“దీనికి కారణం ఇప్పటి ప్రజలకు “భక్తి” రసం ఎక్కువ అవసరం లేకపోతోంది. ”
“భక్తి” రసం లేని లోటుని “శృంగార” రసం ఇప్పటి సినిమాల్లో భర్తీ చేస్తోంది. భక్తిరస ప్రధానమైన సాంప్రదాయ కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో తక్కువ అవటానికి ఈ మార్పు ఒక కారణం.”
కర్ణాటక శాస్త్రీయ సంగీతం భక్తి రస ప్రధానం అంటున్నారా? ఈ వ్యాస రచయితలు. లేక కర్ణాటక సంగీతం లో కన్నా, తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ శృంగారం ఉందంటున్నారా?
సంగీతం పుస్తకం తీసి ఎక్కడ చదివినా శృంగార రసమే. దేవుడి పేర్లు ( well known names in the roster of Indian Gods) ఈ రచనలలో తరచుగా వినవస్తయి. ఐనా విషయం శృంగారమే . ఆ శృంగారంలో ‘మలిన,’ ‘అమలిన’ అని మళ్ళీ ఏదో ఇటీవలి పితలాటకం, అప్పటి సంగీతకారులకు ఉన్నట్టు లేదు.
ఊరికే ఒక సంగీతం పుస్తకం తెరిచి, మచ్చుకు కొన్ని రాస్తున్నాను. ఒకవేళ ఇవి భక్తి పాటలేమో, చదివి చెప్పండి.
6.
ఏర నాపై నింత చౌక శాయ – మేర గాదుర నా సామి
మరుని గన్న శ్రీ వెంకటేశ సుకుమార నన్నేలుకోర సరసుడ
7.
కరుణింప ఇది మంచి తరుణము సామి
పరుల వేడలేను నా పాలి శ్రీ వేణుగోపాల దేవ
కృప జూడుము ఈ వేళ
How about a few more?
8.
నిన్ను కోరియున్నార నెనరుంచి నన్నేలుకోర
పన్నగశయనుడౌ శ్రీ పార్థసారథి దేవ
సూన శరుని బారికోర్వలేర
9.
వలచి వచ్చియున్న నాపై చలము సేయమేరా? సామి నే
చెలువుడైన శ్రీ వేంకటేశ కలసి మెలసి కౌగిలించర
What about that ever popular lilting
10.
రార వేణూ గోపా బాలా రాజిత సద్గుణ జయశీలా
సారసాక్షా నేరమేమీ మారు బాధా కోర్వలేరా
How can I not to mention the recently read 100% sexy tyagaraja song ( Thanks బ్రహ్మానందం గారు )
11
శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను
అంగ-రంగ వైభోగముతో
గోపాంగనామణులెంతో సొగసుగ (శృ)
Get the picture?
“నిన్ను కోరి” seems to be the most oft sung phrase in Karnatak music. How does one interpret that musical phrase? As sexy or spiritual?
మనకి అన్ని కాలాల్లోనూ popular art forms ఉన్నాయి. అలాగే fine arts ఉన్నాయి. ఈవ్యాసంలో మొదలుపెట్టిన గొంతు వ్యాసం మొత్తం మీద లేదు. సినిమా పాటల విషయంలో కాలాన్ని గురించి అంత సానుకూలతని ప్రదర్శించిన వీరే గ్రూప్ డాన్స్ ల విషయాని కొచ్చేసరికీ చాదస్తపు గొంతుని విన్పించారు.
