ఒకపక్క తెలుగువారికి “చారిత్రక దృక్పధం లేదని” ఒప్పుకుంటూనే ‘ఫిర్యాదులు” చేయకుండా ” వ్యక్తిగత” స్థాయిలో ఇలాంటివి చేయమంటూ ఒక సలహా పడేశారు రోహిణీప్రసాద్ . వ్యక్తిగతస్థాయిలో అన్నీ జరిగిపోతే మరి సంస్థలేం చేస్తాయో..వాటి బాధ్యత ఏంటో.. అలాగే అసలు సాంస్కృతికంగా తెలుగు సమాజానికి ఎప్పుడైనా ఎటువంటిదైనా ఒక బాధ్యత అన్నది ఇటువంటి విషయాలపై ఉంటుందా ..ఉండాలా అన్నది..ఇక్కద విషయం ఐతే ఇది ఏమంత పట్టించుకోవలసిన సంగతే కాదన్నట్టు..రోహిణీప్రసాద్ భావించడం పైగా ఆ విషయాన్ని చర్చకుపెట్టిన వారిని ” ఫిర్యాదులు మాని” ఆపన్లన్నీ స్వయగానే చేయమని ఆశించటమ్ ఒక రకంగా తెలుగు సామాజికులకున్న దృస్టినే పట్టించింది. దీని అర్ధం ఏమంటే తెలుగు వారికి ఇవాళ కూడా [ ఇంతగా
technology పెరిగిన ఈ రోజుల్లో కూడా ఏ చారిత్రక దృక్పధమ్ ఎటూ ఉండదనీ గనక వ్యక్తిగతమ్ గానే ఇటువంటి పన్లని చేపట్టాలనీ ఒకవేళ అలా ఎవరైనా చేయలేకపోతే సలహాలూ సూచనలూ ” ఫిర్యాదులూ” మాని గప్చిప్ గా ఊరుకోవాలనీ ఆయన గట్టిగా దెబ్బలాడటమన్నమాట.ఒప్పుకోవడమన్నమాట. ఇదెలాంటి మనస్తత్వమో మరి నాకు అర్ధమ్ కాలేదు.. అంతేగానీ.. ఇన్ని యూనివర్సిటీలున్నాయి ఇన్ని సాంస్కృతిక సంస్థలున్నాయీ..వీరెవరైనా ఒక లక్ష్యంతో ఇవాళ్టి కవి గాయక విమర్శక నట పరివారాన్ని ఆడియో వీడియోలల్లో బంధించే కార్యక్రమమ్ చెస్తే బాగుంటుందనే ఒక సూచనకి తన మద్దత్తు ని తెలిపే స్వరాన్ని వినిపించలేకపోవడమ్ చింతనీయమ్ .
ఇదివరకటి వారు ఏ విధమైన పొరపాట్లు చేసారో మనమూ ఆ విధమైన పొరపాట్లే చేయడం ఏమిటీ?? ఇటువంటి విషయాలు ఏ వ్యక్తికీ సబధించినవి కావనీ మొత్తం సమాజానికి చెందిన బాధ్యతలనీ గుర్తెరగకపోవడం కించిదాశ్చర్యమూ..కించిద్విషాదమూను.
సమకాలంలో మౌనంవహించి ఎప్పుడో ఒక 50 ఏళ్ళు గడిచాకా ఇంకెవరో ఆ సేకరించిన వ్యక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధార పడి ఆయా వ్యక్తుల స్వరాలనీ దృస్యాలనీ ఇతర వివరాలనీ సేకరించి అప్పటి తరాల వారు ఓహోహో అని అంటూంటే మురిసిపోవడమా మనకి ఇవాళ ఉన్న “చారిత్రకదృక్పధం”?? ఇందుకు బాధ్యత వ్యక్తులే తీసుకోవాలంటే తెలుగునేలమీద ఉన్న సంస్థలన్నీ మూసుకుంటే మేలు.
Articles should be like this. Reading the articles of sri krp itself is an education,they are unique and rich in giving new view to the readers. May God bless him.
