పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Kameswara Rao అభిప్రాయం:

    12/01/2008 5:51 am

    “భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు.”
    అని హనుమగారన్నది సరి కాదు. భావకవిత్వం ముందర వాక్యగతమైన (వ్యాకరణ ధిక్కారంతో వచ్చే) అస్పష్టత చాలా వరకూ లేదు. కాని భావగతమైన అస్పష్టత ఉంది. వాక్యగతమైన అస్పష్టత కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంతకన్నా పై మెట్టు మరొకటి ఉంది! అది కవిత్వంలో పొరలు (layers). అంటే పైకి స్పష్టంగా ఒక అర్థాన్నిస్తూనే అంతర్గతంగా మరొక (మరికొన్ని) అర్థాన్ని స్ఫురింపజెయ్యడం. ఇక్కడనేనంటున్నది శ్లేష గురించి కాదు.

    “కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.” అని వినీల్ గారన్నారు.

    But I cannot! ఒక పాఠకుడికి, తనకి అర్థం కాని కవిత్వాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అధికారం ఉంది కానీ, దాన్నసలు కవిత్వమే కాదనడానికీ, విమర్శించడానికీ హక్కు లేదని నా ఉద్దేశం. ఆ కవిత్వం వేరెవరికైనా అర్థం కావచ్చు, వాళ్ళా కవిత్వాన్ని అనుభవించవచ్చు. ఏదైనా కవిత్వం ఎవరికీ అర్థం కాకుండా పోతే, దానికి ఆదరణ లేక అది సహజమరణం పొందుతుంది. దాని గురించి విమర్శించడం అనవసరం.

    ఈ వ్యాసంలో వేలూరివారు ప్రస్తావించిన కవిత్వానికి కొలమానాలు కాని, టెక్నిక్కు కానీ మొత్తం కవిత్వానికంతకీ వర్తించేవి తయారుచెయ్యడం అసాధ్యం, అనర్థం కూడా. ఒకో “రకమైన” కవిత్వానికీ (కొన్ని ప్రత్యేక కొలమానాలతో) ఒకో టెక్నిక్కు సృష్టించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఒక రకమైన కవిత్వానికి సంబంధించిన టెక్నిక్కుని మరొక రకమైన కవిత్వమ్మీద ప్రయోగించడం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వెయ్యడమవుతుంది!

  2. అసంపూర్ణ చిత్రం గురించి nagaraju raveender అభిప్రాయం:

    12/01/2008 3:15 am

    ఈ కవిత ఒక నిశబ్దపు అనుభూతిని మిగిల్చింది.

  3. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి nagaraju raveender అభిప్రాయం:

    12/01/2008 2:47 am

    హైకు కవితాత్మను ఆవిష్కరింప జేస్తే , ఈ వ్యాసం హైకూను సాక్షాత్కరింప జేసింది.

  4. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/30/2008 11:16 pm

    To Give Credit Where It Is Due

    సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.

    గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.

    మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. 🙂 పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.

    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:

    “అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”

    వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. 🙂 మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు – ఛాందసులు, అఛాందసులు – అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.

    నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?

    ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.

    ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి ఆ కవిత చేరేదేమో కూడాను.

    చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
    [2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.

  5. మూడు జ్ఞాపకాలు గురించి phani అభిప్రాయం:

    11/30/2008 10:17 am

    [సూచన: ఈమాటలో ఒక రచయిత రచన చదివేటప్పుడు ఆ రచయిత పేరు మీద క్లిక్ చేస్తే, ఆ రచయిత ఈమాటలో రాసిన రచనల జాబితా వస్తుంది. లేదా, ప్రతిపేజీలో ఎడమవైపు పైన ఉన్న లింకులలో “ఈమాట రచయితలు” మీద క్లిక్ చేస్తే ఇప్పటిదాకా ఈమాటలో రాసిన రచయితల జాబితా వస్తుంది. – సం.]

    సంఘటనలు చెప్పిన తీరు అద్భుతం. చదువుతున్నట్టు కాక సంఘటన జరుగుతున్న ప్రదేశంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ముందు వ్రాసిన కథలు చదవడమెలా?

  6. కుతంత్రం గురించి phani అభిప్రాయం:

    11/30/2008 9:03 am

    కథ ఆసాంతం చదివిన తరువాత బాగుందనిపించింది. అయితే, చిక్కల్లా చివరి దాకా చదివించ లేక పొవడమే. కథ సగం దాక చదవడానికి ఇబ్బందిగా వుంది.

  7. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి e.bhaskaranaidu అభిప్రాయం:

    11/30/2008 2:59 am

    రవి శంకర్ గారు,
    సినిమా పాటల పై మీ పరిశోదనా వ్యాసం చాల వివరణాత్మకంగా వుంది. సినిమాల పాటలకు సాహిత్యంలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయ వచ్చు. మీ కృషికి చాలా దన్యవాదాలు.