ఎప్పుడైనా ఒకే కాలంలో జనసామాన్యపు అభిరుచి [డబ్బులొస్తుందనుకుంటే..] popular art forms లో ఎక్కువ చోటు చేసుకుంటుంది, mass media ల్లో! సినిమా ఎప్పుడూ మాస్ మీడియానే. పైగా డబ్బులు సంపాదించుకుందికి అత్యధిక మొత్తంలో సొమ్ములని వెచ్చించి జూదం ఆడిన పధ్ధతిలో ఒక మూసలో నడిచే కళ కూడా!! అక్కడ డబ్బు మాత్రమే ప్రధానం మిగతావాటికన్నా!! ఆత్రేయ రాసినా, వేటూరి రాసినా, సీతారామ శాస్త్రి రాసినా.. ఇంకా మిగిలిన సినిమా కవులెవరన్నా రాసినా డబ్బుకోసమే!! అంచేత డబ్బులు తెచ్చే విధంగా మాత్రమే రాయమని వారిని ఆ నిర్మాతలు అడగడం తప్పదు. వీరు రాయకా తప్పదు. అందులో మంచివీ జనరంజకమైనవీ ఉంటాయి. కానివీ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వచ్చేది నాటు శృంగారంలోనే గనక చినమా కవులు ఎక్కువగా ఆయా అర్ధాలని వచ్చే విధంగా రాయడం తప్పనిసరి. ఈ విషయం ఆ రాయమనే వారికీ తెలుసు. ఈ రాసే వారికీ తెలుసు. ఇక్కడ ఎవరూ అమాయకులు కారు.పాతకాలంలో కేతిగాడూ, బంగారక్కా లాంటి వీధిబాగోతాల పాత్రలు సినిమాల్లో సమకాలీన అవసరాలని తీర్చేలాగా రూపొందాయి. అయితే సినిమా మాధ్యమం targeted audience ఎవరు అన్నదాని ఆధారం గానే వాడే భాషా, పాటల్లోని అర్ధాలూ, సంగీతమూ ఉంటాయని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఎలాగైతే సినిమాలోని హీరోయిన్ వాడే సంభాషణలూ, వొలకబోసే వయ్యారమూ ఆమె అవన్నీ నచ్చి చేస్తోందని మనం చెప్పలేం. అది ఆ సినిమా దర్శక నిర్మాతల అభీష్టం బట్టి రూపొందుతుంది.
పాపులర్ కళ ఉన్నా సమాంతరంగా మనకి ఇతర కళలు కూడా అవసరమై ఉంటూనే ఉన్నాయి. వాటిలో డబ్బుకి ఉండే స్థానం రెండవదీ, కళాత్మకత మొదటిదీ. అందువలన ఇతర లలితకళలన్నీ అన్నికాలాల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి. సమకాలము మాత్రమే సాహిత్యానికీ సంగీతానికీ కొలమానం అయితే “ఈమాట”లో త్యాగరాజు మీద వ్యాస పరంపర అవసరం ఉండదు. అలాగే గడిచిపోయిన రచయితల రచనలని గురించిన చర్చా ఉండదు. ఇవాళ్టి వాళ్ళ కవిత్వం మాత్రమే వేసుకుని పత్రిక నడుపుకోవచ్చు కదా? కానీ అలా చేయడం లేదెందుకనీ? చాదస్తం వల్లనేనా? కాదే? అలాగే సినిమాల విషయంలో సైతం అభిరుచి అన్నది ప్రమాణం అయితే ఇవాళ్టి సినిమా ఎవరి అభిరుచిని ప్రతిబింబిస్తోంది అన్నది ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. ఈ వ్యాస రచయితా త్రయం చదువుకున్నవారే అయి ఉండి సినిమా పాటకి “సామాజిక అంతరాలూ, ఆడామగా తేడాలూ లేవు” అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ఎందుకు లేవూ? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ ఆడపిల్లా వేటూరి గొంతు పెట్టుకుని “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ” అని పాడదు. అలాంటి పాట వేటూరిది. అమ్మాయిల మనోభావాలని అనుసరించి వచ్చింది కాదు. అమ్మాయికి స్వేచ్చ ఉండి పాడుకోగలిగితే మరి ఇంకెలాగైనా పాడుకునేదేమో గానీ.. వేటూరి సుందర్రామ్మూర్తి రాసినట్టు కాదు. అలాగే ఇతర వర్గాల తేడాలు కూడా!! సినిమాల్లోని భాష ఏ వర్గపు అవసరాలు లేదా ఆశయాలూ ముఖ్యమో వాటిని నెరవేర్చడానికే తయారైనది. అమాయకంగా ఏమీ రూపొందింది కాదు. త్యాగరాజ కీర్తనలకి డిమాండ్ ఉండి డబ్బులొస్తాయని అనుకుంటే మన డిస్ట్రిబ్యూటర్లూ మన ఫైనాన్సర్లూ దానికే డబ్బుపెడతారు. డబ్బులకోసం రాసే పాటలో ఎప్పుడూ ఉత్తమ విలువలు ఉండలేవు. దీనికి కాలం కాదు ప్రతిబంధకం! సమకాలపు అభిరుచి కూడా కాదు. వీళ్ళు ఇన్ని సినిమా పాటలని వివరించి రాసేరు. నేను మరి ఇవాళ్టి కాలానికి చెందిన దాన్నే గానీ వీళ్ళ లిస్టులోని చాలా పాటలు మరి నాకు తెలీదు. నేను సినిమాలని తెగ చూసే అలవాటున్నదాన్నీ కాను.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే జనం అభిరుచి అంటూ ఉండదనీ వాళ్ళు తీసేది వాళ్ళు రాసేదీ జనం అనబడు వారు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూడటమో వినడమో చేయవచ్చు కానీ అవన్నీ “సమకాలము వారి అభిరుచిని” ప్రతిఫలిస్తున్నాయని మనం సాధికారంగా ఏమీ చెప్పలేమనీ నా ఉద్దేశ్యం. తాడేపల్లి హరికృష్ణ గారన్నట్టూ పద్యనాటకాలకీ ఇతర కళారూపాలకీ వచ్చే జనమూ ఇవాళ్టి కాలం వాళ్ళే!! చాయిస్ అని ఒకటుంటుంది మరి. దాని ప్రకారమే బతకడానికి సమకాలం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఈ “చాయిస్” అన్నది తక్కువగా దొరుకుతుంది ఏ కాలంలో బతికిన వారికైనా!! సినిమా పాటా మాటా ఆటాతో సహా!
>> ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు.
>> కాలానుగుణంగా మారి తీరాలి. లేకపోతే మనకే నష్టం కష్టం
అచంచలమైన ఆత్మ విశ్వాసం కల కొద్ది మంది మనుష్యుల చరిత్రే మానవజాతి చరిత్ర అని వివేకానందుడు చెప్పాడు. యద్యదాచరతి శ్రేష్ట: తత్తదేవేతరో జన: అని గీతాకారుడూ అన్నాడు. నిజానికి సూర్యచంద్రుల గతి ననుసరించీ, ఋతువులననుసరించీ నడిచే “కాలం” యుగాలుగా అలానే వున్నది. “మారుతున్న కాలం”గా చెప్పబడుతున్న కాలం దేశచరిత్రల్లో ఆత్మవిశ్వాసం ప్రబలిన కొద్దిమంది వ్యక్తులు నిర్దేశించిన గతి. సామాన్యులందరూ తలొంచుకుని ఇంకేం మారాడకుండా నడుచుకునే దారీను. “కాలం”, “ప్రజాభీష్టం”, collective will ఇలాటివన్నీ బలవంతులు తమ మాట చెల్లించుకోడానికి చెప్పే మనష్యకృతాలైన భౌతిక సూత్రాలు. ఒక్కోసారి అవి మెజారిటీకి ఉపకారమే చేస్తాయి. అనేకసందర్భాలలో అపకరిస్తాయి కూడాను. ప్రస్తుత విషయానికొస్తే, సినిమా స్వరచక్రవర్తి నౌషాద్ గారు: “ప్రజాభీష్టమంటూ వాద్యభీభత్సాన్ని సృష్టించే అధునాతన సంగీతమంతా సంగీతకారులు సృష్టిస్తున్న ఇష్టమేను” అని ఓ సందర్భంలో అన్నాడు. ఇక్కడి చర్చని ఇక్కడింకా పొడిగిస్తే, ఇప్పుడొ ఇళయరాజా, రహ్మాన్లు ఇంకా అవే కల్యాణి, అదే మోహనం, శంకరాభరణాల్లో పాటలు కట్టారునుకోండి – ప్రజలు సినిమాలు చూడ్డం మనుతారా, రికార్డులు కొనడం మానతారా? ఇలాగే ఓ రెండొందల సంవత్సరాలుగా యక్షగానాలు, రంగస్థలనాటకాలూ అవే పద్యాలని అలాగే సాగదీసి పాడుతుంటే ప్రేక్షకులు రావడం మానినట్టుగా నేనెక్కడా వినలేదూ, చదవనూ లేదు. నడుస్తున్నదాన్ని కాలమంటే, అదీ కాలమేను.
హమ్మయ్య ..ఇన్నాళ్ళకి ఒక్క గొంతు “ఈమాట” లో అచ్చయ్యే చాలా చెత్త కవితలమీద ఒక పేరడీ విన్పించింది. అందుకు ముందుగా శశికి అభినందనలు. ఈమాట వాళ్ళు “పీర్” రివ్యూ పధ్ధతిని పాటిస్తూ పైగా తమ అత్యుత్తమ విధానం లోంచి మరీ “ఎంపిక” చేసుకున్న గొప్ప కవితలు ఎంత నాసిగా ఉన్నాయో వారెప్పుడూ పరికించి చదువుకున్నట్టు లేదు. ఎవరేం రాస్తే దాన్ని అచ్చు వేసేస్తూ పేద్ద పేద్ద మాటలెందుకో మరి చెప్పేది? ఉదాహరణకి ఈ కవితనే చూడండి.మూడో స్టాంజా చివరి లైన్లూ.. నాల్గో స్టాంజా మొత్తంగా చెత్త. అర్ధం పర్ధం లేదు. అయినా ఆహా ఓహో అంటూ ఏకవాక్య మెచ్చుకోళ్ళూను. ఈమాట అంతా నిండి అనేకమైనవి …భాష లో బెండు లాంటివీ.. ఊహలో ఊక లాంటివీ ఎన్నో! అన్నీ కవితలే కవితలు కవితలు ..తక్కెడ కొలతన.:)
పదస్వరూపాలు తెలుసుకోకుండా కవిత్వం రాసింది కాకుండా పాఠకులకు పదస్వరూపాలు తెలియవనీ అవేవీ తెలియకుండానే కవిత్వాలు చదివి అభిప్రాయాల్ని వెలిబుచ్చేస్తారనీ దానివల్ల చాలా మందిలో అపోహలు తలెత్తేస్తాయనీ, కవిత్వాన్ని కవిత్వం కాదని తేల్చేస్తారని అందుకే వివరణ ఇస్తున్నాననీ అని అనడం దురహంకారానికి నిదర్శనం.
