పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. పాఠకులకు సూచనలు గురించి geyamala అభిప్రాయం:

    05/23/2010 2:09 am

    ఒక కోకిల తన పాటలను తెలుగు సిని జగత్తుకు దానం చేసి కానరాని లోకాలకు వెళ్లి పోయింది. మే 22 న చనిపోయిన శ్రీ వేటూరి గారి గురించి మీ పత్రికలో వ్యాసం ప్రచురించాలని నా కోరిక .

  2. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Ramnath అభిప్రాయం:

    05/22/2010 10:14 pm

    Srinivas,

    Good one. There is a couple of songs that come to mind. Don’t remember th emovie titles but the songs go something like

    1. ‘dOra vayasu chinnadi.. laa laa la laHa’
    2. ‘EdO.. EdO.. entO ceppalani’

    are worth remembering. I also like chillarakottu cittemma ‘suvvi kastUri ranga’.

    Ramanath

  3. రవీంద్రధనుస్సు గురించి Vadapalli SeshatalpaSayee అభిప్రాయం:

    05/22/2010 4:45 pm

    భారతి – మార్చి, 1962 సంచికలోని “శ్రీవాత్సవ”గారి “రవీంద్రుని ఒక గీతిక – తెనుగు అనువాదాలు” అనే వ్యాసాన్ని “ఆంధ్రభారతి”లో ఇక్కడ చదువవచ్చు.

  4. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:

    05/22/2010 11:27 am

    లైలాగారూ,
    మీరడిగినతరవాత చాలా ఆలోచించేను ఎందుకు అలా రాసేనా అని. ఈకథాకాలం 70, 80 ప్రాంతాల్లో జరిగింది అనుకుంటే, ఇతరవివరాలు సరిగ్గా సరిపోతాయి. అప్పటికి రిక్షాలు ఉన్నాయి. ఇంటరు చదివిన యువదంపతులు ఉండే అవకాశం ఉంది. -.:))

    మాలతి

  5. ఉత్తమాయిల్లాలు గురించి mOhana అభిప్రాయం:

    05/21/2010 10:17 am

    నేను 1956-1958 సంవత్సరాలలో పాత ఇంటర్మీడియేటు (దీనిని F.A., Fellow of Arts అనే వారు) చదివాను. అదే శ్రీ వేంకటేశ్వరనియూనివర్సిటీలో చివరి బ్యాచ్‌. అదే విధముగా BSc కూడా మాకు రెండు సంవత్సరాలే, తరువాత అది మూడేళ్లుగా మారింది. 1958లో మూడేళ్ల ఆనర్సు తీసివేసారు. ఈ మార్పు ఇటూ అటూ ఒక సంవత్సరం తేడాతో అన్ని విశ్వవిద్యాలయాలలో అమలులోకి వచ్చింది. చనిపోతే జుట్టు తీయడం చాలా కుటుంబాలలో ఇప్పుడు కూడా పాటిస్తారు.
    విధేయుడు – మోహన

  6. జనరంజని: మహానటి సావిత్రి గురించి madhavi godavarrhy అభిప్రాయం:

    05/21/2010 9:15 am

    నలభై నాలుగు సంవత్సరాలు బ్రతికిన సావిత్రిగారిని నలభై నాలుగు నిమిషాల్లో బంధించిన ప్రయత్నం అద్భుతం. మనసులో బాధను దిగమింగి తేనెలు కురిపించిన సావిత్రి గారికి నమస్సుమాంజలి. Hats off Srinivas garu.. ఒక్కసారిగా ముత్యాలు కురిసినట్టు.. ఆమని వచ్చినట్లు.. wonderful. సావిత్రిగారు నభూతో నభవిష్యతి.

  7. సుగమం గురించి రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:

    05/20/2010 11:08 pm

    ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు మరియు ఇప్పటి మానవ సంబంధాలను అద్దం పట్టిన కవిత. ఈ కవిత చదవడం నాకు బహుగా నచ్చింది. చాల బాగుంది.

  8. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:

    05/20/2010 7:55 pm

    లైలా గారూ,
    మీకు కథ అర్థమయినందుకు సంతోషం.

    టైంలైను, శ్రాద్ధకర్మల విషయంలో మీరు అడిగిన ప్రశ్నలు – నేను అంతగా ఆలోచించలేదండీ. నేను 1956లో ఇంటరు పూర్తి చేసేను. అదే ఆఖరిబాచ్ అన్నారు. కానీ తరవాత ఇంటరూ, పియూసీ చాలా రకాలుగా మారేయి. వాటివివరాలు నాకు తెలీవు. ఈకథ సుమారుగా గత 30 ఏళ్లలో జరిగినట్టు ఊహించుకున్నాను కానీ అప్పటికి రిక్షాలు లేవేమో. నేను ఇండియా వెళ్లడం చాలా తక్కువ. అంచేత ఇలాటి విషయాలు నాఊహకి ఎలా తోస్తే అలా రాసేస్తాను. చాలామంది పాఠకులకి అది చిరాకే కానీ కానీ నా పరిమితులు అవి. మీరు క్షమించి కథ చదవడానికి సిద్ధపడ్డారు.. థాంక్స్.

    శ్రాద్ధకర్మ చేసినప్పుడు, భార్య అనే కాదు, ఎవరు చనిపోయినా, కర్మ చేసేవారు తలనీలాలు తీయించుకోడం బ్రాహ్మణకుటుంబాల్లో ఉంది. ఇది ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. మిగతా కులాల ఆచారేలేమిటో నాకు తెలీదు. మరొకసారి, కథలో ప్రధానాంశం గుర్తించినందుకు థాంక్స్. నిజానికి, నేను అనుకున్నదానికంటే మీరు ఎక్కువే చదివేరు అందులో.

    మాలతి

  9. కళావసంతము గురించి mOhana అభిప్రాయం:

    05/20/2010 10:10 am

    దేశికాచారి గారూ, మీ పుస్తకం గురించి నాకు తెలీదు, అందువల్ల దానిని ప్రస్తావించలేదు, క్షమించాలి. వేణుగోపాల్ గారూ, నా ఉద్దేశంలో సంగీతము, శాస్త్రము, సాహిత్యము అన్నీ ముడి వేసికొని ఉంటాయి. అందువల్ల అన్నిటిని ఒకే చోట ఉంచినాను. అస్ట్రానమీ గురించి ఇంకా తేటతెల్లముగా వ్రాయనిది నా లోటే, క్షమించాలి. శ్రీనివాసద్వయానికి నా హార్దిక వందనాలు, మీకు ఈ వ్యాసం నచ్చినందులకు నాకు ఎంతో సంతోషం. శ్రీనివాస్ కొమ్మరుగారూ, ఆ పాటను పాడింది శ్రీమతులు MS సుబ్బులక్ష్మి, రాధా విశ్వనాథన్, రాధాజయలక్ష్మి కాదు. అందరికీ మీ ప్రోత్సాహానికి సహస్ర నమస్కృతులు. విధేయుడు – మోహన

  10. ఈ మాసపు పాట గురించి Mohan అభిప్రాయం:

    05/20/2010 5:02 am

    ఉదయకల గారు – మీరు రాసిన ఈ కథ చాలా బాగుంది