పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. అతడు, నేను, అతడి కథ గురించి Vamsi అభిప్రాయం:

    03/05/2009 8:44 pm

    Seems like even suicide follows Darwin’s rule of survival. “It is not the strongest of the species that survives, nor the most intelligent that survives. It is the one that is the most adaptable to change.”

    Btw, thanks for this analysis and I would love to see more of this stuff in eemaata in future.

    –Vamsi

  2. పురూరవ: శ్రవ్య నాటిక గురించి nagaraju raveender అభిప్రాయం:

    03/05/2009 8:11 pm

    చాలా అరుదైన నాటకం. మీరు దీనిని ఈ వెబ్ సైట్ లో పెట్టి చాలా గొప్ప పని చేశారు.

  3. బోడి పద్యం గురించి Lakshmi Kallakuri – ‘Sailakshmi’ అభిప్రాయం:

    03/05/2009 7:39 pm

    పేరు వచ్చిన వాళ్ళు ఏ మాట రాసినా చెల్లుతుందని ‘ఈ మాట’ వాళ్ళు ప్రచురించడము ఏమీ బాగలేదు. మాటలన్నిటిని మురికి చేసి కుండ మీదబెట్టి కోసి ముక్కలు చేసి నెత్తుటితో దహనము చేసి సూపీని, గంగానమ్మని, గాయతృలను బిస్మిల్లా అంటూ వక్రంగా ఖననము చేస్తూ మూఢమతిని అంటే మెచ్చుకోవాలా?
    ‘సాయిలక్ష్మి’

  4. నన్నెచోడుని క్రౌంచపదము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    03/05/2009 7:51 am

    కృష్ణ మోహన రావు గారూ,

    మీ వ్యాసం అద్భుతంగా వుంది. సాహిత్యంలోంచి చరిత్రని తవ్వి తీసే కోణం బాగుంది. ఈ తరహా వ్యాసాలు ఈమధ్య తెలుగులో చూసినట్లు లేదు. మీ సిద్ధాంతాన్ని చక్కగా ప్రతిపాదించారు.
    నాదొక చిన్న సందేహం. వీరేశలింగం, బుర్రా శేషగిరిరావు, కోరాడ రామకృష్ణయ్య, వీరందరూ నన్నెచోడుడు క్రీ.శ 1160 – 1170 తరవాత వాడనీ ఒక సిద్ధాంతాన్ని బలపరిచారు. దానికి చాలా కారణాలు చూపించారు. అంతకుముందు వేటూరి ప్రభాకర శాస్త్రి క్రీ.శ. 1120 కాలం వాడనీ చెప్పారు. కానీ ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేదు. అయ్యుండచ్చు, కావచ్చు నంటూ సందిగ్ధంలో వదిలేసారు. అలాగే ఇతను ఖచ్చితంగా 1160 కాలానికి చెందినవాడనీ చెప్పడానికి ఈ ఆధారంగా ఈ క్రింది పద్యం చూపించారు.

    ఆతపభీతి నీడలు రయంబున మ్రాకులక్రిందు దూరెనో
    ఆ తరులుం దృషాభిహతులై తమ నీడలు తార త్రాగెనో
    భాతి ననంగ నీడ లురుపాదపమూలమలం దడంగె గ్రీ
    ష్మాతపమధ్య వాసరములందు జలింపకయుండు నెండలన్

    ఈ పద్యం అర్థం ( మీకోసం కాదు, మిగతావారికి ) – “ఎండ వేడికి భయపడి చెట్ల నీడలు చెట్ల క్రింద దూరాయి. దాహానికి తట్టుకోలేక చెట్లు తమ నీడల్ని తామే తాగేసాయన్నట్లు ఎక్కడా నీడే లేదు. అంత భయంకరమైన వేసవది”.
    ఈ పద్యం నన్నెచోడుడు “కళింగత్తు పరణి” అనే తమిళ కావ్యాన్నుండి సంగ్రహించాడనీ చెబుతారు. ఈ పద్యం తమిళ ప్రతి నాకు తెలీదు. (సంపాదించడానికి ప్రయత్నిస్తాను).