పాఠకులు యుక్తాయుక్త వివేచన లేనివారనుకోవడం పెద్ద తప్పిదం. నేను లేవనెత్తిన సందేహాలు, మీరు ఇచ్చిన వివరణలు యథాతథంగా వదిలేసి పాఠకుల్ని మీ భాషా సాహిత్య విషయిక వాదనల్లోని పసని నిగ్గుతేల్చమందాం.
ఏ కారణం చేతైనా స్పందన రాకపోతే నాలుగైదు రోజులు ఆగి నేనే రియాక్టవుతా. బై!
ఠాగూర్ ప్రతి వాక్యాన్నీ ఇంత విధ్వంసం చేసి చూడనఖ్ఖరలేదనుకుంటా.
కవికి కూడా ఏమీ ఆశ లేనే లేకపోతే నిజంగానే భయపడవలసిన విషయమ్ అది. మనకి స్వాతంత్రమ్ వచ్చి ఇంకా కొన్ని పదులు గడిచింది లేదు. దాన్ని అర్ధమ్ చేసుకోకుండా ఇంత నిరాశ నింపుకోవడం అందునా యువతరానికి చెంది ఉండి అది ఏం సబబు? పోరాట పటిమ లేనట్టుగా ఉంటే అదేం సందేశం? అందుకు దేవుడేం చేస్తాడమ్మాయీ??
ఈ అరవై ఏళ్ళ ప్రస్థానంలో ఇండియా ఎంత సాధించిందో ఎవరైనా గమనించారా?? ప్రతీ కాలం లోనూ అవినీతి లంచగొండితనం రౌడీయిజం బానిసత్వం అధికారం కోసం పాకులాటా లేవా?? సంతోషించాలి మనం. గడిచిన ఎన్నో కాలాలకన్నా కూడా ఎంతోకొంత నోరువిప్పి మాట్లాడగలిగిన యుగంలో ఉన్నాం. ప్రశ్నలు వేయగలుగుతున్నాం! ఉన్నవాటిని గమనించగలగాలి. లేని వాటిని గుర్తించి వాటిని మార్చగలగాలి. యువతరానికి ఉండవలసిందే ఒక ఉడుంపట్టు, అవిశ్రాంత పోరాట పటిమానూ. ఇలాంటి నస కవితల వల్ల ఏమీ ప్రయోజనం లేదు.
ఇకపోతే దారుణాల మారణాలు ఎందుకూ? మొదటిపదంలో బహువచనం అవసరం ఏమీ లేదే?? దెబ్బలాడండి. ఒక ఉత్తేజంతో కదలండి. కానీ ఊరికే ఇలా “భావహీను”లవకండి.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి lyla yerneni అభిప్రాయం:
03/31/2011 2:28 am
“దీనికి కారణం ఇప్పటి ప్రజలకు “భక్తి” రసం ఎక్కువ అవసరం లేకపోతోంది. ”
“భక్తి” రసం లేని లోటుని “శృంగార” రసం ఇప్పటి సినిమాల్లో భర్తీ చేస్తోంది. భక్తిరస ప్రధానమైన సాంప్రదాయ కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో తక్కువ అవటానికి ఈ మార్పు ఒక కారణం.”
కర్ణాటక శాస్త్రీయ సంగీతం భక్తి రస ప్రధానం అంటున్నారా? ఈ వ్యాస రచయితలు. లేక కర్ణాటక సంగీతం లో కన్నా, తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ శృంగారం ఉందంటున్నారా?