అరచేతిలో ఇమిడే ఎంపీత్రీ రికార్డర్లున్న ఈ రోజుల్లో పెద్దవారి మాటలను సభల్లోనూ, టీవీ, రేడియో ప్రసారాల్లోనూ భద్రపరచడం కష్టమేమీ కాదు. ఇవన్నీ ఇంకెవరో చెయ్యటంలేదని ఫిర్యాదుచేసే బదులుగా ఆసక్తి ఉన్నవారు రికార్డ్ చేసి జాగ్రత్తచెయ్యడం మంచిది.
నేను బొంబాయిలో 1970నుంచీ డజన్లకొద్దీ శాస్త్రీయసంగీత కచేరీలకు హాజరవుతూ ఉండేవాణ్ణి. వాటన్నిటినీ ఒక వయసుమళ్ళిన సింధీ (?) ఆయన తన స్పూల్ రికార్డర్‌లో టేప్ చెయ్యటం గమనించాను. అదంతా బాహాటంగానే జరిగేది కనక ఆయనకు అనుమతి లభించే ఉంటుందని అనిపించింది. ప్రస్తుతం public domain లో లభ్యంకాని ఈ అరుదైన రికార్డింగులన్నీ విడుదల అయిన తరవాత డబ్బు తెచ్చిపెట్టగలిగినవే.
తెలుగువారి విషయంలో అటువంటిది జరగడం దాదాపు అసంభవమే. చారిత్రక దృక్పథం ఉన్నవారు వ్యక్తిగతంగా ఇటువంటి పనులు చేపట్టాలి.
సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజనియర్‌గా పనిచేస్తున్న సురేశ్‌గారి అభిరుచి, అభినివేశం ఎంత గాఢమైనవో ఈ వ్యాసం చదివితే అర్థమవుతుంది. ఉద్యోగపు ‘రాళ్ళ’ కోసమో, మొక్కుబడిగానో కాకుండా తెలుగుమీదా, భాషాశాస్త్రం మీదా ఉన్న అభిమానమే ఆయనకు ప్రేరణ అనుకోవాలి.
మరొక సందర్భంలో నేను సంపాదకవర్గానికి సూచించినట్టుగా ఈమాట పత్రికలో చిత్రకళ, ఆర్కిటెక్చర్ మొదలైన విషయాల గురించి రాయగలిగిన సత్తా ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి ప్రోత్సాహాన్నిచ్చి, తెలుగు వ్యాసాల పరిధిని విస్తృతం చేసే ప్రయత్నాలు జరగాలి. ఒకవేళ అటువంటివారు ఇంగ్లీష్‌లో రాసి ఇచ్చినా వాటిని అనువాదం చేసి ఈమాటలో వేసుకోవచ్చు.
అచ్చయే పత్రికలకు లేని మల్టీమీడియా సౌలభ్యం ఈమాటకు ఉంది. ఏ ఇతర పత్రికా విలేకరులకూ అందుబాటులో లేని సదుపాయాలు విదేశాల్లో ఉంటున్న ఈమాట రచయితలకు ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దినపత్రికల సంపాదకవర్గాలు ఈమాటలో పడే రచనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారని పాఠకులు తెలుసుకోవాలి. మామూలు కమర్షియల్ పరిధులను లక్ష్యపెట్టని ఔత్సాహిక రచయితలు తమకు ఆసక్తికరమైన విషయాల గురించి ఎటువంటి ప్రతిఫలమూ ఆశించకుండా రచనలు పంపుతారు. ఇది ఒకరకమైన నిస్వార్థసేవే.
ఈమాట తనకున్న advantages అన్నిటినీ గుర్తించి రచయితలకూ, రచనలు చెయ్యగలిగినవారికీ ఆహ్వానాలు పంపాలి.