    కళింగత్తు పరణి రాసింది జయంగొండాన్ అనే కవి. ఇతను మొదటి కులోత్తుంగ చోళుడి ఆస్థాన కవి. ఈ చోళ రాజు కాలం సుమారుగా 1135. దీన్ని బట్టి జూస్తే క్రీ.శ 1160 – 1170 తరవాత కాలం అయ్యే అవకాశం వుంది కదా? ఏమంటారు?

  5. కొండ నుంచి కడలి దాకా గురించి baabjeelu అభిప్రాయం:

    03/05/2009 7:35 am

    శ్రీనివాస్ గారికి,
    వుభయకుశలోపరి.
    అర్థం కాని భాషలో వ్రాసిన దానిని, అర్థం కాదని వదిలెయ్యడం, ఎవరి mail వల్లో కష్టపడి చదవడం, చదివి దానికి సమాధానమీయడం మీ సహృదయతకు తార్కాణాలు. మరేట్లేదుకానండీ. మా మంచిపని చేసేరండీ. ఈ మాట ప్రతీ సంచికలోనూ ఏదో వొహటి పెట్టాల మీరు. లేకపోతే వొల్లకోం.

  6. ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా గురించి baabjeelu అభిప్రాయం:

    03/05/2009 7:12 am

    లక్ష్మన్న గారూ,
    ఆయొక్క “సిగరెట్ పేకెట్ సీను” నాకిప్పటికీ గుర్తుంది. ఎందుకో గానీ, ఈ సినిమా, జల్సాఘర్, పథేర్ పాంచాలి కన్నా బాగున్నాదనిపిస్తుంది. ఆచేత్తోనే, శ్యామ్ బెనెగళ్ సినిమాల గురించి కూడా రాద్దురూ. ముఖ్యంగా భూమిక సినిమా గురించి.అదే చేత్తో, బాబ్బాబూ, తెలుగు సినిమాల గురించి కూడారాయండీ. సినిమాని మేధావులు ఎంత “అసుంటా” పెట్టినా, దాని ప్రభావం జన జీవనం మీద చాలా ఎక్కువ. మీ లాటి వాళ్ళు రాసి, ఈ మాటలో పడితే, పక్కన పెట్టడానికి కుదరని సినిమాకి మర్యాదా మన్ననా. దయచేసి తెలుగు సినిమాల గురించి కూడా రాయండి.

  7. అనంతకవితాకాంచి గురించి రాఘవ అభిప్రాయం:

    03/04/2009 8:38 am

    భలే. నవీనబంధకవిత్వం. ప్రేమబంధానికి సూచికగా కాఞ్చీబంధం వాడడం బావుందండీ.

  8. కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar అభిప్రాయం:

    03/04/2009 7:28 am

    శ్రీనివాస్ గారూ,

    నేను ఉదహరించిన సైట్, మీరు ఇచ్చిన సైట్ ఒకటే అని ఇప్పుడే గ్రహించాను.
    నేను bookmark చేసుకున్న mainpage url, మీరు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఉండడంతో వెంటనే గుర్తు పట్టలేక పోయాను. Thanks for your effort anyways.

    తెలుగు లలిత సంగీతం అంటే ఆసక్తి ఉన్న వారు, “ఎత్తవోయీ కేల” పాటని ఇక్కడ విని ఆనందించవచ్చు

    Thanks to Sri B. N. Murty who originally recorded these songs.

    రాజాశంకర్

  9. కొండ నుంచి కడలి దాకా గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/04/2009 6:01 am

    శ్రీనివాస్ గారూ!
    మీరు ఇబ్బంది పడకండి. మీ అభిప్రాయానికి తెనుగు అనువాదం పంపినా నేను respond కాను.నా భావాలు నావి.

    రమ.

  10. నన్నెచోడుని క్రౌంచపదము గురించి రాఘవ అభిప్రాయం:

    03/04/2009 4:32 am

    కృష్ణమోహనరావుగారూ, మీరు నన్నెచోడుని కాలాన్ని నిర్ధారించడానికై లక్షణగ్రంథాలని ఇతర కవుల ప్రయోగాలనీ వాడుకుంటూ వ్యాసాన్ని తార్కికంగా నడిపించిన తీరు ఆద్యంతమూ చాలా బావుంది.

    ఇలాంటి అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు.