పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. మరో ప్రపంచం పిలిచింది గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/11/2010 1:09 am

    శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గూటాలకృష్ణమూర్తిగారు విదేశాంధ్ర ప్రచురణల పేర 80వ దశకంలోనే లండన్ నించి ప్రచురించారు. ఈ పుస్తకం తాలూకు ప్రత్యేకత మహాప్రస్థానం లోని గేయాలని శ్రీశ్రీ చేతిరాతతో ప్రచురించడం! ఇందులోని కొన్ని కవితలకి బాపు బొమ్మలు వేసారు. ఈ పుస్తకంతోపాటుగానే శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గీతాల ఆడియోకేసెట్ కూడా ఉంటుంది.

    ఈమాట సంపాదకవర్గం గూటాల కృష్ణమూర్తిగారిని సంప్రదించి ఈ శ్రీశ్రీ ప్రత్యేక సంచికలో ఆ ప్రతినీ చేర్చి ఉంటే బాగుండేది.ఈమాట పాఠకులకి శ్రీశ్రీ చేతిరాత శ్రీశ్రీ గొంతుకనించి మహాప్రస్థానం .. రెండూ లభించి ఉండేవి..మరి ఆ ప్రయత్నం ఎందుకని జరగలేదో!?

    రమ.

    ఆ ప్రయత్నం జరిగింది, కానీ ఫలించలేదు …[సం.]

  2. కలకీ కలకీ మధ్య గురించి Aparna అభిప్రాయం:

    01/10/2010 4:46 pm

    నచ్చలెదు..meaningless story

  3. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి mOhana అభిప్రాయం:

    01/10/2010 2:02 pm

    జగన్నాధంగారూ, ప్ర, త్ర్య లాటి అక్షరాలవలెనే క్ష అక్షరం కూడా ఒక సంయుక్తాక్షరమే. నిఘంటువులలో క్ష-కారముతో ఆరంభమయ్యే పదాలు క అక్షరం కిందే ఉంటాయి. ప్ర అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు క్ష అక్షరంతో ఆరంభమయ్యే పదాలకంటే ఎక్కువే. కాని దీనికి కొందరు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడానికి కారణం బహుశా క్ష అక్షరం పలికేటప్పుడు, క కు ష ఒత్తు ఇచ్చి పలికేటప్పుడు ఉచ్చరణలో కొద్దిగా భేదం ఉండడంవల్లనేమో? లేకపోతే మతపరంగా (చక్రాలు ఇత్యాదులు) మరేమైనా కారణం ఉందేమో? యూనికోడ్‌లో ఈ అక్షరానికి ఒక ప్రత్యేక స్థానం లేదు అనే అనుకొంటా. విధేయుడు – మోహన

  4. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి jagannadham alapati అభిప్రాయం:

    01/10/2010 12:18 pm

    భాష పైన, ప్రత్యేకించి గణ, మాత్రా ఛందస్సులపై యింతటి సాధికారత గల్గిన మోహనరావు గారు, చాలా కాలంగా నాకున్న ఒక అభిప్రాయం సరియైనదో, కాదో తెలియజేస్తారని ఇది రాస్తున్నాను.
    “క్ష” అనే అక్షరమూ, “క” కి “ష” వత్తు ఇవ్వడమూ, ఉచ్చారణలోనూ, ఇంచుమించు రూపంలోనూ ఒకే రకంగా ఉన్నప్పుడు ప్రత్యేకించి “క్ష” అనే అక్షరం యొక్క ఆవస్యకత ఏమైయుండునో తెలుపగలరు.
    జగన్నాథం ఆలపాటి

  5. మరో ప్రపంచం పిలిచింది గురించి Dr. Apparao Nagabhyru అభిప్రాయం:

    01/08/2010 3:14 pm

    How fortunate we are to see this wonderful video of Sri Sri rendering Maro Prapancham.
    Thanks to Krishnarao garu & Babu garu.
    Apparao

  6. వెదురు వేది గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    01/07/2010 5:22 pm

    చెట్టంత భావాన్ని చిన్ని పదాలలో చెప్పారు, హృద్యంగా.
    విధేయుడు
    -Srinivas

  7. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి Ramkishore అభిప్రాయం:

    01/07/2010 6:11 am

    చాలా బాగుంది. మనసు లోని భావాలను బయటికి తీస్తే ఇటువంటి మాటలే వస్తాయి.

