పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. కేసు గురించి Madhav అభిప్రాయం:

    08/31/2008 7:45 pm

    బాబ్జీలు గారూ,

    ఎంత రంధ్రాన్వేషణ ఐనా ఇలా ప్రతీ అచ్చుతప్పూ ఏకరువు పెట్టక్కర్లేదనుకుంటాను. ఎక్కడా లేని ఇన్ని తప్పులీ కథకే ఎందుకున్నై? అనడిగితే సరిపోయేది.

    తప్పులెందుకున్నై? అని దబాయించే బదులు తప్పులెందుకున్నై? అని సామరస్యంగా అడిగితే, 2005లో ఈమాట సంపాదకుల సాదకబాధకాలు ఏమైనా తెలిసేవేమో. ఇప్పుడిక తెలీవు, వారు చెప్పరు కాబట్టి.

    కానీ, ఒకటి మాత్రం నిజం. సంపాదకులదే బాధ్యత, తప్పైనా ఒప్పైనా, అప్పుడైనా, ఇప్పుడైనా ఇంకెప్పుడైనా. అందుకని ఇప్పుడూ తప్పు మాదే.. అలాగే 2011లో ఒక పాఠకుడు…

    “అద్రుష్టానికీ, అదృష్టానికీ – క్రుతజ్ఞతకీ, కృతజ్ఞతకీ తేడా తెలియని సంపాదకు లుండడం మన టెల్గూ* భాష దరిద్రం.
    – ఒక పాఠకుడు.
    (* టెల్గూ అనేది జాన్ స్మిత్ ప్రభావం వల్ల రాసినది)

    – అని తిడితే, అప్పుడూ తప్పు మాదే. తప్పదు కదా మరి? ఐనా పర్లేదు లేండి. మాకు మీ అభిప్రాయాలు ముఖ్యం.

    మాధవ్ మాచవరం
    (ఈమాట సంపాదకుల తరపున అని రాయదల్చుకోలేదు, వారి అనుమతి అడగలేదు కాబట్టి)

  2. క్రీడాభిరామము:1 వ భాగం గురించి paravastu naga sai suri అభిప్రాయం:

    08/31/2008 7:17 pm

    తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు. తాత్పర్యమ్ కూడా ఇస్తే చాలా మందికి తెలుస్తుంది.

  3. కేసు గురించి baabjeelu అభిప్రాయం:

    08/31/2008 11:15 am

    ఈ మాట సంపాదకులకు,
    “ప్రూఫ్ రీడింగ్” బాధ్యత ఎవరిది?
    రాసిన వారిదా? ప్రచురించేవారిదా?
    ఈ కథ లోనే ఇన్ని తప్పులెలా దొర్లేయి? ఇన్ని అచ్చుతప్పులు ఇంకెక్కడా లేవు. అభిప్రాయాలులో తప్ప. (నేను రాసిన వాటిలోనే కొన్ని మా నాలుగోక్లాసు నాన్నమ్మ చదివి, “నాకు చూపించేకే పంపించు” అంది. తప్పైపోయింది క్షమించు అనగలిగేను)
    మచ్చుకి…
    “ఇదిగో లింగమ్మా నువ్వు ఈ కోర్టుంఉందు…” ( అందుకే లింగమ్మకి అన్నం నీళ్ళు బంద్ అన్న ఒక్క మాట అర్థమైంది, కోర్టంఉందు ఎవరికీ అర్థంకాదు)
    “విశయం” (తెలంగాణా యాసా?)
    “ఒక రకంగా వాళ్ళు కూడా ఆవిడ పక్షాన చేరరేమో” (పత్రికల వాళ్ళు, ఆవిడ పక్షాన చేరేరేమో కదా?)
    “నష్ఠపోవడం” (బహుశా నష్టం తాలూకా బాధని ధ్వనింపచేయడం కోసం అయుండొచ్చు)
    “ఒక సాధారణ పౌరిడికి..” ( సాధారణ పౌరుడు, కోన్ కిస్కా గాడు. వాడి గురించి ఎలా రాసినా తప్పు కాదు. వోటర్ల లిస్టులో వాడి “ఫోటో” బదులు మరొహడిది వేసినా, “ఫొటొ” సరిగ్గానే వుంటుంది, పేరు మార్చేసినా ఎవడిక్కావాలి?)
    “నా కొడుకుని ఉత్త పుక్యానికి నోముకున్నారు..”
    “దృష్ఠీ” (దృష్టి తీవ్రత కోసవేమో?)
    ఇక వాక్యాల “విశయం.”
    రచయిత కి తెలంగాణా యాస మీద పట్టులేదు. పట్టు లేని విషయాన్ని పట్టించుకోకూడదు, రచయిత. లేకపోతే అప్పటిదాకా “మరియాదస్తుల” భాషలో సాగే వాక్యం ఆవుపెయ్యా కాదు, గేదే పెయ్యా కాదు అన్నట్టు తయారవుతుంది.
    వుదాహరణకి:
    “మొఖాలు ఎర్రగా చేసుకోవడం తప్ప మరేం చేయలేక పోయినరు”
    “అందుకే గుర్రుగా … చూస్తున్నరు ఇద్దరూ”
    “.. టీవీ వాళ్ళొచ్చినరు, … మట్లాడినరు..” ఎస్సై ఇంటి దారి పట్టినడు.
    లింగమ్మ జడ్జీ గారితో శిష్ట వ్యావహారికంలోనే మొదలెట్టి, తెలంగాణా యాసలోకి వెళిపోతుంది.
    “నీ కాల్మొక్కుత..” తప్పు. “నీ కాల్మొక్త..” ఆయనెవరండీ, ముప్ఫై, నలభైయేళ్ళ కిందటే అంత చక్కగా రాసేరు. ఇప్పుడేవొచ్చిందీ?
    రాసిన ప్రతిసారీ “భాషా” అనే రాసేరు. అందరూ “బాషా” అనే అంటారు. “అలీఫ్, బే… ల్లో కూడా “భ” లేదనే అనుకుంటున్నాను. “మోహన” గారేవయినా చెప్పగల్రా? లేదంటె మా సాజిద్ నడిగితే తెలిసిపోతుంది. అడుగుతాను.
    ఈ కింది వాక్యం “ఇండిపెండెంటు” గా చదివి “కర్తా, కర్మా మరియు క్రియ” చెప్పగలిగిన వాళ్ళకి సాహిత్య అకాడెమీ “ప్రైజు గేరంటు” (అమంగళము ప్రతిహతమౌగాక)