అయ్యా !! ఆ “విజ్నత” గురించే ఇప్పుడు కూడా అందరూ ఆలోచించాలీ అని అంటున్నాను నేను. సమకాలంలో అవకాశాలని వదిలేసి మనకాలం లోని పేరెన్నిక గన్నవారి గొంతులనీ అలాగే వివిధ అంశాలమీద వారి వారి అభిప్రాయాలనీ.. ఆడియో వీడియో లలో భద్రపరచడం చేయడం గురించి ఎవరైనా నిజంగా ఆలోచిస్తున్నారా ? అని నా సందేహం. మరి అలాంటి పన్లు ఇవాళ కూడా చెయ్యకపోతే మరి కొన్నాళ్ళకి ఇవాళ్టి వాళ్ళని గురించిన ఎటువంటి సమాచారానికైనా రేపటి తరాలు తడుముకోవలసిందే కదా? ఆకాశవాణి వాళ్లకి ముందుచూపులేకపోబట్టి కదా ఇవాళ ఆ నస్టాన్ని భరిస్తున్నాం. ఈ కాసింత ధ్వని రూపకమైన వారి స్మృతులకి ఇంతగా పరవశమైపోతున్నారు ఈ పాఠకులు [శ్రోతలు]. ఆ పనే ఇప్పటికీ మనకాలం లోని
టీవీలూ ..రేడియోలూ ఆ మునుపటి నిర్లక్ష్యం తోనే వ్యవహరిస్తూంటే ..ఏ రకమైన చరిత్రని మనం జాగ్రత్త పరుచుకున్నవాళ్ళం అవుతున్నాం !! ఎవరైనా దీని గురించి ఆలోచించాలి. ముందుచూపుని చూపించాలి. లేకపోతే మరికొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళ మాట్లాడుకుంటున్న ఈ మాటలనే రేపు ఇంకో తరం ఇవాళ్టి మహనీయుల పక్షాన మాట్లాడుకోబోతుంది మరి. తస్మాత్ జాగ్రత.
ఆకాశవాణి సవ్యంగా పనిచేసే రోజుల్లో కూడా అన్నీ సవ్యంగా ఉండేవికావని విన్నాం. 1950లలో బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్ నుంచి వచ్చి నేషనల్ ప్రోగ్రాముల్లో కచేరీలు చేసిన రోజుల్లో ఆయన విదేశీయుడనే కారణంగా దేన్నీ రికార్డు చెయ్యలేదట. ఒక ఇంజనీరు తన అభిమానంకొద్దీ రికార్డు చెయ్యబోతే ‘సకాలంలో’ గమనించి అడ్డుకున్నారట!
మా చిన్నతనంలో, 1958 ప్రాంతాల మొదటిసారిగా స్పూల్ టేప్‌రికార్డర్ ఎలా ఉంటుందో చూశాం. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు ఒకటి కొని కొన్నేళ్ళు వాడడంకూడా జరిగింది. రేడియో స్టేషన్లలో వీటికి కొదవలేకపోయినా సంస్కృతిని పరిరక్షించాలనే విజ్ఞత మాత్రం తక్కువే.
వేమూరి వేంకటేశ్వర రావు గారూ,
నమస్కారం !
మీరు రాసిన స్వీడన్ లో మాతృభాష వాడకాన్ని గురించి చెప్పింది చాలా ఆసక్తిదాయకంగా వుంది. అదేసమయంలో అంతకు మించిన ఆవేదన కలిగించింది. అక్కడ మీకు ఎదురయిన అనుభవవమే ఇక్కడ మన పొరుగున వున్న తమిళనాడులో కూడా కనిపిస్తుంది. చెన్నైలాంటి భారతీయ నగరంలో కూడా పేరు పలకలమీద ఇంగ్లీషు కంటె ఎక్కువగా తమిళం కనిపించడం, ఎదుటివారికి తమిళం ఎంతమాత్రం రాదని తెలిసిన తరువాత మాత్రమే ఇంగ్లీషు మాట్లాడ్డం అనేవి మనందరం సిగ్గు పడవలసిన విషయాలు.
ఇలా తమిళనాడులో మాత్రమేవుండటం వల్ల మన ఇంగ్లీషు భాషాబానిసలయిన ఇతర ప్రాంతాలవారు తమిళుల్ని వీరాభిమానులని వెక్కిరిస్తూ వుంటారు. అది వారి బానిస మనస్తత్వానికి పరాకాష్ఠ. వీళ్ళకి మాతృభాషమీద అభిమానం ఎలా వుంటుందో చూపించాలంటే భారతీయులందరూ ముప్ఫైయేళ్ళ వయసు వచ్చే లోపే కనీసం రెండు మూడు సంవత్సరాలు తమిళనాడులో పనిచేస్తే తప్ప ప్రమోషన్లివ్వకుండా చూసేలా చట్టం తీసుకురావాలి.
