పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. పలుకుబడి: ముందుమాట గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    07/15/2011 4:43 pm

    ఏదైనా ఒక విద్య మీద వ్యాసం వ్రాస్తూ, ఇది అపరావిద్యలలోనిది అని మన్ముందే చెప్పడం అశుభం.
    జనులు, కాస్తో కూస్తో బుఱ్ఱ వున్నవాళ్ళు, వేంటనే ఇది అపరమైతే పరమైన విద్య ఏదో వుందిగా, అది ఏమిటి అని అడుగవచ్చుఁ. అలా మీరు చెప్పదలఁచుకొన్న విద్యపై వారికి ఆసక్తి నశిస్తుంది.

    సరి అయితే ఇంతకీ ఆ పరావిద్య గుఱించి ఒక నాలుగు మాటలు చెప్పవచ్చుగా, అపరమైనది ఎంత నేర్చి ఏం లాభం.

  2. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి pawan అభిప్రాయం:

    07/14/2011 12:42 pm

    చాలా బాగా చెప్పారు.నాకు నా బాల్యమ్ గుర్తుకువచ్చేలా చేశారు.ధన్యవాదాలు.

  3. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి bendapudi subbarao అభిప్రాయం:

    07/14/2011 10:08 am

    అలసాని “కనుపపులు” అని చెప్పుట విడ్డూరము. ఈగడ్డి అక్కడ పెరగదు.

  4. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి swamy అభిప్రాయం:

    07/13/2011 1:34 am

    కథకు ఎదైనా ఒక వేడి వస్తువు అని చక్కగా పేరుపెట్టిన రచయిత కథనంలో ఒకేడివస్తువు అని చెప్పలేదు. ఇదొక ట్రాష్. మాండలికం పేరుతో ఒకప్పుడు వచ్చిన సాహిత్యం ఇప్పుడు తెలుగునాట వెర్రితలలు వేస్తూ ఉంది. మాదసలు తెలుగే కాదు పొమ్మంటూ ఉంది. వికృతశిశువు వికృత చేష్టలు మనం నిస్సహాయంగా చూస్తుండి ఊరుకుంటున్నాం.

    త్రిపుర పేరు చెప్పుకుని బతికేవాళ్ళు ఎక్కువైపోయారు. త్రిపుర రచయితగా కంటే వ్యక్తిగా ఇంకా ప్రత్యేకమైన వాడు. నామిని వ్యక్తిగా ఉత్త డొల్ల . ఉత్త జూటా. వాళ్ళ ప్రస్తావనకి కథకీ పొంతనేంటీ. మధ్యలో నోమ్ చాంస్కీ, డెరిడా ఎందుకొచ్చారో రచయితకే ఎరుక. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లుగా ఉంది రచయిత పరిస్థితి.

  5. పాత పద్యం గురించి Satya అభిప్రాయం:

    07/12/2011 8:16 pm

    దిక్కు తోచని కొత్త ఊళ్ళో బాల్య మిత్రుడు ఎదురవడం – ఇలా అతుక్కుపోయే వర్ణనలు మీకే చెల్లాయి. చాల బావుంది. మీ పద్యం మాదిరిగా మాతో ఎప్పుడైనా పాత ఉత్తరాలు, ఫోటోలు మళ్లీ సంభాషిస్తాయి.

  6. సన్మానానికి రెండు సీ.వీ.లు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/12/2011 2:58 pm

    ఇందులో సెటైరు మొరటుగా ఉన్నప్పటికీ ఇటువంటి రచయిత/త్రిని పూర్తిగా కొట్టిపారెయ్యక్కర్లేదు. ఎంత పలుకుబడి ఉన్న రచయిత/త్రి అయినా ఎన్నో పత్రికల్లో, ఎదరో పబ్లిషర్ల చేత ఎన్నెన్నో రచనలు అచ్చువేయించుకోవడం కష్టమే. ఎటొచ్చీ అటువంటి రచనల విలువను కాలమూ, పాఠకులూ నిర్ణయిస్తారు.

    80 దాటిన తరవాత కూడా కొందరు పట్టువిడవకుండా రాస్తూనే ఉన్నారు. వారి పట్టుదల మెచ్చుకోదగ్గదే. మంచి పత్రికలో, తక్కువరకం పత్రికలో తమతమ అవసరాలనూ, ఆపేక్షలనూ బట్టి వాటిని అచ్చువేసుకుంటాయి. అలాంటివన్నీ పేరు తెచ్చుకుని నిలుస్తాయన్న గ్యారంటీ ఏమీలేదు.

    అనేక క్రైటీరియాతో అనేక బహుమతులూ, గుర్తింపులూ వస్తాయి. వాటన్నిటినీ సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. మెచ్చుకోలుతో బాటు మెచ్చుకునేది ఎటువంటివారో కనిపిస్తూనే ఉంటుంది.

