నిజమైన సాహిత్యాభిమాని అన్ని భాషలనూ అభిమానిస్తాడు.ఏ భాషనూ ద్వేషించడు. ఆధునిక కాలంలో ఇది అత్యవసరం.దృక్ప్ఠథం విశాలం కావడానికి దోహదం చేస్తుంది.అయితే మాతృభాషను కించ పరచుకో రాదు. అనవసరంగా ఆంగ్ల పదాలు చొప్పిస్తూ వ్రాస్తే ఇక ‘తెలుగు’ అని చెప్పుకోవడానికి ఏమి మిగులుతుంది అనే విషయాన్ని రచయితలు ఆలోచించు కోవాలి.
మీ సందేహం సబబుగానే వుంది. మీరు చెప్పిన కీర్తనలో సూచించిన “గరా” అన్నది అనుప్రాసలో క్రిందకే వస్తుంది.
ఈ “వందనము రఘు నందనా” కృతిలో చాలా అనుప్రాసలున్నాయి. నేను ఒక్కొక్క శబ్దాలంకారానికీ ఒక్కో కృతే తీసుకున్నాను. చాలా కృతుల్లో ఇవి కనిపిస్తాయి. మీరు చెప్పిన కృతే తీసుకోండి.
వందనము రఘు నందన సేతు
బంధన భక్త చందన రామ
శ్రీ-దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ (వ)
శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ-భారమా రామ (వ)
వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ (వ)
ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ-వాడను రామ (వ)
కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ (వ)
న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ (వ)
చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ (వ)
క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ (వ)
వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ (వ)
ప్రతీ చరణంలో అనుప్రసాలున్నాయి. “ఓడను, వీడను, వేడను, వాడను” ఒకే రకమైన అక్షరాలతో పలికే విభిన్న పదసముదాయమది. మొత్తం కృతినిండా ఇలాంటివే వున్నాయి. వెతికితే మిగతా కృతుల్లోనూ ఇలాంటివి కనబడతాయి. త్యాగరాజు శబ్దాలంకారాలకి చాలా ప్రాముఖ్యత చూపించాడు. ముఖ్యంగా సంగీతాన్ని కర్ణపేయంగా చేయడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయో, సంగీతానికివెంత అవసరమో చూపించాడు. అన్ని కవితా ప్రక్రియల్లోకీ పాట రాయడం చాలా కష్టం. రాసి మెప్పించడం మరీ కష్టం. సశాస్త్రీయంగా రాయడం బహు దుర్లభం. అందుకే చాలా మంది కవులు కవిత్వంతోనే సర్దిపెట్టుకుంటారు. పాటలజోలికి పోరు. పోయినా శాస్త్రీయ సంగీతం వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడరు. త్యాగరాజు తరువాత మనకు మిగిలిన ఒకే ఒక పెద్ద వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ. తెలుగువారు ఆయనకెంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసున్నదే!
గొర్తి వారి వ్యాసం చాలా చక్కగా మనసుకి హత్తుకుని చిర కాలం గుర్తుండేలా ఉంది. త్యాగరాజు కీర్తనలను పాడుకుని తన్మయించడమే తెలుసు గాని వాటి వెనుకైంత శ్రమ ఉందని ఊహించనే లేదు. వక్కలంక వారికి ఎప్పుడో ముప్ఫై సంవత్సరాల కింద చదివిన వ్యాకరణం కొంచెం గుర్తు కొచ్చి ఇది ఉదహరిస్తున్నాను. వజ్రపుటుంగరము అన్న దాంట్లొ పుంప్వాదేశ, టుగాగమ సంధుల కలయిక ఉందని గుర్తు.
విధేయుడు
నారాయణంబాబు వేదుల జంషెడ్ పూరు.
పాత రచనాసమయాల్లోని “కరిగిజారే కుంకుమబొట్టు” స్థానే ఇప్పుడు “రాలిపడే బొట్టుబిళ్ళలు” అన్నది చోటుచేసుకోవడం ఇక్కడ విశేషం. అయితే కరిగిజారే కుంకుమలో ఉన్న అందం రాలిపడే వీటికి లేదు. ఆధునిక జీవితలోని అంటీఅంటని ఒక అనవసరమైన తొందరలాగా ఈ బొట్టుబిళ్ళలు అలా చటుక్కున రాలిపడిపోవడం తప్పితే !! కొత్త ఉపమానం ఇది.
ఇకపోతే ఎవరూ చదవకపోతే కధకి ఒక ఉనికి లేదేమోగానీ ఎవరూ గమనించకపోయినా జీవితం మాత్రం ఉంటుంది. జీవితం అంటే ఏమన్నా ఇలా ఈమాటలో ప్రచురించబడే కధా !![ పైగా అందరి సమీక్షలూ తర్వాత ]….
ఒకపోలిక కొత్తగా ఉండి మరొక పోలిక అతకనట్టుండి ఇలా “కధ గారి” ఆత్మఘోషలోంచి పొలమారిపోయింది.