వల్లంపాటివారి కథలు నవలలూ కూడా ఆయన కథా శిల్పం నవలా శిల్పం పుస్తకాల్లాగే మంచి సాహిత్యం ఎలా వుండాలో చెప్పే ఉత్తమ స్థాయి రిఫరెన్సు పుస్తకాలే. సృజన కారులందరూ తప్పక చదవాల్సిన పుస్తకాలివి. ఇప్పుడు ఈ పుస్తకాలు కినిగె పై లభించడం అభినందనీయం.
ఆకాశవాణి వారి వద్ద పాత రికార్డింగులు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్నా అవి ఏ స్థితిలో ఉన్నాయో చెప్పగల వాళ్ళు ఇప్పుడు ఆ స్టుడియోల్లో ఉన్నారా అని అనుమానం. ఈ మధ్యనే ఆకాశవాణి వారు ఒక అభ్యర్ధన ప్రెస్ ద్వారా శ్రోతల ముందుంచారు, శ్రోతల దగ్గర ఆకాశవాణీ వారి రికార్దింగులు ఉంటే వారికి ఫంపమని. వారు డిజిటైజ్ చేస్తారుష. అంటే వారిదగ్గర అలనాటి కార్యక్రమాల టేపులు లేనట్టే.
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prashanth gundavarapu అభిప్రాయం:
07/01/2011 3:21 pm

ప్రశాంత్ .
భావతరంగాల సింధువు: భైరవి గురించి srinivasaraov-khammam అభిప్రాయం:
07/01/2011 1:32 pm
Articles should be like this. Reading the articles of sri krp itself is an education,they are unique and rich in giving new view to the readers. May God bless him.
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad అభిప్రాయం:
07/01/2011 10:53 am
అరచేతిలో ఇమిడే ఎంపీత్రీ రికార్డర్లున్న ఈ రోజుల్లో పెద్దవారి మాటలను సభల్లోనూ, టీవీ, రేడియో ప్రసారాల్లోనూ భద్రపరచడం కష్టమేమీ కాదు. ఇవన్నీ ఇంకెవరో చెయ్యటంలేదని ఫిర్యాదుచేసే బదులుగా ఆసక్తి ఉన్నవారు రికార్డ్ చేసి జాగ్రత్తచెయ్యడం మంచిది.
నేను బొంబాయిలో 1970నుంచీ డజన్లకొద్దీ శాస్త్రీయసంగీత కచేరీలకు హాజరవుతూ ఉండేవాణ్ణి. వాటన్నిటినీ ఒక వయసుమళ్ళిన సింధీ (?) ఆయన తన స్పూల్ రికార్డర్‌లో టేప్ చెయ్యటం గమనించాను. అదంతా బాహాటంగానే జరిగేది కనక ఆయనకు అనుమతి లభించే ఉంటుందని అనిపించింది. ప్రస్తుతం public domain లో లభ్యంకాని ఈ అరుదైన రికార్డింగులన్నీ విడుదల అయిన తరవాత డబ్బు తెచ్చిపెట్టగలిగినవే.
తెలుగువారి విషయంలో అటువంటిది జరగడం దాదాపు అసంభవమే. చారిత్రక దృక్పథం ఉన్నవారు వ్యక్తిగతంగా ఇటువంటి పనులు చేపట్టాలి.
పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము గురించి Rohiniprasad అభిప్రాయం:
06/30/2011 10:24 pm
సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజనియర్‌గా పనిచేస్తున్న సురేశ్‌గారి అభిరుచి, అభినివేశం ఎంత గాఢమైనవో ఈ వ్యాసం చదివితే అర్థమవుతుంది. ఉద్యోగపు ‘రాళ్ళ’ కోసమో, మొక్కుబడిగానో కాకుండా తెలుగుమీదా, భాషాశాస్త్రం మీదా ఉన్న అభిమానమే ఆయనకు ప్రేరణ అనుకోవాలి.