    “హైదరాబాదులో మిత్రుడు, హైకోర్టు జడ్జీ ఒకాయన పిల్లవాడి పెళ్ళికి వెళితే ఆయన నోటి మీదుగా విన్న విషయం….”
    (రసాత్మకవైన వాక్యం అందరికీ అదే రసాన్ని అందించాలి. లేకపోతే అది రాసినవాడిదే తప్పు. చదివిన వారిది కాదు.)
    “విప్లవ్ గారితో గొడవ/అభిప్రాయభేదం వల్ల ఇలా “రంధ్రాన్వేషణ” చేస్తున్నాడెహె” అని అనొచ్చు. (నాకే అనిపించింది. నచ్చకపోతె వదిలెయ్యొచ్చుగా? ఎందుకింత రాధ్ధంతం? పిల్లలు ఎలాగా తిడుతున్నారు ఈ మాట చదవటం మొదలెట్టేక వాళ్ళతో ఆడ్డం, వగైరాలు మానేసేనని)
    నిజాయితీ గురించి బాధపడేవాళ్ళు నిజవైన వాళ్ళు. విప్లవ్ గారికి నిజాయితీ గురించి
    నిర్దుష్టవైన అభిప్రాయం వుంది. ఇలాటి వారి రచనల గురించే వివరంగా రాయాలి.
    ఈ రచనలో నిజాయితీ వుంది. ఇంకేం లేదు.
    ఇక వరవర రావూ, గద్దర్ గురించి: వాళ్ళిద్దర్నీ “లింగమ్మ” తప్పు పట్టింది. వీళ్ళిద్దరూ ఏవనకుండావుంటే ఆవిడ కొడుకు బతికుండేవాడన్న బలవైన అభిప్రాయంతో. తప్పో రైటో లింగమ్మది, రచయితది కాదు.
    మై డియర్ విప్లవ్,
    మరో భారత యుధ్ధాన్ని రచించగలిగిన వారని స్వయంగా చెప్పుకునారు. ఇదేం లెక్క?
    అభిప్రాయాల్ని పట్టించుకోకండి. చదివేసి వూరుకోండి.
    ఈ విషయం మీద రాయండి.
    “ఇద్దరు నడివయసు ఆడవాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. “చెస్. ఎదవ లోకం” అన్న మూడ్ లో వున్నారిద్దరూ. ఇద్దరికీ మాటలు కలిసాక తెలిసింది ఇద్దరూ కొడుకుల్ని పోగుట్టుకున్నవాళ్ళేనని. అదికూడా “వొరం రోజుల కిందటే” ఇద్దరు కొడుకులూ పోయేరు. ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది “ఇదేటిదని”. ఒహావిడ కొడుకు పోలీసు, మరొహావిడ కొడుకు (అవిడకి తెలుసు ఎటు పోయేడో, ఎక్కడున్నాడో) చదువూ సంధ్యా, తల్లీ తండ్రీ అందర్నీ వదిలేసి చిన్నప్పుడే అటెటో పోయేడు.”

