పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. తెలుగు నిఘంటువు గురించి… గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    09/06/2009 2:09 pm

    శ్రీనివాస్ గారూ
    థాంక్సండీ మంచి సమాచారం ఇచ్చారు.
    మీరిచిన్న లింకులోని పుస్తకం కాటలాగులాగ ఉన్నది. ఆఖరున ఇచ్చిన ప్లేట్ లలో ఆనాటి ఫ్రెంచి వారు తెలుగునేర్చుకొని వాటి తర్జుమాలను వ్రాసుకోవటం అబ్బురపరచింది. రెండిటి చేతి వ్రాతా ఒకరిదే ననుకొంటున్నాను. గమనించారా?

    ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉండిన తెలుగు వారిలో ఎవరైనా శ్రమిస్తే వాటి మ్యాను స్క్రిప్టులు సేకరించగలిగే అవకాసం ఉంటుందనిపిస్తుంది. గోపీ గారి టైములోలా మరీ ఎక్కువగా శ్రమించక్కరలేదేమో ఈ కాలంలో. ఈ కేటలాగుని కూడా ఎవరో ఎడిట్ చేసినట్లు అనిపిస్తున్నది. అక్కడక్కడా తెలుగుయూనివర్సిటీ అంటూ ఆరుద్ర సమగ్రాంద్ర సాహిత్యం అంటూ రిఫరెన్సులు కన్పించాయి.

    any how i knocked a right door. it seems you are in touch with these affairs since february 2009.
    i once again wonder you zeal and passion for telugu.

    bolloju baba

  2. జమ్మిబంగారం చెట్టు గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    09/06/2009 1:19 pm

    జాన్ హైడ్ గారికి
    మీ శైలికి భిన్నంగా వినిపిస్తూందీ కవిత. భిన్న మతాల చిహ్నాల సమ్మేళన కనపడుతూంది. ఆ మేళవింపూ సమర్థవంతంగా జరిగింది. ఈ కోణంలోంచి మీనుంచి మరిన్ని కవితల్ని ఆశిస్తున్నాను. కవితలోని కొన్ని పదచిత్రాలు లోతుగా ఉండి కవితకు గాఢతను చేకూర్చాయి. మంచి కవితను అందించారు.

    బొల్లోజు బాబా

  3. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి Kameswara Rao అభిప్రాయం:

    09/06/2009 9:24 am

    విశ్వనాథ తరఫునో లేదా బృందావనరావుగారి తరఫునో వకాల్తా పుచ్చుకొని వాదించడానికి నేను రాలేదు. లైలాగారి అభిప్రాయాన్ని తప్పుపట్టాలన్న ఉద్దేశమూ లేదు. ఎవరి అనుభూతి వారిది. ఈ పద్య సందర్భాన్ని మరికొంత వివరించాల్సిన అవసరం ఉందనిపించి ఇది రాస్తున్నాను.

    శూర్పణఖ ముక్కూ చెవులూ తెగిన వెంటనే ఖరదూషణుల దగ్గరికి వచ్చినప్పటి పద్యం కాదిది. అలా వచ్చినప్పుడు శూర్పఖని చూసిన ఖరుడు మొదటగా అనే పద్యం ఇది:
    ఇటులిది యేమమ్మా! ముకు
    పుటముల నెత్తురులు గారు? ముక్కుం జెవులుం
    గటకట! యిట్లేలయ్యెను
    పటువెవ్వడు నిన్ను నిట్టి పాటుం బరుపన్

    అంతే! అంతకన్నా మరే వర్ణనా అక్కడ లేదు. మరి యీ పద్యం ఎప్పుడు వస్తుంది?

