పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. *ద్రౌపది* నవలపై మరోకోణం నుంచి…. గురించి madhuri krishna అభిప్రాయం:

    03/03/2010 5:14 am

    This is a very good presentation on different styles of writing or or maybe, interpreting previous works, at the same time softly but effectively mocking a writer”s wrong perception. This stands as an example for a decent presentation of criticism.

  2. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    03/03/2010 2:23 am

    వాదం వచ్చిన ప్రతిసారీ ఇంత భయంకరంగా వుండనవసరం లేదు వేణుగోపాల్ గారూ. 🙂

    చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో లో వార్తలు చదివే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి వుంటారనుకుంటుండే వాడిని. ఒక సారి ఒక అనౌన్సర్ పొరపాటున ‘సిబ్బంది’ అనడానికి బదులు ‘సిద్దంబి’ అనడం నేను స్పష్టంగా విన్నాను. ఆ రోజంతా కనపడ్డ వాళ్లందరికీ రేడియో లో వార్తలు చదివే ఆయన చేసిన పొరపాటు గురించి చెప్పుకుంటూ తిరిగాను. నేను అట్లా ప్రచారం చేసినందు వల్లన ఆ అనౌన్సర్ ఖ్యాతికి ఏమీ నష్టం వచ్చి వుంటుందనుకొను. నిజానికి ఆ పొరపాటు పట్టుకోవటం వలన నా దృష్టిలో కూడా అనౌన్సర్లు గొప్ప వాళ్ళు అయి వుంటారన్న నమ్మకం కూడా ఏమీ తగ్గలేదు. కాక పోతే, గొప్ప వాళ్ళు కూడా మామూలు మనుషులే అన్న జ్ఞానం మాత్రం నాకు వచ్చింది.
    అట్లాగే, శ్రీశ్రీ రాసిన పాటలో పొరపాటు దొర్లిందట అని ఒక పది మంది వింతగా చెప్పుకుంటే అందులో పెద్ద నేరమేమిటో నాకు అర్ధం కావటం లేదు. దాని వలన శ్రీశ్రీ కి వచ్చిన నష్టమేమీ లేక పోగా, ఒకరికో ఇద్దరికో శ్రీశ్రీ కూడా మానవమాతృడే అన్న స్పృహ కలుగుతుంది. అది మంచిదే.

    అట్లా చెప్పుకునే వాళ్ళ మీద తెలిసిన వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు విరుచుకు పడితే – ఆహా , ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద నేరంగా లెక్క కట్టి ఇంత వుద్రేక పడుతున్నారంటే, అసలు విషయం ఇంకెదో వుంది వుంటుంది అన్న అభిప్రాయం కలిగే ప్రమాదం కూడా వుంటుంది.

    ఇక పోతే, అచ్చు తప్పులు , వ్యాకరణ పొల్లులూ దిద్దుకోవడం రచయితకి కనీస బాధ్యత. రచయిత గొప్పదనానికి అదేమంత పెద్ద తార్కాణం కాదు.

    శ్రీ శ్రీ , ఒకటీ రెండూ కాదు, ఏకంగా కొన్ని తరాల తెలుగు యువతీ యువకులని ప్రభావితం చేసిన కవి. ఇది ఎలాటి ప్రభావమూ, ఈ ప్రభావం మంచికొచ్చిందా చెడ్డకొచ్చిందా, ఏ కవితా ఎప్పుడూ ఏ ప్రయోజనాన్ని సాధించింది, ఇలాటి విషయాలని మాట్లాడుకోవలసిన అవసరం ఈ రోజున వున్నది. అవకాశం కూడా కొద్ది కొద్దిగా కనపడుతోంది.

    బాధ్యత కల మనుషులు, ఆ అవకాశాన్ని చేజారనీయకుండా మాట్లాడాలి. మాకు తెలుసు, మీకు తెలియదు, మాకున్న రసజ్ఞానం మీకు లేదు, శ్రీశ్రీ ని అంచనా వేసే టంత గొప్పవాళ్ళా మీరు ? అంటూ శ్రీశ్రీ వ్యాకరణ దోషం గురించి చెప్పుకున్న వాళ్లంతా రాళ్ళు విసురుతున్న అలాగా జనం అన్నట్టు కలియబడితే, జవాబు చెప్పక తప్పదు.

    పి.ఎస్.
    మొసళ్ళ గుంపుల మధ్య అలవోకగా బ్రతకడం అలవాటయిపోయిన వాడిని కాబట్టి నామీద వేస్తే సంభాళించుకోగలిగాను కానీ, మీరిలాగ అలవాటుగా ఇంటి పేర్లతో గాలాలు వెయ్యరనే ఆశిస్తున్నాను. విషయం శ్రీరంగం వదిలిపెట్టి కంచి దోవ పట్టటం ఎవరికి మాత్రం మంచిది ?

  3. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/03/2010 1:51 am

    వ్యాకరణం కన్నా కవిహృదయానికి ప్రాముఖ్యతనివ్వడం అన్నది ఒక సరసగుణం! ! నేను శ్రీశ్రీవిషయంలో చెప్పినది అదే!! పైగా శ్రీశ్రీ తాను స్వయంగా వివరణ ఇచ్చాకా మరింక అది చర్చకి రాకూడదు. అది ఒక మర్యాద.

    సాహిత్యంలో వ్యాకరణ దోషాలు ఎన్నుకుంటూ పోతే మహామహులు చాలరు. “ఎమితిని సెపితివి కపితము” అని అల్లసాని పెద్దనని రామలింగడు వెక్కిరించాడని ప్రతీతి. అందువల్ల పెద్దన కవిత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయింది.

    అలాగే అన్నమాచార్యులవారి వేల సంకీర్తనలలో వ్యాకరణ దోషాలు మెండుగానే దొరుకుతాయి. కానీ ఆయన పదాల ప్రాముఖ్యతకి అవేమీ అడ్డురాలేదు. రావు.

    కవితా సంపన్నత ముందు ఇలాంటివి బహుచిన్నవని..లోకంవాటిని పట్టించుకోదనీ చెప్పడం నా ఉద్దేశ్యం!

    శ్రీశ్రీకున్న అపార భాషా పరిజ్నానం తెలిసిన వారు “శ్రీశ్రీ తప్పుచేసేడోచ్ ” అని చాటనఖ్ఖరలేదు అన్నది నా భావం! తప్పు అన్నది ఒప్పు చేసే ప్రయత్నం నేను చేయలేదు. ఆయన మిగతావి అన్నీ “బహువచనం”లో పదాలని రాసేడు గనక అది వ్యక్తి గురించి కాక సమిష్టి పోరాటానికి ఆయన ఆ పాటని లక్ష్యించాడు గనక
    ఆ “ప్రతి మనిషి ని ” మందికి గుర్తుగా గ్రహిస్తే చాలు అన్నది నా సూచన.
    నేను కవితాసౌదర్యానికి వశురాలిని. దాని ముందు ఇతర దోషాలు నాకు ఎక్కవు. ఉత్తమ కవులందరికీ ఉత్తమ భావుకులకందరికీ ఇది అనుభవంలోకి వచ్చే విషయమే!!

    రమ.

  4. హిమబిందు గురించి sureshnaik అభిప్రాయం:

    03/03/2010 12:24 am

    చాల బాగా వ్రాసారు.

  5. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Raghu Echempati అభిప్రాయం:

    03/03/2010 12:02 am

    చాల థన్యవాదములు ఈ పాట లకు.

