పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. ఎంగిలాకులు గురించి యుగంధర్ అభిప్రాయం:

    01/25/2009 7:56 am

    జిన్హే నాజ్ హై హింద్ పర్ .. వో కహాన్ హై?
    ప్యాసా సినిమాలో సాహిర్ లూఢియాన్వీ పద్యాన్ని తలపించారు!

  2. చంద్రుణ్ణి చూపించే వేలు గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    01/25/2009 7:52 am

    ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించినందుకు ధన్యవాదాలు. హైకూ గుఱించి తెలుసుకున్నాను.

    ఆఖరి పేరా చదువుతుండగా ఓశో వ్రాసిన “సౌందర్యత అంతర్మార్గంలో నుంది”, అన్న వ్యాసం గుర్తుకువచ్చింది.

    – రాకేశ్వర

  3. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama అభిప్రాయం:

    01/25/2009 7:04 am

    వేలూరి గారూ !

    మీరు ఒప్పుకున్నారు, అందుకు సంతోషం. వెల్చేరు నారాయణరావు గారు..తెలుగు కవిత్వానికి సంబంధించి చెప్పుకోవలసిన పని చేసిన మాట నిజమే అయినా…ఆయన కృషి మాత్రమే సరిపోతుందని చెప్పగలమా?బంగారమ్మ గారు కవిత్వం రాసిన తరవాత మరి అర్ధశతాబ్దానికి ఒక విమర్శ వచ్చిందని చెప్పుకోవడం …విమర్శనా రంగానికి నామర్దా కాదా?అది తెలుగులొ మంచి విమర్శ ఏ కారణంగా గానీ లేదని చెప్పడమే కదా ఒకరకంగా!

    ఈ లెఖ్ఖన ఇవాళ కవితారంగంలో అనేక కల్పనా విన్యాసాలు , చతురతలు ప్రదర్శించిన కవయిత్రుల గురించి..వారి కవిత్వం లోని విశేషాంశాలు గురించి విపులంగా వివరించడానికి ఇంకో యాభయ్యేళ్ళు పట్టాలన్నమాట !! వారు జీవించి వుండగా ..వారి కల్పన గురించి పాక్షికంగానే తప్ప విశేషించి చెప్పటం ఏ విమర్శకులూ ఎందుకు చేయకూడదో ?! అపచారమా ? లేక అభద్రతా భావమా?? లేక ” ఈ ఆడాళ్ళ రాతల గురించి మనమెందుకు మాట్లాడాలిలే..అన్న తూష్ణీ భావమా? మీరయినా విశదీకరించ వచ్చునే?

    ఒక కృష్ణశాస్త్రి గురించి చర్చించిన మాదిరిగానే…ఒక శ్రీరంగం శ్రీనివాస రావుని గురించి మాట్లాడిన రీతి లోనే… తెలుగుకవితారంగం లోని స్త్రీలని గురించి అయితే మౌనమో..లేదా అస హనమో తప్ప ఒక్కరయినా వారి కవితల్లోని అందాలకి పరవశం తో మాట్లాడిన వారు లేకపోవడం వెనకవున్న కారణాలని ఆలోచించనవసరం లేదా? ప్రపంచం లోని వేరే ఏ చోటనయినా ఇటువంటి పరిస్థితి కన్పించదే? కవిత్వం విషయంలో స్త్రీల వ్యక్తీకరణల్లో ఉన్న భిన్నత్వం మీద పదుగురూ చర్చించడం మంచిదేమో?! పోయిన శిలాలోలిత విషయం లో ప్రదర్శించిన ఆద్రత … ఆతృత…ఉన్న శిలాలోలితల మీద చూపలేని సంశయానికి గల కారణాలేమిటో?

    రమ.