మరొక సందర్భంలో నేను సంపాదకవర్గానికి సూచించినట్టుగా ఈమాట పత్రికలో చిత్రకళ, ఆర్కిటెక్చర్ మొదలైన విషయాల గురించి రాయగలిగిన సత్తా ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి ప్రోత్సాహాన్నిచ్చి, తెలుగు వ్యాసాల పరిధిని విస్తృతం చేసే ప్రయత్నాలు జరగాలి. ఒకవేళ అటువంటివారు ఇంగ్లీష్‌లో రాసి ఇచ్చినా వాటిని అనువాదం చేసి ఈమాటలో వేసుకోవచ్చు.
అచ్చయే పత్రికలకు లేని మల్టీమీడియా సౌలభ్యం ఈమాటకు ఉంది. ఏ ఇతర పత్రికా విలేకరులకూ అందుబాటులో లేని సదుపాయాలు విదేశాల్లో ఉంటున్న ఈమాట రచయితలకు ఉండే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దినపత్రికల సంపాదకవర్గాలు ఈమాటలో పడే రచనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారని పాఠకులు తెలుసుకోవాలి. మామూలు కమర్షియల్ పరిధులను లక్ష్యపెట్టని ఔత్సాహిక రచయితలు తమకు ఆసక్తికరమైన విషయాల గురించి ఎటువంటి ప్రతిఫలమూ ఆశించకుండా రచనలు పంపుతారు. ఇది ఒకరకమైన నిస్వార్థసేవే.
ఈమాట తనకున్న advantages అన్నిటినీ గుర్తించి రచయితలకూ, రచనలు చెయ్యగలిగినవారికీ ఆహ్వానాలు పంపాలి.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి prashanth gundavarapu అభిప్రాయం:
06/30/2011 12:02 pm
అయ్యా !! ఆ “విజ్నత” గురించే ఇప్పుడు కూడా అందరూ ఆలోచించాలీ అని అంటున్నాను నేను. సమకాలంలో అవకాశాలని వదిలేసి మనకాలం లోని పేరెన్నిక గన్నవారి గొంతులనీ అలాగే వివిధ అంశాలమీద వారి వారి అభిప్రాయాలనీ.. ఆడియో వీడియో లలో భద్రపరచడం చేయడం గురించి ఎవరైనా నిజంగా ఆలోచిస్తున్నారా ? అని నా సందేహం. మరి అలాంటి పన్లు ఇవాళ కూడా చెయ్యకపోతే మరి కొన్నాళ్ళకి ఇవాళ్టి వాళ్ళని గురించిన ఎటువంటి సమాచారానికైనా రేపటి తరాలు తడుముకోవలసిందే కదా? ఆకాశవాణి వాళ్లకి ముందుచూపులేకపోబట్టి కదా ఇవాళ ఆ నస్టాన్ని భరిస్తున్నాం. ఈ కాసింత ధ్వని రూపకమైన వారి స్మృతులకి ఇంతగా పరవశమైపోతున్నారు ఈ పాఠకులు [శ్రోతలు]. ఆ పనే ఇప్పటికీ మనకాలం లోని
టీవీలూ ..రేడియోలూ ఆ మునుపటి నిర్లక్ష్యం తోనే వ్యవహరిస్తూంటే ..ఏ రకమైన చరిత్రని మనం జాగ్రత్త పరుచుకున్నవాళ్ళం అవుతున్నాం !! ఎవరైనా దీని గురించి ఆలోచించాలి. ముందుచూపుని చూపించాలి. లేకపోతే మరికొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇవాళ మాట్లాడుకుంటున్న ఈ మాటలనే రేపు ఇంకో తరం ఇవాళ్టి మహనీయుల పక్షాన మాట్లాడుకోబోతుంది మరి. తస్మాత్ జాగ్రత.
ప్రశాంత్
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad అభిప్రాయం:
06/30/2011 10:24 am
శివరామప్రసాదుగారు చెప్పినదాంట్లో పాయింటుంది.
ఆకాశవాణి సవ్యంగా పనిచేసే రోజుల్లో కూడా అన్నీ సవ్యంగా ఉండేవికావని విన్నాం. 1950లలో బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్ నుంచి వచ్చి నేషనల్ ప్రోగ్రాముల్లో కచేరీలు చేసిన రోజుల్లో ఆయన విదేశీయుడనే కారణంగా దేన్నీ రికార్డు చెయ్యలేదట. ఒక ఇంజనీరు తన అభిమానంకొద్దీ రికార్డు చెయ్యబోతే ‘సకాలంలో’ గమనించి అడ్డుకున్నారట!