    రఘు

  6. 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక గురించి ns murty అభిప్రాయం:

    03/02/2010 10:30 pm

    వేంకటేశ్వర రావు గారి సమీక్ష బాగుంది. నిజానికి తెలుగు కథల రీతి ఇప్పుడలాగే అన్నిచోట్లా ఉంది. దానికి అమెరికా , ఇండియా అన్న భేదం లేదు. పూర్వం సాహిత్య సృజనచేయడానికి ముందు సాహిత్య అధ్యయనం ఉండేది. సమకాలీన సాహిత్యం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకుని తర్వాత తమ సాహిత్య కృషి కొనసాగించే వారు. పత్రికలకు పేజీలునింపడం కావాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టీవీ ఛానెళ్ళకి ఏ చెత్త కబురైనా వార్తలాగే. అలా అని సహజంగా రాయగల సమర్థులు ఉండరని కాదు. అది మనకు అందరికి తెలుసు. కోటికొక్కరు.
    లక్ష్మన్నగారు చెప్పిన రెండుకారణాలూ ఆంధ్రదేశానికి కూడా డిటో. అయితే ఇక్కడ అవసరం వాసి పెరగడము గురించికాబట్టి ‘వ్యక్తిగతం’ కాకుండా, వస్తుగతం అయే విమర్శ తెలుగులో రావలసిన అవసరం ఎంతయినా ఉంది.
    నిజానికి తెలుగులో రంగుటద్దాల విశ్లేషణలు తప్ప నిఖార్సయిన సహిత్య విమర్శ చదివి ఎన్నేళ్ళయింది?

  7. తెలుగు వీర లేవరా గురించి tatiraju venugopal అభిప్రాయం:

    03/02/2010 3:48 pm

    ‘ప్రతి’ వాదం ఇంత భయంకరమా?
    ‘ పాడవోయి భారతీయుడా ’ ( శ్రీశ్రీ సినీమా పాటలు , పద్యాలూ -మొదటి సంపుటి -శ్రీశ్రీ ప్రచురణలు -1983) సంకలనం లోని మొదటి పాట అయిన ‘ పాడవోయి భారతీయుడా ’ కింద శ్రీశ్రీ గారిచ్చిన వివరణ ఇలా ఉంది – ‘’తెలుగు వీర లేవరా – అనే పాటతో ఈ సంపుటిని మొదలు పెట్టక పోవడానికో చిన్న కారణం ఉంది . అందులో – ప్రతి మనిషి తొడలు గొట్టి —–సింహాలై గర్జించాలి అనడంలో వ్యాకరణ దోషం ఉంది (ప్రతి మనిషి ఏక వచనం , సింహాలై బహు వచనం . సింహంలా గర్జించాలి ఆంటే సరిపోతుంది . సాహిత్య రీత్యా మాత్రమే కాక సంగీత పరంగా కూడా ). వచ్చే సంపుటి —లో —సవరణ ఉంటుంది . సినీమా పాటల్లో పెద్ద పెద్ద దూడలకే ఎవరూ కేర్ చెయ్యరని నాకు తెలుసు . నేను చేస్తాను .” (ఇక్కడ పాడినవారు ఘంటసాల అని మాత్రమే ముద్రితమైంది . సుశీల గారి పేరు లేదు ).
    దరిమిలా రెండవ సంపుటి ‘ తెలుగు వీర లేవరా ’ (1996) లోని తొలి పాట ‘తెలుగు వీర ’ అయ్యి ‘సింహంలా ’ అనే సవరణతోనే వెలు వడింది ( ఇక్కడ పాడిన వారు ఘంటసాల అని మాత్రమే ఉంది . రామకృష్ణ పేరు లేదు . గమ్మత్తు ఏమిటంటే -ఈ సంపుటికి ముందు మాట రాసిన వారు గాయని సుశీల గారే ) .
    ( ఈ రెండవ సంపుటిలో వడ్డాది వారి పాట ‘చల్లని రాజా ఓ చందమామ ’ , కొసరాజు గారి ‘దేశమ్ము మారిందోయి కాలమ్ము మారిందోయి ’, మూడవ సంపుటిలో భుజంగరాయ శర్మ గారి పాట ‘కలిమి నిలవదు లేమి మిగలదు ’ ఈ రెండూ శ్రీశ్రీ గారివిగా భ్రమించి ముద్రించడం తప్పే . ఇక్కడ ఈ తప్పులకు శ్రీశ్రీ బాధ్యులు కారు ).
    విశేషమేమిటంటే – తొలి సంపుటిలోని తొలి పాట లోనూ , రెండవ సంపుటి లోని తొలి పాట లోనూ ‘ప్రతి మనిషి ’ అన్నది చోటు చేసుకోవడమే . చూడండి – పాడవోయి భారతీయుడా ’ పాటలో ‘ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే ’ అని ఉంటుంది కదా . మొదటిది స్టేజి సాంగ్ అయితే రెండవది మార్చింగ్ సాంగ్ కనుక శ్రీశ్రీ లోని చిన్నయ్య సూరి కాస్తా పర వస్తు అయ్యారు .
    రామాయణంలో పిడకల వేట – ఇటీవల ఒక టీవీ ఛానెల్లో ఒక కుర్ర గాయకుడు మల్లాది వారి ‘మది శారదా దేవి మందిరమే ’ పాటను అద్భుతంగా ఆలపించినా తరువాత ట్రైనరు అనబడు ఒక వర్ధమాన గాయని ‘ఆఖరి లైన్లో గుఱుతెఱిగిన కాదు గురునెరిగిన అని పాడాలి ’ అని అన్నారు .తాను పాడింది తప్పు కాదని ఆ అబ్బాయికి తెలిసినా బిక్క మొహం వేయక తప్ప లేదు . ఈనాటి అజ్ఞ్యాన తిమిరాంధకారానికి మల్లాది వారు ఎంతగా నవ్వుకొంటున్నారో ఏమో ? నిజానికి ఆ ఆఖరి లైన్లో – వర దాయిని కానీ గుఱుతెఱిగిన మన – మది శారదా దేవి మందిరమే ’ అని ఆ అబ్బాయి పాడినట్టే ఉంది .
    ఉన్న తప్పుని ఒప్పుకోవడం గొప్ప . లేని తప్పుని చొప్పించడం నేరం .
    ఇలా ఈ వివరాలు ఇస్తున్నానో లేదో ఒక టీవీ ఛానల్ శ్రీశ్రీ గారి మీద డాక్యుమెంటరీ తీసి నందులు గెలుచుకుంది అని విన్నాను. కృష్ణ శాస్త్రి గారి ‘మాట’ ఒక్క రికార్డ్ గా నైనా దాచుకోలేక పోవడం మన దురదృష్టం అని శ్రీశ్రీ అన్నారు. శ్రీశ్రీ ఆ మాటకొస్తే అదృష్టవంతులే.
    -డాక్టర్ తాతిరాజు వేణుగోపాల్