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal అభిప్రాయం:

    01/24/2009 10:33 am

    జనవరి 8 న రమ గారు అన్నారు- ‘అన్నమయ్య కవులకే కవి, సంగీతం వినడానికి త్యాగరాజు’ అనీ. అందుకే కదా, ఒకరు ‘పద సంకీర్తనాఛార్యులు’, మరొకరు వాగ్గేయకారులు అనే గుర్తింపు పొందారూ. ఈ రెండూ (సాహిత్య సంగీతాలు) తెలుగు వాణి, మన తల్లి, మనకే ఇవ్వడం మన సుకృతం. అన్నమయ్య పదపుష్పాలకి సంగీత పరిమళం ఎమ్మెస్ కలిగిస్తే త్యాగయ్య స్వర మాలికలోని పదపుష్పాలకి సాహితీ సొబగులు మంగళంపల్లి వారు తీసుకొచ్చారు. అయినా త్యాగయ్య రత్నమైన ‘ఎందరో మహానుభావులు’ సాహిత్యపరంగా ఎంత గొప్పదీ! –తాతిరాజు వేణుగోపాల్

  5. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి సూర్యుడు అభిప్రాయం:

    01/24/2009 8:19 am

    మీ వ్యాసం చాలా బాగుంది.

    ద మ్యాథమ్యాటికల్ సెంచురీ అని ఓ పుస్తకం లో హిల్బెర్ట్ కీలకోపన్యాసంలో ఇచ్చిన సమస్యలు గణిత శాస్త్ర అభివృద్ధికి ఎలా ఉపయోగపడ్డాయో బాగా వివరించారు, ఇక్కడ దాని లంకె :

    http://press.princeton.edu/chapters/i7789.html

    నమస్కారములతో,
    /సూర్యుడు 🙂

  6. పడవ మునుగుతోంది గురించి narendra అభిప్రాయం:

    01/24/2009 2:25 am

    చాలా మంచి కథ చదివాను. ధన్యవాదాలు.

  7. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    01/24/2009 12:42 am

    చావలి బంగారమ్మగారి కవిత “నీడ“ను వారి కవితాసంకలనము “కాంచనవిపంచి“లో చదువగలరు.

    శాయి

  8. రచయితలు – ఎడిటర్లు గురించి zilebi అభిప్రాయం:

    01/23/2009 9:30 pm

    వెంకటెశ్వర రావు గారు-

    వ్యాసం చాలా బాగున్నది.

    తారాస్థాయి పదం తారస్థాయి అని ఉండాలనుకుంటాను.

    జిలేబి.
    http://www.varudhini.tk

  9. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి zilebi అభిప్రాయం:

    01/23/2009 9:02 pm

    నాకు నచ్చిన పద్యం మీ ఈ శీర్షిక చాలా బాగుంది. నాకు నచ్చిన పద్యం శీర్షికన నా బ్లాగులో దాశరథి శతకం నుంచి వ్రాసాను. చదవగలరు.

    http://www.varudhini.tk

    జిలెబి.

  10. ఖాళీ సీసాలు గురించి Navuluri Venkateswara Rao అభిప్రాయం:

    01/23/2009 1:59 am

    This is in continuation of my noting of the 18th.
    Emile Zola’s novel I have referred to is L’assommoir (The Dram Shop–a shop selling cheap liquor distilled on the premises), which is full of street language using a large number of “obscure” slang words and curses. It portrays the wretched life of a poor laundress, Gervaise.
    In his preface, the writer says, “When it was serialized in a newspaper, it was attacked and denounced with unprecedented ferocity…I wanted to depict the inexorable downfall of a working-class family in the poisonous atmosphere of our industrial suburbs…(It is) about the common people that does not lie and that smells of the common people.”
    This novel is part of Zola’s 20-novel Roughon-Macquart series.
    For no real reason, Virginie, a prostitute and Gervaise fight with each other in a washhouse, exchanging swear words, with the onlookers enjyoing the “spectacle” and ogling at the naked bodies of the two women, who tear each others dresses including the inner clothing. The fight and bad mouthing each other are elaborately dealt with.
    The Telugu story seems to have been written under the influence of that great novel in general and the fight in particular.