    అన్నీ స్త్రీపాత్రలే ఉన్నాయంటూ రాసిన లేడీస్ క్లబ్‌ల గురించిన పాత నాటికలు కొన్ని ఇలాగే ఉంటాయి. ఆడవాళ్ళంతా అసూయాద్వేషాలతో కీచులాడుకోవడమే హాస్యమనుకుని అటువంటివి రాసేవారు. ఇదీ అలాగే ఉంది.

    Pseudonym గురించి పేచీ ఎందుకు? అభిప్రాయాలు రాసేవాళ్ళకే ఒక్కొక్కప్పుడు స్వంతపేరు వాడుకునే ధైర్యముండదు.

  7. అమెరికాలో నాట్య శిక్షణ గురించి మోహన అభిప్రాయం:

    07/12/2011 2:03 pm

    చక్కగా వ్రాసిన ముఖాముఖి వ్యాసము ఇది. అందరూ దీనిని తప్పక చదవాలి. శ్రీమతి సంధ్యశ్రీ,, రూప గారల అనుభవాలు నాట్యానికి మాత్రమే కాదు, మిగిలిన లలిత కళలకు కూడ వర్తిస్తాయి.. నాశీ శంకగిరి గారికి నా అభినందనలు. – మోహన

  8. అర్థంకాని కవిత్వం గురించి Raghothama Rao. C అభిప్రాయం:

    07/12/2011 12:55 pm

    మంచి వ్యాసం కామేశ్వరరావు గారు.

    చక్కటి విశ్లేషణతో అందరికీ అర్థమయ్యేలా సాగింది రచన.

  9. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి yasasvi అభిప్రాయం:

    07/12/2011 12:46 pm

    “నిజాయితీ నిబధ్ధతా”… అంటే …అది వస్తువు మీదా శైలి మీదా కధనమ్ మీదా?? ఎవరు ఏది పెడితే అది రాసుకుంటూ పోతే దాన్ని ఏమైనా అంటారేమో గానీ సాహిత్యమ్ అని అనరు. రాణి గారి అభిప్రాయం బాగుంది. అందులో జూటా ఏమీ వినిపించడమ్ లేదు. అభిప్రాయం ఒక కోణాన్ని చెప్పగలిగేలా ఉండాలి. లేనిదానికి బరువుండదు. కలగాపులగం మాటలూ.. అయోమయపు అభిప్రాయాలూ.. ఎవరికీ ఉపకరించేవి కావు.

    కధ అంటే కధనం ఉండాలి. దబాయింపు వల్ల ఏమి లాభం?? బుర్రకి తట్టినదో మనసుకి నచ్చినదో గబాల్న రాసేయకండీ. కాస్త మగ్గనివ్వండీ ఊహని. అప్పుడు తాను చెప్పదలుచుకున్నది మరింత గాఢంగా ఉంటుంది. అదీ ఏ రచయితకైనా ఉండవలసిన ఉండదగిన లక్షణం అని అన్న రాణి గారి మాటల్ని స్వీకరించడం కాకపోతే మానె ఆలోచించడానికి ఏమి అభ్యంతరం.. ఎవరికైనా??

    యశస్వి.

  10. సన్మానానికి రెండు సీ.వీ.లు గురించి swamy అభిప్రాయం:

    07/12/2011 8:30 am

    ఈ కథకు కామెంటు రాయడం కూడా దండగే.

    గతంలో మారుపేర్ల మాయువు అని వేలూరి వెంకటేశ్వర్రావు గారు ఈ మాటలో ఒక వ్యాసం రాసారు. అఫ్సర్ కవితా సంకలనం ఊరిచివర్ని ఎవరో మారుపేరుతో విమర్శించినందుకు సంపాదకుడితో సహా ఈ మాట పాఠకులెవరూ ఆ మారుపేర్ల మాయువుని క్షమించలేదు. ఇంతకు మించి ఈ మాయువెవరో కూడా నాకు తెలియదు. ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఈ కథని “అనానిమస్సు” అన్న పేరుతో ఎలా అనుమతించారు? ఈ కథ మరియు కథకుడి మారుపేరు ఈమాటకు తగినట్లుగా లేదు. ఒకరికి మించి ఎక్కువ సంపాదకులున్న ఈమాటకు ప్రచురణకు ముందు రివ్యూ ఉండదా? మీ పత్రికకేమన్నా కథలకు లోటున్నదా? మీకు ప్రెజుడిసెస్ ఉండటం ఆశ్చర్యకరం.

    ఇక ముందు ఇలా జరగదని ఆశిస్తూ..

    వీరాస్వామి