చోటు ఇవ్వం అంటూనే, ఇలాంటీ వ్యక్తిగత వ్యంగ్యాలని అనుమతించడం భావ్యంగా లేదు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. “నీ పేరు చెప్పూ, నీ పేరు చెప్పూ, అప్పుడే నువ్వన్న విషయాలు పట్టించుకుంటాము” అని అనడం భావ్యం కాదు. ఒకవేళ అలాగే వుండాలీ అని అనుకుంటే, ఈమాట వారు ఆ రూలే పెట్టాలి.
నా అబిప్రాయంలో విషయానికే ప్రాధాన్యత ఇచ్చాను. వ్యాసకర్తని ఒక్క మాట అనలేదు.
అభిప్రాయాలతో ఎవరూ మారరు సాహిత్యానికి సంబంధించిన వరకూ. కానీ అలాంటి అభిప్రాయాలు వుంటాయి అని తెలియడం కోసమే ఈ అభిప్రాయ వేదిక. ఆ పైన సెన్సార్ చెయ్యడానికి పెద్దలున్నారు.
పేరు చెప్పకపోవడం వల్లనే, నా అభిప్రాయానికి విలువ లేదని మీరంటే, అలాగే కానియ్యండి.
పాఠకుడు
ఛందోధర్మము గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:
08/20/2008 10:22 am
కుక్కపిల్ల, అగ్గిపెట్టి, సబ్బు బిళ్ళ, గుర్రం, గాడిద కావేవీ కవితకనర్హం. ఎటొచ్చీ రాసేవాళ్ళకున్న అర్హత తోనే పేచీ.
రాజాశంకర్ కాశీనాథుని
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి మొద్దబ్బాయి అభిప్రాయం:
08/20/2008 10:13 am
పాఠకుడు గారూ,