వాళ్ళు రాక ముందు గురించి Seetha Kumari అభిప్రాయం:
03/07/2011 7:10 am
చక్కని దృశ్య కవిత…
భాషల ఋతువు గురించి Seetha Kumari అభిప్రాయం:
03/07/2011 7:08 am
చాలా మంచి కవిత….ఎంతో నచ్చింది..
ఫాదరు జోజి గురించి Seetha Kumari అభిప్రాయం:
03/07/2011 7:05 am
బాగుంది…
ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి pratap అభిప్రాయం:
03/07/2011 4:51 am
చాలా బాగున్నది.
భాషల ఋతువు గురించి sesha kumar kv అభిప్రాయం:
03/07/2011 4:12 am
నిజమైన సాహిత్యాభిమాని అన్ని భాషలనూ అభిమానిస్తాడు.ఏ భాషనూ ద్వేషించడు. ఆధునిక కాలంలో ఇది అత్యవసరం.దృక్ప్ఠథం విశాలం కావడానికి దోహదం చేస్తుంది.అయితే మాతృభాషను కించ పరచుకో రాదు. అనవసరంగా ఆంగ్ల పదాలు చొప్పిస్తూ వ్రాస్తే ఇక ‘తెలుగు’ అని చెప్పుకోవడానికి ఏమి మిగులుతుంది అనే విషయాన్ని రచయితలు ఆలోచించు కోవాలి.
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి Sowmya అభిప్రాయం:
03/06/2011 8:26 am
మొదటి విద్యాసుందరి లంకె మరేదో వ్యాసానికి వెళ్తోంది…సరిచేయగలరు.
[పొరపాటు సరిజేశాం, ధన్యవాదాలు, సం.]
ప్రేమ కవితలు గురించి asan అభిప్రాయం:
03/06/2011 8:13 am
ok చాలా బాగుంది.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/06/2011 3:55 am
కిషోర్ గారూ,
మీ సందేహం సబబుగానే వుంది. మీరు చెప్పిన కీర్తనలో సూచించిన “గరా” అన్నది అనుప్రాసలో క్రిందకే వస్తుంది.
ఈ “వందనము రఘు నందనా” కృతిలో చాలా అనుప్రాసలున్నాయి. నేను ఒక్కొక్క శబ్దాలంకారానికీ ఒక్కో కృతే తీసుకున్నాను. చాలా కృతుల్లో ఇవి కనిపిస్తాయి. మీరు చెప్పిన కృతే తీసుకోండి.
వందనము రఘు నందన సేతు
బంధన భక్త చందన రామ
శ్రీ-దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ (వ)
శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ-భారమా రామ (వ)
వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ (వ)
ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ-వాడను రామ (వ)
కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ (వ)
న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ (వ)
చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ (వ)
క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ (వ)
వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ (వ)
ప్రతీ చరణంలో అనుప్రసాలున్నాయి. “ఓడను, వీడను, వేడను, వాడను” ఒకే రకమైన అక్షరాలతో పలికే విభిన్న పదసముదాయమది. మొత్తం కృతినిండా ఇలాంటివే వున్నాయి. వెతికితే మిగతా కృతుల్లోనూ ఇలాంటివి కనబడతాయి. త్యాగరాజు శబ్దాలంకారాలకి చాలా ప్రాముఖ్యత చూపించాడు. ముఖ్యంగా సంగీతాన్ని కర్ణపేయంగా చేయడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయో, సంగీతానికివెంత అవసరమో చూపించాడు. అన్ని కవితా ప్రక్రియల్లోకీ పాట రాయడం చాలా కష్టం. రాసి మెప్పించడం మరీ కష్టం. సశాస్త్రీయంగా రాయడం బహు దుర్లభం. అందుకే చాలా మంది కవులు కవిత్వంతోనే సర్దిపెట్టుకుంటారు. పాటలజోలికి పోరు. పోయినా శాస్త్రీయ సంగీతం వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడరు. త్యాగరాజు తరువాత మనకు మిగిలిన ఒకే ఒక పెద్ద వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ. తెలుగువారు ఆయనకెంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసున్నదే!
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి narayana babu vedula అభిప్రాయం:
03/05/2011 8:07 am
గొర్తి వారి వ్యాసం చాలా చక్కగా మనసుకి హత్తుకుని చిర కాలం గుర్తుండేలా ఉంది. త్యాగరాజు కీర్తనలను పాడుకుని తన్మయించడమే తెలుసు గాని వాటి వెనుకైంత శ్రమ ఉందని ఊహించనే లేదు. వక్కలంక వారికి ఎప్పుడో ముప్ఫై సంవత్సరాల కింద చదివిన వ్యాకరణం కొంచెం గుర్తు కొచ్చి ఇది ఉదహరిస్తున్నాను. వజ్రపుటుంగరము అన్న దాంట్లొ పుంప్వాదేశ, టుగాగమ సంధుల కలయిక ఉందని గుర్తు.
విధేయుడు
నారాయణంబాబు వేదుల జంషెడ్ పూరు.
కథ కథ గురించి rama bharadwaj అభిప్రాయం:
03/05/2011 1:10 am

రమ.