సంగీతం పుస్తకం తీసి ఎక్కడ చదివినా శృంగార రసమే. దేవుడి పేర్లు ( well known names in the roster of Indian Gods) ఈ రచనలలో తరచుగా వినవస్తయి. ఐనా విషయం శృంగారమే . ఆ శృంగారంలో ‘మలిన,’ ‘అమలిన’ అని మళ్ళీ ఏదో ఇటీవలి పితలాటకం, అప్పటి సంగీతకారులకు ఉన్నట్టు లేదు.
ఊరికే ఒక సంగీతం పుస్తకం తెరిచి, మచ్చుకు కొన్ని రాస్తున్నాను. ఒకవేళ ఇవి భక్తి పాటలేమో, చదివి చెప్పండి.
1.
మంచీ స – మాయా, మిదే రా, రా,- నా మనో, – హరా
మాంచి మాటా – లెం, చినన్ను ఉ – గాం, చ వే మి – కాం, చ – నఅంగ
పంచశరుడువిలు – వంచిశరములిటు- పొంచివేయనిక- నించుక నోర్వను
2.
సా , , మీ రారా – సమాయమూ రా , , -, జల జాక్షి -గవయనిక
సరోజముల – నురోజముల – మదనుడ గురియ తాళదిక పరాకు – వలదుర
నా, మనవివిను- మా, దయను- మా, వనితనను – మా, నము వలదు-
నబల – యబల – కువల – యాక్షి – బెదరెను – కోకిలకూకా -లకు కే కలి- కేకా – లకూ వేగ
నీ, మధురవచ – నా, మృతము చెవి – నా, వి నె నుమ ద – నాత్రిబ డి న ది –
నిక్కము – సొక్కెను – మక్కువ – దాక్కెను – నీక్కముగా – నక్కలికి – మక్కువ తో – సొక్కించుమిక
Chucking the obscuring musical crooning. Quickly typing the words to show sahityaM clearly;
3.
సరిసిజ ముఖిరో నీకు సరి ఎవ్వరే
పరమాత్ముడైన శ్రీ సుబ్రహ్మణ్యుడే
నీపై మరులుకొని చాలా పరవశుడై యుండగ
4.
సామి నిన్నే కోరియున్నార – చలము సేయ మేర గాదుర
భూమి వెలయు స్రీ గర్భ పురినివాస పశుపతీశ
కామకోటి సుందరా నన్నేలుకోర
5.
సామి నిన్నే కోరి – చాల మరులు కొన్నదిరా
తామసము సేయక – దయజూడరా గోపాలా
Still having doubts?
6.
ఏర నాపై నింత చౌక శాయ – మేర గాదుర నా సామి
మరుని గన్న శ్రీ వెంకటేశ సుకుమార నన్నేలుకోర సరసుడ
7.
కరుణింప ఇది మంచి తరుణము సామి
పరుల వేడలేను నా పాలి శ్రీ వేణుగోపాల దేవ
కృప జూడుము ఈ వేళ
How about a few more?
8.
నిన్ను కోరియున్నార నెనరుంచి నన్నేలుకోర
పన్నగశయనుడౌ శ్రీ పార్థసారథి దేవ
సూన శరుని బారికోర్వలేర
9.
వలచి వచ్చియున్న నాపై చలము సేయమేరా? సామి నే
చెలువుడైన శ్రీ వేంకటేశ కలసి మెలసి కౌగిలించర
What about that ever popular lilting
10.
రార వేణూ గోపా బాలా రాజిత సద్గుణ జయశీలా
సారసాక్షా నేరమేమీ మారు బాధా కోర్వలేరా
How can I not to mention the recently read 100% sexy tyagaraja song ( Thanks బ్రహ్మానందం గారు )
11
శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను
అంగ-రంగ వైభోగముతో
గోపాంగనామణులెంతో సొగసుగ (శృ)
Get the picture?
“నిన్ను కోరి” seems to be the most oft sung phrase in Karnatak music. How does one interpret that musical phrase? As sexy or spiritual?
లైలా
PS: వ్యాసం బాగుందండి
పలుకుబడి: ముందుమాట గురించి sesha kumar kv అభిప్రాయం:
03/30/2011 5:31 am
ఆసక్తి దాయక మైన చక్కని విషయాన్ని తెలియ జేయడానికి పూను కుంటున్నసురేష్ గారికి కృతజ్ణ తలు.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj అభిప్రాయం:
03/29/2011 2:01 pm
మనకి అన్ని కాలాల్లోనూ popular art forms ఉన్నాయి. అలాగే fine arts ఉన్నాయి. ఈవ్యాసంలో మొదలుపెట్టిన గొంతు వ్యాసం మొత్తం మీద లేదు. సినిమా పాటల విషయంలో కాలాన్ని గురించి అంత సానుకూలతని ప్రదర్శించిన వీరే గ్రూప్ డాన్స్ ల విషయాని కొచ్చేసరికీ చాదస్తపు గొంతుని విన్పించారు.
