పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. పండిన మొగలిరేకుల ఏకాంత ప్రవాహం: “సముద్రం” గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    01/29/2010 1:13 am

    పైనించి కింది దాకా మూడు సార్లు చదివినా ఈ యమ్మ గొడవేంటో తెలియలేదు. వాడ్రేవు వీరలక్ష్మి గారిని అక్కా అని పిలిచే చనువు రచయిత్రికి వుండచ్చు. వీర్లక్ష్మక్క ప్రేమ గురించి లోతయిన సాధన చేసి వుండొచ్చు.

    ఆ చనువుకి ఆధారమేంటో మనకి చెప్పనక్కరలేదు కానీ, కనీసం వీరలక్ష్మక్కకి ప్రేమగురించి వున్న పరిజ్ఞానమేమిటో సూచన ప్రాయంగానయిన పాఠకులకి చెప్తే సమీక్షకురాలి ముల్లె ఎంబోతుందో ? మొగిలి రేకుల ప్రవాహం తో మొదలై నెమలి ఈకలు, అమాయకత్వంతో సముద్రంలో కలిసిపొయిన ఈ సమీక్ష ఎన్నిసార్లు చదివినా యదుకుల భూషణ్ ఎవరో, ఏమిటో, ఏమి రాశాడో తెలియదు.

    సమీక్షిస్తున్న పుస్తకం పట్ల గాని, ఆ పుస్తకం రాసిన రచయిత పట్లగాని, దాన్ని చదవమని చెప్పిన వ్యక్తి పట్లగాని, ఆ సమీక్ష చదవటం కోసం సమయం వెచ్చించే పాఠకుడి పట్లగాని ఏమాత్రం గౌరవం లేకుండా కలం నిండా సిరా నింపుకుని కాగితాల మీద వలకబోసే ధైర్యం తెలుగునాట రచయితలకి ఎట్లా అబ్బిందో తెలిసిన వాళ్ళు చెప్పాలి. (నాకయితే రాయప్రోలు సుబ్బరావు దీనికి కారకుడని నమ్మకం)

    చాకిరేవు ఉపేంద్ర
    పి.ఎస్. పై వాక్యాలలో ‘పాఠకుడు’ అన్న పదం వచ్చినప్పుడల్లా కీ బోర్డ్ ‘పాతకుడు’ అని సూచిస్తూ వచ్చింది. నిజమే ఏ పూర్వ దుష్కృతమో కాకపోతే ఈనాటి తెలుగు రచయితలు, రచయిత్రులు, సమీక్షకుల బారిన పడతాము.!!

  2. గాలిపటం గురించి sameer అభిప్రాయం:

    01/27/2010 4:32 pm

    సత్యానంద కుమార్ గారు,
    మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ ప్రయత్నము బాగుంది. అనువాదము చాలా కష్టమైన ప్రక్రియ. మీకు తెలియంది కాదు. భావములో ఏ మాత్రము తేడా రాకుండా మీరు అనువదించారు కానీ ఇంగ్లీషు పదాలు తెలుగు వాక్య నిర్మాణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మీరు ప్రయోగించిన ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీషు వాక్య నిర్మాణం ప్రకారంగా మీరు దీన్ని మారిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మీరేమంటారు?

  3. గాలిపటం గురించి sameer అభిప్రాయం:

    01/27/2010 4:02 pm

    చాలా బాగా చెప్పారు నారాయణ గారూ.

  4. కలైన గోర్వెచ్చని పాట గురించి అరుణ అభిప్రాయం:

    01/27/2010 8:29 am

    అలసి గూటికి చేరిన పక్షులు
    రెక్కలు సరిచేసుకుంటూ సేదదీరేవి
    దాలిలో మునగదీసుకున్న కుక్కపిల్లలు
    చెవులాడించుకుంటూ చూస్తుండేవి
    బోదెలో కప్పలో
    గట్టుపైచేరి వళ్ళారబెట్టుకుంటుండేవి

    మంచి పద చిత్రం

  5. అమ్మ ఉత్తరం గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:

    01/26/2010 7:38 am

    చాలా బాగా చెప్పేరు ఉత్తరం గురించి. సున్నితమైన విషయం, హృదయానికి హత్తుకొనే విధంగా.

    అభినందనలు

  6. పాఠకులకు సూచనలు గురించి siva rama prasad అభిప్రాయం:

    01/26/2010 6:28 am

    ఇటు వంటి తెలుగు పత్రిక వుందని నాకు తెలియదు. 1999 నుండీ అంటె అసలు నమ్మశక్యంగా లేదు.మొదటి సారి చూడటం తటస్థించింది.చాల గొప్పగ ఉన్నది. శ్రీ శ్రీ మహా ప్రస్థానం బాపు బొమ్మలు, ఆ font లో అద్భుతం గా వుంది. మీకు నా కృతజ్ఞతలు.

  7. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి siva rama prasad అభిప్రాయం:

    01/26/2010 5:58 am

    శ్రీ శ్రీ కవితకి బాపు బొమ్మలు అద్భుతంగా వున్నాయి. రంగులు చాలా అందంగా ఉన్నాయి.

  8. రాత్రి నృత్యం గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/25/2010 12:59 am

    ఇంద్రాణీ!! కవిత మాంఛి ఉత్సాహం గా ఉంది. బాగా రాస్తున్నావు.
    రమ.

  9. రాత్రి నృత్యం గురించి Ch J Satyananda Kumar అభిప్రాయం:

    01/24/2010 10:48 am

    This poem’s English translation is given hereunder:

    like rain of dark night
    let music melt
    let four shoulders meet
    let all these trees rock
    let our bodies cleave
    let birds pair croon
    let throats shriek in craze
    let moon light dust raise
    let feet soar and soar
    amid dry leaves and misty fume
    amid snake hisses and cricket screeches
    whole night, whole night, whole night
    ah there
    dance, dance, dance!

    Ch J Satyananda Kumar
    Visakhapatnam
    24-01-2010

  10. కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/23/2010 3:11 pm

    తెలుగు పదాల ఉచ్చారణ, ఇతర సాంస్కృతిక విశేషాలను తరవాతి తరాలలో అవసరమున్నవారికి అందించడమనేది మన బాధ్యతే కనక త్వరలోనే ఇంటర్నెట్‌లో ఆడియో, వీడియోలకే ప్రత్యేకించిన పత్రికలు రావాలని ఆశిద్దాం.
    ఔత్సాహికులు కనక ఇటువంటిది చెయ్యకపోతే మనకి మిగిలేవి సినిమాలే. ఇప్పటికే సంక్రాంతివంటి సందర్భాలకు ప్రవాసాంధ్ర సాంస్కృతిక ప్రదర్శనల్లో సినిమా పాటలు తప్ప మరొక సాధనం లేకుండాపోయింది. సినిమాపాటలన్నీ మంచివికావని అనుకోనక్కర్లేదుగాని చింతాదీక్షితులుగారి బాలభాష పద్ధతిలో కొన్ని ఆర్కైవ్స్‌ తయారుచేస్తే మంచిది.