  8. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Gopikrishna అభిప్రాయం:

    03/02/2010 3:02 pm

    నా అభిమాన గాయనులు బాలసరస్వతి, ఎస్.వరలక్ష్మి, లీల గార్లు. వీరిలోని వరలక్ష్మి గారి గురించి శ్రీనివాస్ గారు వ్రాసిన వ్యాసము బహు చక్కగా ఉన్నది. క్లుప్తంగా ఉంటూనే నాకు తెలియని చాలా విషయములు తెలియునట్లు చేసినది. రోహిణీప్రసాద్ గారి అభిప్రాయము చాలా సూటిగా స్పష్టముగా ఉన్నది.

    కృతజ్ఞతలతో
    గోపీకృష్ణ

  9. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి bollojubaba అభిప్రాయం:

    03/02/2010 2:54 pm

    జాషువా గారు గొప్ప కవి. స్థూలంగా వారి కవిత్వాన్ని స్ప్రుశించిన ఈ వ్యాసం బాగుంది. మరింత విపులంగా మరో వ్యాసాన్ని బృందావనరావు గారి కలం నుండి వెలువడుతుందని ఆశిస్తున్నాను.

    బొల్లోజు బాబా

  10. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/02/2010 2:48 pm

    అవును రోహిణీ ప్రసాద్ గారూ! సముద్రాల సీనియర్ రాసిన పాట అది. నాకు ఆ పాట కూడా భలే ఇష్టమ్ . ఇంకా చాలా ఉన్నాయి. శ్రీనివాస్ గారు చేర్చినవి తరుచూ వినిపించనివి. వినిపించే వాటిల్లో మీరు చెప్పిన “నా సరి మనోహరి” వరలక్ష్మి గారి మరో మంచి పాట.
    రమ.