    ఖరుడు దురుముఖుడు మొదలైన పద్నాలుగు మంది ముఖ్య సేనాపతులను వారి సేనలతో సహా రామ లక్ష్మణుల పనిపట్టమని పంపిస్తాడు. వాళ్ళతోపాటు శూర్పణఖనీ తోవ చూపించడానికి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి రాముడి చేతిలో ఊకుమ్మడిగా ఒక్క క్షణంలో చచ్చిపోతారు, శూర్పణఖ కళ్ళముందే! దానితో ఆమె రోదన మరింత తీవ్రమవుతుంది. ఇంతకుముందు ఆమె ముక్కూచెవులు కోయబడినప్పుడు ఆమెకి కలిగిన బాధ కొంతవరకూ ఎక్కువగా శారీరకమైనది, ఆ పైన ఉన్నదల్లా అవమానం. ఇప్పుడు కలిగిన బాధ అది కాదు. ఆమె మొత్తంగా నిర్వీర్యురాలైంది. ఇప్పుడు ఆమె మనసంతా దైన్యం నిండిపోయింది. ఇప్పుడామెకి ఉన్నది క్రోధమూ కాదూ, అవమానమూ కాదు. తీవ్ర భయమూ, నిరాశ, విస్మయమూ. తను ప్రాణాలతో ఉండికూడా లేనట్టే, జీవచ్ఛవం అన్నమాట. ఈ పద్యంలో వర్ణించబడ్డ అవస్థ అది. అది శారీరకమైన రూపాన్ని కాదు వర్ణిస్తున్నది.
    ఇక ఆమెని చూసిన ఖరుని మనస్థితి ఏమిటి? తన సేన వాళ్ళని సంహరించి ఉంటుందన్న పరిపూర్ణమైన నమ్మకం అతనిది. అంచేత ఇంకా శూర్పణఖ ఎందుకలా దీనంగా కనిపిస్తోందో అతనికి తెలియలేదు. ఆమె ముక్కు చెవులు కోసి ఉండడం వల్లనే అలా కనిపిస్తోంది అనుకుంటున్నాడు. అది అతనికి చిరాకు తెప్పించింది. అందుకే తర్వాత పద్యంలో ఏదైనా వనమూలికలు పెట్టుకొని గాయం మాన్పుకో, ఇంకా ఎందుకీ దుఃఖం అంటాడు.

  4. రచయితలకు సూచనలు గురించి gangakiran అభిప్రాయం:

    09/06/2009 4:55 am

    ఓహొ, చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రోమాంచితము. ఏ దేశంలో ఉన్నా తెలుగు దాహం తీరుతుంది.

  5. పెదవి దాటనివి గురించి Purnima అభిప్రాయం:

    09/06/2009 4:08 am

    Well presented story. Loved it!
    Interesting comments too! 🙂

  6. జమ్మిబంగారం చెట్టు గురించి jwalitha అభిప్రాయం:

    09/05/2009 10:06 pm

    బంగారంగా ఏరుకుంటున్నవాళ్ళంతా
    ఒక్కో జమ్మిచెట్టౌతారు.
    ఆశ బాగున్నది.. అవసరమున్నది

  7. తెలుగు నిఘంటువు గురించి… గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    09/05/2009 6:22 pm

    బాబా గారు,

    బ్రౌన్ నిఘంటువుపైనున్న అభియోగాల గురిచి మరో సారి వివరంగా మాట్లాడుకుందాం.. మీరు ప్రస్తావించిన, సంస్కృత, తెలుగు నిఘంటువుల వివరాలు ఈ క్రింది పుస్తకం/కాటలాగ్ లో చూడవచ్చు. గత 6 నెలలుగా ఈ కాటలాగ్ on-line లో లభ్యం.

    Manuscrits telugu : catalogue raisonné / établi par Gérard Colas et Usha Colas-Chauhan. – Paris : Bibliothèque Nationale de France, 1995. – 117 pp. : Ill. – ISBN 2-7177-1928-8

    http://gallica.bnf.fr/ark:/12148/bpt6k2557038
    http://groups.yahoo.com/group/racchabanda/message/20634
    http://groups.yahoo.com/group/racchabanda/message/1500

    Regards,
    Sreenivas

  8. నిశ్శబ్దం లో నీ నవ్వులు గురించి sridhar అభిప్రాయం:

    09/05/2009 12:48 pm

    చాలా బాగుంది. మనసుకు యెంతో హాయిగా ఉంది. Thank you.

  9. పెదవి దాటనివి గురించి Ravi అభిప్రాయం:

    09/05/2009 10:13 am

    Nice subtle story. Only insecure people and others in insecure conditions require assurance with straight statements like ‘I love you’. Otherwise, it is like captioning a picture of an elephant with the word elephant. Showing rather than saying is the secret of sharing love. The lesser your sensitivity the more you need ‘saying’ (vocalizing in Ms Malathi’s words). Vikas may know that Meghana loves him. But his intention seems to hurt her and not to demand vocalizing her love. Intention to hurt takes recourse to groundless allegations also. Such allegations take form from a region of our mind where fantasies are born. They betray the essential emotional insecurity and doubts of self-worth of that person. Thanks for ‘showing’ a piece of inner drama.

  10. జమ్మిబంగారం చెట్టు గురించి Venkat అభిప్రాయం:

    09/05/2009 6:46 am

    రాజశేఖర్ రెడ్డి ఉదంతానికి సరిగ్గా సరిపోయిందా?? లేక ముందుగానే ఊహించారా???