  8. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి e.bhaskaranaidu అభిప్రాయం:

    11/30/2008 2:20 am

    1965 లో ఎస్సెసెల్సి లో ప్రవరాఖ్యుని పాఠం ఉండేది. పరీక్షల్లో తెలుగులో ఒక ప్రశ్న వచ్చింది. అది: ప్రవరాఖ్యుడు హిమాలాయాలకు వెళ్ళి ఏమి చూసాడు? అని. దానికి సమాదానంగా నేను అందులోని పద్యం “అటజనికాంచె భూమిసురుదడంబరచుంబి…” అనే పద్యము రాసాను. సమాదానము గద్యంరూపములో రాయ కుండా పద్యంలో రాస్తె మార్కులు వేస్తారో లేదో అనే భయం వుండేది. కాని ఆ పద్యం మీద అభిమానంతో సమాదానం పద్యరూపంలోనే వ్రాసాను. ఆపద్యం అంటే అంత అభిమానం ఆనాడు నేర్చుకున్న్ ఆ పద్యం ఈనాటికి నాకు కంఠతా వచ్చు. ఆ రోజుల్లోనే తెలుగులో నాకు చాల ఎక్కువ మార్కులు వచ్చాయి.

    మను చరిత్రలోనె ననుకుంటా…. ఒక వచనం వుండేది అది….విద్యగొనుటయె గాక గుటగుటకు గురుతోనా యని……..” అని వుండేది. అది ఏ అస్వాసంలో వుందో ….

  9. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    11/29/2008 3:52 pm

    హనుమ గారు
    Thanks for the reference.
    ఇది రాద్దామనుకోలేదు, కాని నేను రాసింది అస్పష్టంగా ఉందేమోనని అనుమానం వచ్చి రాయడం. “ఈ మాట” యొక్క అభిప్రాయవేదిక చర్చావేదిక గా మారకుండా ఉండాలని గింజుకుంటూ కూడా రాయడం.

    గ్లోబలైజేషన్్ ఉన్నా లేకపోయినా, “నారికేళపాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టమే కాదు, నిజాయితీ అని కూడా అనిపించడంలేదు నాకు.

    వినీల్్ గారు “అస్పష్టతకు కారణాలేమిటి?” అని చాలా మంచి ప్రశ్న వేసారు. రెండు పాయింట్లు చెప్పి నా అభిప్రాయంతో ముగిస్తాను.
    1. అస్పష్టత చాలా సార్లు subjective అనిపిస్తుంది.
    2. అస్పష్టత వేరు complexity వేరు.
    ఒకరికి అస్పష్టంగా ఉన్నది ఇంకొకరికి ఉండకపోవచ్చు. లోకం మొత్తానికి అస్పష్టంగా ఉన్నది కవికి స్పష్టంగా ఉండొచ్చు, hopefully! Subjective అన్నప్పుడు, అస్పష్టతకు సవాలక్ష కారణాలుండొచ్చు. పాఠకుడు సరిగ్గా చదవకపోవడం నుంచి, భాషా పరిచయం లేకపోవడం నుంచి అచ్చుతప్పులు గ్రహించకపోవడం దాకా ఎన్నో కారణాలుండొచ్చు. వాటికి కవిత మాత్రం కారణం కాదు. కాబట్టి వాటి గురించి, అంటే “1” గురించి కాదు ఈ చర్చ అని అనుకుంటున్నాను.

    ఇక “2” వ అంశం. ఆలోచనా విస్తృతి పెరిగినప్పుడు complexity తగ్గిపోతుందని కాదు కాని, complexity పట్ల స్పష్టత పెరుగుతుంది. వీటి ఉదాహరణలు అందరి దగ్గరా ఉంటాయి.

    నేను సమర్థించని “అస్పష్టత” పై రెండు కోవలకు సైతం చెందనిది, ఇతరమైనది! కవిత అర్థం కాకముందు కాదు, దాని అర్థం తెలుసుకున్నాక కూడా అది అస్పష్టంగా కనిపించడం గురించి. అప్పుడు ఆ “కవిత” అనే రాతలో ఏముంది డొల్ల అని ఎందుకు నిలదీయకూడదో తెలియదు, నిజాయితీగా. నేనన్న “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టం అని అన్నది దీని గురించి మాత్రమే.
    ==================
    విధేయుడు
    -Srinivas

  10. నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    11/29/2008 2:02 pm

    కవిత్వంలో అస్పష్టతను గురించి ప్రస్తావిస్తూ నేను కోట్ చేసిన తిలక్ కవితా పంక్తులలో , కవిత్వంలో అస్పష్టతని తిలక్ సమర్థిస్తున్నారన్న అభిప్రాయం కలిగితే అది నా పొరపాటు మాత్రమే.
    ఆయన వ్రాసిన “నవత – కవిత” కవిత లో కవిత్వం పట్ల ,కవిత్వం లో అస్పష్టత పట్ల ఆయన అభిప్రాయాలు చూడవచ్చు.బహుశా ఏభై ఏళ్ళక్రితం వ్రాసిన కవిత అయినా మౌలికంగా కవిత్వాన్ని గురించిన కొన్ని ఆలోచనలు ఇప్పటికీ Out of context కాకపోవటం కూడా మనం చూడవచ్చు. ఈ కవిత నగ్నమునిగారికి ఆయన వ్రాసిన లెటర్ అని విన్నాను.