పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/11/2011 8:54 am

    బ్రహ్మానందం గారికి

    మీరు “శ్రుత” అనే మాట చాలా సార్లు వాడారు ఈ వ్యాసంలో.

    శృతం అంటే అంటే వండబడినది లేదా కాచబడినది అని అర్థం.
    శ్రుతం అంటే వినబడినది.

    శ్రుతపేయం అనటం సరి కాదనుకుంటా – శ్రోత్రపేయం అనే ప్రయోగం సంస్కృత నిఘంటువులో చూసాను.(పేయము = తాగదగ్గది)

    శ్రుతయోగ్యము అనటం కూడా సరి కాదేమో – శ్రవణయోగ్యం అనాలేమో.

    శ్రుతప్రాయము అనే మాటకి వాడుక గూగుల్ లో వెదికితే దొరికింది. దాదాపుగా అంతా వినబడినది (heard almost in full) అని అర్థం. మీరు ఉద్దేశించింది అదేనా?

    త్యాగరాజు వాడిన శబ్దాలంకారాలను వదిలి ఈ శబ్ద చర్చ చేస్తున్నందుకు క్షమించండి.

    నలుగురికి తెలిస్తే ఉపయోగం కదా అని ఇక్కడే రాస్తున్నాను.

    మీ
    శ్రీనివాస్

  2. నిరాశకై ఆశపడుతూ… గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/11/2011 6:46 am

    శ్రీనివాస్ గారు, థాంక్సండి.
    ఏమిటా రెండు పాటలు? తెల్సుకోవచ్చా?
    కృతజ్ఞతలతో-
    ఆర్.దమయంతి.

  3. కాలనీ భోగి గురించి chintalapati అభిప్రాయం:

    03/10/2011 1:44 pm

    Excellent. Not only the proper narration but a touch of humor made it a complete story. I think you need to put more time into writing more full-length stories. I feel proud to have a friend in my circle who is a writer.

  4. About eemaata గురించి b vijayakumar అభిప్రాయం:

    03/10/2011 1:21 pm

    ఈ మాట చాలా బాగుంది. తెలుగు సాహితీ భాండాగారంగా ప్ర సిద్ధికెక్కాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.
    బల్లా విజయకుమార్ , గజపతినగరం

  5. నిరాశకై ఆశపడుతూ… గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/10/2011 8:41 am

    కెందారాలు అంటే? నిఘంటువులో దొరకలేదా మాట.

    “చెలువమీరిన సెల” అంటే? (చెలువ అంటే స్త్రీ అని అర్థం; చెలువము అంటే అందము అని).

    ఓ రెండు మంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలను గుర్తుకు తెచ్చారు మీరు.

  6. ఫాదరు జోజి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/10/2011 3:55 am

    ఫాదరు జోజి ఎవరా అని వెదుక్కుంటే…హైదరాబాదు ఆర్చిబిషప్పుగా పని చేసి ఇటీవలే మరణించిన జోజి బాబు గారి పేరు తారస పడింది. ఆయన స్మృతిలో రాసిన కవితా ఇది?

    “నేలబారు గద్ద / నిడుపు సూపు నేను / నేలమీద లేను / ధూళి రేగుతాను.” అన్న చరణం కవితా సందర్భంలో, మిగతా మృదు పద చిత్రాల నడుమ బాగా అతికినట్లు అనిపించలేదు.

  7. నిరాశకై ఆశపడుతూ… గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/09/2011 9:45 pm

    రమ గారికి,
    నమస్తే.
    మీ విమర్శ బావుందండి. మీరన్నట్టు మార్చాలనుకున్నా, కానీ కుదరలేదు.
    ‘అరిగిపోయిన’ అని అన్నారు మీరొక చోట. కాదండి. ‘కరిగిపోయిన’ కరెక్టేమో! అని అనుకుంటున్నా.
    కృతజ్ఞతలతో-
    ఆర్.దమయంతి.

  8. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:

    03/09/2011 2:05 pm

    సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసినది –
    “నాగరత్నమ్మ గారు త్యాగరాజు మీద తెలుగులో స్వయంగా రాసిన ఒక వ్యాసం నావద్ద వుంది” .
    ఈ వ్యాసము, మరి కొన్ని వివరాలు పై వ్యాసానుబంధానికి జత చేయబడినదని పాఠకులకు తెలియజేస్తున్నాము. విధేయుడు – మోహన

  9. భాషల ఋతువు గురించి kiran babu అభిప్రాయం:

    03/09/2011 1:15 pm

    చాలా బాగుందీ కవిత.

  10. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/08/2011 2:57 pm

    లైలా గారూ,

    మీరు కథలూ, కవితలే రాస్తారనుకున్నాను. పాటలు కూడా రాస్తారన్నమాట. ఇలా ఓ పాట పాడుకోండీ, లేదా వాయించుకోండంటూ నాలుగు వాక్యాలు మా ముందు కుమ్మరిస్తే ఎలా? ట్యూనిచ్చుకు కొట్టండి. లైలా విరచత అని చివర్లో చేర్చి మరీ హాయిగా పాడుకుంటాం. goose bumps రాకపోతే అప్పుడడగండి.
    ప్రేమ పాటలు తప్ప పాడుకోకూడదా ఏం?
    ప్రకృతి ధర్మాన్ని తప్పించుకోడం ఎవరి వల్లా కాదు. త్యాగరాజు కూడా మనలాగా ఉప్పూ కారమూ రుచులు తెలుసున్నవాడే!
    మీ కోసం త్యాగరాజు రాసిన ప్రేమ గీతం. శృంగారంపాలు ఎవరికి కావలిసినంత వారు రంగరించుకోవచ్చు.
    ఈ పాట చదివి ( మీ పాట లాగ )మీరు శాంతిస్తారని ఆశిస్తూ –

    శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను
    అంగ-రంగ వైభోగముతో
    గోపాంగనామణులెంతో సొగసుగ (శృ)

    నవ్వుచు కులుకుచునొకతె కొప్పున
    పువ్వుల ముడుచుచునొకతె
    దువ్వుచు కురులనునొకతె కృష్ణుని
    రవ్వ జేయుచునొకతె వేడ్కగ (శృ)

    మగడు వీడనుచునొకతె రవికయు
    బిగువున జేర్చుచునొకతె
    తగును తనకనుచునొకతె పాద
    యుగములనొత్తుచునొకతె వేడ్కగ (శృ)

    సొక్కుచు సోలుచునొకతె కృష్ణుని
    గ్రక్కున ముద్దిడునొకతె
    పక్కగు రమ్మనుచునొకతె మడుపుల-
    నక్కరనొసగుచునొకతె వేడ్కగ (శృ)

    పరిమళములందుచునొకతె శ్రీ
    హరి హరియనుచునునొకతె
    ఉరమున జేర్చుచునొకతె పయ్యెద
    జరిపి వేడుకొనుచునొకతె వేడ్కగ (శృ)

    సారసాక్షయనుచునొకతె కను
    సైగను పిలుచుచునొకతె
    రారాయనుచునునొకతె త్యాగ-
    రాజ సఖుడనుచునొకతె వేడ్కగ (శృ)

    నౌకాచరిత్రం వినండి. మనసు కాస్త కుదటపడుతుంది. పాపం, త్యాగరాజుకీ తప్పలేదు ఈ ప్రేమగోలని తెలుస్తుంది.