ఎప్పుడైనా ఒకే కాలంలో జనసామాన్యపు అభిరుచి [డబ్బులొస్తుందనుకుంటే..] popular art forms లో ఎక్కువ చోటు చేసుకుంటుంది, mass media ల్లో! సినిమా ఎప్పుడూ మాస్ మీడియానే. పైగా డబ్బులు సంపాదించుకుందికి అత్యధిక మొత్తంలో సొమ్ములని వెచ్చించి జూదం ఆడిన పధ్ధతిలో ఒక మూసలో నడిచే కళ కూడా!! అక్కడ డబ్బు మాత్రమే ప్రధానం మిగతావాటికన్నా!! ఆత్రేయ రాసినా, వేటూరి రాసినా, సీతారామ శాస్త్రి రాసినా.. ఇంకా మిగిలిన సినిమా కవులెవరన్నా రాసినా డబ్బుకోసమే!! అంచేత డబ్బులు తెచ్చే విధంగా మాత్రమే రాయమని వారిని ఆ నిర్మాతలు అడగడం తప్పదు. వీరు రాయకా తప్పదు. అందులో మంచివీ జనరంజకమైనవీ ఉంటాయి. కానివీ ఉంటాయి. డబ్బులు ఎక్కువ వచ్చేది నాటు శృంగారంలోనే గనక చినమా కవులు ఎక్కువగా ఆయా అర్ధాలని వచ్చే విధంగా రాయడం తప్పనిసరి. ఈ విషయం ఆ రాయమనే వారికీ తెలుసు. ఈ రాసే వారికీ తెలుసు. ఇక్కడ ఎవరూ అమాయకులు కారు.పాతకాలంలో కేతిగాడూ, బంగారక్కా లాంటి వీధిబాగోతాల పాత్రలు సినిమాల్లో సమకాలీన అవసరాలని తీర్చేలాగా రూపొందాయి. అయితే సినిమా మాధ్యమం targeted audience ఎవరు అన్నదాని ఆధారం గానే వాడే భాషా, పాటల్లోని అర్ధాలూ, సంగీతమూ ఉంటాయని ఖచ్చితంగా ఏమీ చెప్పలేం. ఎలాగైతే సినిమాలోని హీరోయిన్ వాడే సంభాషణలూ, వొలకబోసే వయ్యారమూ ఆమె అవన్నీ నచ్చి చేస్తోందని మనం చెప్పలేం. అది ఆ సినిమా దర్శక నిర్మాతల అభీష్టం బట్టి రూపొందుతుంది.
పాపులర్ కళ ఉన్నా సమాంతరంగా మనకి ఇతర కళలు కూడా అవసరమై ఉంటూనే ఉన్నాయి. వాటిలో డబ్బుకి ఉండే స్థానం రెండవదీ, కళాత్మకత మొదటిదీ. అందువలన ఇతర లలితకళలన్నీ అన్నికాలాల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి. సమకాలము మాత్రమే సాహిత్యానికీ సంగీతానికీ కొలమానం అయితే “ఈమాట”లో త్యాగరాజు మీద వ్యాస పరంపర అవసరం ఉండదు. అలాగే గడిచిపోయిన రచయితల రచనలని గురించిన చర్చా ఉండదు. ఇవాళ్టి వాళ్ళ కవిత్వం మాత్రమే వేసుకుని పత్రిక నడుపుకోవచ్చు కదా? కానీ అలా చేయడం లేదెందుకనీ? చాదస్తం వల్లనేనా? కాదే? అలాగే సినిమాల విషయంలో సైతం అభిరుచి అన్నది ప్రమాణం అయితే ఇవాళ్టి సినిమా ఎవరి అభిరుచిని ప్రతిబింబిస్తోంది అన్నది ముఖ్యమైన ప్రశ్న అవుతుంది. ఈ వ్యాస రచయితా త్రయం చదువుకున్నవారే అయి ఉండి సినిమా పాటకి “సామాజిక అంతరాలూ, ఆడామగా తేడాలూ లేవు” అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది. ఎందుకు లేవూ? ఖచ్చితంగా ఉన్నాయి. ఏ ఆడపిల్లా వేటూరి గొంతు పెట్టుకుని “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ” అని పాడదు. అలాంటి పాట వేటూరిది. అమ్మాయిల మనోభావాలని అనుసరించి వచ్చింది కాదు. అమ్మాయికి స్వేచ్చ ఉండి పాడుకోగలిగితే మరి ఇంకెలాగైనా పాడుకునేదేమో గానీ.. వేటూరి సుందర్రామ్మూర్తి రాసినట్టు కాదు. అలాగే ఇతర వర్గాల తేడాలు కూడా!! సినిమాల్లోని భాష ఏ వర్గపు అవసరాలు లేదా ఆశయాలూ ముఖ్యమో వాటిని నెరవేర్చడానికే తయారైనది. అమాయకంగా ఏమీ రూపొందింది కాదు. త్యాగరాజ కీర్తనలకి డిమాండ్ ఉండి డబ్బులొస్తాయని అనుకుంటే మన డిస్ట్రిబ్యూటర్లూ మన ఫైనాన్సర్లూ దానికే డబ్బుపెడతారు. డబ్బులకోసం రాసే పాటలో ఎప్పుడూ ఉత్తమ విలువలు ఉండలేవు. దీనికి కాలం కాదు ప్రతిబంధకం! సమకాలపు అభిరుచి కూడా కాదు. వీళ్ళు ఇన్ని సినిమా పాటలని వివరించి రాసేరు. నేను మరి ఇవాళ్టి కాలానికి చెందిన దాన్నే గానీ వీళ్ళ లిస్టులోని చాలా పాటలు మరి నాకు తెలీదు. నేను సినిమాలని తెగ చూసే అలవాటున్నదాన్నీ కాను.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే జనం అభిరుచి అంటూ ఉండదనీ వాళ్ళు తీసేది వాళ్ళు రాసేదీ జనం అనబడు వారు తమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చూడటమో వినడమో చేయవచ్చు కానీ అవన్నీ “సమకాలము వారి అభిరుచిని” ప్రతిఫలిస్తున్నాయని మనం సాధికారంగా ఏమీ చెప్పలేమనీ నా ఉద్దేశ్యం. తాడేపల్లి హరికృష్ణ గారన్నట్టూ పద్యనాటకాలకీ ఇతర కళారూపాలకీ వచ్చే జనమూ ఇవాళ్టి కాలం వాళ్ళే!! చాయిస్ అని ఒకటుంటుంది మరి. దాని ప్రకారమే బతకడానికి సమకాలం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడూ కూడా ఈ “చాయిస్” అన్నది తక్కువగా దొరుకుతుంది ఏ కాలంలో బతికిన వారికైనా!! సినిమా పాటా మాటా ఆటాతో సహా!
రమ.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:
03/29/2011 2:31 am
>> ఎన్ని రామసేనలు వచ్చినా అనివార్యమైన కాలం తెచ్చే మార్పులను ఆపడం సాధ్యం కాదు.
>> కాలానుగుణంగా మారి తీరాలి. లేకపోతే మనకే నష్టం కష్టం
అచంచలమైన ఆత్మ విశ్వాసం కల కొద్ది మంది మనుష్యుల చరిత్రే మానవజాతి చరిత్ర అని వివేకానందుడు చెప్పాడు. యద్యదాచరతి శ్రేష్ట: తత్తదేవేతరో జన: అని గీతాకారుడూ అన్నాడు. నిజానికి సూర్యచంద్రుల గతి ననుసరించీ, ఋతువులననుసరించీ నడిచే “కాలం” యుగాలుగా అలానే వున్నది. “మారుతున్న కాలం”గా చెప్పబడుతున్న కాలం దేశచరిత్రల్లో ఆత్మవిశ్వాసం ప్రబలిన కొద్దిమంది వ్యక్తులు నిర్దేశించిన గతి. సామాన్యులందరూ తలొంచుకుని ఇంకేం మారాడకుండా నడుచుకునే దారీను. “కాలం”, “ప్రజాభీష్టం”, collective will ఇలాటివన్నీ బలవంతులు తమ మాట చెల్లించుకోడానికి చెప్పే మనష్యకృతాలైన భౌతిక సూత్రాలు. ఒక్కోసారి అవి మెజారిటీకి ఉపకారమే చేస్తాయి. అనేకసందర్భాలలో అపకరిస్తాయి కూడాను. ప్రస్తుత విషయానికొస్తే, సినిమా స్వరచక్రవర్తి నౌషాద్ గారు: “ప్రజాభీష్టమంటూ వాద్యభీభత్సాన్ని సృష్టించే అధునాతన సంగీతమంతా సంగీతకారులు సృష్టిస్తున్న ఇష్టమేను” అని ఓ సందర్భంలో అన్నాడు. ఇక్కడి చర్చని ఇక్కడింకా పొడిగిస్తే, ఇప్పుడొ ఇళయరాజా, రహ్మాన్లు ఇంకా అవే కల్యాణి, అదే మోహనం, శంకరాభరణాల్లో పాటలు కట్టారునుకోండి – ప్రజలు సినిమాలు చూడ్డం మనుతారా, రికార్డులు కొనడం మానతారా? ఇలాగే ఓ రెండొందల సంవత్సరాలుగా యక్షగానాలు, రంగస్థలనాటకాలూ అవే పద్యాలని అలాగే సాగదీసి పాడుతుంటే ప్రేక్షకులు రావడం మానినట్టుగా నేనెక్కడా వినలేదూ, చదవనూ లేదు. నడుస్తున్నదాన్ని కాలమంటే, అదీ కాలమేను.
