పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. గాలిపటం గురించి Ch J Satyananda Kumar అభిప్రాయం:

    01/23/2010 1:56 pm

    మిత్రమా,

    గాలి పటం కవిత చాలా బాగుంది. దాన్ని ఇంగ్లీషులో అనువదించి ఈ క్రింద ఇస్తున్నాను. museindia.com లో కూడా వేస్తాను రెండు దినాల్లో.

    Don’t know why that kite is
    Flying away skyward
    Driven by western winds
    Soaring high upward

    In the past too while many kites
    Like wing stretched birds
    Like dashing planes
    Zipped fast
    In their flights to kiss the heavens
    Somersaulting and rumbling

    Here on land
    despite losing spirits
    Pooled-up all energies and
    Stabilized their every movement..

    In the revelry
    Of reaching distant coasts, when
    Left the hands that guided
    Severed the umbilical cord

    Drifted like dry leaves distanced from the tree branch
    Lost vigor and blown away like torn waste paper pieces
    Didn’t they caught-up in thorny bushes….?

    మిత్రుడు
    సత్యానంద కుమారు

    Then why that kite is
    exulting
    Driven by western winds it is
    exciting

  2. కృష్ణం వందే జగద్గురుం గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/23/2010 3:43 am

    “లాలనుచు నూచేరు లలనలిరుగడల ” రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో ఆశాభోంస్లే గారు పాడింది ఉంది. ఆశా ఆ పదాన్ని చాలా బాగా పాడేరు. ఆమె తెనుగు ఉచ్చారణ వినసొంపుగా ఉండటం విశేషం.
    ఇంక తెలుగు భాష ప్రత్యేకత ఏమంటే..మనం పదాలని విడగొట్టి పలకం. సంధిచేసి కలిపి పలుకుతాం! అలానే పలకాలి. లాలి+అనుచు=లాలనుచు అవుతుంది. లాలి అనుచు అని కావాలంటే ఆ పదస్వరూపం తెలియని వాళ్ళకి వివరించి అర్ధం చెప్పడానికి పనికొస్తుందే గానీ అలా పలికే వారికో..లేదా అలా మాట్లాడే వారికో తెలుగు రాదని అర్ధం లేదా వారు మాకు తెలుగు రాదూ అని వినేవారు అనుకునేలా అభినయం చేస్తున్నారని అర్ధం!

    ఇవాళ మీడియా కుర్రకారుకి ప్రమాణ భాషగా మారింది గనక తెలుగు రాని వారూ లేదా తెలుగుని అన్యభాషాధోరణిలో పలకాలని ఉవ్విళ్ళూరేవారూ అలా సంధిని విరిచి పలకడం చేయడం మనం గమనించవచ్చు. పైగా అది తెలుగుమాటకి సహజ ధోరణికాదు అని వారికి చెప్పగల వీలుకూడాలేదు.ఎందుకంటే మీడియా పనిగట్టుగుని తెలుగుని కకావికలు చేస్తోంది గనక. దానిపై విమర్శకి ఒక plotform అన్నదే ఎక్కడా లేదుగనక. అది సురక్షితంగా ఈ విధ్వంసానికి పూనుకుంది. క్షేమంగా ఈ పనక్షేకొనసాగిస్తోందికూడా!!
    అందువల్ల ఈది సరైన పలుకుబడో తెలుసుకోగల వీలుకూడా యువతరానికి ఉండటంలేదు. అందుకోసం భాష నిలుపుకోవాలన్నా..మంచి పలుకుబడీ..ఉచ్చారణా మిగుల్చుకోవాలన్నా వారికి ఈ విషయాలని విశదపరిచేవారు క్రమ పధ్ధతిలో్ వీటిని పాఠాలుగా చెప్పేవారు అన్ని రంగాల్లోనూ ఉండాల్సిన సమయం వచ్చింది. లేకపోతే రేపటి గాయనీగాయకులు “లాలనుచు” అని కాకుండా “లాలి అనుచు” అనే పల్లవిని అందుకుంటారు. అంతేకాదు వాళ్ళు “లాలనుచు” అని పాడే వాళ్ళని అది తప్పుఅని చెప్పి ఒక తప్పుని ఒప్పుగా మార్చే పనికి శ్రీకారం కూడా చుడతారు.

    రమ.

  3. కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/22/2010 10:14 pm

    నారాయణగారూ,
    నేను రాసే విషయాల గురించి (ప్రవేశం అనేకన్నా) ఆసక్తి ఉంది. ఆ కారణంగానే నేను రాస్తూ ఉంటాను. నా కిష్టమైన కొన్ని విషయాలు ఎన్నేళ్ళయినా నాకు గుర్తుంటాయి కనక ఇప్పటి తరం వారితో అవి పంచుకోవాలనిపిస్తే వాటి గురించి రాస్తాను.
    సంగీతం గురించి చిన్నప్పటినుంచీ అభిరుచి ఉంది. కొన్నేళ్ళు సితార్ నేర్చుకుని కచేరీలు చేశాను.
    పాప్యులర్ సైన్స్ వ్యాసాలు రాయాలనేది నాకున్న ఆసక్తి. అవన్నీ ప్రస్తుతం సంపుటాలుగా వస్తున్నాయి. బాగానే అమ్ముడుపోతున్నాయని విన్నాను.