    మీలాటి వారే రాయగలరు. రాయండి.

  4. సాయము శాయరా డింభకా! గురించి rama అభిప్రాయం:

    08/31/2008 7:10 am

    DEAR NARAYANA SWAMEE,

    మీరు రాసినదాన్ని “కథ” అని ఇవాళ ఎవరూ అనరు. కథ చెప్పటం ఒక టెక్నిక్, ఒక క్రియేటివ్ స్కిల్. మంచి కథ ఎలా వుంటుందో Márquez ని చదివి గానీ, ఝుంపాలాహిరిని చదివి గానీ ముందు తెలుసుకొండి. కథలకేం ఎప్పుడన్న రాయొచ్చు. ఆ విద్య పట్టుబడితే. లేకపోతే మీ పరిచయం లోని బిరుదులన్నీ వ్యర్థమే సుమా..!!

    రామ.

  5. విలువలు గురించి sukumar అభిప్రాయం:

    08/30/2008 11:05 pm

    Very moving and touching story. It does make you wonder if human beings are generally so selfish & narrow-minded as Raju, Chandu found out, to their utter dismay?

    Having said that all hope is not lost since there are people like Scott too in this same world! Thank God for that. I guess it also reveals as to how EXPENSIVE a death in a foreign country is.

    Also it throws up another interesting question: what would have been the case had Ravi been an American citizen and still wished his body to be sent to India for cremation?

  6. ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    08/30/2008 10:06 pm

    రవికిరణ్ గారూ,

    మీరడిగిన ప్రశ్నలకి మీవీ నావీ సమాధానాలు ఒకటిగానే ఉంటాయి – మనిద్దరి అభిప్రాయాలని చూస్తే. మరో విధంగా అనిపిస్తే, అది నా వాదనలో లోపం. రచయిత జీవితంతో ప్రమేయం లేకుండా రచనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిష్కర్షగానే చెప్పాను.

    కొడవళ్ళ హనుమంతరావు

  7. ఛందోధర్మము గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    08/30/2008 8:13 pm

    సత్యన్నారాయణ గారు,
    జీవితాన్ని చిత్రించడం సాహిత్యవంటే, జీవితంలో కల్పన లేదని కాదండీ. బతుకులో వాస్తవవెంత నిజవో, కల్పనా అంతే అవసరం. కల్పనే లేకపోతే మన బాల్యంలో వొక అత్యద్భుతవైన కలని, ఆ కలతో మమైకవైపోయిన ఆ బతుకుని పారేసుకోవడవే కదా. కల్పనా, కలే లేకపోతే యవ్వనం ఎంత నిస్సారంగా నీరుకారిపోతుందో మీకు తెలీదా, నాకు తెలీదా. నేలనొదిలి కొన్నిసార్లు పగటి కలల్లో ప్రయాణం అనుభవం లేని మనిషంటూ ఎవరైనా వుంటారా. జీవితాన్ని చిత్రించడవంటే ఎక్కాలతోపాటూ, ఏడేడు సముద్రాల అవతలనున్న మార్రిచెట్టు తొఱ్ఱలో చిలక గురించి కూడా చెప్పటం అండీ. అందుకని లెక్కల మాస్టారు ఎంత నిజవో, ఎగిరే గుర్రవెక్కిన రాకుమారుడు జీవితంలో అంత అవసరవే. మరందుకని బతుకంటే, నవ్వులూ, ఏడ్పులూ మాత్రవే కాదండీ, కలలూ, కల్పనలూ కూడా వుంటాయని మనవి.