  8. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kayakay అభిప్రాయం:

    01/07/2010 3:43 am

    కధ చాలా బాగున్నది ! ఏది చూడాలనుకున్న వాళ్లకి అది! ఆ వ్యక్తి నిషా షామల్ ఊహల్లొ నుంచి ఆ రాత్రి కవితా రూపంలొ వొచ్చిన కీట్స్ !

  9. శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/07/2010 1:08 am

    పరుచూరి శ్రీనివాస్ గారు రాసిన పేర్లకి మరికొన్ని ముఖ్యమైన జోడింపులు.

    తెలుగులో భావకవులనీ..అభ్యుదయా కవులనీ ఇంగ్లీషులోకి తొలిగా అనువాదంచేసిన ఒక మంచి అనువాదకుడు శ్రీనివాస్ రాయప్రోల్ గారు. ఆయన జయప్రభ గారి కవిత్వాన్ని కూడా ఇంగ్లీషు లోకి అనువదించారు. ఇంగ్లీషులో కవిగా అంతర్జాతీయ గుర్తింపు కల్గిన వారు శ్రీనివాస్ రాయప్రోల్ . american poet willims carlos willims వంటి వారితో ఆయనకి మంచి స్నేహం ఉండేది.

    శ్రీనివాస్ రాయప్రోల్ తెలుగు కధల్ని కూడా ఇంగ్లీషులోకి అనువాదం చేసినవారు. అలాగే తెలుగు కధలని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన మరో అనువాదకుడు రంగారావుగారు. ఆయన అనువాదాలని penguin సంస్థ ప్రచురించింది. అలాగే డి.కేశవరావు గారు కూడా తెలుగు ఆధునిక కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన వారు.

    ఇంక శ్రీనివాస్ పరుచూరి చేసిన వ్యాఖ్య”బాగా” అన్నది..ఈ సరికే చర్చింపబడి ఉంది. ఎవరికి “బాగా” అన్నది ముఖ్యం. అనువాదం చేసినవారికా?? లేక ఆ అనువాదాలని చదివిన వారికా?? అని. ఏ భాషలోకి అనువాదం అవుతున్నాయో ఆ భాషలోని నుడికారంతో ఆ భాషకి సొంత కవిత్వంలాగా అన్పించేది మంచి అనువాదంగా అనుకోవాలి. ఇందులో చర్చకి అవసరమైన విషయాలు అనేకం ఉంటాయి.మూలంలోని ప్రాణశక్తి అనువాదంలోకి రాగలగాలి.

    శ్రీశ్రీ కవిత్వం బహుశా భారతీయ భాషలలోకి అనువాదం బాగా అవుతుందేమో గానీ ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు అంత బాగా చేయడం కొంచెం కష్టమైన విషయమే ఏ అనువాదకుడికైనా!! ఇవన్నీ అనువాదం చేసేవారి ముందున్న సమస్యలు. అలాగని అనువాదాలు చేయకుండా కూడా ఉండడం సరికాదు. తగినంత శ్రధ్ధ ఉండాలి అనువాదంచేసేవారికి. తగినంత నైపుణ్యం కూడా ఉండాలి. తగినంత సమయాన్ని వారు వెచ్చించ గలిగి కూడా ఉండాలి. అలా పని చేసేవారికి ఆర్ధికమైన వనరులు కూడా సమకూడేలా ఉండాలి. అప్పుడు మాత్రమే అనువాదాలు చేయడానికి వ్యక్తులు మరింతగా ముందుకి వచ్చే వీలుంది.
    రమ.

  10. వెదురు వేది గురించి mOhana అభిప్రాయం:

    01/06/2010 3:05 pm

    చక్కని కవిత! విధేయుడు – మోహన