– తాడేపల్లి హరికృష్ణ
ప్రేమ కవితలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/28/2011 1:16 pm
హమ్మయ్య ..ఇన్నాళ్ళకి ఒక్క గొంతు “ఈమాట” లో అచ్చయ్యే చాలా చెత్త కవితలమీద ఒక పేరడీ విన్పించింది. అందుకు ముందుగా శశికి అభినందనలు. ఈమాట వాళ్ళు “పీర్” రివ్యూ పధ్ధతిని పాటిస్తూ పైగా తమ అత్యుత్తమ విధానం లోంచి మరీ “ఎంపిక” చేసుకున్న గొప్ప కవితలు ఎంత నాసిగా ఉన్నాయో వారెప్పుడూ పరికించి చదువుకున్నట్టు లేదు. ఎవరేం రాస్తే దాన్ని అచ్చు వేసేస్తూ పేద్ద పేద్ద మాటలెందుకో మరి చెప్పేది? ఉదాహరణకి ఈ కవితనే చూడండి.మూడో స్టాంజా చివరి లైన్లూ.. నాల్గో స్టాంజా మొత్తంగా చెత్త. అర్ధం పర్ధం లేదు. అయినా ఆహా ఓహో అంటూ ఏకవాక్య మెచ్చుకోళ్ళూను. ఈమాట అంతా నిండి అనేకమైనవి …భాష లో బెండు లాంటివీ.. ఊహలో ఊక లాంటివీ ఎన్నో! అన్నీ కవితలే కవితలు కవితలు ..తక్కెడ కొలతన.:)
రమ.
మేఘాంగన గురించి GSCS Siddhartha అభిప్రాయం:
03/28/2011 3:42 am
పదస్వరూపాలు తెలుసుకోకుండా కవిత్వం రాసింది కాకుండా పాఠకులకు పదస్వరూపాలు తెలియవనీ అవేవీ తెలియకుండానే కవిత్వాలు చదివి అభిప్రాయాల్ని వెలిబుచ్చేస్తారనీ దానివల్ల చాలా మందిలో అపోహలు తలెత్తేస్తాయనీ, కవిత్వాన్ని కవిత్వం కాదని తేల్చేస్తారని అందుకే వివరణ ఇస్తున్నాననీ అని అనడం దురహంకారానికి నిదర్శనం.
పాఠకులు యుక్తాయుక్త వివేచన లేనివారనుకోవడం పెద్ద తప్పిదం. నేను లేవనెత్తిన సందేహాలు, మీరు ఇచ్చిన వివరణలు యథాతథంగా వదిలేసి పాఠకుల్ని మీ భాషా సాహిత్య విషయిక వాదనల్లోని పసని నిగ్గుతేల్చమందాం.
ఏ కారణం చేతైనా స్పందన రాకపోతే నాలుగైదు రోజులు ఆగి నేనే రియాక్టవుతా. బై!
వాళ్ళు రాక ముందు గురించి yedukondala swamy అభిప్రాయం:
03/28/2011 12:04 am
కవిత బాగుంది ఊహని కలిగిస్తుంది మరింత ముందుకు సాగితే బాగుండేది.
ఏడుకొండలస్వామి
తిరుపతి
ప్రేమ కవితలు గురించి sasi అభిప్రాయం:
03/27/2011 2:32 am
కవితలు కవితలు కవితలు కవితలు…
ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
అక్కడ ఇక్కడ అంతా కవితలు.
ప్రేమ ఫలిస్తే, వాన కురిస్తే,
చిటికెన వేలుకు చీమ కరిస్తే…
ఎక్కడ చూసిన తక్కెడ కొలతన
అక్కడ ఇక్కడ అంతా కవితలు.
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి bhanu అభిప్రాయం:
03/26/2011 6:58 am
Story is good but you have to maintain clarity in this story .
స్వేచ్ఛ? గురించి rama bharadwaj అభిప్రాయం:
03/26/2011 1:44 am