మా చిన్నతనంలో, 1958 ప్రాంతాల మొదటిసారిగా స్పూల్ టేప్‌రికార్డర్ ఎలా ఉంటుందో చూశాం. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు ఒకటి కొని కొన్నేళ్ళు వాడడంకూడా జరిగింది. రేడియో స్టేషన్లలో వీటికి కొదవలేకపోయినా సంస్కృతిని పరిరక్షించాలనే విజ్ఞత మాత్రం తక్కువే.
స్వీడన్‌లో మాతృ భాష వాడకం గురించి రాణి. అభిప్రాయం:
06/30/2011 5:45 am
వేమూరి వేంకటేశ్వర రావు గారూ,
నమస్కారం !
మీరు రాసిన స్వీడన్ లో మాతృభాష వాడకాన్ని గురించి చెప్పింది చాలా ఆసక్తిదాయకంగా వుంది. అదేసమయంలో అంతకు మించిన ఆవేదన కలిగించింది. అక్కడ మీకు ఎదురయిన అనుభవవమే ఇక్కడ మన పొరుగున వున్న తమిళనాడులో కూడా కనిపిస్తుంది. చెన్నైలాంటి భారతీయ నగరంలో కూడా పేరు పలకలమీద ఇంగ్లీషు కంటె ఎక్కువగా తమిళం కనిపించడం, ఎదుటివారికి తమిళం ఎంతమాత్రం రాదని తెలిసిన తరువాత మాత్రమే ఇంగ్లీషు మాట్లాడ్డం అనేవి మనందరం సిగ్గు పడవలసిన విషయాలు.
ఇలా తమిళనాడులో మాత్రమేవుండటం వల్ల మన ఇంగ్లీషు భాషాబానిసలయిన ఇతర ప్రాంతాలవారు తమిళుల్ని వీరాభిమానులని వెక్కిరిస్తూ వుంటారు. అది వారి బానిస మనస్తత్వానికి పరాకాష్ఠ. వీళ్ళకి మాతృభాషమీద అభిమానం ఎలా వుంటుందో చూపించాలంటే భారతీయులందరూ ముప్ఫైయేళ్ళ వయసు వచ్చే లోపే కనీసం రెండు మూడు సంవత్సరాలు తమిళనాడులో పనిచేస్తే తప్ప ప్రమోషన్లివ్వకుండా చూసేలా చట్టం తీసుకురావాలి.
స్నేహితుడు, విమర్శకుడూ గురించి రాణి. అభిప్రాయం:
06/30/2011 2:58 am
వల్లంపాటివారి కథలు నవలలూ కూడా ఆయన కథా శిల్పం నవలా శిల్పం పుస్తకాల్లాగే మంచి సాహిత్యం ఎలా వుండాలో చెప్పే ఉత్తమ స్థాయి రిఫరెన్సు పుస్తకాలే. సృజన కారులందరూ తప్పక చదవాల్సిన పుస్తకాలివి. ఇప్పుడు ఈ పుస్తకాలు కినిగె పై లభించడం అభినందనీయం.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాదు కప్పగంతు అభిప్రాయం:
06/29/2011 8:31 pm
@రోహిణీప్రసాద్ గారూ,
ఆకాశవాణి వారి వద్ద పాత రికార్డింగులు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్నా అవి ఏ స్థితిలో ఉన్నాయో చెప్పగల వాళ్ళు ఇప్పుడు ఆ స్టుడియోల్లో ఉన్నారా అని అనుమానం. ఈ మధ్యనే ఆకాశవాణి వారు ఒక అభ్యర్ధన ప్రెస్ ద్వారా శ్రోతల ముందుంచారు, శ్రోతల దగ్గర ఆకాశవాణీ వారి రికార్దింగులు ఉంటే వారికి ఫంపమని. వారు డిజిటైజ్ చేస్తారుష. అంటే వారిదగ్గర అలనాటి కార్యక్రమాల టేపులు లేనట్టే.
ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి kiran అభిప్రాయం:
06/29/2011 10:56 am
IN EVERY LINE AND EVERY WORD ARE SUPERB THANKS FOR TRANSLATING.