  4. కృష్ణం వందే జగద్గురుం గురించి నారాయణ గరిమెళ్ళ అభిప్రాయం:

    01/21/2010 12:14 am

    రోహిణీ ప్రసాద్ గారూ,

    నాకు ఆశ్చర్యంగా ఉంది.

    ఇంతకీ మీకు ఎన్ని రంగాలలో ప్రవేశం ఉంది?

    మీ వ్యాసాలను ప్రజాసాహితి లోనూ, కౌముది లోనూ, ఈమాట లోనూ, ఆంధ్రప్రభ లోనూ అనేకమైన విషయాల గురించి చదివాను.

    నాకు తెలిసి మీరు సాహిత్యం, హేతువాదం, క్రోమోజోములూ జన్యువుల గురించి చెప్పే శరీర ధర్మ శాస్త్రం, దేశపరిస్థితులు గురించి వ్రాశారు. మరి ఇప్పుడు సంగీతం గురించి చూస్తున్నాను.

    నారాయణ గరిమెళ్ళ

  5. మరో ప్రపంచం పిలిచింది గురించి Jagannadha Rao అభిప్రాయం:

    01/20/2010 7:19 am

    అనందం
    అద్భుతం
    ఆశ్చర్యం
    నా జీవితం ధన్యం
    శ్రీ శ్రీ కి జొహరులు

  6. గాలిపటం గురించి నారాయణ గరిమెళ్ళ అభిప్రాయం:

    01/20/2010 2:23 am

    గాలి పటాలు అందు బాటులో ఉండి ఎగురుతుంటేనే, వాటి స్వేచ్చకు
    ఎగరేసినవారి స్పూర్తి/సామర్ధ్యాని కి అందం/అర్థం.

    ఏ దిక్కు గాలుల్నైనా ఎలాగూ నిలువరించలేము, కాబట్టి,
    తయారీ సమయములోనే బాధ్యతగా ఎగరడమెలాగో నేర్పించాలి.
    అంతేనంటారా, సమీర్ గారూ?

    నారాయణ గరిమెళ్ళ.

  7. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/19/2010 1:11 pm

    మోహన గారి అభిప్రాయం అంతగా స్పస్టపడలేదు నాకు. ఆయన పదాలతో ఉదాహరిస్తూ మరింత వివరించి ఉండిఉంటే బాగుండేది.

    “త్ర్యంబక” లాంటి పదాల్లోని ” త్ర్య” అన్నది కూడా సయుంక్తాక్షరం తో మొదలౌతున్న ఒక అరుదైన పదం. ఇందులో రెండు కాదు మూడు అక్షరాలు కలిసి ఒక అక్షరం కాగా పదాదిన ఈ సంయుక్తాక్షరం రావడం విశేషం.

    రమ.

  8. కలైన గోర్వెచ్చని పాట గురించి rajendra kumar devarapalli అభిప్రాయం:

    01/19/2010 1:17 am

    ఈ మధ్య కాలంలో చదివిన కవితల్లో అత్యంతాఅహ్లాదాన్ని పంచిన కవిత ఇది.నులకమంచం పేనటం ఏ రాజభవనాల్లోని తివాచీలకూ తీసిపోదు,కలలు చెదరకుండా ఆకులు చుక్కలు కావలి కాయటం అన్నభావనే ఎంతో ఆత్మీయంగా ఉంది.కానీ జాన్ గారు మీరు ఇకపైన నులకకౌశలం కోసం వెతుకుతూనే ఉండాలేమోనండి!ఇంకెక్కడి నులక మంచాలు?
    మంచి కవితను మాచే మరలామరలా చదివింపజేసినందుకు గాను ధన్యవాదాలు.

  9. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి mOhana అభిప్రాయం:

    01/18/2010 9:33 pm

    శాయి గారూ, భారతి వ్యాసాన్ని అందించినందులకు వందనా లండీ. నాకు తెలిసి ష-కారపు ఒత్తు క-కారముతో, ర-కారముతో మాత్రమే వస్తుంది. ల-కారముతో, ష-కారపు ఒత్తుతో ఏమైనా పదాలున్నాయా? లేదనే అనుకొంటాను. ర్ష
    సంయుక్తాక్షరము ముందున్న పదాలు ఏవీ లేవు. ష-కారపు ఒత్తుతో ప్రారంభమయ్యే పదాలు క-అక్షరముతో మాత్రమే. అందువల్ల దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నదేమో? ఇలా మరేదైనా సంయుక్తాక్షరం తెలుగులో ఉందా?
    విధేయుడు – మోహన

  10. నాకు నచ్చిన పద్యం: ధర్మజుని గుణవిశేషం గురించి Ramakrishna అభిప్రాయం:

    01/16/2010 7:22 am

    డియర్ సర్
    పై పద్యము యొక్క ఎత్తుగడ నర్తనశాల చిత్రం లో ఘంటసాల గారి కంఠం లో గొప్పగా కళ్యాణి రాగం లో ఆవిష్కరింపబడింది.
    రామకృష్ణ