పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. శరణాగతి గురించి Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

    06/01/2010 11:32 am

    సీస పద్యం రాసే సామర్థ్యం లేక మీరలా రాసారనే ధ్వని నా అభిప్రాయంలో లేదే!!! ఒకవేళ అలా అన్పిస్తే క్షంతవ్యుణ్ణీ. ఏమైనా సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.

  2. శరణాగతి గురించి ధేశికాచారి అభిప్రాయం:

    06/01/2010 12:08 am

    లక్ష్మీప్రసాదుగారికి,
    సీసపద్యం ఛందస్సు తెలియక,లేదా సీసపద్యం వ్రాసే సామర్థ్యం లే క అట్లా వ్రాయలేదు. ఇది బుద్ధి పూర్వకంగా సీసపద్యంలోని ఉత్తరార్థంలో 3 ఇంద్రగణాలపైన ఒక సూర్యగణం వేసి, ద్విపదలాగా నడిపించాలని చేసిన ప్రయోగం. ఈ విధంగా సీసపద్యంపై కొద్దిపాటి మార్పులతో సీసపద్యం లాగ నడిచే ఛందస్సులకు నేను పెట్టుకున్న పేరు సీసతుల్యములని. మీకు ఓపిక ఉంటే ఇట్లాంటి నూతనచ్ఛందో ప్రయోగాలు నా వెబ్ సైటులో నా జక్కనచరిత్ర కావ్యంలోచూడగలరు. పైగా అది సీసపద్యమని నేను పైఖండికలో దానిని లేబుల్ చేయలేదు. ఒకవేళ అట్లా చేయాలంటే దానిని సీ.తు. (సీసతుల్యము) అని నా జక్కనచరిత్రలో చేసిన విధంగా చేస్తాను కాని, సీ (సీసము) అని చేయను. మీరు సూచించిన “సొంపుల” అనే మార్పు బాగుందని అంగీకరిస్తాను. కాని రెండవ సూచనతో నేనంగీకరించలేను.”నిధులీనుచు” అనేప్రయోగం అఖండయతిని తొలగించుకొనడానికి చేసిన కృత్రిమయత్నం లాగ ఉంటుందే కాని పద్యం యొక్క సొగసును గాని, అర్థాన్నిగాని పెంపొందింపజేయదు. ఇక్కడ అఖండయతి పడుతున్నదని గుర్తున్నా, దానిని తొలగించడానికి చేసే వికృతయత్నాలకంటే దానిని ఉంచుకోవడమే ఉత్తమపక్షమని నేను ఆవిధంగా వ్రాసినాను.

  3. శరణాగతి గురించి Dr.Gannavarapu Vraha Narasimha Murty అభిప్రాయం:

    05/31/2010 6:05 pm

    వేదాది విద్యలే అను పద్యము సీసం కాదు. ఇందులో ఏడు ఇంద్ర గణములు ఒక సూర్య గణం ప్రతి పాదంలోను ఉన్నాయి. తిరుమల కృష్ణదేశికాచారి గారు దీనిని సీసం అనలేదు. అందుచే ఆయన ఛందస్సును తప్పు పట్టలేము. ఇది క్రొత్త ప్రక్రియో లేక మరో పేరున్న ఉపజాతి వర్గమో అవుతొంది. పద్యం బాగుంది. దీనికో పేరుంటే ఎవరైనా తెలియ పరుచ గలరు. ఒక పేరు లేకపోతే దీనిని తిరుమల అందాము.

  4. శరణాగతి గురించి Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

    05/31/2010 12:59 pm

    సీస పద్యంలో ఛందస్సు సవరించుకోగలరు

  5. శరణాగతి గురించి Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

    05/31/2010 12:56 pm

    ఛందస్సు అభివ్యక్తికి ప్రతిబంధకమనే భాషరాని, భాష నేర్చుకోని సొమరిపోతులు మీ పద్యాలు చదివితే బాగుంటుంది.
    పదక్రమంపు టింపుల నలవర్చి అనే కంటే పదక్రమంపు సొంపుల నలవర్చి అంటే బాగుండేదేమో. స్వర్ణమయతేజముతోడ శిరఃపదాంతమున్ అనే దగ్గర అన్వర్థ సాధనలో క్లిష్టత చోటు చేసుకుదని నా అభిప్రాయం. దీన్ని స్వర్ణ నిధులీనుచు నాపద మస్తకంబికన్ రంతొనరింనేల? అనో వేరే విధంగానో అంటే బాగుండేదేమో! అఖండ యతి బాధా ఉండేది కాదు.
    చనువు తీసుకుని ఉచిత సలహాలిచ్చినందుకు అన్యథా భావించరుకదా!!!!
    శుభం భూయాత్