    హనుమంత రావుగారు, సాయి గారు,
    వొకవేళ సరైన ఆస్తిపాస్తులుండి, బతుకులో పోషణకోసం రాజీపడవలసిన అవసరం లేకపోతే, అప్పుడు ఆ రచయితలు తప్పులు చేస్తే వాళ్ల రచనలకి ఆ తప్పులంటుతాయా? కడుపులో చల్లకోసవైనా, ఒంట్లో వేడి కోసవైనా తప్పు, తప్పే కదండీ. ఐతే తప్పు చేసిన వాళ్ళకీ, తప్పు చేసే వాళ్ళకీ బతుకులో కష్టం, సుఖం అనుభవించే అర్హత లేదా? ఆ అనుభవాన్ని చెప్పుకునే అవకాశం వాళ్లకి లేదా? మనుషులుగా వాళ్ళని మనం నెత్తిన పెట్టుకుని తిరగక్కరలేదు, కానీ కవులుగా, రచయితలుగా, కళాకారులుగా వాళ్ల సృష్టిని కించపచవలసిన అవసరం వుందా? వొక వేళ వాళ్ల ఒళ్ళు కొవ్వెక్కే తప్పులు చేసున్నా, ఆ తప్పుల్ని వాళ్ళ రచనలకి ఆపాదించాల్సిన అవసం వుందా? చండీ దాసు గారికున్నంత ధైర్యం లేని రచయితలు, బలహీనులు, వ్యసనపరులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, రాజకీయనాయకులు (?) వీళ్ళెవరికీ కస్టాన్నీ, సుఖాన్నీ, ఏడుపుని, నవ్వునీ, కన్నీళ్ళనీ, ప్రేమనీ, నిజాన్ని, కల్పన్నీ, వాళ్ళు నమ్మిన నిజాన్నీ (వాళ్లకది ఆచరణ సాద్యం కాకపోవచ్చు) కాగితం పైన పెట్టే అర్హత లేదా.

  8. మంచులో తడిసిన ఉదయం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    08/30/2008 5:42 pm

    బాబ్జీలు గారూ, జయప్రభ గారూ,
    నా కవితపై మీ స్పందన కి , ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
    గత కొద్ది వారాలుగా ఇండియా లో Whirlwind tour లో ఉండటం వల్ల ఈమాట చూడలేకపోయాను.

    జయప్రభ గారూ,
    “జలపాత(స్నాన)పు ఖడ్గచాలనానికి” వెరవని వాళ్ళు , మంచు గాలి వణుకు కి జడుస్తారంటారా?! 🙂

  9. ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    08/30/2008 5:31 am

    సాయి గారికి:

    బాబ్బాబు, నా సందేశం లోని చివరి పేరాని ఏరి పారేసి మిగిలినవి చదువుకుందురూ. మీకు పుణ్యం వుంటుంది. అక్కడ కాస్తంత కవి హృదయాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నించాను. క్షమించండి. 🙂

    హనుమంతరావు గారు ఇలా అన్నారు:

    సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.

    దీనితో నేను ఏకీభవిస్తున్నాను. నేను సాధారణ పాఠకుణ్ణే. ఆస్కర్ వైల్డ్ ఏకవాక్యాలు (one-liners) నాకు బాగా నచ్చేవి. ఆ తర్వాత అతని జీవిత చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం తెచ్చి చదివితే తెలిసింది అతన్ని రెండు సంవత్సరాలు అప్పట్లో ఒక చెప్పుకోదగని నేరానికి చెరసాలలో పెట్టారని.

    అది చదివి హతాశుణ్ణయ్యాను. కానీ అతని వాక్యాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. అతని నేరం (?) ఏమాత్రమూ నచ్చదు. 🙂

    నమస్కారములతో

    పామర్తి సత్యనారాయణ

  10. సాయము శాయరా డింభకా! గురించి ramani అభిప్రాయం:

    08/30/2008 3:50 am

    ఈ బాదరాయణ సంభంద బాంధవ్యాలేమిటో కాని, ఒక్కమాట నిజం. మనకోసమంటూ లేదా మనమెలా ఉన్నామో అని ఒక్కసారన్నా ఆలోచించేవాళ్ళే మనవాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. మన అవసరానికి అప్పటికప్పుడు మనదగ్గరికి వచ్చేవారే మనకి సహాయకులు గాని, మన సహాయం అడిగితే మటుకు ఎవ్వరైనా కాదనేవారే.

    ఈ కథ లో నైనా ఆ సమయంలో అండ్రియా , హార్లీ , ఇంకో తెల్ల జంట అక్కడికి వచ్చారు కాబట్టి ఆ సమయంలో సహాయకంగా చేయి అందించగలిగారు కాని, లేకపోతే వాళ్ళు కూడా అక్కరికి రాని మిత్రులే కదా!

    ” నమ్మితే ప్రాణాలైనా ఇస్తాము, నమ్మడమేరా కష్టం
    ముక్కుసూటిగా ఉన్నది చెప్తాము నచ్చకుంటే మీ ఖర్మం
    కష్టమొచ్చిన కన్నీరొచ్చిన
    చెదరని కదలని ఇంధ్రధనుస్సులం మేమే ఇండియన్స్ ”

    అన్నది గుర్తోస్తోంది. కథలో ‘మన ‘ అనుకొనేవాళ్ళని విలన్ గా(అక్కరకి రాని నేస్తం గా) చూపించడం కొంచం బాధగానే ఉంది.