  6. ఉత్తమాయిల్లాలు గురించి Satya అభిప్రాయం:

    05/29/2010 11:53 am

    మాలతి గారూ,

    మీరు చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పారు.మీకు శ్రీరంగశయనం పైకోపమేమో గాని, ఆ పాత్రపై ఖచ్చితమైన అవగాహన ఉంది. నిజ జీవితంలో తారసపడిన ఒక పాత్రలాగా ‘చిత్రీకరించారు’.

    70-80 ప్రాంతాల్లో ఇటువంటి మనస్తత్వాలు ఇట్లా ఉండేవేమో నాకు తెలీదు కాని, ఈ కాలం చెత్త సినిమాలు చూసి మనసులు పాడు చేసుకొని…భార్య ఉండగానే కలల్లో తేలిపోయే వాళ్ళు, భార్య పోయిన తర్వాత ఆ కలల్ని నిజం చేసుకోవాలనుకవడంలో నాకేమీ అసహజమనిపించలేదు.

    –సత్య

  7. కళావసంతము గురించి మందాకిని అభిప్రాయం:

    05/29/2010 4:39 am

    మోహన విరచితమైన మధుమాసపు వర్ణన మనమోహనమై, ఇంపుగా నున్నది.
    ధన్యవాదములు.

  8. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kavitha అభిప్రాయం:

    05/28/2010 4:16 pm

    Kayakay గారు, కథ మళ్ళీ చదివాను..మీ అభిప్రాయం చూసాక.మబ్బు విడినట్టుగా ఉంది!

  9. ఇంకా ఎందుకు మిగిలావు గురించి gana అభిప్రాయం:

    05/28/2010 12:33 pm

    కవితాత్మక నింద లేక నిరసన.

    ‘ఆది భిక్షువు వాడినేది కోరేదీ’ లేక
    ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ‘ కన్నా
    మీ కవిత ఘాటుగానే ఉంది.

    ఏదనుకున్నా బాగా వ్రాసారు.

  10. మరో ప్రపంచం పిలిచింది గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    05/28/2010 11:52 am

    1979లో బరంపురంలో అఖిలాంధ్ర రచయితల సమ్మేళనం మార్చి 20-22 ల మధ్య జరిగినప్పుడు మహాకవి ‘ అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితా లాలసుడా, దేర్ ఫోర్ ఊగరా ఊగరా’ అని ప్రసన్న వదనంతో చదవడం, ‘ఒక్క మతితోనే సతమతమౌతుంటే నాకీ బహు మతులెందుకూ’ ‘ అన్న పానుగంటి వారి జోక్ ని వినిపించి ‘సాక్షి’ వ్యాసాలు ప్రస్తావించడం- ఇవన్నీ మననం చేసుకుంటుంటే అటువంటి ‘మూవింగ్ ఎన్ సైక్లోపీడియా’ కవి 20వ శతాబ్దంలోనే కాదు, ఇప్పుడూ లేడు అనిపిస్తుంది. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది- ఈ గేయం ఎన్నో రూపాలతో సినీ గీతంగా మళ్ళీ మళ్ళీ శ్రీశ్రీ కలంనుండే రావడం బహుశ: గిన్నీసు వారి దృష్టికి రాలేదేమో. రణ భేరి చిత్రంలో కొంత భాగం ‘మార్చింగ్ సాంగ్’ గా, మిగతా భాగం బుర్ర కథ గా మలిచారు. ఇవన్నీ ఒక చోటికి తీసుకు రాగలిగేది, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, ఈ మాటే!
    -వేగోతారా